విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లడానికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకునే క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. దీంతో పలువురు విద్యార్థులు, మహిళా కానిస్టేబుళ్లు కిందపడి తొక్కిసలాట జరగడంతో.. ముగ్గురు విద్యార్థులతో పాటు ఓ మహిళా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కించారు. అరెస్ట్‌లను నిరసిస్తూ విద్యార్థులు పోలీసు వాహనాల్లో గాలి తీసేశారు.
Published Fri, Jul 28 2017 2:39 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
Advertisement