సమాజంలో అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బీసీ కార్పొరేషన్‌ను కొనసాగిస్తూనే రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ తరగతుల అభివృద్ధి సంస్థ (మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్–ఎంబీసీడీసీ) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎంబీసీలకు బడ్జెట్లోనే నిధులు కేటాయించి, కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలు చీకట్లోనే మగ్గిపోతున్నాయని సీఎం ఆవేదన వెలిబుచ్చారు. ఎంబీసీ కులాల్లోని కుటుంబాలకు వెలుగు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఎంబీసీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్షించారు.
Published Tue, Feb 21 2017 6:30 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement