జగన్ వద్ద గోడు వెళ్లబోసుకున్న పొగాకు రైతులు
ఒంగోలు: అయ్యా, మీరు రాగానే ధర పెంచేశారు... మీరు రోజూ వస్తే మా బతుకులు బాగుపడ్డట్టేనని పొగాకు రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డిని వేడుకున్నారు. ఈ సంఘటన బుధవారం ప్రకాశం జిల్లా టంగుటూరు వేలం కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిం చిన జగన్ టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతులను, పొగాకు బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు గంట సేపు వేలం కేంద్రంలో గడిపిన ఆయన అక్కడ వేలం జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
జగన్ పొగాకు వేలం కేంద్రంలోకి అడుగుపెట్టగానే అక్కడ స్క్రీన్‌పై వేలం ధరల పట్టికను పరిశీలించారు. లోగ్రేడ్ పొగాకుకు కిలో రూ. 34 ఉండటంతో పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ భాస్కరరెడ్డిని వివరణ కోరారు. కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంవల్ల ఈ సమస్య తలెత్తిందని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో జగన్ తన ఎదుట వేలం జరపాలని కోరారు. వీవీ లక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన లోగ్రేడ్ పొగాకు వేలం జరిగింది. జగన్ అక్కడే ఉండటంతో వ్యాపారులు పాట పెంచగా రూ.65 పలికింది. ‘‘అయ్యా... మీరు వచ్చారు కాబట్టే ఈ ధర వచ్చింది. రోజూ మీరు మా క్లస్టర్‌కు రండి... మాకు మంచి రోజులు వస్తాయి’’ అంటూ జగన్‌తో రైతులు తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు.
మీరు రాగానే రేటు పెంచేశారు
Published Thu, Oct 1 2015 2:44 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement