లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి బాధ్యత తీసుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు నేనంటే.. నేనంటూ పోటీలు పడ్డారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. పార్టీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామాలకు సిద్ధపడగా.. ప్రభుత్వాధినేతగా ఆ బాధ్యత తనదంటూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ముందుకొచ్చారు. అయితే, సోనియా, రాహుల్‌ల రాజీనామాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే, పార్టీని దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో బలోపేతం చేసేలా పునర్వ్యవస్థీకరించే బాధ్యతలను పార్టీ అధ్యక్షురాలైన సోనియాగాంధీకి అప్పగిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది.
Published Tue, May 20 2014 6:37 AM | Last Updated on Fri, Mar 22 2024 10:39 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement