అధికార టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మారిన నిడమానూరు సర్పంచ్ పై కావాలనే అధికార పక్ష నాయకులు దాడి చేయించి ఆయన కారు తగులబెట్టారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆ తర్వాత సీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఘటనపై వివరించారు.