సార్‌.. ఇది ప్రజాస్వామ్యమేనా ? | ys jagan mohan reddy complaints on ap cabinet | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 3 2017 4:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యమేనా? అని గవర్నర్‌ను ప్రశ్నించినట్టు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రభుత్వం తన మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని ఆక్షేపిస్తూ వైఎస్‌ జగన్‌ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారాన్ని తప్పుబడుతూ గవర్నర్‌కు లేఖ అందజేశామని.. 'సార్‌ ఇలా చేయడం ప్రజాస్వామ్యమేనా' అని ఆయనను అడిగామని వైఎస్‌ జగన్‌ చెప్పారు. వేరే పార్టీ గుర్తు మీద గెలిచి.. ఆ పార్టీ ద్వారా సాధించిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా.. పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం, వారిపై అనర్హత వేటు వేయకుండా పదవుల్లో కొనసాగించడం ధర్మమేనా? అని గవర్నర్‌ను ప్రశ్నించినట్టు తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement