బీహార్ లో ఘెరా ప్రమాదం...20 మంది మృతి | train accident in bihar, 20 died | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 18 2014 9:27 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM

రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని సెమ్రా, సుగౌలి స్టేషన్ల మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్ దాటుతున్న ఓ ఆటోను డ్రెహాడూన్- రాస్తి గంగా ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 20 మంది మృతిచెందారు. వీరిలో ఎనిమిదిమంది చిన్నారులు ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. కాపలాలేని రైల్వే గేట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల తెలంగాణాలోని మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూలు బస్సు ప్రమాదం నుంచి కోలుకోక ముందే మరో రైలు ఆటోను ఢీకొంది. ఇవి రైల్వే శాఖ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement