ఉత్తరాఖండ్ వరదబాధితుల సహాయార్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూ.20 లక్షల విరాళం సేకరించింది. వైఎస్ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల వేతనం సహా నేతలు, అభిమానులు ఇచ్చిన విరాళాలతో రూ.20 లక్షలు పోగయ్యాయి. వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ నేతలకు రూ.20లక్షల చెక్కును అందజేశారు. ఈ చెక్కును సీఎం రిలీఫ్‌ఫండ్‌కు వైఎస్ఆర్ సీపీ నేతలు అందజేయనున్నారు.