సురేష్ ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఎంటెక్ చేరేందుకు పీజీఈసెట్ రాసి పాసయ్యాడు. కానీ ఎంటెక్‌లో చేరలేని దుస్థితి. ఎందుకంటే బీటెక్ పూర్తిచేసిన సర్టిఫికెట్లను సదరు కాలేజీ యాజమాన్యం ఇవ్వలేదు. 2014-15కు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడమే దీనికి కారణం. 'ప్రభుత్వం 2014-15 నుంచి ఫీజులను కాలేజీలకు చెల్లించకుండా.. విద్యార్థుల ఖాతాల్లోనే వేస్తామంటోంది. ఇప్పటికీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేయలేదు. మీరు సర్టిఫికెట్లు తీసుకెళ్లిపోతే మా పరిస్థితి ఏమిటి..?'అన్నది కాలేజీ నిర్వాహకుల వాదన. ఇక గత్యంతరం లేక సురేష్ తన తల్లి నగలు అమ్మి రూ.60వేలు చెల్లించి, సర్టిఫికెట్లు తీసుకున్నాడు.