రుణమాఫీ, ఉచిత విద్యుత్ సాగునీటి ప్రాజెక్టులు.. మొదలుకుని తాజాగా ప్రకటించిన ఎకరానికి రూ.8 వేల ఆర్థిక సాయం వరకూ.. మూడేళ్ల పాలనలో ప్రగతిని ప్రజలకు వివరించేందుకు తెలం గాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) సిద్ధమైంది. టీఆర్‌ఎస్ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు ‘ప్రగతి నివేదన’గా పేరు పెట్టింది.