'బాబుతో భేటీ తర్వాత పొగాకు రైతులపై ప్రకటన' | we will giva a statement after meeting with chandra babu, says nirmala seetaraman | Sakshi
Sakshi News home page

'బాబుతో భేటీ తర్వాత పొగాకు రైతులపై ప్రకటన'

Published Fri, Sep 18 2015 2:39 PM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM

'బాబుతో భేటీ తర్వాత పొగాకు రైతులపై ప్రకటన' - Sakshi

'బాబుతో భేటీ తర్వాత పొగాకు రైతులపై ప్రకటన'

ఒంగోలు : ప్రకాశం జిల్లా వలేటివారిపాలేం మండలం కొండసముద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు నీలం వెంకట్రావ్ కుటుంబాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పొగాకు రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. పొగాకు రైతులను ఆదుకుంటామని ఆమె చెప్పారు.

ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై మాట్లాడిన తర్వాత పొగాకు రైతుల విషయంపై ఓ ప్రకటన విడుదల చేస్తామని మంత్రి వివరించారు. జిల్లాలోని కందుకూరు వేలం-2 కేంద్రం వద్ద పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్రమంత్రి స్పష్టమైన ప్రకటన చేయలేదంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement