ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనను శుక్రవారం గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆమె కాన్వాయిని అడ్డుకున్న రైతులు రహదారిపై అడ్డంగా బైఠాయించారు. మిగిలిన పొగాకు కొనుగోలుకు హామీ ఇవ్వాలని వారు ఆమెను డిమాండ్ చేశారు.