విశాఖ జిల్లా నర్సీపట్నంలోని శారదానగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో కత్తులతో ప్రవేశించిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లో ఉన్నకాడికి దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో 15 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి ఆభరణాలు, రూ. 10 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Published Sun, Mar 26 2017 12:05 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement