పొగాకు రైతులకు మద్దతుగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనునన్నట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
ఒంగోలు: పొగాకు రైతులకు మద్దతుగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనునన్నట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పొగాకు వేలం కేంద్రాల వద్ద గిట్టుబాటు ధరల కోసం రైతులతో కలసి ఆందోళన చేపడతామని తెలిపారు.
పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లభించక అప్పులభారంతో చనిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి ఎండగడతామని చెప్పారు. టంగుటూరులో గిట్టుబాటు ధర రాలేదనే మనోవేధనతో మరణించిన రైతు మిడతల కొండలరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 14న ఒంగోలు, పొదిలి పొగాకు వేలం కేంద్రాల వద్ద నిర్వహించే ధర్నాలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొననున్నారు.