స్వతంత్ర భావాలున్న ఓ 24 ఏళ్ల యువతి ఆమె. స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించుకునే హక్కు తనకుందని, తననెవరూ భయపెట్టలేరని అంటోంది. వ్యతిరేక గళమే వినపడకూడదనే ఫర్మానాలను లెక్కచేయనంటోంది. ముప్పేటదాడి జరుగుతున్నా, బెదిరింపులు వస్తున్నా... ధైర్యంగా నిలబడి పోరాడుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడామె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ . పేరు గుర్‌మెహర్ కౌర్. ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజి విద్యార్థిని. భిన్న అభిప్రాయాలకు, భావజాలానికి చోటులేదనే రీతిలో ఢిల్లీ వర్సిటీల్లో ఏబీవీపీ కనబరుస్తున్న ఆధిపత్య ధోరణిపై, చేస్తున్న దాడులపై సోషల్ మీడియా కేంద్రంగా పోరాటం చేస్తోంది. ‘నేను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని. ఏబీవీపీకి భయపడను. నేను ఒంటిరిని కాదు.