రాష్ట్రంలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను మరో పక్షం రోజులపాటు పొడిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి బుధవారం సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఆన్‌లైన్ ద్వారా ఓటరు నమోదు చేయాలనుకుంటున్న వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్వర్ చాలా ఆలస్యంగా లభ్యమవుతున్నందున ఒక కంప్యూటర్‌పై గంటకు ముగ్గురు, నలుగురికన్నా ఎక్కువగా నమోదు చేయించుకోలేకపోతున్నారని, రాష్ట్రంలో అనేక చోట్ల నుంచి ఫిర్యాదులు అందాయని వినతిపత్రంలో పేర్కొన్నారు.
Published Thu, Nov 3 2016 7:05 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement