హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే భవిష్యత్తు ఉండదన్న ఆలోచన ప్రజల్లో బలంగా ఉంది.. దానిపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఆలోచించాల్సి అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన వందేమాతరం ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయం మార్చేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విశ్వ ప్రయత్నం చేయాలని సూచించారు. తాను రాజస్థాన్‌లోని ఏడారి ప్రాంతం అయినా నాగోల్ జిల్లా పుట్టి అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదవి సివిల్ సర్వెంట్ అయ్యానని చెప్పారు.
అప్పట్లో 95 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేవారుండగా.. ఇప్పుడు 5 శాతం మంది మాత్రమే చదువుకుంటున్నారని చెప్పారు. దీనిపై ఉపాధ్యాయులు ఆలోచించాలి.. తల్లిదండ్రుల ధోరణిలో మార్పు రావాల్సి ఉందని చెప్పారు. విశిష్ట అతిథి, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ తీసివేసి సెలక్ట్ చేసే విధానం రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ బడిని ప్రజల బడిగా మార్చాలని తెలిపారు. చదువు చెప్పటం ఒక ప్యాషన్ కావాలని చెప్పారు. పోరాడి సాధించిన ఈ తెలంగాణ ప్రభుత్వమైనా పాఠశాలను తనిఖీ చేసే విధానానికి స్వస్తి చెప్పి, టీచర్లను నమ్మేందుకు ప్రయత్నించాలన్నారు. విద్య విద్యార్థికి అందించటమే ఉపాధ్యాయుని బాధ్యతన్నారు. ఫలితాలపై ఉపాధ్యాయుడిని ప్రభుత్వం ప్రశ్నించకూడదని తెలిపారు.
'ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆలోచించుకోవాలి'
Published Tue, Jun 7 2016 7:46 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM
Advertisement
Advertisement