tobacco farmers
-
గుడ్‌న్యూస్: పొగాకు రైతులకు వడ్డీ లేని రుణం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో మాండూస్ తుపాను ప్రభావంతో పొగాకు పంట నష్టపోయిన ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలకు చెందిన రైతులకు పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి నుంచి రూ.10 వేల చొప్పున వడ్డీ లేని పంట రుణం ఇచ్చేందుకు కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ మంత్రి పియూష్ గోయెల్ ఆమోదించారని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు చెప్పారు. గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి సభ్యులు 28,112 మంది రైతులకు రూ.10 వేల చొప్పున రూ.28.11 కోట్లు పంపిణీ చేసేందుకు అనుమతి లభించిందన్నారు. పొగాకు పంట నష్టపోయినట్లు రైతులు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజమండ్రిలోని సెంట్రల్ టూబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీటీఆర్ఐ)కి చెందిన ఆరుగురు శాస్త్రవేత్తలు, పొగాకు బోర్డు అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలు తుపాను ప్రభావిత పొగాకు పొలాలను సందర్శించి, తక్షణ నష్ట నివారణకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు. సుమారు రూ.25 కోట్ల మేర పొగాకు రైతులు మాండూస్ తుఫాను వల్ల నష్టపోయారని తెలిపారు. ప్రస్తుతం బ్యారన్‌కు ఇచ్చిన రూ.5 లక్షలు రుణంకు అదనంగా మరో రూ.50 వేలు రుణం ఇవ్వాలని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీకి సిఫారసు చేశామని చెప్పారు. అంతేకాకుండా పొగాకు పంట నష్టపోయిన రైతులకు కూడా నష్ట పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామన్నారు. ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో పొగాకు వేలం జరుగుతోందని, అత్యధికంగా కిలోకు రూ.271 ధర లభిస్తోందని, సగటున కిలోకు రూ.239.16 లభించిందని తెలిపారు. ఏపీలో ఫిబ్రవరి మాసం చివర కానీ, మార్చి మొదటి వారంలో కానీ ఆక్షన్ ప్రారంభమవుతోందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇదీ చదవండి: ‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం -
రికార్డు స్థాయిలో పొగాకు ధర
సాక్షి, అమరావతి: పొగాకుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలకడంతో రైతులు ఈ పంట సాగుకు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత సీజన్ (2021–22)లో అంతర్జాతీయంగా పొగాకు పండించే దేశాల్లో దిగుబడి గణనీయంగా తగ్గడంతో దేశీయంగా పొగాకుకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ కారణంగా తొలిసారి బ్రైట్ గ్రేడ్‌తో సమానంగా మీడియం, లో గ్రేడ్ పొగాకు ధర పలికింది. (పొగాకును బ్రైట్, మీడియం, లోగ్రేడ్‌గా వర్గీకరించి విక్రయిస్తారు. బ్రైట్ పొగాకుకు మంచి రేటు వస్తుంది. మీడియం, లో గ్రేడ్ పొగాకుకు డిమాండ్‌ను బట్టి రేటు ఉంటుంది). 2020–21 సీజన్లో కిలోకు గరిష్టంగా రూ.193 పలుకగా, 2021–22లో రూ.245 పలికింది. అన్ని గ్రేడ్ల సరాసరి ధర 2020–21లో కిలో రూ.147.30 చొప్పున రాగా, 2021–22లో రూ.178.53 వచ్చింది. 2020–21 సీజన్లో రూ.1,661 కోట్ల టర్నోవర్ జరగ్గా, 2021–22 సీజన్లో ఇప్పటి వరకు రూ.2,061 కోట్ల వ్యాపారం జరిగింది. రాష్ట్రంలో పొగాకు సాధారణ సాగు విస్తీర్ణం 2.10 లక్షల ఎకరాలు. ప్రధానంగా ప్రకాశం, పశ్చిమగోదావరి, నెల్లూరు, కర్నూలు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో సాగవుతుంది. ప్రస్తుత సీజన్లో 130 మిలియన్ కిలోల ఉత్పత్తి లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 115 మిలియన్ కిలోలు మార్కెట్‌కు వచ్చింది. మరో 10 మిలియన్ కిలోల వరకు వచ్చే అవకాశం ఉంది. 2022–23 సీజన్లో 142 మిలియన్ కిలోల ఉత్పత్తి లక్ష్యాన్ని పొగాకు బోర్డు నిర్దేశించింది. మంచి రేటొచ్చింది 85 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నా. ఎకరాకు ఏడు క్వింటాళ్లు వచ్చింది. 6 క్వింటాళ్లు బ్రైట్, మీడియం గ్రేడ్ పొగాకు రాగా, మరో క్వింటాల్ లో గ్రేడ్ వచ్చింది. సరాసరి ధర కిలో రూ.177 పలికింది. గతంలో ఎప్పుడూ ఇంత ధర రాలేదు. – గుండ్రాళ్ల కొండారెడ్డి, సింగరబొట్లపాలెం, ప్రకాశం జిల్లా సాగుపై ఆసక్తి పెరుగుతోంది గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సరాసరి ధర పలకడంతో రైతులు పొగాకు సాగువైపు ఆసక్తి చూపిస్తున్నారు. 2022–23లో పొగాకు ఉత్పత్తి లక్ష్యం 142 మిలియన్ కిలోలుగా నిర్దేశించాం. సాగుదారులకు బోర్డు అన్ని విధాలుగా అండగా ఉంటోంది. ఈ ఏడాది అదనంగా సాగుకు అనుమతినిచ్చాం. రాయితీపై నాణ్యమైన విత్తనం, ఎరువులందించే ఏర్పాట్లు చేస్తున్నాం. – కృష్ణశ్రీ, ప్రొడక్షన్ మేనేజర్, పొగాకు బోర్డు -
పొగాకు రైతుకు కలిసొచ్చిన వేళ
పొగాకు రైతుకు ఈ ఏడాది కలిసొచ్చింది. మార్కెట్లో మంచి రేటు లభించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఈ ఏడాది కిలో పొగాకు సరాసరి రూ..178 రాగా గత సంవత్సరం సరాసరి రూ.141లు లభించింది. రైతు ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఇదిలా ఉండగా పొగాకు వేలం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల రెండో వారంలో వేలం ముగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కందుకూరు/ఒంగోలు సబర్బన్: అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడంతో పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉంది. ఉమ్మడి ప్రకాశం పరిధిలోని అన్ని వేలం కేంద్రాల్లో అన్ని గ్రేడ్ల పొగాకును వ్యాపారుల పోటీపడి మరీ కొనుగోలు చేయడంతో రైతులు ఆశించిన స్థాయిలోనే ధరలు నమోదయ్యాయి. కందుకూరు వేలం కేంద్రాలు బోర్డు పరిధిలో నంబర్ వన్‌గా నిలిచింది. బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు ధర సీజన్ మొత్తం రూ.186 వద్ద స్థిరంగా ఉండగా, మొదట్లో రూ.120 పలికిన లోగ్రేడ్ పొగాకు చివరికి వచ్చే సరిసరి రూ.110లుగా పలికింది. దీంతో కేజీ పొగాకు సరాసరి ధర ఇప్పటి వరకు కందుకూరు–1లో రూ.178.38, కందుకూరు–2లో రూ.178.46 వచ్చింది. మిగిలిన అన్ని వేలం కేంద్రాల్లోను రూ.167ల నుంచి రూ.174ల పరిధిలోనే ఉన్నాయి. మిగిలిన వేలం కేంద్రాలతో పోల్చుకుంటే కందుకూరు వేలం కేంద్రాల్లో సరాసరి ధరలు రూ.4 నుంచి రూ.11 వరకు అత్యధికంగా నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది మంచి లాభాలతో పొగాకు సీజన్‌ను ముగించేందుకు రైతులు సిద్ధమయ్యారు. మిగిలిన పంటలు దారుణంగా దెబ్బతీసిన నేపథ్యంలో పొగాకు ఈ ఏడాది రైతులను ఆర్థికంగా నిలబెట్టిందని భావిస్తున్నారు. స్థిరంగా మార్కెట్: ఈ ఏడాది వేలంలో భారీ ఒడిదుడుకులు ఏమీ లేకుండా పొగాకు మార్కెట్ స్థిరంగా కొనసాగింది. పొగాకు ఉత్పత్తి తగ్గి రైతులు ఆశించిన స్థాయిలోనే రేట్లు రావడంతో వేలం ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. దీంతో ఎస్ఎల్ఎస్ పరిధిలో వేలం ప్రక్రియ అటూ ఇటుగా రెండు నెలల వ్యవధిలోనే ముగించగలిగారు. ఎస్ఎల్ఎస్ పరిధిలో 39.47 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తులను అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉండగా దిగుబడి తగ్గడంతో 33.16 మిలియన్ కేజీల ఉత్పత్తి మాత్రమే వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనికిగాను ఇప్పటికే 32.74 మిలియన్ కేజీల పొగాకు విక్రయాలు పూర్తికాగా ఇంకా 0.78 మిలియన్ కేజీల పొగాకే మిగిలి ఉంది. ఇక కందుకూరు పరిధిలోని వేలం కేంద్రాల్లో మాత్రమే వేలం కొనసాగుతోంది. అత్యధిక పొగాకు ఈ రెండు వేలం కేంద్రాల్లోనే ఉండడంతో వేలం ఆలస్యమవుతోంది. వీటిలో కందుకూరు–1వ వేలం కేంద్రం పరిధిలో 8.03 మిలియన్ కేజీల పొగాకుకు అనుమతి ఉంటే 8.10 మిలియన్ కేజీల ఉత్పత్తి వస్తుందని అంచనా. దీనిలో ఇప్పటి వరకు 7.43 మిలియన్ కేజీలను అమ్మగా, ఇంకా 0.67 మిలియన్ కేజీల ఉత్పత్తులు అమ్మాల్సి ఉంది. ఈనెల 16వ తేదీ నాటికి ముగించనున్నారు. కందుకూరు–2లో 6.80 మిలియన్ కేజీలకు అనుమతి ఉంటే 6.70 మిలియన్ కేజీల ఉత్పత్తి వస్తుందని అంచనా. దీనిలో ఇప్పటికే 6.59 మిలియన్ కేజీలను విక్రయించగా ఇంకా 0.11 మిలియన్ కేజీలు అమ్మాల్సి ఉంది. ఈనెల 6వ తేదీ నాటికి వేలం ముగియనుంది. మొత్తం మీద రెండో వారం కల్లా ఎస్ఎల్ఎస్ పరిధిలోని వేలం కేంద్రాల్లో వేలం ప్రక్రియ పూర్తి కానుంది. చివరి దశలో వేలం.. పొగాకు వేలం పూర్తికావస్తోంది. దక్షిణ ప్రాంత తేలిక నేలల (ఎస్ఎల్ఎస్) పరిధిలో మొత్తం 6 వేలం కేంద్రాలుంటే నాలుగు కేంద్రాల్లో ఇప్పటికే పొగాకు వేలాన్ని ముగించారు. పొదిలి, కనిగిరి, కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో వేలం ముగియగా కందుకూరు రెండు వేలం కేంద్రాల్లో మరో పది రోజుల్లో వేలం ముగియనుంది. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో 11 వేలం కేంద్రాల్లో 67.74 మిలియన్ కేజీల పొగాకును కొనుగోలు చేయగా ఇంకా కేవలం 6.27 మిలియన్ కేజీల ఉత్పత్తులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిని ఈనెల మూడోవారంకల్లా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. టంగుటూరు పొగాకు వేలం క్రేందంలో శనివారం 681 పొగాకు బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. కారుమంచికి చెందిన రైతులు 718 బేళ్లు వేలానికి తీసుకురాగా వాటిలో 681 కొనుగోలు చేశారు. 35 బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.188 కాగా, కనిష్ట ధర రూ.110, సరాసరి ధర రూ.182.70 పలికింది. వేలంలో మొత్తం 17 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. కొండపి వేలం కేంద్రంలో శనివారం 731 పొగాకు బేళ్లను కొనుగోలు చేశారు. అనకర్లపూడి, ముప్పరాజుపాలెం, పెరిదేపి, మిట్టపాలెం, అక్కచెరువుపాలెం, గోగినేనివారిపాలెం, చోడవరం, ముప్పవరం, రామచంద్రాపురం, కట్టావారిపాలెం, నర్సింగోలు గ్రామాల నుంచి రైతులు 930 బేళ్లు వేలానికి తెచ్చారు. 731 బేళ్లు కొనుగోలు చేసి, 179 బేళ్లు తిరస్కరించారు. అత్యధిక ధర కేజీ పొగాకు రూ.187 పలకగా, అత్యల్పం రూ.110, సరాసరి ధర రూ.179.17 వచ్చింది. ఎస్బీఎస్ పరిధిలో... ఎస్బీఎస్ పరిధిలో ప్రకాశం జిల్లా పరిధిలోని వెల్లంపల్లి, ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొండపి వేలం కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 41.25 మిలియన్ కేజీల పొగాకుకు అనుమతి ఉండగా 40.50 మిలియన్ కేజీ ఉత్పత్తి వస్తుందని అంచనా. ఇప్పటికే 35.00 మిలియన్ కేజీల ఉత్పత్తుల అమ్మకాలు పూర్తిగా కాగా ఇంకా 5.49 మిలియన్ కేజీల పొగాకును అమ్మాల్సి ఉంది. ఈనెల 20వ తేదీకల్లా పూర్తిగా వేలాన్ని ముగించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పొగాకు సాగే ఈ ఏడాది రైతులను ఆదుకుంది పొగాకు పంట సాగు ఈ సంవత్సరం రైతులకు కలిసొచ్చింది. గతంలో వరుసగా నష్టాలు వచ్చినా ఈ ఏడాది మార్కెట్ బాగుండడంతో మంచి లాభాలు వచ్చాయి. మంచి పొగాకు క్వింటా రూ.18,600ల వరకు వచ్చింది. లోగ్రేడ్ పొగాకు కూడా కాస్త ఆటూ ఇటుగా బ్రైట్ గ్రేడ్‌తో సమానంగా రేట్లు వచ్చాయి. దీని వల్ల యావరేజ్ ధరలు ఎక్కువగా ఉండడంతో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరం పొగాకు పంటే రైతులకు కాస్త ఆదాయాలు తెచ్చిపెట్టింది. – అనుమోలు రాములు, పొగాకు రైతు,పోలినేనిపాలెం -
యాంత్రీకరణకు పొగాకు రైతుల మొగ్గు
దేవరపల్లి: కూలీల కొరత తీవ్రం కావడంతో రైతులు వ్యవసాయంలో యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. యాంత్రీకరణను ప్రభుత్వం ప్రోత్సహించి రాయితీలు కల్పించడంతో ఎక్కువ మంది రైతులు సాగులో మెషీన్ల సాయంతో లబ్ధిపొందుతున్నారు. పొగాకు సాగుకు కూలీల సమస్య ఏర్పడడంతో పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతం రైతులు యంత్రాల సాయం తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా పొగాకు క్యూరింగ్ విధానంలో మార్పులు తీసుకొస్తున్నారు. సాధారణంగా తోటలోని పొగాకు రెలిసి బ్యారన్ వద్దకు తీసుకువచ్చి కర్రలకు అల్లి బ్యారన్లో ఉంచి క్యూరింగ్ చేస్తారు. ఈ విధానం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు కూలీల సంఖ్య ఎక్కువ అవసరం. ఈ విధానానికి స్వస్తి పలకడానికి విదేశాల్లో అవలంభిస్తున్న నూతన టెక్నాలజీని తీసుకువచ్చారు. జర్మనీలో రైతులు ఏర్పాటు చేసిన లూజ్‌లీఫ్ బ్యారన్లను పరిశీలించిన అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా బ్రెజిల్ నుంచి పరికరాలను దిగుమతి చేసుకుని జిల్లాలోని గోపాలపురం, యర్నగూడెంలో బ్యారన్లు నిర్మించారు. సుమారు రూ.9 లక్షల వ్యయంతో బ్యారన్ నిర్మించి ప్రయోగాత్మకంగా క్యూరింగ్ చేశారు. దీనివల్ల మంచి ఫలితాలు రావడంతో ఐటీసీ భాగస్వామ్యంతో ఈ ఏడాది గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో 14 యూనిట్ల నిర్మాణం చేపట్టారు. వీటిని పొగాకు క్యూరింగ్‌కు మాత్రమే కాకుండా మల్టీపర్పస్ యూనిట్లుగా వినియోగిస్తున్నారు. చిట్యాలలో 4 యూనిట్ల నిర్మాణం మల్టీపర్పస్ యూనిట్ ఖరీదు రూ.9 లక్షలుగా ఉంది. ఐటీసీ రూ.3 లక్షలు, పొగాకు బోర్డు రూ.3 లక్షలు ఇస్తుండగా, రైతు వాటాగా రూ.3 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. గోపాలపురం మండలంలోని చిట్యాలలో ఈ ఏడాది 4 యూనిట్లు నిర్మిస్తున్నారు. పొగాకు క్యూరింగ్‌తో పాటు కొబ్బరి, మొక్కజొన్న, అల్లం, పసుపు వంటి పంటలు డ్రై చేస్తున్నారు. 2,500 కొబ్బరి కాయలు ఒకేసారి డ్రై చేస్తున్నారు. దీనికి 30 గంటల సమయం పడుతుంది. 25 క్వింటాళ్ల మొక్కజొన్న గింజలను 12 గంటల్లో డ్రై చేస్తున్నారు. శీతాకాలం, వర్షాకాలంలో యూనిట్ బాగా ఉపయోగపడుతుంది. డ్రై చేసిన పంటను గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకోవచ్చని రైతులు అంటున్నారు. మల్టీపర్పస్ యూనిట్ల వల్ల రైతుకు 50 శాతం ఖర్చు తగ్గుతుంది. కూలీల అవసరం ఉండదు. పొగాకు రైతులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ పద్థతిలో రెండు బ్యారన్లు క్యూరింగ్ చేసే పొగాకును లూజ్‌లీఫ్ బ్యారన్లో ఒకేసారి చేయవచ్చు. సాధారణ పద్ధతికి, లూజ్‌లీఫ్ బ్యారన్లో క్యూరింగ్ చేసే విధానానికి బ్యారన్‌కు సుమారు రూ.1.50 లక్షల తేడా వస్తుందని రైతులు తెలిపారు. బ్యారన్‌కు రెండు క్వింటాళ్లు పొగాకు ఆదా అవుతుంది. ఆటో ప్యానల్ బోర్డు ఏర్పాటు లూజ్‌లీఫ్ బ్యారన్‌కు ఆటో ప్యానల్ బోర్డు ఏర్పాటు చేశారు. క్యూరింగ్‌లో టెంపరేచర్ హెచ్చు తగ్గులను బోర్డులోని సెన్సార్ పరికరం సరి చేసుకుంటుంది. ఒకేసారి 1200 నుంచి 1300 కిలోల పొగాకు క్యూరింగ్ అవుతుంది. రైతులకు అన్ని విధాలుగా ఉపయోగం పొగాకు క్యూరింగ్ కోసం ఏర్పాటు చేసిన లూజ్ లీఫ్ బ్యారన్లు మల్టీపర్పస్ యూనిట్లుగా ఉపయోగపడుతున్నాయి. పొగాకు క్యూరింగ్‌తో పాటు డ్రయర్‌గా ఉపయోగిస్తున్నాం. కొబ్బరి, మొక్కజొన్న, పసుపు, అల్లం వంటి పంటల్ని డ్రై చేసి నిల్వ ఉంచుతున్నాం. కూలీల సమస్యను అధిగమించమించడంతోపాటు పంట నాణ్యత బాగుంటుంది. బ్యారన్‌కు ఏడాదికి రెండు క్వింటాళ్లు పొగాకు ఆదా అవుతుంది. – గద్దే శ్రీనివాస్, యర్నగూడెం -
విదేశాలకు 'ఆంధ్రా పొగాకు'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు గత ఏడాది రంగంలోకి దిగిన మార్క్‌ఫెడ్.. పొగాకును విదేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్క్‌ఫెడ్ వద్ద సుమారు రూ.103 కోట్ల విలువైన 9.43 మిలియన్ కిలోల పొగాకు ఉంది. దీన్లో ఉన్నది ఉన్నట్లుగా అమ్ముడయ్యేదిపోను మిగిలినదాన్ని ప్రాసెస్, ప్యాకింగ్ చేసి రీడ్రైడ్ థ్రెషడ్ లేమినా (ఆర్టీఎల్) రూపంలో విదేశాలకు ఎగుమతి చేయనుంది. ప్రాసెస్ చేసేందుకు టెండర్లు ఖరారు చేశారు. నమూనాగా ప్యాక్ చేసిన శాంపిళ్లను పొగాకు వ్యాపారులు, ఎగుమతిదారులు, విదేశీ కస్టమర్లకు పంపించారు. వాటి నాణ్యత బాగానే ఉందని పరీక్షల్లో తేలిందని అధికారులు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన అధిక వర్షాలకు తోడు కరోనా ప్రభావంతో గతేడాది మార్కెట్లో పొగాకు రేటు పతనమైంది. దీంతో ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంతో మార్క్‌ఫెడ్ చరిత్రలో తొలిసారి పొగాకు వేలంలో పాల్గొని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. సగటున కిలో రూ.81కి కొనుగోలు రాష్ట్రంలో సాధారణంగా ఖరీఫ్‌లో 4,360 ఎకరాలు, రబీలో 2,02,345 ఎకరాల్లో పొగాకు సాగవుతుంది. 2019–20 సీజన్లో ఖరీఫ్‌లో 6,787 ఎకరాలు, రబీలో 1,92,700 ఎకరాల్లో సాగైంది. ఏటా పొగాకు బోర్డు ద్వారా క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. గతేడాది కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా పొగాకు రేట్లు పతనమవడంతో మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగింది. గతేడాది 128.65 మిలియన్ కిలోలు మార్కెట్‌కు వచ్చింది. దీంట్లో 12.93 మిలియన్ కిలోలను (1,29,31,590 కిలోలను) మార్కెఫెడ్ కొనుగోలు చేసింది. సగటున కిలో రూ.81 వంతున 29,228 మంది రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసింది. కొనుగోలుకు వెచ్చించిన సొమ్ము, రవాణా ఖర్చులు, బ్యాంకు వడ్డీలు కలిపి మార్క్‌ఫెడ్‌కు రూ.128.65 కోట్ల వ్యయం అయింది. అనంతరం ఈ–వేలం ద్వారా 3.50 మిలియన్ కిలోలను విక్రయించింది. ఇంకా గోదాముల్లో 9.43 మిలియన్ కిలోలు ఉంది. కోవిడ్ కారణంగా వ్యాపారులకు విదేశాల నుంచి ఆర్డర్స్ తగ్గిపోయాయి. కర్ణాటకలో లో గ్రేడ్ రకాల పంట ఎక్కువగా వచ్చింది. ఎగుమతికి రవాణా ఖర్చులు పెరిగిపోవడం, కంటైనర్ల కొరత వంటివి కూడా తోడయ్యాయి. దీంతో మార్క్‌ఫెడ్ వద్ద పొగాకు నిల్వలు పేరుకుపోయాయి. ఈ పొగాకును విక్రయించేందుకు మార్క్‌ఫెడ్ సన్నాహాలు చేస్తోంది. నేరుగా ఎగుమతికి సన్నాహాలు దేశీయ వ్యాపారులు ముందుకు రాకపోతే ఇతర దేశాలకు నేరుగా ఎగుమతి చేయాలని భావిస్తున్నాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రబీలో క్వాలిటీ పొగాకు పండటం వల్ల మా వద్ద ఉన్న లో గ్రేడ్ పొగాకుకు కాస్త డిమాండ్ ఏర్పడనుంది. కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో మా వద్ద పేరుకుపోయిన నిల్వలు అమ్ముడవుతాయన్న ఆశాభావంతో ఉన్నాం. కొంత మామూలుగా, మరికొంత ప్రాసెస్ చేసి ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ఎక్స్‌పోర్టు ఏజెంట్లను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – పి.ఎస్.ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్ -
ఏపీ: పొగాకు రైతుకు ప్రభుత్వ దన్ను
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతుకు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. ఏళ్ల తరబడి పంట అమ్ముకోవడంలో ఇబ్బందులు పడుతూ.. ఏటా నష్టపోతున్న పొగాకు రైతులకు ఈ సంవత్సరం ఉపశమనం లభించింది. దర్జాగా పంటను అమ్ముకున్నారు. రెక్కలుముక్కలు చేసుకుని పండించినా.. వ్యాపారుల చేతుల్లో మోసపోతున్న రైతుకు అండగా నిలవాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించారు. వ్యాపారులతో పోటీపడి పొగాకును కొనుగోలు చేయించారు. దీంతో వ్యాపారులు కూడా ధరపెంచి కొనక తప్పలేదు. మార్క్‌ఫెడ్ దాదాపు రూ.128.65 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేలం గతనెల 29న పూర్తయింది. లోగ్రేడ్ పొగాకు లక్ష్యంగా.. 1977లో పొగాకు బోర్డు ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు వేలం కేంద్రాల్లో వ్యాపారులు, ఎగుమతిదారులు చెప్పిందే ధరగా నడిచేది. లోగ్రేడ్ పేరిట ధరలను మరింత తగ్గించేవారు. వారు చెప్పిన ధరకే.. రైతుకు అమ్ముకోక తప్పేదికాదు. రైతు కష్టాలు తెలిసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వ్యాపారులు కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి ఆగస్టు ఒకటిన మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించారు. మొత్తం 18 వేలం కేంద్రాల్లోనూ రంగంలోకి దిగిన మార్క్‌ఫెడ్ అధికారులు.. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలో రూ.85 వంతున లోగ్రేడ్ పొగాకు కొనుగోలును లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో వ్యాపారుల్లో కలవరం మొదలైంది. లోగ్రేడ్ బేళ్లన్నీ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తే చివరకు తమ వ్యాపారమూలాలు కదులుతాయని తాము కూడా పోటీపడి లోగ్రేడ్ బేళ్ల కొనుగోలు మొదలుపెట్టారు. దీంతో లోగ్రేడ్ పొగాకు ధరలకు రెక్కలొచ్చాయి. కొందరు వ్యాపారులు, ఐటీసీ, పీఎస్ఎస్, జీపీఐ తదితర కంపెనీల ప్రతినిధులు పోటీపడి లోగ్రేడ్ పొగాకు కొనుగోలు చేశారు. మార్క్‌ఫెడ్ రూ.128.65 కోట్ల విలువైన 12.93 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసింది. దీన్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలోని వెల్లంపల్లి వేలం కేంద్రంలోనే రూ.13.30 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేసింది. తగ్గిన నో బిడ్లు.. గతంలో వేలం కేంద్రాల్లో కొన్ని బేళ్లను వ్యాపారులు తిరస్కరించేవారు (నో బిడ్). గతంలో ప్రతి వేలం కేంద్రంలో 100 నుంచి 150 బేళ్ల వరకు నో బిడ్ పేరిట తిరస్కరించేవారు. అంటే మొత్తం వచ్చిన బేళ్లలో 35 నుంచి 40 శాతం బేళ్లు తిరస్కరణకు గురయ్యేవి. దీంతో ఏటా బ్యారన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల మేర రైతుకు నష్టం వచ్చేది. ఈ ఏడాది నో బిడ్ల శాతం పదికన్నా తగ్గింది. దీంతో పొగాకు రైతులు ఈ ఏడాది నష్టాలు లేకుండా బయటపడ్డారు. (చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్) రాష్ట్రంలో 18 పొగాకు వేలం కేంద్రాలు రాష్ట్రంలో ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగాకు పండిస్తారు. ఈ పంట కొనుగోలుకు నాలుగు జిల్లాల్లో 18 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. ఇవి ప్రకాశం జిల్లాలో 10 (ఒంగోలు, టంగుటూరు, కందుకూరుల్లో రెండేసి, కొండపి, వెల్లంపల్లి, పొదిలి, కనిగిరి), పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు (జంగారెడ్డిగూడెంలో రెండు, దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రెండు (డీసీ పల్లి, కలిగిరి), తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి (తొర్రేడు) ఉన్నాయి. -
పొగాకు రైతుకు రూ.130 కోట్ల లబ్ధి
సాక్షి, అమరావతి: పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వ్యాపారులతో పోటీపడి మార్క్‌ఫెడ్ పొగాకు కొనుగోలు చేస్తుండటంతో పంట ధర పెరుగుతోంది. దీంతో రైతుకు మంచి రేటు వస్తోంది. జూన్ నెలాఖరు వరకు ముప్పుతిప్పలు పెట్టిన వ్యాపారులు ప్రభుత్వ జోక్యంతో పంట కొనుగోలుకు ముందుకొస్తున్నారు. ►అకాల వర్షాల కారణంగా తెగుళ్లు సోకి ఈ సీజనులో పొగాకు దిగుబడి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం టుబాకో బోర్డు ఆధ్వర్యంలో వేలం కేంద్రాలను ప్రారంభించినా కోవిడ్ కారణంగా ఎగుమతులు ఆగిపోవడంతో స్థానిక వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల నుంచి చౌకగా కొనుగోళ్లకు ప్రయత్నించారు. ►కొందరు రైతులు లోగ్రేడ్ పొగాకును కిలో రూ.60 నుంచి రూ.70లోపే విక్రయించారు. ఇలా మూడు నెలల వ్యవధిలో రైతుల నుంచి 45 మిలియన్ కిలోల పొగాకును వ్యాపారులు కొనుగోలు చేశారు. నష్టపోతున్న పొగాకు రైతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పరిస్ధితి వివరించడంతో వెంటనే స్పందించి కొనుగోలు బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. ►జూలై మొదటి వారం నుంచి మార్క్‌ఫెడ్ అన్ని వేలం కేంద్రాల్లో వ్యాపారులతో పోటీపడి పొగాకు కొనుగోలు చేయడంతో ఇప్పటివరకు 49 మిలియన్ కిలోల పొగాకును రైతులు అమ్ముకోగలిగారు. ప్రభుత్వ జోక్యం కారణంగా కొన్ని రకాల పొగాకుకు కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు ధర పెరగడంతో రైతులు లబ్ధి పొందారు. ‘లోగ్రేడ్ పొగాకు ధర కిలో రూ.40 – రూ.50 లోపే పలకడంతో విక్రయించలేక ఇంటికి తెచ్చా. లారీ కిరాయిల కోసం రూ.వేలల్లో ఖర్చయింది. చివరి ఆశగా ముఖ్యమంత్రి జగన్‌ను కలసి మా దుస్థితిని వివరించడంతో రెండు రోజుల్లోనే అధికారులతో సమావేశం నిర్వహించి పొగాకు రైతుకు అండగా నిర్ణయం తీసుకున్నారు. మార్క్‌ఫెడ్‌కు అధిక రేటుకు అమ్ముకుంటున్నాం. ఆ డబ్బుతో మళ్లీ సాగుకు సమాయత్తం అవుతున్నాం’ –రావూరి శ్రీకాంత్, కలిగిరి, నెల్లూరు జిల్లా. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో పొగాకు రైతులు రూ.130 కోట్ల వరకు లబ్ధి పొందనున్నారు. వ్యాపారులతో పోటీపడి మార్క్‌ఫెడ్ పొగాకు కొనుగోలు చేస్తుండటంతో ధరలు పెరిగాయి. దేశంలో మొదటిసారిగా పొగాకు విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది – మారెడ్డి సుబ్బారెడ్డి (ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు) -
పొగాకు రైతుకు మార్క్‌ఫెడ్ అండ
పొగాకు రైతులు ఈ ఏడాది కష్టాల నుంచి గట్టెక్కారు. వ్యాపారుల, తయారీదారుల, ఎగుమతిదారుల కబంధ హస్తాల నుంచి పొగాకు రైతును ఒడ్డున పడేసిన సంవత్సరంగా ఈ ఏడాది నిలవబోతోంది. వేలంలో ఈ మూడు రకాల వ్యాపారులు పొగాకు రైతును కీలుబొమ్మలాగా ఆడుకున్నారు. వ్యాపారులు వాళ్ల ఇష్టమొచ్చిన ధరకు కొనుగోలు చేస్తే నోరెత్తలేని దీనస్థితిలో ఇప్పటి వరకు రైతు మగ్గిపోయాడు. అయితే ఆ చీకటి రోజులకు చరమగీతం పాడుతూ, రైతులను నష్టాలపాలు చేస్తున్న వ్యాపారులకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోళ్లలో వ్యాపారులకు పోటీగా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించింది. అంతే పొగాకు రైతులకు ఊహకు కూడా అందని విధంగా ప్రయోజనం చేకూరుతోంది. పొగాకు రైతు మోములో చిరునవ్వు చిగురించింది. ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక్క నిర్ణయంతో పొగాకు రైతుల ముఖాల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. పొగాకు బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఏనాడు రాలేదు. 1976లో భారత ప్రభుత్వం వాణిజ్య పంట అయిన పొగాకు కోసం పొగాకు బోర్డును ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఎన్నో పోరాటాలు, పొగాకు రైతుల త్యాగాలు, ప్రాణదానాల ఫలితంగా 1984లో పొగాకు బోర్డు ఆధ్వర్యంలో పొగాకు వేలం కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయినా పొగాకు రైతు ప్రతి సంవత్సరం నష్టాలతోనే సహ జీవనం చేస్తూ వస్తున్నాడు. ఆ నష్టాల నుంచి పొగాకు రైతును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయటపడేశారు. ప్రకాశం, నెల్లూరు రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 24,153 పొగాకు బ్యారన్లు ఉండగా వాటిలో ఎస్బీఎస్ పరిధిలో 12,633, ఎస్ఎల్ఎస్ పరిధిలో 11,520 బ్యారన్ల కింద పొగాకును సాగు చేస్తున్నారు. అదేవిధంగా రెండు జిల్లాల్లో కలిపి రైతులు 30,811 మంది ఉన్నారు. వారిలో ఎస్బీఎస్ పరిధిలో 14,559 మంది రైతులు, ఎస్ఎల్ఎస్ పరిధిలో 16,252 మంది పొగాకు సాగు చేస్తున్నారు. 51 కోట్ల విలువైన పొగాకు కొనుగోళ్లు.. మార్క్‌ఫెడ్ సంస్థ వేలంలోకి దిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.50 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేసింది. అందులో దాదాపు 90 శాతానికి పైగా పొగాకు ఒక్క లో గ్రేడ్ పొగాకు కావటం విశేషం. దీంతో ప్రకాశం జిల్లాతో పాటు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పొగాకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 12 పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. వాటిలో దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలల్లో (ఎస్బీఎస్) ఆరు, దక్షిణ ప్రాంత తేలిక పాటి నేలల్లో (ఎస్ఎల్ఎస్) మరో ఆరు వేలం కేంద్రాలు ఉన్నాయి. ఎస్బీఎస్ పరిధిలోని రైతుల వద్ద రూ.36 కోట్ల విలువైన పొగాకు, ఎస్ఎల్ఎస్ పరిధిలోని రైతుల వద్ద రూ.15 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేశారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లే లక్ష్యంగా.. పొగాకు వ్యాపారులు రైతులు పండించిన పొగాకులో లో గ్రేడ్ పొగాకు అధికంగా ఉత్పత్తి అవుతోంది. అయితే వ్యాపారులు లో గ్రేడ్ పొగాకును అతి తక్కువ ధరకు కొనుగోలు చేయటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి లో గ్రేడ్ పొగాకు కొనుగోలు లక్ష్యంగా మార్క్‌ఫెడ్‌ను వేలం ప్రక్రియలోకి దించారు. దీంతో ఇప్పటి వరకు ఇప్పటి వరకు 58 వేల పొగాకు బేళ్లు రైతుల వద్ద నుంచి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగి సరిగ్గా ఆగస్టు 7వ తేదీతో 30 రోజులు అయింది. నాణ్యమైనది అత్యధికంగా కిలో రూ.208 పొగాకు బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాణ్యమైన పొగాకు ధర కిలో రూ.208 పలికిన సందర్భాలే లేవు. అత్యధికంగా ధర పలికింది ఈ సంవత్సరమే. అదీ కూడా మార్క్‌ఫెడ్ పొగాకు వేలంలోకి రావటం వల్లనే సాధ్యమైంది. లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లే లక్ష్యంగా మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగినప్పటికీ నాణ్యమైన పొగాకును కూడా కొనుగోలు చేయటానికి మార్క్‌ఫెడ్ అధికారులు నిర్ణయించారు. దీంతో పేరెన్నికగన్న పొగాకు వ్యాపారులతో మార్క్‌ఫెడ్ పోటీ పెంచింది. దీంతో నాణ్యమైన పొగాకును వ్యాపారులు అత్యధిక ధర కిలోకు రూ.208 చెల్లించి కొనాల్సిన పరిస్థితి ఎదురైంది. పోటీ వలన మేలిమి పొగాకుకు పలికిన అత్యధిక ధర కిలో: రూ.208 గతంలో గరిష్టంగా నాణ్యమైన పొగాకు ధర: రూ.202 ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన బేళ్లు: 58 వేల పొగాకు బేళ్లు -
కనీస ధరతో పొగాకు కొనుగోళ్లు
అన్ని పంటల్లాగే పొగాకును కూడా కొనుగోలు చేస్తాం. మార్కెట్‌కు వచ్చిన అన్ని రకాల పొగాకుకు కనీస ధరలు ప్రకటించి కొనుగోలు చేయాలి. ఈ రేట్లను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శించాలి. ఈ రేట్లను ప్రామాణికంగా తీసుకుని కనీస రేట్లకుపైనే వేలం కొనసాగాలి. తద్వారా రైతుల్లో విశ్వాసం, భరోసా కల్పించాలి. పొగాకు కొనుగోలు వ్యవహారాన్ని రింగ్ చేసే పద్ధతులకు స్వస్తి చెప్పాలి. వ్యాపారాలు చేయని వారి లైసెన్స్‌లను తొలగించాలి. వ్యాపారాలు చేయకపోతే వారికి లైసెన్స్‌లు ఎందుకు? ఇవి చేయగలిగితే చాలా వరకు పరిస్థితి అదుపులోకి వస్తుంది. సాక్షి, అమరావతి: ఇదివరకెన్నడూ లేని విధంగా పొగాకు రైతులకు మేలు జరిగేలా కనీస ధర ప్రకటించి, ఆపై ధరలకే కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెట్లో పొగాకు కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశానికి వివిధ కంపెనీల ప్రతినిధులు, రైతులు, రైతు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పొగాకు రైతుల సమస్యలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పటికప్పుడే స్పందిస్తూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. లైసెన్స్ తీసుకున్నారంటే కొనుగోలు చేయాల్సిందే ► ఈ ఏడాది ధరల స్థిరీకరణ కోసం రూ.3,200 కోట్లు ఖర్చు చేశాం. అరటి, మొక్క జొన్న, పసుపు, శనగ ఇలా అన్ని రకాల పంటలను కరోనా సమయంలో కూడా భారీగా ఖర్చు చేసి కొనుగోలు చేశాం. ► పొగాకును కూడా అలాగే కొనాలి. పొగాకు బోర్డు, కంపెనీలు కలిసి రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలి. లైసెన్స్‌లు తీసుకుని, వేలంలో పాల్గొనని వ్యాపారులు, కంపెనీల విషయంలో పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలి. ► ఏపీ మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోళ్లు చేయాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పొగాకు మార్కెట్లో జోక్యం కోసం రెండు మూడు రోజుల్లో ఒక సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఆ సంస్థ పొగాకు కొనుగోలు కోసం లైసెన్స్ తీసుకుంటుంది. ఒక ఐఏఎస్ స్థాయి అధికారి నేతృత్వంలో ఆ సంస్థ నడుస్తుంది. ► బోర్డు.. పొగాకు కొనుగోలు కంపెనీలు, వ్యాపారుల సహకారంతో ముందుకు వెళ్తుంది. ప్రకటించిన కనీస ధరల కన్నా.. ఎక్కువ ధరకు కొనుగోలు చేసేలా చూస్తుంది. ► పొగాకు గ్రేడ్ల వారీగా రెండు రోజుల్లో కనీస ధరలు ప్రకటించాలి. అలాగే లైసెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ వేలం కేంద్రాల వద్ద ప్రతిరోజూ కొనుగోలు చేయాలి. వేలం జరిగే అన్ని రోజులూ పాల్గొనాలి. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పొగాకును వారు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ► రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తెచ్చుకోవాలనే లక్ష్యంతో కాకుండా, రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇది మా అజెండా. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాపారులు రింగ్ కాకుండా చూడాలి ► చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుంది. మార్కెట్లో పోటీతత్వం పెంచింది. రైతులకు మేలు చేసే ప్రభుత్వం ఇక్కడ ఉంది. దీన్ని మీరు సానుకూలంగా తీసుకోవాలి. ► ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ముందుకు రావాల్సి ఉంది. లక్ష్యాల మేరకే పంట సాగవుతున్నప్పుడు కొనుగోలు చేయకపోతే రైతులు నష్టపోతారు. ► 920 మందికి లైసెన్స్‌లు ఇచ్చినా.. 15 మందికి మించి పొగాకు వేలం పాటల్లో పాల్గొనడం లేదు. వ్యాపారులు కుమ్మక్కు అవుతున్నారని రైతులు అంటున్నారు. రైతులు వేలం కేంద్రానికి తీసుకు వచ్చినప్పుడు కేవలం నాణ్యమైన పొగాకును మాత్రమే తీసుకుని మిగతాది కొనుగోలు చేయకుండా వదిలేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ► వ్యాపారులు ఒక రింగులా ఏర్పడుతున్నారని రైతులు చెబుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవాల్సిందే. మార్కెట్లో పారదర్శకత, ఫెయిర్ విధానాలు, పోటీని పెంచే విధానాలు ఉండాలి. ► రైతుల సరుకును నిరాకరించడం వల్ల వారిలో భయాందోళనలు నెలకొంటున్నాయి. చివరకు వారు ఎంతో కొంతకు తెగనమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి. వేలం కేంద్రానికి సరుకు వచ్చిన రోజే కొనుగోలు చేస్తేనే బాగుంటుంది. ► రైతుల నుంచి ఎంత కొనుగోలు చేస్తామన్నది ముందే మీరు పరిమితి విధిస్తున్నప్పుడు.. కొనుగోలు చేయకపోవడం కరెక్టు కాదు. తిప్పి పంపే పరిస్థితి ఉండకూడదు. కేవలం మేలు రకం కొనుగోలు చేయడం వల్ల రైతులను తీవ్ర నిరాశలోకి నెట్టినట్టు అవుతుంది. ► ప్రాసెస్ చేసే అవకాశం రైతుకు లేదు కాబట్టి.. రైతు ఎంతో కాలం సరుకును నిల్వ చేసుకోలేడు. చివరకు వ్యాపారులు రింగ్ అవడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మా కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ► పొగాకు కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితులను రైతులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇండెంట్ ఇచ్చి, తమ చేత పంట పండించి.. చివరకు వేలం కేంద్రం వద్దకు వ్యాపారులు రావడం లేదని వాపోయారు. కరోనాకు ముందు ధరలు బాగున్నా, ఇప్పుడు ధరలు తగ్గిపోయాయన్నారు. ► గడువు ముగిసినా.. వారం.. పది రోజులు అంటూ కొనుగోలు చేయడం లేదన్నారు. వేలం కేంద్రాల వైపు వ్యాపారులు చూడడం లేదని వాపోయారు. ఎకరాకు రూ.1.4 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ► కేంద్ర ప్రభుత్వానికి రూ.40 వేల కోట్లు, ఎగుమతుల రూపంలో మరో రూ.6 వేల కోట్ల ఆదాయం పొగాకు ద్వారా వస్తోంది. రైతులకు మాత్రం అప్పులు తప్పడం లేదన్నారు. ఒక ఏడాది పెట్టబడులు వస్తే.. వరుసగా ఆరేళ్లు నష్టాలు వస్తున్నాయని చెప్పారు. ► పొగాకు కొనుగోలు కోసం రిజిస్టర్ చేసిన కంపెనీలు కూడా వేలంలో పాల్గొనడం లేదని.. మీడియం, లోగ్రేడ్ పొగాకు రేటు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ► ఈ సమీక్షలో మంత్రులు కన్నబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీ బాలశౌరి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.సునీత, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు. లైసెన్స్‌దారులంతా వేలంలో పాల్గొనాల్సిందే లైసెన్స్ తీసుకొని పంట సాగు చేసిన రైతు నష్టపోకుండా ఉండే విధంగా దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేçస్తున్నాం. కొంతమంది లైసెన్స్‌దారులు కంపెనీలతో కుమ్మక్కయి రైతులు తక్కువ ధరకు అమ్ముకునే విధంగా చేయడం ఇకపై సాధ్యం కాదు. ఇక నుంచి ప్రతీ లైసెన్స్‌దారుడు విధిగా వేలంలో పాల్గొనే విధంగా నిబంధన తీసుకువస్తాం. జిల్లా, మండల స్థాయి వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌గా స్థానిక రైతులనే నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా ఇంచార్జిమంత్రి గౌరవ అధ్యక్షులుగా, మండల కమిటీలకు స్థానిక ఎమ్మల్యేలు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. ఈ కమిటీలో కౌలు రైతు, మహిళా రైతు విధిగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
పొగాకు కొనుగోళ్లపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: పొగాకు రైతుల ఇబ్బందులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రైతులను ఆదుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులను ఆదుకునేందుకు మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోనుంది. దీని కోసం రెండు,మూడు రోజుల్లో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయనున్నారు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో సంస్థ పనిచేయనుంది. పొగాకు కనీస ధరలను ప్రభుత్వం ప్రకటించనుంది. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే వేలం నిర్వహించనున్నారు. (‘వేదాద్రి’ మృతులకు 5 లక్షల పరిహారం) పొగాకు కొనుగోలు ప్రక్రియలో పాల్గొనని వ్యాపారులు, కంపెనీలపై వేటు వేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. లైసెన్స్ ఉన్న వ్యాపారులు వేలంలో తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం తెలిపారు. వేలం జరిగే అన్ని రోజుల్లో కూడా కొనుగోళ్లలో పాల్గొనాలని సీఎం సూచించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోళ్లు జరపాలని, లేదంటే వారి లైసెన్స్‌లను రద్దు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. (అర్హులందరికీ ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’) -
పొగాకు రైతుకు కోవిడ్ దెబ్బ!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చైనాలో ప్రబలిన కోవిడ్ (కరోనా) మన పొగాకు రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఏడాది చైనా బృందం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించి సాగులో ఉన్న పొగాకు పంటలను పరిశీలించి వెళ్లింది. దీంతో రైతుల్లో చైనాకు ఎగుమతులు మెరుగుపడతాయన్న ఆశలు చిగురించాయి. ఇంతలో చైనాలో కోవిడ్ విజృంభించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. సకాలంలో వర్షాలు పడటంతో మంచి దిగుబడి, ఎగుమతులు సాధించవచ్చని ఆశించిన రైతులు కోవిడ్ ప్రభావంతోపాటు దేశంలోనూ సరైన ధర లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మధ్యలో అధిక వర్షాలు పంటను దెబ్బతీశాయి. దీంతో పొగాకు కోత కోయకుండానే పండుగుల్ల ఆకును వదిలేయాల్సిన దుస్థితి రైతులకు ఎదురైంది. ఈ ఏడాది ముందుగానే ప్రారంభించినా.. గతేడాది పొగాకు క్రయవిక్రయాలతో పోలిస్తే ఈ ఏడాది వేలాన్ని ముందుగానే ప్రారంభించింది.. పొగాకు బోర్డు. ఫిబ్రవరి 17 నుంచే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగాకు వేలం ప్రారంభమైంది. గతేడాది తొలి విడతలో మార్చి 22 నుంచి, రెండో విడతలో మార్చి 27 నుంచి వేలాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడడంతో దక్షిణాది తేలిక నేలలు, నల్లరేగడి నేలల్లో కలిపి పది మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అదనంగా వచ్చింది. 2019–20 పొగాకు ఉత్పత్తి లక్ష్యం 84 మిలియన్ కిలోలు కాగా ఈ ఏడాది 94.21 మిలియన్ కిలోల పొగాకు దిగుబడి వచ్చినట్లు పొగాకు బోర్డు అంచనాకు వచ్చింది. గతేడాది తీవ్ర వర్షాభావంతో అధిక వ్యయాన్ని భరించి మరీ పొగాకు సాగు చేస్తే ఒక్కో బ్యారన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు మేర రైతులకు నష్టం వాటిల్లింది. గతేడాది అత్యధికంగా కిలోకు రూ.167.75 వచ్చింది. ఈ ఏడాది ఈ మొత్తానికి పది శాతం కలిపి ప్రారంభ ధర కిలోకు రూ.184గా నిర్ణయించాలని వ్యాపారులను రైతులు వేడుకొన్నారు. దీనికి ఒప్పుకున్న వ్యాపారులు చివరకు వేలం కేంద్రంలోకి వచ్చేసరికి ధరను తగ్గించడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పొగాకు బోర్డు నాణ్యమైన ఎఫ్–1 పొగాకుకు ప్రారంభ ధరను కిలోకు రూ.190గా నిర్ణయించింది. అయితే వ్యాపారులు రూ.170 మాత్రమే చెల్లించడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వ్యాపారుల సిండికేట్.. చైనా అధికారుల బృందం దేశంలో పర్యటించడంతో పొగాకు కొనుగోళ్లకు సంబంధించి వ్యాపారుల్లో పోటీ పెరుగుతుందని రైతులు భావించారు. కోవిడ్ దెబ్బతో చైనా ఈ వైపు కన్నెత్తి చూడడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే అదునుగా తీసుకున్న ఇండియన్ టుబాకో అసోసియేషన్ తన పెత్తనాన్ని పొగాకు వేలంలో సాగించింది. అన్ని పొగాకు వ్యాపార సంస్థలు కలిసి ఇండియన్ టుబాకో అసోసియేషన్‌గా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. రైతులతో, పొగాకు బోర్డుతో చేసుకున్న ఒప్పందాలను వ్యాపారులు లెక్క చేయడం లేదు. వేలం కేంద్రాల్లో వ్యాపారులు పొగాకు బేళ్లను తిరస్కరిస్తుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేలం జరుగుతున్న ఆరు కేంద్రాల్లో శనివారం రైతులు 635 బేళ్లను తీసుకురాగా 150 బేళ్లను కొనుగోలు చేయకుండా తిరస్కరించారు. పూర్తి స్థాయిలో వ్యాపారులు పాల్గొనలేదు రెండు జిల్లాల్లో మొదటి విడతగా ఆరు కేంద్రాల్లో వ్యాపారులు కొనుగోళ్లు ప్రారంభించారు. బోర్డులో రిజిస్టర్ చేసుకున్న వ్యాపారులందరూ వేలంలో పాల్గొనడం లేదు. దీంతో వేలం కేంద్రాలకు వచ్చిన అన్ని బేళ్లను కొనుగోలు చేయటం లేదు. దీంతో మిగిలిన బేళ్లను వెనక్కు తీసుకుపోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో చైనా వ్యాపారులెవరూ రాలేదు. – జి.ఉమామహేశ్వరరావు, పొగాకు బోర్డ్ ఆర్ఎం (ఎస్బీఎస్) నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి చైనా బృందం రాష్ట్రంలో పర్యటించినప్పుడు పొగాకుకు మంచి ధర వస్తుందనుకున్నాం. అయితే ఇంతలో కోవిడ్ దెబ్బ మన పొగాకు వ్యాపారంపై తీవ్రంగా పడింది. దీంతో ఇక్కడి వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారు. దీంతో గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. – మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు -
రోడ్డెక్కిన పొగాకు రైతులు
సాక్షి, కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో రైతులు వేలానికి ఉంచిన బేళ్లలో ప్రతిరోజు వంద నుంచి 200 పొగాకు బేళ్లు కొనకుండా వ్యాపారులు వెనక్కి తిప్పి పంపుతుండటంతో కడుపు మండిన రైతులు ఆర్అండ్బీ రోడ్డు ఎక్కి ధర్నా చేసిన సంఘటన కొండపిలో జరిగింది. కొండపి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం వేలంకేంద్రం పరిధిలోని అయ్యవారిపాలెం, జువ్విగుంట, తంగెళ్ళ గ్రామాల నుంచి రైతులు 1047 బేళ్లను అమ్మకాలకు పెట్టారు. వేలం కేంద్రం అధికారి మధుసూదనరావు వేలాన్ని ప్రారంభించగా 74 బేళ్లు బిడ్డింగ్ కాగా అందులో 35 బేళ్లను వ్యాపారులు వివిధ కారణాలతో కొనకుండా తిరస్కరించారు. దీంతో పరిస్థితి గమనించిన రైతులు ఒక్కసారిగా వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వేలం జరిగిన బేళ్లలో సగం బేల్స్‌ను కొనకుండా తిరస్కరిస్తే ఇక రైతులు అమ్ముకునేది ఏంటని వ్యాపారులను నిలదీసి వేలాన్ని అడ్డుకుని నిలిపివేశారు. అనంతరం వందల మంది రైతులు బోర్డు ముందు ఆర్అండ్బీ రోడ్డు మీద బైఠాయించి అర్ధగంటకు పైగా తమ నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని రైతులను కోరటంతో కొద్దిసేపు ధర్నా చేసి విరమిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బోర్డు ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు వందల సంఖ్యలో పొగాకు బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేయకపోవటం వలన తిరిగి ఇళ్లకు తీసుకెళ్తున్నట్లు ఆవేదన చెందారు. ధరలు దిగ్గోసి కొంటున్నా వచ్చినదే దక్కుదల అని అమ్ముకుని నష్ట పోతున్నారన్నారు. పొగాకు బాగోలేదని, ఆర్డర్లు లేవని రకరకాల సాకులతో తెచ్చిన బేళ్లను సైతం కొనకుండా ముప్పతిప్పలు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు వందల సంఖ్యలో తెచ్చిన బేళ్లను రైతులు ఇళ్లకు తీసుకెళ్లి తీసుకురావాలంటే రవాణా ఖర్చులు సైతం తడిసిమోపెడవుతున్నాయని తెలిపారు. ఇక మీదట రైతులు పొగాకు వేసే పరిస్థితి సైతం లేదన్నారు. బోర్డు తగిన చర్యలు తీసుకుని తెచ్చిన బేళ్లను వెనక్కి పంపకుండా వ్యాపారులతో కొనిపించాలన్నారు. కార్యక్రమంలో పొగాకు రైతులు పాల్గొన్నారు. వ్యాపారులు నోబిడ్లు లేకుండా చూడాలి వ్యాపారులు ప్రతి రోజు వందకు పైగా బేళ్లను కొనకుండా వెనక్కి పంపుతున్నారు. ఈవిధంగా కొంటే రైతులు పొగాకు అమ్ముకోలేరు. 74 బేళ్లకు పాట పెడితే 34 బేళ్లను నోబిడ్ పెట్టాల్సి వచ్చింది. ఈవిధంగా అయితే రైతులు చాలా ఇబ్బంది పడతారు. వెనక్కి తీసుకెళ్లి తీసుకురావటంతోనే కాలం సరిపోతుంది. వ్యాపారులు నోబిడ్లు తగ్గించి కొనుగోలు చేయాలి. - కె.మధుసూదనరావు, వేలంకేంద్రం అధికారి, కొండపి చాలా ఘోరంగా ఉంది కొండపి పొగాకు వేలం కేంద్రంలో రైతులు పరిస్థితి ఘోరంగా ఉంది. గిట్టుబాటు ధరల గురించి ఆశలు వదులుకున్న రైతులు ఏదో ఒక రేటుకు పొగాకు అమ్ముకోవాలని నిర్ణయించుకున్నా వ్యాపారులు కొనటం లేదు. ప్రతిరోజు వందల సంఖ్యలో రైతులు తెచ్చిన బేళ్లను వెనక్కి తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితి గురించి బోర్డు పట్టించుకుని చర్యలు తీసుకోవాలి. - ఎల్.భాస్కర్, అయ్యవారిపాలెం, పొగాకు రైతు పొగాకు రైతుల పరిస్థితి దీనంగా ఉంది నీరులేక, మల్లె పెరిగి దిగుబడి రాక అష్టకష్టాలు పడి పండించిన పంటను వ్యాపారులు దోచుకుంటున్నారు. దోపిడీకి మేము సహించి బేళ్లు వదులుకుంటున్నా వివిధ సాకులతో తెచ్చిన బేళ్లను కొనకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. పొగాకు రైతుల బాధలు ఎవరూ పట్టించుకోవటం లేదు. - బొట్లగుంట రమణయ్య, జువ్విగుంట -
‘సిరి’పైనే పొగాకు రైతుల గురి
మునుపెన్నడూ లేని విధంగా పొగాకు రైతులు ఈ ఏడాది సిరి అనే రకం పొగాకు విత్తనాలపై అమితాసక్తి చూపారు. దక్షిణ ప్రాంత తేలిక నేల ప్రాంతాలైన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గతంలో సిరి, వీటీ 1158, ఎన్ 98, జీ 11 తదితర రకాలను పొగాకు నారుమడి కోసం రైతులు, నర్సరీ వ్యాపారులు ఉపయోగించగా.. ఈ ఏడాది దీనికి భిన్నంగా సిరి రకం విత్తనాల వైపు మొగ్గు చూపారు. దక్షిణ ప్రాంత రైతులందరూ సిరి విత్తనాలతోనే నార్లు పోశారు. రైతుల ఆసక్తి మేరకు రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సీటీఆర్ఐ) విత్తనాభివృద్ధి శాస్త్రవేత్తలు సిరి విత్తనాలనే రైతుల కోసం అందించారు. రాజమహేంద్రవరంతోపాటు, కందుకూరులో విత్తనాలను కిలో రూ.900 చొప్పన విక్రయించారు. ఈ ఏడాది దాదాపు 8 వేల కిలోల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు రైతుల కోసం ఉత్తర ప్రాంతమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని నర్సరీ వ్యాపారులు కూడా సిరి విత్తనాలతోనే పొగాకు నారుమడులు పెట్టారు. ఉత్తర ప్రాంతానికి అనువైన కన్సన్, ఎల్టీ కన్సన్తోపాటు ఐటీసీ విత్తన రకాలు ఇక్కడ రైతులు ఉపయోగిస్తున్నారు. ఒక ఎకరం నారుమడికి గరిష్టంగా నాలుగు కేజీల విత్తనాలను రైతులు వాడుతున్నారు. అధిక దిగుబడులను ఇవ్వడంతోపాటు ఆకుముడత అతి తక్కువగా ఉంటోంది. అందువల్లే రైతులు సిరి పొగాకు విత్తనాలపై ఆసక్తి చూపుతున్నారు దిగుబడి ఎక్కువ ఆకుముడత తక్కువ ఇతర విత్తనాలతో పోల్చుకుంటే సిరి విత్తనాలు దిగుబడి బాగా వస్తుంది. పైగా ఆకుముడత తక్కువగా ఉంటోంది. అందుకే సిరి విత్తనాలనే నారుమడులకు ఉపయోగిస్తున్నాం. – బాలు కోటిరెడ్డి (89853 11626), పొగాకు రైతు, కనిగిరి, ప్రకాశం జిల్లా విత్తనాలకు డిమాండ్ పెరిగింది గతేడాది వరకు ఎన్ 98, జీ 11 విత్తనాలను ఉపయోగించేవాళ్లం. ఈ ఏడాది సిరి విత్తనాలనే కొనుగోలు చేశాం. కందుకూరులో విత్తనాలు అయిపోవడంతో రాజమహేంద్రవరం వచ్చి తీసుకున్నాం. – జి. అబ్దుల్లా, కొండాపురం, నెల్లూరు జిల్లా – పలుకూరి కోటేశ్వరరెడ్డి, సాక్షి, రాజమహేంద్రవరం -
పొగాకు రైతులకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, ఒంగోలు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తనను కలిసిన పొగాకు రైతులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం వైఎస్ఆర్ సీపీ పోరాటం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను శనివారం వీవీపాలెం పొగాకు రైతులు కలిశారు. కిలో పొగాకుకు రూ.176 ఉత్తత్పి వ్యయం అవుతుందని, కౌలు ఖర్చులు అదనంగా అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు ఖర్చులు కూడా పెరిగిపోయాయని వాపోయారు. కనీసం గిట్టుబాటు ధర రూ.210 ఉండాలని రైతులు కోరారు. మరో ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుందని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని జగన్ తెలిపారు. ఇందుకోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని జననేత హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు వలేటివారిపాలెం చేరుకున్న వైఎస్ జగన్‌కు స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను రాజన్న బిడ్డకు వివరించారు. -
పొగాకు రైతులు సమస్యల్లో కూరుకుపోయారు
-
ఎవుసం భారం
ఏటేటా పెరుగుతున్న పెట్టుబడి ఎకరా పత్తి సాగుకు రూ.15 వేలపైనే పెట్టుబడి సకాలంలో వర్షాలు లేక ఎండుముఖం పడుతున్న పంట కూలీల కొరతతో ఇబ్బందులు రాయికోడ్: వ్యవసాయం ఏటేటా భారమవుతోంది. కూలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ట్రాక్టర్ కిరాయితో అన్నదాతలు సతమతమవుతున్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు, కార్మికులు, కార్మికేతరులు సైతం పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో బీడుభూములు సైతం సాగులోకి వచ్చాయి. మండలంలో ప్రధానంగా పత్తి, కంది, పెసర, మినుము, సోయాబీన్ పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 7,649 హెక్టార్లలో పత్తి పంటను సాగు చేశారు. జూన్‌లో కురిసిన తొలకరి వర్షాలకు పత్తి విత్తనాలు విత్తిన రైతులు దిగుబడిపై భారీ అంచనాతో ఉన్నారు. ఎకరం పత్తిపంట సాగు కోసం ఇప్పటి వరకు రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు చెబుతున్నారు.పంట ఇంటికి చేరే వరకు మరో రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు. ప్రతి సంవత్సరం కూలీలకు కూలి, ట్రాక్టర్ కిరాయి పెరగడమే కారణమని చెబుతున్నారు. ఒక్కో కూలీకి రోజుకు రూ.300, ఎకరం దుక్కి దున్నడానికి ట్రాక్టర్ కిరాయి రూ.1,200 చెల్లిస్తున్నారు. ఎడ్ల నాగళ్లతో దుక్కులు దున్నడం చాలా వరకు తగ్గింది. కూలీలు కొరతతో కూలి రేట్లు రెండింతలు పెరిగాయి. రోజుకు కనీసం రూ.300 చెల్లిస్తే తప్పా కూలీలు పనులకు రాని పరిస్థితి. పెరిగిన పెట్టుబడిని తట్టుకోవాలంటే ఎకరం విస్తీర్ణంలో కనీసం 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉంటుందని అంటున్నారు. పంటలు ఎండుముఖం మొదట్లో సరైన సమయంలో వర్షాలు కురవక పలువురు రైతులు వేసిన విత్తనాలను దున్నేసి రెండోసారి విత్తారు. జూన్‌లో 168 ఎంఎం సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 133 ఎంఎం మాత్రమే కురిసింది. జూలైలో 205 ఎంఎం సాధారణ వర్షపాతానికి 225 ఎంఎం నమోదు కావడంతో రైతులకు ఊరట లభించింది. ఆగస్టులో వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు గ్రామాల్లో పత్తి పంట వాడిపోతోంది. ఈ నెలలో 215 ఎంఎం సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 39 ఎంఎం మాత్రమే కురిసింది. గత రెండు వారాలుగా వాతావరణం వేసవిని తలపిస్తోంది. భానుడి ప్రతాపానికి పంటలు వాడిపోతున్నాయి. మండల కేంద్రంలో కురిసిన వర్షాలు ఇతర గ్రామాల్లో కురవడం లేదు. ప్రస్తుతం రైతులు భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా పంటల దిగుబడి రాక అప్పుల్లో కూరుకుపోయామని వాపోతున్నారు. వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. ఇందుకుగాను ఉపాధి హామీ పథకం పనులను వ్యవసాయానికి అనుబంధం చేయాలని విన్నవిస్తున్నారు. ఎకరం పత్తి సాగుకు పెట్టుబడి వివరాలు పని ఖర్చు దిక్కి దున్నడానికి రూ.1,500 కల్టివేటర్‌కు రూ.500 పత్తి గీతకు.. రూ.500 విత్తనాల కొనుగోలు రూ.1,600 కూలీల ఖర్చు రూ.800 మూడు బస్తాల ఎరువు రూ.2,200 ఎరువు చల్లడానికి రూ.500 రెండుసార్లు కలుపు రూ.3,000 పత్తి అంతర కృషికి (మూడుసార్లు) రూ.1,800 రసాయనాల కొనుగోలు(రెండుసార్లు) రూ.2,400 రసాయనాల పిచికారీ(రెండుసార్లు) రూ. 1,600 మొత్తం రూ.16,400 పెట్టుబడులు పెరిగాయి పంటల సాగు భారమవుతోంది. విత్తనాలు, ఎరువులు, కూలి రేట్లు పెరుగుతున్నాయి. పంటలకు మద్దతు ధర ఉండటం లేదు. అప్పులు పెరుగుతున్నాయి. వ్యవసాయాన్ని బతికించాలంటే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఉపాధి హామీ పథకాన్ని సాగు పనులకు అనుసంధానం చేయాలి. పంటలకు మద్దతు ధర అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - ఎల్.సంగన్న, జంమ్గి రైతు ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి 4 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. వాతావరణం ప్రతికూలంగా ఉంది. ఇప్పటి వరకు ఎకరాకు రూ.16 వేలకుపైగానే పెట్టుబడి పెట్టాను. పంట ఇంటికి చేరుకునే సరికి రూ.20 వేల పెట్టుబడి అవుతుంది. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే పెట్టుబడి పోను కొంతైనా లాభం పొందొచ్చు. ట్రాక్టర్, కూలీ రేట్లు, విత్తనాలు, ఎరువుల ధరలు పెరగడంతో ఎవుసం భారమవుతోంది. - బి.విఠల్, జంమ్గి రైతు -
'న్యాయం జరిగేవరకూ సీఎంను వదిలిపెట్టం'
-
'న్యాయం జరిగేవరకూ చంద్రబాబును వదిలిపెట్టం'
ఏలూరు : చంద్రబాబు నాయుడు పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓ పక్క డబ్బులు లేవంటూనే సీఎం మరోవైపు విమానాల్లో విదేశాలకు వెళుతున్నారని ఆయన విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో బుధవారం వైఎస్ జగన్ ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానాల్లో విదేశాలకు వెళ్లడం కాదని, రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక చంద్రబాబు విస్మరించారన్నారు. రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు రావటం లేదని, మరోవైపు పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదని వైఎస్ జగన్ అన్నారు. రుణాలపై బ్యాంకులు రూపాయిన్నర నుంచి రెండు రూపాయిలు అపరాధ రుసుం వసూలు చేస్తున్నాయని, ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతులు బతికేదెలా అని ప్రశ్నించారు. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటివరకూ పొగాకు కొనుగోళ్లు చేపట్టలేదని వైఎస్ జగన్ అన్నారు. జులై వచ్చినా సగం పొగాకు కూడా కొనుగోలు చేయకపోవటం దారుణమన్నారు. జిల్లాలో ముగ్గురు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని మండిపడ్డారు. ఒక్క పొగాకు రైతులే కాదని, వరి నుంచి పామాయిల్ రైతుల వరకూ అందరి పరిస్థితి ఇదేనన్నారు. కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. గిట్టుబాటు ధర రాక రైతులందరూ అవస్థలు పడుతున్నారన్నారు. ఎన్నికలు ముందు చంద్రబాబు ఏం చెప్పారని, అధికారంలోకి వచ్చాక ఆయన చేస్తున్నారో చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడితే తాను రూ.5వేల కోట్లతో పెడతానని చంద్రబాబు చెప్పారనే విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆ విషయాన్ని మరచిపోయారని ధ్వజమెత్తారు. రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. కొత్త రుణాలు రాక, పాత రుణాలు రెన్యువల్ కాక రైతులు కష్టాల్లో కూరుకుపోయారన్నారు. పొగాకుకు రూ.20 బోనస్ ఇస్తామని చెప్పి, కేవలం పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.70 లక్షలు ముష్టి వేశారని వైఎస్ జగన్ అన్నారు. పొగాకు ఉత్పత్తిని 65 మిలియన్ క్వింటాళ్ల నుంచి 35 మిలియన్ క్వింటాళ్లకు తగ్గించారని ఆయన వ్యాఖ్యానించారు. పొగాకు కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. స్థిరీకరణ నిధిని తీసుకొచ్చేలా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. అప్పుడైనా పొగాకు బోర్డు స్పందించి, రైతులకు న్యాయం చేస్తుందని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో పొగాకకు కనీసం రూ.165 మద్దతు ధర లభిస్తే...చంద్రబాబు గత ఏడాది 114 రూపాయలే ఇచ్చారన్నారు. అలాగే పామాయిల్ విషయానికి వస్తే వైఎస్ఆర్ హయాంలో రూ.10 వేలు పలికితే, ఇప్పుడు రూ.5,500కి పడిపోయిందన్నారు. ఉత్పత్తి ధర పెరుగుతు ఉంటే, మద్దతు ధర మాత్రం తగ్గుతోందన్నారు. నాయకులు మాట మీద నిలబడాలని, రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలన్నారు. లేకుంటే చంద్రబాబు ప్రతి ఒక్కరికీ విమానం లేదా కారు కొనిస్తానంటారని ఎద్దేవా చేశారు. మాట నిలబెట్టుకోకపోతే నిలదీసే పరిస్థితి రావాలని, అప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. ప్రాజెక్టులకు పరిహారం విషయంలోనూ చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. పట్టిసీమ కింద ఎకరాకు రూ.30 లక్షలు ఇస్తే, చింతలపూడి కింద రూ.12 లోలే ఇస్తున్నారన్నారు. రైతులు కొట్టుకోవాలి, ఉద్యమాలు రావాలి...ప్రాజెక్టులు కట్టకుండా కాలయాపన చేయాలనేది చంద్రబాబు ఉద్దేశమన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ చంద్రబాబు వదిలిపెట్టమని, రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
పొగాకు రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి
జంగారెడ్డిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. బుధవారం ఆయన జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా పొగాకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లో క్వాలిటీ పొగాకుకు కనీస ధర ఇవ్వడం లేదని రైతులు ...వైఎస్ జగన్ వద్ద వాపోయారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని కూడా తగ్గించి పొగాకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిపై పొగాకు బోర్డు అధికారులను నిలదీస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఆయిల్ ఫాం రైతులు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయిల్ ఫాం రైతులు కలిశారు. దుద్దుకూరులో చింతమనేని హనుమంతరావు ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఉదయం వైఎస్ జగన్‌ను కలిసి ఆయిల్ ఫాం సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఆయనకు తెలిపారు. క్రూడ్ పామాయిల్‌పై 12.5 శాతం దిగుమతి పన్ను విధించారని, అయితే పామాయిల్ టన్నుకు మద్దతు ధర రూ.7,494 మాత్రమే ఇస్తున్నారన్నారు. టన్ను పామాయిల్ మద్దతు ధర రూ.10వేలకు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రైతులు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా వైఎస్ జగన్ జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులకు ముఖాముఖి కానున్నారు. మధ్యాహ్నం కుక్కునూరులో పర్యటించనున్నారు. పోలవరం నిర్వాసితుల రిలే దీక్షకు వైఎస్ జగన్ మద్దతు పలకనున్నారు. -
టీడీపీలో వేడి
రెండేళ్ల అనంతరం తొలిసారి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లిన మంత్రి సుజాత జానంపేట అక్విడెక్ట్‌ను పరిశీలించిన దేవినేని ఉమ ఏలూరు : పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి, ముంపు మండలాల్లో ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడానికి ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలిసి అధికార పార్టీలో వేడి మొదలైంది. అయితే, అనివార్య కారణాల వల్ల వైఎస్ జగన్ పర్యటన రద్దయ్యింది. తన నియోజకవర్గంలోనే పొగాకు వేలం కేంద్రాలు ఉన్నా ఏనాడూ వాటివైపు కన్నెత్తి చూడని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సోమవారం ఆగమేఘాల మీద రెండు వేలం కేంద్రాలను సందర్శించడం చర్చనీయాంశమైంది. గత ఏడాది పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందు లకు గురై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నా వారి సమస్యలపై మంత్రి స్పందించలేదు. తాజాగా జగన్మోహన్రెడ్డి వస్తున్నారనే సమాచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సుజాత వేలం కేంద్రాలకు వెళ్లారు. వర్జీనియా పొగాకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, వంద రోజుల్లో వేలం పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటివరకూ చేయలేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారంటూ వారిపై జాలి చూపించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మిస్తున్న పోలవరం కుడికాలువ అక్విడెక్ట్ పనులను పరిశీలించారు. ప్రాజెక్ట్ పనులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పకుండా ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడానికే సమయాన్ని కేటాయించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికావడం జగన్మోహనరెడ్డికి ఇష్టం లేదని, అందుకే ముంపు ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముంపు మండలాల అభివృద్ధికి రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఆ ప్రాంతంలో కనీస అభివృద్ధి కూడా జరగకపోగా.. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్లు ఇతరత్రా ఏ పథకాలు అందకపోవడంతో వేలేరుపాడు, కుకునూరు మండలాల ప్రజలు అధికార టీడీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి రెండు నెలల క్రితం పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షంపై బురదచల్లే పనిలో రాష్ట్ర మంత్రులు నిమగ్నమయ్యారు. -
పొగాకు రైతుల ఆందోళన
మరిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు ఎదుట పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో నెల్లూరు-ముంబాయి రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
రోడ్డెక్కిన పొగాకు రైతులు
గిట్టుబాటు ధర రావడంలేదని వర్జినియా పొగాకురైతులు వేలం నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడంలో మంగళవారం ఉదయం జరిగింది. ప్రకృతితో యుద్ధం చేస్తూ ఆరుగాలం కష్టపడి పంట సాగు చేస్తే ప్రభుత్వం గిట్టు బాటు ధర కల్పించక పోవడం అన్యాయమని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. పంట కోసం అప్పులు చేశామని.. పరిస్థితి చూస్తే.. కనీసం వడ్డీలకు కూడా ఆదాయం సరిపోని పరిస్థితి ఉందని అన్నారు. గిట్టుబాటు ధర కల్పించే వరకూ వేలం జరగ నిచ్చేదిలేదని స్పష్టం చేశారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక ఓ పొగాకు రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన పందిరిపల్లి వెంకట సత్యనారాయణ (45) అనే రైతు తనకున్న 70 సెంట్ల పొలంతోపాటు ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేస్తున్నాడు. సగత సీజన్లో తీవ్ర పంటనష్టం వాటిల్లింది. దీంతో బ్యాంకులతోపాటు స్నేహితులు, బంధువుల నుంచి సుమారు రూ.16 లక్షల వరకు అప్పు చేసినట్టు అతని కుటుంబసభ్యులు తెలిపారు. రుణమాఫీ కాకపోవడం, ఇటీవల బ్యాంకుల నుంచి నోటీసులు రావడం, అప్పు ఇచ్చిన వ్యక్తుల నుంచి కోర్టు నోటీసులు అందడంతో సత్యనారాయణ మనోవేదనకు గురయ్యాడు. దీనికి తోడు ప్రస్తుతం బ్యాంకుల నుంచి కొత్త రుణాలు ఇవ్వకపోడంతో పాత అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక సత్యనారాయణ మంగళవారం ఇంట్లోనే పురుగుమందు తాగాడు. అప్పుల భారాన్ని మోయలేక, అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్లో రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రధానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ
ఒంగోలు: పొగాకు రైతుల ఆత్మహత్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా రైతుల సమస్యలను వైవీ సుబ్బారెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రైతు ఆత్మహత్యలు, సమస్యలపై ప్రత్యేకంగా లేఖలో ఎంపీ ప్రస్తావించారు. పొగాకు రైతులను ఆదుకోవాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. లేఖ కాపీని కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, రాధా మోహన్ సింగ్‌కు కూడా వైవీ సుబ్బారెడ్డి పంపారు. -
పొగాకు రైతులకు నష్టపరిహారం
-
మీరు రాగానే రేటు పెంచేశారు
జగన్ వద్ద గోడు వెళ్లబోసుకున్న పొగాకు రైతులు ఒంగోలు: అయ్యా, మీరు రాగానే ధర పెంచేశారు... మీరు రోజూ వస్తే మా బతుకులు బాగుపడ్డట్టేనని పొగాకు రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిని వేడుకున్నారు. ఈ సంఘటన బుధవారం ప్రకాశం జిల్లా టంగుటూరు వేలం కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిం చిన జగన్ టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతులను, పొగాకు బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు గంట సేపు వేలం కేంద్రంలో గడిపిన ఆయన అక్కడ వేలం జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ పొగాకు వేలం కేంద్రంలోకి అడుగుపెట్టగానే అక్కడ స్క్రీన్‌పై వేలం ధరల పట్టికను పరిశీలించారు. లోగ్రేడ్ పొగాకుకు కిలో రూ. 34 ఉండటంతో పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ భాస్కరరెడ్డిని వివరణ కోరారు. కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంవల్ల ఈ సమస్య తలెత్తిందని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో జగన్ తన ఎదుట వేలం జరపాలని కోరారు. వీవీ లక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన లోగ్రేడ్ పొగాకు వేలం జరిగింది. జగన్ అక్కడే ఉండటంతో వ్యాపారులు పాట పెంచగా రూ.65 పలికింది. ‘‘అయ్యా... మీరు వచ్చారు కాబట్టే ఈ ధర వచ్చింది. రోజూ మీరు మా క్లస్టర్‌కు రండి... మాకు మంచి రోజులు వస్తాయి’’ అంటూ జగన్‌తో రైతులు తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. -
పోరు ఆగదు
♦ టంగుటూరు పొగాకు ధర్నాలో వైఎస్ జగన్ ♦ రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన చంద్రబాబు ♦ రెండుసార్లు పొగాకు రైతులను ఆదుకున్న వైఎస్సార్ సాక్షి, టంగుటూరు : పొగాకు రైతులకు న్యా యం జరిగే వరకూ ఈ పోరు ఆగదని, వారికి తుదివరకూ అండగా నిలబడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో పొగాకు గిట్టుబాటు ధర రాక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న, గుండె ఆగి మరణించిన రైతు కుటుంబాలను ఆయన బుధవారం పరామర్శించారు. అనంతరం టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో పొగాకు వేలం జరుగుతున్న విధానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొగాకు వేలం కేంద్రం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో పొగాకు బోర్డు పనితీరు అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరి రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత రైతులను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నపుడు రెండుసార్లు ప్రభుత్వం తరఫున పొగాకు రైతులను ఆదుకున్న విషయం గుర్తు చేశారు. గిట్టుబాటు ధర రాక కడుపు మండుతుంటే కడుపు కాల్చుకుని ధర్నాలో పాల్గొన్న రైతన్నలందరికీ... కడుపునిండా బాధ ఉన్నా, కష్టమనిపించినా రైతన్నల ఆక్రోశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దలకు చెప్పడానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అనుకున్నది సాధిద్దామని రైతులకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాను ఉద్దేశించి జగన్మోహన్రెడ్డి ఉద్వేగభరిత ప్రసంగం ఆయన మాటల్లోనే.... అధ్వాన్నంగా పొగాకు బోర్డు పనితీరు రాష్ట్రంలో పొగాకు బోర్డు నడుస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలిగించింది. పొగాకు వేలం జనవరిలో మొదలుపెట్టి జూన్‌కు ఆపేయాలి. కానీ అక్టోబర్ నెల వస్తున్నా వేలం పూర్తి కాలేదు. రైతన్నలు మూడునెలల్లో పండించిన పంటను అమ్ముకోవడానికి పది నెలలు పడుతోంది. జూన్ దాటిన తర్వాత వర్షాలు పడతాయి, దీనివల్ల పొగాకులో తేమ శాతం పెరిగి పొగాకు రంగు మారి, ధర తగ్గిపోతుందని తెలిసి కూడా అక్టోబర్ వరకూ పొగాకు అమ్మకాలు జరిపిస్తున్నారు. ఈ రోజు పొగాకు ధరలు పరిశీలించేందుకు టంగుటూరు వేలం కేంద్రానికి వెళ్లా. అక్కడ నా కళ్లముందే వేలం నిర్వహించారు. వేలం జరిగేటప్పుడు మన అందరికీ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు ఉదయం నేను రాకముందు ఎఫ్-9 గ్రేడ్ పొగాకు ధర రూ.34 అని బోర్డుపైన కనపడుతూ ఉంది. వేలం వద్ద నేను నిలబడ్డా. అదే గ్రేడ్ పొగాకును నా కళ్లెదుటే రూ.65కు పాడారు. ఇదే గ్రేడ్ పొగాకు గతేడాది కిలో రూ.80 పలికిందని అధికారులు చెప్పారు. జిల్లాలో గత ఏడాది కిలో పొగాకు రూ.109 పలికితే, ఈ ఏడాది సగటు ధర రూ.90.90 మాత్రమే. రూ.109కి రూ.90.90 పోలికెక్కడ? రాష్ట్రవ్యాప్తంగా ఇదే పొగాకు ధర సగటున రూ.101.16 అని చెబుతున్నారు. ప్రస్తుతమున్న 172 మిలియన్ కిలోల లక్ష్యాన్ని 120 మిలియన్ కిలోలకు తగ్గించాం కాబట్టి వచ్చే ఏడాది పొగాకు ధర బావుంటుందని బోర్డు చెబుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పొగాకు బోర్డు చెబుతున్న ఈ లెక్కలు నిజమే అయితే... గత ఏడాది 213 మిలియన్ కిలోలుగా ఉన్న లక్ష్యాన్ని 172 మిలియన్ కిలోలకు తగ్గించినా ధర ఎందుకు తగ్గింది? ఇప్పుడు 120 మిలియన్ కిలోలకు తగ్గిస్తే ధర పెరుగుతుందని మొసలి కన్నీరెందుకు కారుస్తున్నారని ప్రశ్నిస్తున్నా. రుణమాఫీ చేయని చంద్రబాబు రైతులు ఏడెకరాలకు ఒక బ్యారన్ పెడతారు. కనీసం ఐదెకరాలకు ఒక బ్యారన్ పెడితే, ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున 50 క్వింటాళ్లు పండితే, బ్యాంకులు రూ.ఐదు లక్షల రూపాయల వరకూ రుణం ఇస్తున్నారు. ఇప్పుడు లక్ష్యాన్ని 172 మిలియన్ కిలోల నుంచి 120 మిలియన్ కిలోలకు తగ్గించి, బ్యారన్‌కు 30 క్వింటాళ్లు లక్ష్యంగా పెడితే బ్యాంకులు రూ.3లక్షలకు మించి రుణాలివ్వవు. మరోవైపున బేషరతుగా రుణమాఫీ చేస్తానని ఎన్నికలముందు ఊరూరా హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పటివరకూ ఆ పని చేయలేదు. రైతుల రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు అన్నాడా లేదా? (అన్నాడని అందరూ చేతులెత్తారు.) మరి రుణమాఫీ పూర్తిగా చేశాడా? (లేదు లేదంటూ అందరూ చేతులెత్తి సమాధానం చెప్పారు.) రుణాలు మాఫీ కాలేదు. బ్యాంకుల్లో ఉన్న బంగారం వేలం వేస్తున్నారు. గతంలో రూ.లక్ష వరకూ రుణం వడ్డీ లేకుండా వచ్చేది. మూడు లక్షల రూపాయల వరకూ రుణం పావలా వడ్డీకి వచ్చేది. ఇప్పుడు 14 నుంచి 18 శాతం వరకూ అపరాధ రుసుం విధిస్తున్నారు. చంద్రబాబునాయుడు రుణమాఫీ ప్రకటించే నాటికి రాష్ట్రంలో రూ.87,612 కోట్ల రుణాలున్నాయి. వాటిపై ఇప్పటికి రూ.18 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోంది. చంద్రబాబునాయుడు గత ఏడాది రూ.4600 కోట్లు, ఈ ఏడాది రూ.2800 కోట్లు మొత్తం కలిసి రూ.7400 కోట్లు మాఫీ చేశారు. రెండేళ్లలో ఆయన వేసిన ముష్టి రూ.7400 కోట్లకు వడ్డీ కూడా మాఫీ కాలేదు. రాష్ట్రంలో రైతులకు కష్టకాలం రాష్ట్రంలో ఏ రైతు పరిస్థితి చూసినా ఇలానే ఉంది. పామాయిల్‌కు గిట్టుబాటు ధర రూ.9 వేలు ప్రకటిస్తే ఇప్పుడు రూ.5,400 కు కూడా కొనడంలేదు. ధాన్యానికి రూ.1400 ఎంఎస్పీ ప్రకటిస్తే రైతుకు రూ.1100 కూడా దక్కడం లేదు. పత్తికి కనీస మద్దతు ధర రూ.4,500 ప్రకటిస్తే రూ.3,500 కూడా రావడం లేదు. పట్టుగూళ్లుకు రూ.300 నుంచి రూ.350 ధర రావాల్సి ఉండగా ఇప్పుడు రూ.150 కూడా రావడంలేదు. పసుపు కిలోకు రూ.150 నుంచి రూ.250 వరకూ గిట్టుబాటు ధర రావాల్సి ఉండగా, రూ.70 కూడా రావడంలేదు. చెరుకు టన్ను రూ.2300 కాగా రూ.1540 మాత్రమే వస్తోంది. మొక్కజొన్నకు రూ.1310 గాను రూ.900 కూడా పలకడం లేదు. ఇక సుబాబుల్, జామాయిల్ విషయానికి వస్తే రూ.4,400, రూ.4600 గిట్టుబాటు ధర ఇవ్వాల్సి ఉండగా రూ.3500 కూడా అందడం లేదు. రైతు బతుకే కష్టంగా మారింది. ఈ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయి. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ పోరాటం ఆగదు. నష్టపోయిన ప్రతి రైతుకు తోడుగా ఉంటాం. కష్టమైనా ఒత్తిడి తెచ్చేందుకు అందరం ఒకటవుదాం. మనకి కావాల్సింది సాధించుకుందాం. ధర్నాలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ తలశిల రఘురామ్, జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అమృతపాణి, నియోజకవర్గ ఇన్చార్జులు వరికూటి అశోక్‌బాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, యెడం బాలాజీ, గొట్టిపాటి భరత్, వెన్నా హనుమారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడు కుటుంబాలకు పరామర్శ జిల్లాలో అత్మహత్యలకు పాల్పడిన పొగాకు రైతులు బొలినేని కృష్ణారావు, నీలం వెంకటరావు, గిట్టుబాటు ధర రాక వేలం కేంద్రంలోనే గుండె ఆగి చనిపోయిన మిడసల కొండలరావు కుటుంబాలను జగన్ పరామర్శించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినా అధైర్యపడకుండా ముందుకు సాగాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డిగ్రీ చదువుతున్న ఆడపిల్ల చదువు మాన్పించవద్దని కొండలరావు కుటుంబానికి చెప్పారు. పొగాకు రైతులను ఆదుకున్న వైఎస్సార్ 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినపుడు పొగాకు రైతులు ఇలానే సంక్షోభంలో ఉంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దింపి సొసైటీల తరఫున పొగాకు కొనుగోలు చేయించారు. దీనివల్ల పోటీ పెరిగి పొగాకుకు మంచి ధర వచ్చింది. ఆయన ఐదేళ్లలో రెండుసార్లు పొగాకు రైతులను ఆదుకున్నారు. కానీ ఇదేపని చంద్రబాబు చేసే అవకాశం ఉన్నా చేయలేదు. చంద్రబాబూ నీకు బుద్ధీ జ్ఞానం ఏమైనా ఉందా? ముఖ్యమంత్రిగా పొగాకు రైతులను ఆదుకోవాలన్న బుర్ర, ఆలోచన లేకుండా పోయాయి. 172 మిలియన్ కిలోల పొగాకు పండుతుందని తెలిసినప్పుడు మార్కెట్ సంక్షోభంలో ఉన్నపుడు జనవరి నుంచి జూన్ వరకూ రూ.400 కోట్లు ఖర్చు పెట్టి 30 మిలియన్ కిలోలు కొని ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారా? లోగ్రేడ్ పొగాకు కిలోకు రూ.62 నుంచి రూ.67 వరకూ ధర ఇస్తామని మూడు వారాల కిందట మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు కేవలం రూ.34 పలుకుతోంది. రూ.67 కంటే తక్కువకు ఎవరి వద్ద కొన్నారో వారందరికీ మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా. అప్పుడు రైతులకు కొంతైనా ఊరట కలుగుతుంది. -
సర్కారుపై సమర శంఖం
-
సర్కారుపై సమర శంఖం
- పొగాకు రైతులకు జగన్ అండ - నేడు టంగుటూరులో నిరసన సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం పొగాకు రైతుల పాలిట శాపంగా మారుతోంది. పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తామంటూ పాలకులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడంతో రైతాంగం ఊపిరి ఆగిపోతోంది. బోర్డు నిర్దేశించిన మేరకే పండించినా కొనే దిక్కు లేక ఉరికొయ్యలను, పురుగు మందులను ఆశ్రయించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరుగురు పొగాకు రైతులు కన్ను మూసినా పాలకులు కళ్లు తెరవడం లేదు. మరో ‘టంగుటూరు ఉద్యమం’ రాష్ట్రంలో పొగాకుకు మద్దతు ధర దక్కడం లేదు. తక్కువ రకం(లో-గ్రేడ్) పొగాకును కిలోకు రూ.60 నుంచి రూ.67 మధ్య చెల్లించి, పూర్తిగా కొనుగోలు చేయిస్తామని, ట్రేడర్లు మద్దతు ధర కంటే తక్కువకు కొంటే కేంద్రం రూ.15, రాష్ట్రం రూ.5 అదనంగా ఇస్తాయంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నీటి మీద రాతగానే మిగిలిపోయింది. తక్కువ రకం పొగాకు ధర కిలోకు రూ.35 నుంచి రూ.40 మధ్యే పలుకుతోంది. రైతుల వద్దనున్న పూర్తి పొగాకును కొనుగోలు చేయిస్తామన్న హామీ నెరవేరలేదు. అన్ని విధాలా చితికిపోతున్న పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తున్నారు. రైతుల వద్ద ఉన్న లో-గ్రేడ్ సహా అన్ని రకాల పొగాకును తక్షణమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో బుధవారం ప్రకాశం జిల్లా టంగుటూరులో నిరసన చేపట్టనున్నారు. రైతాంగంలో ఆత్మస్థైర్యాన్ని నింపి, బతుకుపై భరోసా కల్పించాలని జగన్ సంకల్పించారు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపునిస్తున్నారు. 1983లో పొగాకు వ్యాపారుల మోసాన్ని ఎదిరించి వేలం కేంద్రాల ఏర్పాటుకు రైతులు ‘టంగుటూరు ఉద్యమం’ నడిపారు. అదే ప్రాం తంలో జగన్ మరో పోరాటం చేయనున్నారు. రైతుల కుటుంబాలకు నేడుపరామర్శ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రభుత్వ నిర్వాకం కారణంగా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పరామర్శించనున్నారు. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న బొలినేని కృష్ణారావు, నీలం వెంకట్రావ్ కుటుంబాలతోపాటు పొగాకు వేలం కేంద్రం లోనే గుండె ఆగి మరణించిన మిడసల కొండలరావు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. అనంతరం బాధిత రైతుల సమస్యలపై టంగుటూరులో నిరాహార దీక్ష చేపడతారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పామాయిల్, పొగాకు రైతులు మంగళవారం జగన్‌ను కలసి, సమస్యలను వివరించారు. రైతుల సమస్యలను విన్న జగన్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి వెంకటరావు నేతృత్వంలో జగన్‌ను రైతులు కలిశారు. -
బాధితులకు బాసటగా...
- పొగాకు రైతులకు అండగా జగన్ - రేపు జిల్లాలో పరామర్శ యాత్ర - అత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఓదార్పు - టంగుటూరు వేలం కేంద్రం ఎదుట ధర్నా సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గిట్టుబాటు ధర లేక సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను పరామర్శించడంతోపాటు, పొగాకు రైతులకు అండగా నిలబడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఉదయం 6 గంటలకు సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బయలుదేరి పొందలవారిపాలెంలో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించి అక్కడి నుంచి టంగుటూరు చేరుకుని వేలం కేంద్రం ఎదుట గిట్టుబాటు ధర కోసం రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొంటారు. ధర్నా అనంతరం జరుగుమిల్లి మండలం చింతలవారిపాలెం వెళ్లి వేలం కేంద్రంలోనే గుండెపోటుతో మృతి చెందిన మిడసల కొండలరావు కుటుంబాన్ని, వలివేటివారిపాలెం మండలం కొండసముద్రంలో ఆత్మహత్య చేసుకున్న నీలం వెంకట్రావు కుటుంబాలను పరామర్శిస్తారు. టంగుటూరులో నిర్వహించే ధర్నాలో పొగాకు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. ట్రాక్ పై తీగలు - నిలిచిన రైళ్లు కంభం : రైలు పట్టాలపై విద్యుత్తు తీగలు తెగిపడడంతో సోమవారం అర్ధరాత్రి వరకూ రైళ్లకు అంతరాయం ఏర్పడిన ఘటన కంభం మండలంలోని సైదాపురం సమీపంలో చోటుచేసుకుంది. తొలుత సాయంత్రం కొన్ని విద్యుత్ తీగలను అతికష్టం మీద పక్కకు లాగి గుంటూరు - డోన్ ప్యాసింజర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మళ్లీ మరో తీగ రాత్రి 7.30 గంటలకు పడడంతో కంభం రైల్వేస్టేషన్‌కు వచ్చిన కాచిగూడ - గుంటూరు ప్యాసింజరు రాత్రి 9.40 నిమిషాల వరకూ కదలలేకపోయింది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు రైల్వే అధికారులతో వాగ్వివాదానికి దిగారు. 9 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య నడిచే మచిలీపట్నం ఎక్స్ ప్రెస్, గుంటూరు -కాచిగూడ ప్యాసింజరు, అమరావతి, ప్రశాంతి, ఎక్స్‌ప్రెస్‌ల రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. రూ 27.11కోట్ల ముద్రా రుణాలు జిల్లా కలెక్టర్ సుజాతశర్మ వెల్లడి ఒంగోలు టౌన్: ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద జిల్లాలో 10100 మందికి 27.11కోట్ల రూపాయల ముద్రా రుణాలు ఇవ్వనున్నట్టు కలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. సోమవారం సాయంత్రం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ముద్రా రుణ మెగా క్యాంపు నిర్వహించారు. ఏపీఐఐసీ ద్వారా ఏకగవాక్ష విధానం అమలులో ఉందని, పరిశ్రమల కోసం కొత్తగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారికి విద్యుత్, పంచాయతీ, అగ్నిమాపక శాఖల నుంచి సకాలంలో అనుమతులు మంజూరు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా, నిజాయితీగా అమలు చేయాలని యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్రాజుసూచించారు. ఎటువంటి గ్యారంటీ లేకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా రుణం పొందే సౌలభ్యం ఉండటం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ నరసింహారావు, సిండికేట్ బ్యాంకు డివిజనల్ మేనేజర్ రామ్మూర్తి, డీఆర్డీఏ పీడీ మురళి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ డాక్టర్ బీ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులు బ్యాంకు చెక్కులను అందజేశారు. -
పొగాకు రైతుల కోసం ఆత్మత్యాగం
దేవరపల్లి: రాష్ట్రంలో పొగాకు రైతుల ఆత్మహత్యలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాశాడు... పొగాకు రైతుల కోసం తాను ఆత్మత్యాగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు అందులో స్పష్టంచేశాడు... పరిష్కారమార్గం కూడా చూపించాడు... అయినా ప్రభుత్వాధినేత స్పందించకపోవడంతో అన్నంతపనీ చేశాడు... కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలుపుకుని తాగి ఉసురు తీసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంకు చెందిన సింహాద్రి వెంకటేశ్వరరావు అనే రైతు (55) సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పొగాకు రైతుల దుస్థితిపై వెంకటేశ్వరరావు వారం రోజుల కిందటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. పొగాకు రైతుల్ని ఆదుకోవాలని కోరారు. వారి కోసం తాను ఆత్మత్యాగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. లేఖను ఈనెల 16న సీఎంకు పంపించారు. బ్యాంకు అప్పులు తీర్చలేక పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు తన ప్రాణరక్షణ కోసం సుమారు రూ.5.50 కోట్లు వెచ్చించి బస్సు తయారు చేయించుకున్నప్పుడు... పొగాకు రైతుల ప్రాణ రక్షణకు ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. బ్యారన్‌కు రూ.9 లక్షల చొప్పున కేంద్రం పరిహారం ఇస్తే రైతులు స్వచ్ఛందంగా పొగాకు బ్యారన్ల రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకుని లెసైన్సులను ప్రభుత్వానికి అప్పగిస్తారని ఆయన పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రినుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాణాలు మింగేసిన అప్పుల భారం పొగాకు సాగు గిట్టుబాటు కాకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో వెంకటేశ్వరరావు తనకున్న 11 ఎకరాల పొలాన్ని రెండేళ్ల కిందట అమ్మేశాడు. అయినా అప్పులు తీరక 22 ఎకరాలను దేవస్థానం భూమిని కౌలుకు తీసుకుని పొగాకు పండిస్తున్నాడు. పంటకు రూ.22 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ ఏడాది పొగాకుకు గిట్టుబాటు లభించకపోవడంతో బ్యాంకు అప్పులు తీరలేదు.సుమారు రూ.34 లక్షల మేర అప్పులు ఉన్నాయి. అది తీర్చే దారిలేక వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఆత్మహత్యలు వద్దు.. ఆదుకుంటాం
సాక్షి, విజయవాడ బ్యూరో: పొగాకు రైతుల్ని ఆదుకుంటామని, అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఆమె గేట్‌వే హోటల్లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. పొగాకు కొనుగోళ్లు లేక రాష్ర్టంలో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయని, పొగాకు రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాయని చెప్పారు. మృతి చెందిన మూడు రైతు కుటుంబాల్లో రెండు కుటుంబాలను పరామర్శించగలిగానని, పొగాకు బోర్డు ద్వారా వారికి కొంత పరిహారం ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల పరిహారంతోపాటు కేంద్ర సాయం కోసం ప్రయత్నిస్తానన్నారు. అధికారికంగా 177మిలియన్ కిలోల పొగాకు సాగు జరిగితే ఈ నెల 15 నాటికి 148మిలియన్ కిలోలకుపైగా కొనుగోలు జరిగిందని, మరో 28.22మిలియన్ కిలోలు కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో పామాయిల్, సెరికల్చర్ రైతుల్ని అదుకుంటామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. పట్టిసీమకు నీరిచ్చాం... : గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం పూర్తి చేశామని, శుక్రవారం సాయంత్రం 6.30గంటలకు పట్టిసీమ నీరు ఒక పంపు ద్వారా విడుదల చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో పామాయిల్, సెరికల్చర్ రైతుల్ని ఆదుకోవాలని సీఎం కేంద్రమంత్రికి విజ్జప్తి చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులకు కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. శుక్రవారం ఆమె ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు. కాగా పొగాకు కొనుగోళ్లలో వ్యాపారుల మాయాజాలంపై రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. నిర్ధిష్టమైన హామీ ఇవ్వకుండా వెళ్లిపోతున్నారంటూ మంత్రిని అడ్డుకున్నారు. -
'బాబుతో భేటీ తర్వాత పొగాకు రైతులపై ప్రకటన'
ఒంగోలు : ప్రకాశం జిల్లా వలేటివారిపాలేం మండలం కొండసముద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు నీలం వెంకట్రావ్ కుటుంబాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పొగాకు రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. పొగాకు రైతులను ఆదుకుంటామని ఆమె చెప్పారు. ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై మాట్లాడిన తర్వాత పొగాకు రైతుల విషయంపై ఓ ప్రకటన విడుదల చేస్తామని మంత్రి వివరించారు. జిల్లాలోని కందుకూరు వేలం-2 కేంద్రం వద్ద పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్రమంత్రి స్పష్టమైన ప్రకటన చేయలేదంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. -
నిర్మలాసీతారామన్ని అడ్డుకున్న రైతులు
-
నిర్మలాసీతారామన్ని అడ్డుకున్న రైతులు
ఒంగోలు : ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనను శుక్రవారం గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆమె కాన్వాయిని అడ్డుకున్న రైతులు రహదారిపై అడ్డంగా బైఠాయించారు. మిగిలిన పొగాకు కొనుగోలుకు హామీ ఇవ్వాలని వారు ఆమెను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కారు దిగి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. -
నిర్మలా సీతారామన్‌ని కలసిన వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు : పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కి ఒంగోలు లోక్‌సభ సభ్యుడు, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్మలా సీతారామన్ పర్యటించారు. అందులోభాగంగా ఆమె పేర్నమిట్ట పొగాకు వేలం కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా ఆమెకు వైవీ సుబ్బారెడ్డి వినతి పత్రం అందజేశారు. పొగాకు రైతులు బాగా నష్టపోయారని ఈ నేపథ్యంలో వారికి భారీ స్థాయిలో నష్ట పరిహారం ప్రకటించి ఆదుకోవాలని ఆయన...కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ని కోరారు. వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి పట్ల ఆమె సానుకూలంగా స్పందించారు. -
ధైర్యంగా ఉండండి..ప్రభుత్వం ఆదుకుంటుంది
- ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు కుటుంబానికి మంత్రులు ప్రత్తిపాటి , శిద్దా పరామర్శ - రూ.5 లక్షలు పరిహారం - పొగాకు బోర్డు, వ్యాపారులతో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష టంగుటూరు : ఆత్మ స్థైర్య కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పొగాకు రైతులకు సూచించారు. ఆత్మహత్మకు పాల్పడిన పొదవారిపాలేనికి చెందిన పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు కుంటుంబ సభ్యులను మంత్రి పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర రోడ్డురవాణా శాఖా మంత్రి సిద్దా రాఘవరావు, కలెక్టర్ సుజాతశర్మ ఆదివారం పరామర్శించారు. పొగాకు రైతులకు ధైర్యం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తమను పంపించాడని తెలిపారు. రూ. 37.5 లక్షల అప్పు ఉందని మృతుని కుటుంబ సభ్యులు మంత్రులకు వివరించారు. ఆ కుటుంబ దయనీయ పరిస్థితిని స్థానికులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ మృతుని కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తుందని ప్రకటించారు. ప్రైవేట్ అప్పులు చెల్లింపు బాధ్యతను ఆర్డీవోకు అప్పగించారు. రేపే బోర్డు అధికారులు, పొగాకు వ్యాపారులతో సీఎం సమావేశం ప్రస్తుత పరిస్థితిపై చర్చించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పొగాకు బోర్డు, వ్యాపారులు, ఎగుమతిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని మంత్రి పుల్లారావు తెలిపారు. గిట్టుబాటు ధరలకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందని భరోసా ఇచ్చారు. అదనపు పొగాకుపై అపరాద రుసం రద్దు చేయండి అదనపు పొగాకు కొనుగోళ్లపై ప్రస్తుతం కొనసాగుతున్న అపరాద రుసుం 15 శాతం,సెస్‌లను రద్దు చేయాలని స్థానిక రైతులు, రైతు సంఘం నాయకుడు గోపి మంత్రులను కోరారు. ప్రస్తుతం రైతుల వద్ద లోగ్రేడే పొగాకు ఉందని,అందుకే అపరాద రుసుం రద్దు చేసి రైతులను ఈమేరకైనా ఆదుకోవాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి, టీడీపీ నాయకులు మంత్రుల వెంట ఉన్నారు. -
'నిల్వ ఉన్న పొగాకును తక్షణమే కొనుగోలు చేయాలి'
-
కేంద్ర బృందాన్ని పంపిస్తా..
మీ ఇబ్బందులు చెప్పుకోండి పొగాకు రైతు ప్రతినిధులతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పొగాకు రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ ఎంపీలు న్యూఢిల్లీ: పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు కేంద్రం నుంచి బృందాన్ని పంపిస్తామని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీఇచ్చారు. ఇబ్బందులేమైనా ఉంటే కమిటీకి నివేదించాలని రైతులకు సూచించారు. పొగాకు పంటకు ప్రత్యామ్నాయంపై తానెలాంటి నిర్ణయాన్ని తీసుకోలేనని ఆమె స్పష్టం చేశారు. పొగాకు రైతుల సమస్యల్ని తప్పక పరిష్కరిస్తామని, ధైర్యంగా ఉండాలని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు నేతృత్వంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన రైతు ప్రతినిధుల బృందం శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైంది. బీజేపీ ఎంపీ కంభపాటి హరిబాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, గ్రేడింగ్ తక్కువ చేసి చూపడం, ఇతర ఇబ్బందులను ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందుల్ని మంత్రికి వివరించారు. గ్రేడ్‌ను తగ్గిస్తున్నారని, గిట్టుబాటు ధర లభించట్లేదని తెలిపారు. స్టాకును కొనేలా పొగాకు బోర్డును ఆదేశించాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ.. రైతుసమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. రైతుల ఇబ్బందులు తెలుసుకోవడానికి సోమ లేదా మంగళవారం కేంద్రబృందాన్ని పంపిస్తానని హామీఇచ్చారు. మంచి పరిణామం: వైఎస్సార్సీపీ ఎంపీలు పొగాకు రైతు సమస్యలపై కేంద్రమంత్రి సానుకూలంగా విని కేంద్ర బృందాన్ని పంపిస్తామని హామీ ఇవ్వడం మంచి పరిణామమని వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్యతో భేటీ.. ఇదిలాఉండగా వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, టీడీపీ ఎంపీ మురళీమోహన్, రైతుసంఘాల ప్రతినిధులు అంతకుముందు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలసి పొగాకు రైతు సమస్యలపై వినతిపత్రం అందచేశారు. లోయర్, మిడిల్ గ్రేడ్ పొగాకుకు కనీస ధర రూ.96 చొప్పున చెల్లిస్తామని కంపెనీలు ప్రకటించినప్పటికీ గరిష్టంగా రూ.50 నుంచి 70 మాత్రమే ఇస్తున్నాయని చెప్పారు. వెంటనే వెంకయ్యనాయుడు పొగాకు బోర్డు చైర్మన్ గోపాల్‌తో ఫోన్లో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. పొగాకు రైతుల ఇబ్బందులపై వాణిజ్యమంత్రితో, ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆయన రైతులకు హామీఇచ్చారు. -
'పొగాకు రైతుల సమస్యలు పరిష్కరిస్తాం'
న్యూఢిల్లీ : పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో వైఎస్ఆర్ సీపీ ఎంపీల సమావేశం ముగిసింది. పొగాకు రైతుల సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఇచ్చిన ధర చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, ప్రత్యామ్నాయ పంటలు వేసే ముందు రైతులు ఆలోచించాలని ఆమె సూచించారు. భేటీ అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ మాట్లాడుతూ...వాణిజ్య శాఖ మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు అధికారుల బృందాన్ని పంపుతామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు. -
పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి
కేంద్ర వ్యవసాయ, ఆర్థిక మంత్రులకు వైఎస్సార్సీపీ ఎంపీల విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: పొగాకు రైతులకు న్యాయం చేయడానికి గిట్టుబాటు ధర కల్పించడంలో జోక్యం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల సమక్షంలో ఏపీ, తెలంగాణలోని పొగాకు రైతుల సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం తొలుత కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివేదించారు. గిట్టుబాటు ధర కల్పించాలని, వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్ సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. మధ్య, తక్కువ గ్రేడు పొగాకు కొనుగోలు చేయడానికి పొగాకు బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకు కొనుగోళ్లు చేయాలని కోరారు. పొగాకు రైతులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరప్రసాదరావు, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, పొగాకు రైతులు అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. పొగాకు రైతుల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన నిధులతో నిల్వల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని జైట్లీని కోరామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు దుగ్గినేని గోపినాథ్, మారెడ్డి సుబ్బారెడ్డి, బంగారుబాబు, వైవీ కృష్ణారావు, బి.ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు. కాగా, శుక్రవారం వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో వైఎస్సార్సీపీ ఎంపీలు, పొగాకు రైతు ప్రతినిధులు భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో 10న జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానించినట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఏపీ అభివృద్ధిని కోరుకునే అన్ని పార్టీలు ధర్నాకు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. -
ఖరీఫ్ కటీఫ్ !
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు, మరోవైపు సాగునీటి ప్రాజెక్టులు ఎండిపోవడంతో ఖరీఫ్ ప్రశ్నార్థకంగా మారుతోంది. గత ఏడాది పూర్తిగా నష్టపోయిన రైతుకు ఈ ఏడాది మరింత ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకూ గత రెండు నెలల్లో పడాల్సిన వర్షపాతం కంటే 45 శాతం తక్కువ నమోదైంది. ఈ నెలలో పడాల్సిన వర్షపాతంతో పోలిస్తే 85 శాతం తక్కువ వర్షం కురిసింది. ఒకవైపు వర్షాలు లేకపోవడంతోపాటు ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కూడా నీటిమట్టాలు అడుగంటుతుండటంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలో కూడా అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఇప్పట్లో ప్రాజెక్టుల్లో నీరు నిండే పరిస్థితి లేదు. ఇదే జరిగితే పశ్చిమ డెల్టాతో పాటు, నాగార్జున సాగర్ కుడికాల్వ ఆయకట్టు కింద ఉన్న పంట ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే ఎక్కడ చూసినా పచ్చగా ఉండాల్సిన పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. సరైన వర్షాలు పడితే పంటలు సాగు చేయటానికి దుక్కులు దున్ని అదునుకు సిద్ధం చేసిన పొలాలు ప్రస్తుతం బీడు భూములుగా మారుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, కుంటలు అడుగంటాయి. జూన్‌లో కొద్దిపాటి వర్షాలు పడినా అవి భూమిలో ఇంకిపోయాయి. చెరువుల్లో నీటిమట్టం ఎక్కడా పెరగలేదు. జిల్లాలోని ప్రాజెక్టుల్లో కూడా నీళ్లు లేవు. దీంతో చెరువుల కింద ఉన్న మాగాణి భూముల్లో కూడా ఈ ఏడాది పంటలు వేసే అవకాశం కనపడటం లేదు. ఖరీఫ్ అదును దాటకముందే వర్షాలు పడాలని దేవుడిని వేడుకోవడం మినహా రైతుకు మరో దిక్కు కనపడటం లేదు. ఖరీఫ్‌లో జిల్లాలో 2,48,370 ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా జూలై నెల సగం దాటిపోయిన తర్వాత కూడా 24 వేల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు వేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా ఇందులో సగం కూడా వేయలేదని రైతు నాయకులు చెబుతున్నారు. కృష్ణాడెల్టా కాల్వల పరిధిలో మాత్రమే ఎంతో కొంత వరి వేసే అవకాశం ఉందంటున్నారు. జిల్లాలో లేట్ ఖరీఫ్ కావడంతో ఇంకా నారుమళ్లు కూడా వేయలేదు. పైన పడే వర్షాలు, డెల్టాకు నీటి విడుదల చూసిన తర్వాత నారుమళ్లు వేద్దామనే ఉద్దేశంలో రైతన్న ఉన్నాడు. గత ఏడాది ఖరీఫ్, రబీలలో రైతాంగం పూర్తిగా నష్టపోయింది. గత ఏడాది పరిస్థితి ఇదీ... గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ చూస్తే -47.5 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఉద్యాన వన పంటలైన బత్తాయి, నిమ్మ దారుణంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో 56 మండలాలకు గాను 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. కేవలం యద్దనపూడి, ఉలవపాడు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. వరి విషయానికి వస్తే 5,25,393 టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా 4,83,938 టన్నుల ఉత్పత్తి వచ్చింది. దీని ద్వారా కనీసం రూ.58 కోట్ల నష్టం వాటిల్లింది. శనగ పంట దిగుబడి కూడా గణనీయంగా పడిపోయింది. తద్వారా రూ.224 కోట్ల నష్టం రైతులకు వాటిల్లినట్లు అంచనా. వేరుశనగ కూడా దెబ్బతింది. మరోవైపు పొగాకు రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. పండిన పంటలో 30 శాతం కూడా కొనుగోలు జరగలేదు. గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉండగా, వచ్చే ఏడాది విస్తీర్ణం తగ్గించాలన్న పొగాకు బోర్డు నిర్ణయంతో రైతులు మరింత నష్టపోనున్నారు. గత ఏడాది అన్ని పంటలు కలిపి 63,619 ఎకరాల్లో సాగు తగ్గింది. సుమారు 12 శాతం పంట దిగుబడి తగ్గిందని అంచనా. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద గత ఏడాది నీరు అందక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరి పొలాలకు నీరు అందలేదు. దీంతో చివరి భూముల్లో పంట బాగా దెబ్బతింది. ఈ ఏడాదీ వర్షాభావ పరిస్థితులు వెన్నాడుతుండటంతో ఖరీఫ్ ప్రశ్నార్థకంగా మారనుంది. -
14న పొగాకు రైతులకు మద్దతుగా ఏపీలో ధర్నాలు
ఒంగోలు: పొగాకు రైతులకు మద్దతుగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనునన్నట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పొగాకు వేలం కేంద్రాల వద్ద గిట్టుబాటు ధరల కోసం రైతులతో కలసి ఆందోళన చేపడతామని తెలిపారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లభించక అప్పులభారంతో చనిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి ఎండగడతామని చెప్పారు. టంగుటూరులో గిట్టుబాటు ధర రాలేదనే మనోవేధనతో మరణించిన రైతు మిడతల కొండలరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 14న ఒంగోలు, పొదిలి పొగాకు వేలం కేంద్రాల వద్ద నిర్వహించే ధర్నాలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొననున్నారు. -
రైతు కోసం ఎందాకైనా
గిట్టుబాటు ధర దక్కక ఆందోళన బాటపట్టిన పొగాకు రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలిచారు. ‘మీ కోసం ఎందాకైనా వస్తా.. రైతుల కష్టాలు, నష్టాలు తీర్చేందుకు దేనికైనా సిద్ధమే’నని ప్రకటించారు. కష్టించి పండించిన పంటకు మద్దతు ధర దక్కక.. పొగాకు కొనేందుకు వ్యాపారులు ముందుకు రాక.. పాలకులు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితుల్లో అల్లాడిపోతున్న రైతులకు వైఎస్ జగన్ పర్యటన స్థైర్యాన్నిచ్చింది. ‘ప్రభుత్వం మెడలు వంచైనా గిట్టుబాటు ధర తెచ్చుకునేందుకు పోరాడదాం.. పదో తేదీ నాటికి సర్కారు దిగిరావాలని అల్టిమేటం జారీ చేస్తున్నాం.. లేదంటే వేలం కేంద్రాల వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టి శంఖారావం మోగిద్దాం’ అని రైతుల హర్షధ్వానాల మధ్య వైఎస్ జగన్ ప్రకటించారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు :పొగాకు రైతుల కష్టాలను తెలుసుకునేందుకు శనివారం మధ్యాహ్నం 12గంటల తర్వాత వైఎస్ జగన్ దేవరపల్లి పొగాకు కేంద్రానికి విచ్చేశారు. అప్పటికే అక్కడున్న వేలాది మంది రైతులకు అభివాదం చేసిన ఆయన పొగాకు బేళ్లను, కొనుగోళ్ల తీరును పరిశీలించేందుకు వేలం కేంద్రంలోకి వెళ్లారు. అక్కడ రైతులు, కొనుగోలుదారులు, వేలం నిర్వహణ అధికారులతో ఆయన మాట్లాడారు. దేవరపల్లి గ్రామానికి చెందిన రైతు మాగంటి సాయిబాబు మాట్లాడుతూ గతేడాది ఇదే సమయానికి కిలో రూ.175 ఉన్న కిలో పొగాకు ధర ఈ ఏడాది రూ.130కి తగ్గిపోయిందని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. గత ఏడాది జూలై నెల ప్రారంభానికి దాదాపు 50 మిలియన్ల కిలోల పొగాకును వివిధ కంపెనీలు కొనుగోలు చేయగా, ఈ ఏడాది 17 మిలి యన్ కేజీలు మాత్రమే కొన్నాయని చెప్పారు. గత పరిస్థితికి ఇప్పటికి ఎందుకు తేడా వచ్చిందని ఐటీసీ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్‌కుమార్‌ను వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇందుకు ఆయన వివరణ ఇస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం పొగాకు ఎగుమతులకు అనుమతులను నిలిపివేసిందని తెలిపారు. కంపెనీల నుంచి డిమాండ్ కూడా తగ్గిందని చెప్పారు. బ్యాంకర్లు ముష్టివాళ్లుగా చూస్తున్నారు : రైతు ఆవేదన వేలం కేంద్రం ప్రాంగణంలోనే వైఎస్ జగన్ తొలుత రైతులతో మాట్లాడించారు. మధ్యాహ్నపు ఏసు అనే రైతు మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో పొగా కు రైతులను బ్యాంకు అధికారులు ముష్టివాళ్లుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడవటి నాగేశ్వరరావు అనే రైతు మాట్లాడుతూ చంద్రబాబు పొగాకు కంపెనీల వద్ద కోట్లాది రూపాయల లంచాలు తీసుకుని పొగాకు రైతులను గాలికి వదిలేశారని విమర్శించారు. జగన్ రాకతో పాపప్రక్షాళన ఎన్నికల ప్రచారంలో భాగంగా పొగాకు బోర్డుకు చంద్రబాబు రావడంతో రైతులకు దరిద్రం పట్టుకుందని, వైఎస్ జగన్ అడుగుపెట్టడంతో ఇప్పుడు పాపప్రక్షాళన జరిగిందని రైతు కొడవటి నాగేశ్వరరావు ఆవేశంగా మాట్లాడగా, మిగిలిన రైతులు పెద్దపెట్టున చప్పట్లు కొట్టారు. ‘మీరు వస్తున్నారని తెలిసే రెండు రోజులుగా కేజీకి రూ.20 రేటు పెంచారు’ అని రైతులు చెప్పారు. సిగ్గు లేదా బాబూ..నిప్పులు చెరిగిన జగన్ రైతులు, వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పొగాకు రైతుల కోసం ఒక్కసారి ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురుకాగా స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్టీసీ) ద్వారా కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధర రావడం లేదని చెబుతుంటే బాబు సిగ్గులేకుండా అది తన పరిధిలోనిది కాదని తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జీవితమంతా బొంకటమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. పొగాకు రైతులకు ఎంతమందికి రుణమాఫీ జరిగిం దో చేతులెత్తాలని కోరగా, రైతులంతా తమలో ఎవరికీ రుణమాఫీ కాలేదని నినదించారు. పొగాకుకు గిట్టుబాటు ధరలపై 10వ తేదీలోపు సర్కారు దిగిరాకుంటే రాష్ట్రంలోని అన్ని పొగాకు వేలం కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని జగన్ హెచ్చరించారు. అడుగడుగునా ఘన స్వాగతం శనివారం ఉదయం 10.05 గంటలకు తూర్పుగోదావరి జిల్లానుంచి కొవ్వూరు బ్రిడ్జి వద్దకు చేరుకున్న వైఎస్ జగన్‌కు జిల్లా నేతలు, కొవ్వూరు పట్టణ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఉదయం 10.20 గంటలకు దొమ్మేరు చేరుకున్న జగన్ అల్లూరి సీతారామరాజు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేశారు. దొమ్మేరులో సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు) ఇంటికి వెళ్లి అల్పాహారం స్వీకరించారు. అక్కడి నుంచి దేవరపల్లి బయలుదేరారు. దారి పొడవునా గ్రామాల వద్ద తనకోసం వేచి ఉన్న ప్రజలను చూసి వాహనం ఆపి పలకరించి ముందుకు సాగారు. ఎడ్లబండిపై వెళ్లిన జగన్ మధ్యాహ్నం 12.20 గంటలకు దేవరపల్లి చేరుకుని అక్కడ ప్రధాన కూడలి నుంచి ఎడ్లబండిపై ప్రదర్శనగా పొగాకు వేలం కేంద్రానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. రైతులతో మాట్లాడిన అనంతరం నల్లజర్ల, భీమడోలు, ఏలూరు మీదుగా విజయవాడ వెళ్లారు. -
పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన జగన్
-
కేంద్రంపై ఒత్తిడి తెండి
♦ తమ సమస్యలను పరిష్కరించాలని జగన్‌కు పొగాకు రైతుల వినతి ♦ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళతామని ప్రతిపక్షనేత హామీ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి వెంకటరావు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో రైతులు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిసి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ ఎంపీల ద్వారా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 50 వేల మందికి పైగా రైతులు పొగాకు పండిస్తున్నారని, గిట్టుబాటు ధర లేక వారంతా నష్టాల ఊబిలో కూరుకు పోతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రైతులకు లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలు లేకపోవడం పొగాకు రైతులకు ఆశనిపాతంగా మారిందన్నారు. ప్రభుత్వ నిరంకుశ, నిర్లక్ష్య వైఖరితో ఏదో రకంగా పొగాకు సాగును నిర్మూలించేందుకు రహస్య యత్నాలు జరుగుతున్నాయని వినతిపత్రంలో వాపోయారు. ఖైనీ, గుట్కా, పాన్‌పరాగ్, బీడీ వంటి వాటిని నియంత్రించకుండా కేవలం ఒక్క సిగరెట్లపైనే 30 నుంచి 70 శాతం పన్ను పెంచేశారన్నారు. పొగాకు ఎగుమతి కంపెనీలకు రాయితీలు ఇవ్వక వారిని నష్టాలకు గురి చేస్తున్నారని వివరించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పొగాకు కిలో ధర రూ. 170 ఉండగా ప్రస్తుతం రూ. 90 నుంచి రూ. 130 లోపు ఉంటోందని రైతులు వాపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ రైతులకు అండగా నిలబడాలని కోరారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రుతో ఈ అంశంపై సంప్రదింపులు జరిపేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. జగన్‌ను కలిసిన రైతు ప్రతినిధుల్లో కె.రాంబాబు, ఎస్.ఎస్.వి.కె.ఈశ్వర్‌రెడ్డి, ఎస్.జి.జగదీశ్వర్‌రెడ్డి, పి.సుభాష్‌చంద్ర, పి.ప్రసాద్, చవల సుబ్రహ్మణ్యం, కంకట గాంధీ తదితరులున్నారు. -
పొగాకు కొనుగోళ్లు జరపాల్సిందే
♦ ట్రేడర్లతో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ♦ నిల్వల కొనుగోళ్లపై మంత్రితో భేటీ అయిన రాష్ట్ర బృందం సాక్షి, న్యూఢిల్లీ : పొగాకు పంటకు మద్దతు ధరలేక, కొనేవారు లేక తీవ్ర ఇక్కట్లలో ఉన్నామని పొగాకు రైతులు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వద్ద మొరపెట్టుకున్నారు. పలువురు పొగాకు బోర్డు సభ్యులు, రైతులు, కొనుగోలుదారులు, సిగరెట్ తయారీ కంపెనీల ప్రతినిధులు, ఎగుమతిదారులు మంగళవారం నిర్మలాసీతారామన్‌తో సమావేశమయ్యారు. పొగాకు నిల్వలను కొనుగోలు చేయాలని, గత ఏడాది కొనుగోలు చేసిన సగటు ధరకు గానీ, మూడేళ్ల సగటు ధర గానీ చెల్లించాలని కోరారు. నిర్ధేశిత మొత్తంలో పొగాకు అవసరమని చెప్పిన తరువాత ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం సరికాదని వాపోయారు. ఈ నేపథ్యంలో నిర్మలాసీతారామన్ కొనుగోలుదారులను గట్టిగా నిలదీసినట్టు సమాచారం. సమావేశం అనంతరం వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏపీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పొగాకు కొనుగోళ్లు, ధరపై జులై 4న గుంటూరులో జరిగే సమావేశంలో తుది నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఓటుకు కోట్లు కేసు నిందితుడు రేవంత్ రెడ్డికి బెయిల్ రావడం సంతోషకరమని పుల్లారావు అన్నారు. -
రోడ్డెక్కిన పొగాకు రైతులు
టంగుటూరు: గిట్టుబాటు ధర కోసం పొగాకు రైతులు రోడ్డెక్కారు. గిట్టుబాటు ధరలు ఎలాగూ లేవు. కనీసం నిన్నమొన్నటి ధరలు కూడా అమాంతం రూ.20 తగ్గించడంతో ఆగ్రహించిన స్థానిక రెండో పొగాకు వేలం కేంద్రం రైతులు కొనుగోళ్లు నిలిపేశారు. వేలం కేంద్రం ఎదురుగా స్థానిక ఆర్అండ్బీ రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ నిలిపి తమ నిరసన తెలిపారు. రెండో పొగాకు వేలం కేంద్రంలో గురువారం ఎం.నిడమలూరు రైతులు 339 పొగాకు బేళ్లు కొనుగోళ్లకు ఉంచారు. వరుసగా 65 బేళ్ల వరకు వేలం జరగ్గానే గిట్టుబాటు ధర లేదంటూ రైతులు కొనుగోళ్లను అడ్డుకున్నారు. వెంటనే వేలం కేంద్ర సూపరింటెండెంట్ మనోహర్ చొరవ తీసుకొని వ్యాపారులు, రైతులతో చర్చించారు. కనీసం నిన్న మొన్నటి ధరలకు కూడా రూ.20 వరకూ తగ్గించి వేశారంటూ రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరువర్గాలతో చర్చించి వారి అంగీకారం మేరకు తిరిగి వేలం ప్రారంభించారు. వరుసగా 20 బేళ్లకు వేలం ముగిసినా ధరల్లో మార్పులేమీ లేకపోవడంతో రైతులు కొనుగోళ్లు మరొకసారి అడ్డుకున్నారు. మరింత పతనమైన ధరలతో ఆగ్రహంగా ఉన్న రైతులు వేలం కేంద్రం ఎదురుగా ఉన్న ఆర్అండ్బీ రోడ్డుపై బైఠాయించారు. ఆ మార్గంలో రాకపోకలు నిలపేశారు. వ్యాపారులు తాము ఇచ్చిన ఇండెంట్ ప్రకారం పొగాకు కొనుగోలు చేయాలని, టుబాకో బోర్డు రైతుల పక్షం వహించి న్యాయం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఎస్టీసీని రంగంలోకి దించి గిట్టుబాటు ధర చెల్లించి పొగాకు కొనుగోలు చేయాలని రైతులు నినదించారు. పోలీసుల సూచనలతో సూపరింటెండెంట్ రైతుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. వేలం కేంద్రం సూపరింటెండెంట్ మాట్లాడుతూ పరిస్థితిని టుబాకో బోర్డుకు పరిస్థితి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. -
పొగాకు రైతుల రాస్తారోకో
గిట్టుబాటు ధరల కోసం ఆందోళన నాయకులు, వ్యాపారుల కుమ్మక్కుపై విమర్శలు కొండపి : గిట్టుబాటు ధర లేదని పొగాకు రైతులు శనివారం రాస్తారోకో చేశారు. వ్యాపారులు ధరలు దిగకోసి పొగాకు కొంటున్నా రైతు నాయకులు వ్యాపారులకు వంత పలకడంపై ఆగ్రహం చెందారు. వేలం కేంద్రం అధికారి సైతం చోద్యం చూడటం తప్ప వ్యాపారులపై ఒత్తిడి తెచ్చి రైతుల పక్షం వహించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ పొగాకు రైతులు కొండపి పొగాకు వేలంకేంద్రంలో వేలాన్ని అడ్డుకున్నారు. గిట్టుబాటు ధరల కోసం రెండు గంటలకు పైగా శనివారం రాస్తారోకో నిర్వహించారు. వివరాలు .. వేలంకేంద్రం పరిధిలోని నరసరాజుపాలెం, పీరాపురం గ్రామానికి చెందిన రైతులు 336 బేళ్లను వేలం కేంద్రానికి తీసుకొచ్చారు. కేంద్రం అధికారి మురళీధర్ వేలాన్ని ప్రారంభించారు. రెండు లైన్లు కొనుగోలు చేసిన తరువాత మూడవ లైన్లోకి పాట రాగా పొగాకుకు గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతులు గ్రహించారు. వెంటనే రైతులు వేలాన్ని అడ్డుకుని వేలం కేంద్రం ముందు రోడ్డు మీద రాస్తారోకోకు దిగారు. రోడ్డుకు అటుఇటు ముళ్ల కంచెలు, విద్యుత్ స్తంభాలు వేసి రాస్తారోకో నిర్వహించారు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత ఏడాది మేలిమి పొగాకు క్వింటా 12 వేల రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయగా ఇప్పుడు అదే పొగాకు 9 వేల రూపాయల నుంచి 8 వేలకు దిగకోశారని ఆవేదన చెందారు. ధరల గురించి బోర్డు చైర్మన్ పట్టించుకుని రైతులకు న్యాయం చేయాలన్నారు. ఎస్ఐ ఆంజనేయులు రైతులకు సర్ది చెప్పడంతో ఇంత తక్కువగా ధరలు మరొకసారి రాకూడదని చెబుతూ రాస్తారోకో విరమించారు. ధరల్లేవు మాది ఐటిసి ఎన్పిఏ గ్రామం. అయినా ధరలకు దిక్కులేదు. ట్రేలలో మెక్కలు పెంచమన్నారు. పట్టలు వేసి మరీ గ్రేడ్ చేసి చెక్కులు వేయమన్నారు. ధరలు మాత్రం పెంచకుండా దిగ కోస్తున్నారు. దీంతో మాకు దిక్కుతోచడం లేదు. కె.బ్రహ్మయ్య, నరసరాజుపాలెం మేలిమి పొగాకుకు తక్కువ ధరలా ! రూ. 12 వేలకు కొనుగోలు చేయాల్సిన మేలిమి పొగాకు రూ.9 వేల లేపే కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా అయితే పొగాకు రైతు బతికి బట్ట కట్టేది ఎట్టా. పొటాష్ వేస్తే మంచిదని అధికారులు సలహా ఇస్తే మూట 28 వందలు పెట్టి ఎకరాకు బస్తా వేశాం. ఖర్చు తడిసి మోపెడు అయింది. బండి భాస్కర్‌రెడ్డి , పీరాపురం వ్యాపారులకే నాయకుల వంత వ్యాపారులకే అధికారులు , కొంతమంది రైతు నాయకులు వంత పలుకుతున్నారు. రైతును పట్టించుకునేవారు ఏరి. ఇంత దారుణమైన ధరల పతనం ఆగకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోక గత్యంతరం లేదు. జి సుబ్బరాయుడు -
పొగాకు రాజకీయం..
పొగాకు రైతులు ఆరుగాలం పడిన కష్టమంతా కేవలం క్యూరింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది. క్యూరింగ్‌కు సరిపడా వంట చెరకు లభించకపోతే చేతికంద వచ్చిన పంట నాశనమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ముందస్తుగా వంట చెరకు సమకూర్చుకున్న వారికి కష్టాలు తప్పాయి. కానీ సన్నచిన్న కారు రైతులు మాత్రం జీడిపుల్ల, అడవిపుల్లలపైనే ఆధారపడుతుంటారు. 1982 నుంచి అశ్వారావుపేట ప్రాంతానికి పొగాకు పంటను పరిచ యం చేసిన వ్యక్తులుగా.. పలు రాజకీయ పారీ ్టల్లో కీలక నేతలుగా పేరొందిన వారు పొగాకు క్యూరింగ్‌కు అటవీ కలపను నరికేందుకు అనుమతులు ఇప్పించి రైతుల నుంచి ప్రశంసలు అందుకునేవారు. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా వీరే రైతుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. కథ మారిపోయింది..: ఇంతకుముందులా కలప నరుక్కునేందుకు అటవీశాఖ అధికారులు అంగీకరించకపోవడం తో చిన్న రైతులకు భారంగా మారింది. ఓపక్క బొగ్గుతో బ్యారన్లను నిర్వహించాలని ప్రభుత్వం చెబుతున్నా.. కొందరు వైట్ కాలర్ నాయకులు మాత్రం మేం అడవి పుల్లను ఇప్పిస్తామని చెప్పి రైతులను మభ్యపెట్టడ ంతో రైతులు ఆ దిశగా ఆలోచించలేదు. ఇదే అదనుగా కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏటా ఇది జరిగే తంతే అయినా.. రైతు లు మాత్రం పని అయిపోతుందని పట్టించుకోకుండా ఖర్చులు భరిస్తున్నారు. ఈ ఏడాది పుల్ల రవాణా కష్టం కావడంతో నాయకులను నమ్ముకున్న రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. పచ్చి ఆకు కొట్టి బ్యారన్ దగ్గరకు తెచ్చాక నిల్వ ఉంచడం కుదరని పరిస్థితి. పచ్చి ఆకును జడ లు కట్టాక ఉడికించాల్సిందే. ఉడికించేందుకు పుల్ల లేని పక్షంలో ఎంత ఖర్చయినా సరే.. రైతులు వెనుకాడలేరు. ఈ బలహీనతను ఆసరాగా తీసుకున్న కొందరు వ్యక్తులు అడ్డదారిలో తెచ్చిన కలపను ఎక్కువ ధరలకు చిన్న రైతులకు విక్రయిస్తున్నారు. దీంతో బొగ్గుకంటే ఎ క్కువ ధరతో పొగాాకును ఉడికించాల్సిన ఇ బ్బందికర పరిస్థితులు నెలకొన్నా.. రైతులు ఎవరికీ చెప్పుకోలేక నానా బాధలు పడుతున్నారు. మూడు రెట్లు ధర చెల్లించాల్సి వస్తోంది..: సాధారణంగా అడవి నుంచి పుల్లను తోలుకుంటే అయ్యే ఖర్చుకు మూడు రెట్లు ధర చెల్లించి కలపను సమకూర్చుకోవాల్సి వస్తోందని పలువురు రైతులు వాపోతున్నారు. పుల్ల రవాణాకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వలేదని ముందే గ్రహించిన కొందరు స్మగ్లర్లు రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మూడు రెట్ల అధిక ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇంత చేసి పుల్లను కొనుగోలు చేసినా అనుమతులు లేవంటూ అటవీశాఖ అధికారులు కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టించి కంటికి రెప్పలా కాపాడుకుని సాగు చేసిన పంటను చివరలో క్యూరింగ్ సమయానికి నానా పాట్లు పడాల్సి వస్తోందని, వంట చెరుకు లభించకపోతే పొగా లు పొలంలోనే పండిపోతుందని, రంగు మారి తే కష్టమంతా వృధా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్యూరింగ్ కోసం శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇవీ లె క్కలు..: అశ్వారావుపేట, దమ్మపేట మండలాలతో కలిపి జంగారెడ్డిగూడెం 2వ వేలం ప్లాట్‌ఫాం పరిధిలో 510 బ్యారన్లు ఉన్నాయి. ఒక్కో బ్యారన్‌కు 5 ఎకరాల విస్తీర్ణంలో సరిపడా పొగాకు సాగుచేస్తుంటారు. ఒక్కో బ్యారన్‌కు రూ.4 నుంచి 5లక్షల వరకు మట్టిలో సత్తువను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి పెట్టుబడి అవుతుంది. ఒక్కో బ్యారన్ క్యూరింగ్ కోసం కనీసం 50 సీఎంటీ(క్యూబిక్ మీటర్)ల పుల్ల అవసరం అవుతుంది. అంటే ఇక్కడి ట్రాక్టర్ లోడింగ్‌ను బట్టి 10 ట్రక్కుల పుల్ల సరిపోతుంది. డ్రైవర్ పనితనాన్ని బట్టి పుల్ల వినియోగం తగ్గే అవకాశమూ ఉంది. ఏటా అటవీ కార్పొరేషన్ ద్వారా అడవిలో పాత చెట్లను తొలగించి వేలం ద్వారా విక్రయిస్తుంటారు. కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణలో ముందుగానే అడవిలో చెట్లను నరికేసి.. లాట్లుగా పేర్చి ఉంచుతారు. కలప వ్యాపారులు పోటీ పడి ఒక్కో సీఎంటీ ధర రూ.450 నుంచి రూ.500 వరకు కొనుగోలు చేస్తుంటారు. ఈఏడాది మాత్రం ఓ వ్యాపారి అత్యధికంగా రూ.1120కి కొనుగోలు చేశారు. ఈతరహా ధర పోటీ పెరిగినప్పుడు మాత్రమే ఉంటుందని, సాధారణంగా ఒక సీఎంటీ పుల్ల ధర రూ. 600కు మించదని కలప కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈగణాంకాల ప్రకారం ఒక్కో బ్యారన్‌కు 50 టీఎంసీల చొప్పున రూ.30వేలు ఖర్చవుతుంది. అధికారికంగా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసే పుల్లతో దర్జాగా పొగాకు ఉడికించుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగేది ఇదీ..: అడవి పుల్ల కోసమని అధికారి పార్టీ నాయకులతోపాటు పొగాకు రైతు ప్రతినిధులు ఒక్కో బ్యారన్‌కు రైతుల నుంచి రూ.8వేల నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేస్తుంటారు. ఆ తర్వాత ట్రాక్టర్‌కు రూ.3వేల చొప్పున( నరికివేత ముఠా, రవాణా ఖర్చులు) రైతులే భరించాలి. ఇలా ఒక్కో బ్యారన్‌కు రూ. 38 వేల నుంచి రూ. 45 వేల వరకు ఖర్చవుతోంది. దీనికి తోడు మధ్యలో అటవీశాఖ అధికారులు ఆపితే నజరానాలు చెల్లించాలి. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు కూడా ఫార్మాలిటీ కోసమని సన్న,చిన్నకారు రైతులపై కేసులు నమోదు చేస్తుంటారు. అన్నీ కలుపుకుంటే పుల్ల పేరుతో ఒక్కో బ్యారన్‌కు రూ. 50వేలకుపైగానే ఖర్చుఅవుతోందని రైతులు అంటున్నారు. రాజకీయనాయకులు అధికారుల చుట్టూ తిరగడం కన్నా టెండర్ సమయంలో పొగాకు రైతులకే ప్రభుత్వ ధరకు పుల్లను కేటాయించాలని డిమాండ్ చేస్తే ఎంతో మేలు చేసిన వారవుతారని రైతులు అంటున్నారు. తప్పుడు మార్గంలో అడవిలో పుల్లను నరికేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం కన్నా సక్రమంగా పోరాడితే పొగాకు రైతులు గుండె నిబ్బరం చేసుకుని వ్యవసాయం చేసుకోవచ్చని అంటున్నారు.