భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన కలను నెరవేర్చుకుంది. స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌ను సాధించింది. ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లోఒలింపిక్ చాంపియన్,ప్రపంచ మూడో ర్యాంకర్ కరోలినా మారిన్ స్పెయిన్ పై 21-19, 21-16 తేడాతో సింధు భారత్ నెగ్గింది.