బంగాళాఖాతంలోని మారిషస్ సముద్ర తీరంలో కనుగొన్న విమాన శకలం ఎమ్హెచ్ 370దే అని మలేషియా, ఆస్ట్రేలియా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మారిషస్ సముద్ర తీరంలో ఈ ఏడాది మేలో మారిషస్ సముద్ర తీరంలో ఓ విమాన శకలాన్ని గుర్తించారు. ఆ విమాన శకలాన్ని ఆస్ట్రేలియా రవాణ భద్రత సంస్థకు చెందిన నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించి... పరిశోధించారు. చిట్ట చివరకు ఆ విమాన శకలం 2014 మార్చి 4 వ తేదీన గల్లంతైన ఎమ్హెచ్ 370దే అని వారు నిర్ధారించారు.