రైల్వే గేటు పడినా ఎమర్జెన్సీ అంటూ కొందరు పట్టాలు దాటేస్తుంటారు. మరికొన్ని సమయాలలో రైలు ఢీకొని మృతిచెందిన ఘటనలు ఉన్నాయి. రైల్వే క్రాసింగ్ గేట్ దాటిన ఓ ఏనుగు రైల్వే, అటవీశాఖ ఉద్యోగులకు వణుకు పుట్టించింది. రైల్వే గేటును తన తొండంతో ఎత్తి పట్టాలు దాటి వెళ్లిపోయింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని ఛప్రమరి వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలోని రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద చోటుచేసుకుంది. అసలు విషయం ఏంటంటే.. ఛప్రమరి వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఓ ఏనుగు తప్పించుకుంది. దీనికి సమీపంలోనే రైల్వే గేట్ ఉంది. అరణ్యం నుంచి తప్పించుకుని వచ్చిన ఆ ఏనుగు రైల్వే గేట్ వద్దకు వచ్చింది.