ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరం మార్టిన్ ప్లేస్లోని కేఫ్ లో ఆగంతకులు 7 మందిని బందీలుగా నిర్బంధించిన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు మరింత భద్రతను పెంచారు. భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా భారత్, ఆసీస్ల మధ్య రెండో టెస్టు యధాతథంగా జరుగుతుందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17 నుంచి బ్రిస్బేన్లో ఈ మ్యాచ్ జరగనుంది. సిడ్నీ ఘటన నేపథ్యంలో అక్కడి భారత కాన్సులేట్ ను మూసివేశారు. కా న్సులేట్ సిబ్బందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆగంతకుల చెరలో గుంటూరు జిల్లాకు చెందిన టెకీ అంకిరెడ్డి విశ్వకాంత్ కూడా బందీగా ఉన్నారు.