రాష్ట్రవ్యాప్తంగా ఐదు నెలల పాటు నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుకున్న దానికంటే ఎక్కువగా ఎక్కువ లక్ష్యాన్ని చేరుకున్నామని పార్టీ నేతలు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. రెండు రోజులుగా జరిగిన సమీక్షలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం తీరుతెన్నులపై 13 జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో జగన్ సమీక్షిం చారని వెల్లడించారు.