'పొగాకు రైతుల సమస్యలు పరిష్కరిస్తాం' | ysrcp mps met central minister nirmala sitharama over Tobacco farmers problems | Sakshi
Sakshi News home page

'పొగాకు రైతుల సమస్యలు పరిష్కరిస్తాం'

Published Fri, Aug 7 2015 7:28 PM | Last Updated on Tue, May 29 2018 2:59 PM

ysrcp mps met central minister nirmala sitharama over Tobacco farmers problems

న్యూఢిల్లీ : పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో వైఎస్ఆర్ సీపీ ఎంపీల సమావేశం ముగిసింది. పొగాకు రైతుల సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఇచ్చిన ధర చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, ప్రత్యామ్నాయ పంటలు వేసే ముందు రైతులు ఆలోచించాలని ఆమె సూచించారు.

భేటీ అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ మాట్లాడుతూ...వాణిజ్య శాఖ మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు అధికారుల బృందాన్ని పంపుతామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement