విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ కాలాంతకుడిగా మారాడు. విచక్షణ రహితంగా ప్రవర్తించి ఓ విద్యార్థి ప్రాణాలు బలితీసుకున్నాడు. టీచర్ కొట్టిన దెబ్బలకు విద్యార్థి మరణించాడు. నల్లగొండ జిల్లా హాలియా మండలం తిరుమలగిరిలో ఈ దారుణం చోటు చేసుకుంది. టీచర్ తీవ్రంగా కొట్టడంతో విద్యార్థి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. చికిత్స కోసం హైదరాబాద్కు తరలించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు.
Published Sun, Nov 9 2014 8:20 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement