ప్రచారం నిమిత్తం నగరానికి చేరుకున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నం.1 పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.