రాష్ట్రంలో 8 ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఓట్లలెక్కింపు జరగనుంది. ఈ నెల 9వ తేదీన పోలింగ్ జరిగిన మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలతోపాటు ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరిగిన కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.