దూసుకొస్తున్న ‘వార్దా’ తుపాను | Visakhapatnam depression centered at a distance of 1,160 km | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 8 2016 7:19 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

ఏపీ వైపు తుపాను దూసుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బుధవారం సాయంత్రం వరకు స్థిరంగా ఉంది. ఆ తర్వాత నుంచి ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతూ బుధవారం రాత్రికి విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1,160, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 1,220 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం మరో 24 గంటల్లో (శుక్రవారం నాటికి) తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement