రికార్డుస్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గాలని ఆశించిన డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్‌కు ఊహించని ఫలితం ఎదురైంది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో వైల్డ్ కార్డుతో ఈ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ 117వ ర్యాంకర్ డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్ ) ఈ సెర్బియా స్టార్‌ను ఇంటిముఖం పట్టించి పెను సంచలనం సృష్టించాడు. 4 గంటల 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇస్టోమిన్ 7–6 (10/8), 5–7, 2–6, 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ జొకోవిచ్‌పై అద్వితీయ విజయం సాధించాడు.
Published Fri, Jan 20 2017 7:11 AM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM
Advertisement
Advertisement
Advertisement