Chief Electoral Officer Bhanwar Lal
-
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదును పొడిగించండి
-
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదును పొడిగించాలి
సీఈవో భన్వర్‌లాల్‌ను కోరిన ఎంపీ విజయసాయిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను మరో పక్షం రోజులపాటు పొడిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి బుధవారం సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఆన్లైన్ ద్వారా ఓటరు నమోదు చేయాలనుకుంటున్న వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్వర్ చాలా ఆలస్యంగా లభ్యమవుతున్నందున ఒక కంప్యూటర్‌పై గంటకు ముగ్గురు, నలుగురికన్నా ఎక్కువగా నమోదు చేయించుకోలేకపోతున్నారని, రాష్ట్రంలో అనేక చోట్ల నుంచి ఫిర్యాదులు అందాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కారణంగా కనీసం 50 శాతం మంది కూడా నమోదు చేసుకోలేరేమోనన్న ఆందోళనను విజయసాయిరెడ్డి వ్యక్తం చేశారు. కనుక నవంబర్ 5వ తేదీ వరకున్న నమోదు గడువును మరో పక్షం రోజులకు పొడిగించాలని కోరారు. మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించడానికి నియమితులైన సిబ్బందిని మరిన్ని అదనపు గంటలు పని చేసేలా ఆదేశాలివ్వాలని, ఇలాంటి క్లెయింలను స్వీకరించి తగిన రసీదులు ఇచ్చేలా చూడాలని విజయసాయిరెడ్డి కోరారు. డిసెంబర్ 23 వరకూ నమోదు చేసుకోవచ్చు : ప్రస్తుత ఓటరు నమోదు ప్రక్రియను ఈనెల 7వరకే పొడిగించే అవకాశం ఉందని, అదీ తాను కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతికి సిఫార్సు చేయగలనని భన్వర్‌లాల్ తమకు చెప్పారని విజయసాయిరెడ్డి తెలిపారు. సీఈవోను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 22న పట్టభద్రుల ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటిస్తారని భన్వర్‌లాల్ తమకు చెప్పారన్నారు. ఆ మరుసటి రోజు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 23 వరకు తొలి విడతలో ఓటర్లుగా నమోదు కాలేకపోయిన వారు, పేర్లు గల్లంతైన వారు తాజాగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారన్నారు. అన్నీ చేర్చాక తుది జాబితా వెల్లడవుతుందన్నారు. -
'ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆలోచించుకోవాలి'
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే భవిష్యత్తు ఉండదన్న ఆలోచన ప్రజల్లో బలంగా ఉంది.. దానిపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఆలోచించాల్సి అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన వందేమాతరం ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయం మార్చేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విశ్వ ప్రయత్నం చేయాలని సూచించారు. తాను రాజస్థాన్‌లోని ఏడారి ప్రాంతం అయినా నాగోల్ జిల్లా పుట్టి అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదవి సివిల్ సర్వెంట్ అయ్యానని చెప్పారు. అప్పట్లో 95 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేవారుండగా.. ఇప్పుడు 5 శాతం మంది మాత్రమే చదువుకుంటున్నారని చెప్పారు. దీనిపై ఉపాధ్యాయులు ఆలోచించాలి.. తల్లిదండ్రుల ధోరణిలో మార్పు రావాల్సి ఉందని చెప్పారు. విశిష్ట అతిథి, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ తీసివేసి సెలక్ట్ చేసే విధానం రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ బడిని ప్రజల బడిగా మార్చాలని తెలిపారు. చదువు చెప్పటం ఒక ప్యాషన్ కావాలని చెప్పారు. పోరాడి సాధించిన ఈ తెలంగాణ ప్రభుత్వమైనా పాఠశాలను తనిఖీ చేసే విధానానికి స్వస్తి చెప్పి, టీచర్లను నమ్మేందుకు ప్రయత్నించాలన్నారు. విద్య విద్యార్థికి అందించటమే ఉపాధ్యాయుని బాధ్యతన్నారు. ఫలితాలపై ఉపాధ్యాయుడిని ప్రభుత్వం ప్రశ్నించకూడదని తెలిపారు. -
నేడు సాగర్‌కు భన్వర్‌లాల్ రాక
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ గురువారం సాయంత్రం నాగార్జునసాగ ర్కు రానున్నారు. శుక్రవారం ఉదయం పెద్దవూర మండలంలో ఆధార్‌కు ఓటర్‌గుర్తింపు కార్డు అనుసంధానం చేసే కేంద్రాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని పెద్దవూర తహసీల్దార్ ఖలీల్ అహమద్ తెలిపారు.