తెలంగాణలో కొత్త జిల్లాల సంబురం మొదలైంది. ఇప్పటికే బతుకమ్మ, దసరా పండుగలతో ప్రజలంతా సంతోషంగా గడుపుతుండగా వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియకు శరవేగంగా కదులుతోంది. తన తరుపున పూర్తి కావాల్సిన అధికారిక లాంచనాలను ఒక్కోక్కటిగా పూర్తి చేస్తోంది. కొత్తగా ఏర్పాటవుతున్న 21 జిల్లాల్లో బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్ల పేర్లను ప్రకటించింది. వారంతా తెల్లవారు జామునే అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.