Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Movie stars supported Roja1
ఆ వ్యాఖ్యలు దుర్మార్గం

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్‌కే రోజాకు సినీతారలు బాసటగా నిలిచారు. అసహ్యకరమైన పదాలతో విమర్శించిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ తారలు రాధిక, కుష్బూ, రమ్యకృష్ణ, మీనా, నవనీత్‌కౌర్, కవిత డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఈ విషయంపై సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికైనా సిద్ధమంటున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇది సహించరానిదిఈ వీడియో చూడగానే ఒక స్నేహితురాలిగా, ఒక మహిళగా చాలా బాధ పడ్డాను. ఓ వైపు దేశం అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా, ఇంకా మహిళలను కించ పరచడం, అక్రమ రవాణా, గృహ హింస, బహిరంగంగా తిట్టడం రోజూ జరు­గుతూనే ఉన్నాయి. టీడీపీ మాజీ మంత్రి తనయుడు, ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌ ఈ విధంగా తిట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరానిది. ఈ సమయంలో కుల, మతాలకు అతీతంగా మగ, ఆడ అని తేడా లేకుండా అందరూ ఒక్కటై రోజాకు అండగా నిలబడాలి. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో తక్షణం కలుగ చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలి. భారతమాతాకు జై అనే దేశంలో ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – రమ్యకృష్ణ నీకు పెళ్లాం, సోదరి లేరా?రోజా సినిమా హీరోయిన్‌గా నటించింది. రాజకీయాల్లోకి వెళ్లి మంత్రిగా పని చేసింది. అలాంటి రోజాపై ఇష్టానుసారం మాట్లాడటా­నికి ఎంత ధైర్యం కావాలి? నీకు పెళ్లాం, సోదరి లేరా? ఒక లీడర్‌గా ఆడవారి గురించి ఇంత దిగజారి మాట్లాడతారా? రుజువులు ఉంటే చూపించి మాట్లాడాలి కానీ, ఇలా నీచంగా దిగజారి మాట్లాడకూ డదు. మీకు రాజకీయాలు ప్రధానం కావచ్చు.. అయితే మహిళల ఆత్మగౌరవంతో పని లేదా? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారు సిగ్గుపడేలా చర్యలు తీసుకోవాలి. – నవనీత్‌ కౌర్‌పిరికిపంద చర్య ఇదిగౌరవం అంటే ఏమిటి.. ఎదుటి వారి­తో ఎటువంటి భాష మాట్లాడాలి.. అని నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) తో కలిసి పని చేసినప్పుడు నేర్చుకున్నాం. అటువంటి ఆయన స్థాపించిన పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే ఇంత నీచంగా మాట్లాడటం శోచనీయం. రోజా ఏ పార్టీలో ఉన్నా.. ఆమె ఒక మహిళ అన్న విషయం మర్చిపోకూ­డదు. తెలుగుదేశం పార్టీ నాయ­కులు రాజకీ­యాలను ఇంత దిగజారు­స్తార­నుకోలేదు. మహిళలను రాజకీయాల్లోకి రాకుండా చేసే పిరికిపంద చర్య ఇది. ఆ ఎమ్మెల్యే మాటలను నేను పూర్తిగా ఖండిస్తున్నా. – కవితనీచంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలిరోజాకు మా అందరి మద్దతు ఉంది. ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లా­డిన వారిపై చర్య తీసుకోవాలి.– కుష్బూ రోజాను చూసి అసూయ పడుతున్నాడురోజా గురించి మాట్లాడిన వీడియో చూశాను. చాలా చాలా కోపం తెప్పించింది. ఒక మహిళ పైకి ఎదుగుతోంది అంటే బహి­రం­­గంగా ఇంత నీచంగా మాట్లాడతారా? ఇలాంటి మాటలకు మహిళలు భయపడి లోపల కూర్చుంటారు అనుకుంటున్నా­రేమో.. కాలం మారింది. మహిళలు మరింత ధృడంగా తయారయ్యారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడంటే ఆయన రోజాను చూసి ఎంత అసూయ పడుతు­న్నాడో తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్, ఆలో­చనలు ఎంత నీచంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రోజా చాలా ధైర్యం కలిగిన మహిళ. రోజా.. నేను నీకు అండగా ఉంటాను. సుప్రీంకోర్టు తక్షణం కలుగ చేసుకొని రోజాకు న్యాయం జరిగేట్టు చూడాలి. – మీనాఇంత నీచంగా ఎలా మాట్లాడతారు?రోజాపై అంత దారుణంగా మాట్లాడ­టం బాధ కలిగించింది. రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు దారుణం. రాజకీయాల్లోకి మహిళలు మరింత ముందుకు రావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మహిళల గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు? – రాధిక– సాక్షి, అమరావతి

trump-repeats-10-tariff-threat-for-brics2
‘మాతో ఆటలొద్దు’: బ్రిక్స్ దేశాలకు ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌ డీసీ: బ్రిక్స్‌ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోమారు విరుచుకుపడ్డారు. బ్రిక్స్‌లోని ఆరు దేశాలకు జూలై 6న విధించిన 10శాతం అదనపు సుంకాలను మరోమారు గుర్తుచేశారు. అమెరికన్‌ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఏ దేశానికైనా ఇలాంటి దెబ్బే ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు.డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ డాలర్ తన హోదాను కోల్పోతే అది ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినట్లేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ఆయన ఆయన మరో మరోమారు బ్రిక్స్ దేశాలపై (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) మాటల దాడి చేశారు. ‘బ్రిక్స్’ త్వరలోనే కనుమరుగవుతుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమూహంలోని దేశాలపై భాగమైన 10 శాతం అదనపు సుంకం విధించడంపై గతంలో చేసిన ప్రకటనను ఆయన పునరుద్ఘాటించారు. #WATCH | US President Donald Trump says, "... This (The Genius Act) is really strengthening the US Dollar and giving the Dollar a great prominence. There is a little group called BRICS, and it is fading out fast. But BRICS tried and wanted to take over the Dollar and the… pic.twitter.com/wG6GEe8OOs— ANI (@ANI) July 18, 2025తమ ‘జీనియస్‌ చట్టం’ అమెరికా డాలర్‌ను బలోపేతం చేస్తుందని, డాలర్‌కు మరింత ప్రాముఖ్యతను తీసుకువస్తుందన్నారు. అయితే డాలర్ ఆధిపత్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్రిక్స్ అనే చిన్న సమూహం త్వరలోనే కనుమరుగుకానున్నదని ట్రంప్‌ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలకు తాము 10శాతం అదనపు సుంకం విధిస్తామని ప్రకటించగానే ఆ దేశాలవారు మర్నాడే సమావేశం నిర్వహించారని, అయినా తనను కలుసుకునేందుకు ఎవరూ రాలేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ హోదాను ఎప్పటికీ కోల్పోనివ్వమని అన్నారు. బ్రిక్స్‌లోని ఆరు దేశాలు తమ తీరు మార్చుకుంటే ఈ సమస్య సద్దుమణుగుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు.బ్రిక్స్ దేశాలు గత ఏడాది బ్రెజిల్, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలను దాటి ఇరాన్, ఇండోనేషియాలకు సభ్యత్వాన్ని కల్పించాయి. ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో ఆయా దేశాధినేతలు యూఎస్‌ సైనిక, వాణిజ్య విధానాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలో ట్రంప్‌ ఆయా దేశాలను టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది. కాగా ట్రంప్‌ 2025, జూలై 18న జీనియస్ చట్టంపై సంతకం చేశారు. ఇది ప్రపంచ డిజిటల్ కరెన్సీ విప్లంలో కొత్త అధ్యాయమని ట్రంప్‌ పేర్కొన్నారు.

AP economy heading for decline due to ineffective coalition and Red Book rule3
ప్రజల కొనుగోలు శక్తి ఢమాల్‌

సాక్షి, అమరావతి : కూటమి ప్రభుత్వ అసమర్థ, రెడ్‌బుక్‌ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బక్కచిక్కిపోతోంది. సంపద పెరగకపోగా గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో వచ్చిన సంపదను కూడా కూటమి స­ర్కా­రు ఆవిరి చేసేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఇందుకు నిదర్శనం అ­మ్మకం పన్ను రాబడులు తగ్గిపోవడమే. దీంతోపాటు రాష్ట్ర రెవె­న్యూ రాబడులు 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025­–26 తొలి త్రైమాసికంలో తగ్గిపోయాయి. మొత్తం మీద చంద్ర­బాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్ర సంపద తిరో­గమనంలోనే పయనిస్తోంది. అమ్మకం పన్ను రాబడితో పాటు పన్నే­తర ఆదాయం తగ్గుతోంది తప్ప పెరగడం లేదు. ఇందుకు కా­గ్‌ గణాంకాలు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది తొ­లి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌) బడ్జెట్‌ గణాంకాలను కాగ్‌ వెల్లడించింది.» సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు పెద్దపెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు తీరా సీఎం అయ్యాక సంపద సృష్టించడం దేవుడెరుగు 2023–24లో వైఎస్‌ జగన్‌ పాలనలో వచ్చిన సంపద కూడా రాకుండా ఆవిరి చేసేస్తున్నారు. అప్పులను మాత్రం భారీగా పెంచేశారు. అయినా, సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు.» 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో రెవెన్యూ రాబడులు ఏకంగా రూ.9,873 కోట్లు (21.41 శాతం) తగ్గినట్లు కాగ్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. అంటే... వైఎస్‌ జగన్‌ పాలనలో 2023–24 తొలి త్రైమాసికంలో వచ్చినంత కూడా రాకపోగా ఇంకా తగ్గిపోయాయి. సాధారణంగా ఏటా రెవెన్యూ రాబడులు ఎంతో కొంత పెరగాలి గానీ అంతకుముందు సంవత్సరాల కంటే తగ్గకూడదు. ఒకవేళ తగ్గాయి అంటే రాష్ట్ర సంపద తిరోగమనంలో ఉన్నట్టే.» అమ్మకం పన్ను రాబడి కుడా తగ్గిపోయింది. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో అమ్మకం పన్ను రాబడి రూ.369 కోట్లు తగ్గిపోవడంతో వృద్ధి 7.78 శాతం తిరోగమనంలోకి వెళ్లింది. అమ్మకం పన్ను రాబడి తగ్గిపోతు­న్నదంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నట్లు అర్థం అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే అమ్మకం పన్నులో వృద్ధి నమోదవుతుందని లేదంటే రాబడి తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు.» కూటమి ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర గ్రాంట్లు కుడా గణనీయంగా తగ్గడం గమనార్హం. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే 2025–26 తొలి త్రైమాసికంలో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఏకంగా రూ.14,230 కోట్లు తగ్గిపోయాయి. 90.95 శాతం మేర కేంద్ర గ్రాంట్లు తగ్గిపోయినట్లు తేలుతోంది.» బాబు అధికారం చేపట్టిన నాటి నుంచి పన్నేతర ఆదాయంలో తరుగుదలే తప్ప పెరగడం లేదు. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే 2025–26 తొలి త్రైమాసికంలో పన్నేతర ఆదాయం రూ.111 కోట్లు తగ్గిపోయింది. వృద్ధి 8.06 శాతం తగ్గింది.» మరోవైపు సామాజిక రంగ వ్యయం (విద్య వైద్యం, సంక్షేమ రంగాలకు చేసేది) గతం కన్నా సాధారణంగా పెరగాలి. కానీ, వైఎస్‌ జగన్‌ సర్కారుతో పోల్చితే బాబు ప్రభుత్వంలో తగ్గిపోయింది. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో రూ.7,495 కోట్లు (15.28 శాతం) తగ్గింది.» ఈ ఆర్థిక ఏడాది మూడు నెలల్లో బాబు సర్కారు ఏకంగా రూ.36,384 కోట్లు అప్పులు చేసినట్లు కాగ్‌ గణాంకాలు వెల్లడించాయి. మూలధన వ్యయం రూ.6,053 కోట్లు మాత్రమే అని పేర్కొన్నాయి. ఇదే 2023–24 తొలి త్రైమాసికంలో మూలధన వ్యయం రూ.12,669 కోట్లు ఉండడం విశేషం. సాధారణంగా అమ్మకం పన్నులో ఎంతో కొంత వృద్ధి ఉండాలి. అలాంటిది 2023–24 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో వచ్చిన అమ్మకం పన్ను రాబడి ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రాలేదంటే ఆందోళన కలిగించే విషయమేనని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. » సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు... వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో వచ్చిన సంపదను కూడా రాబట్టలేక ఉన్నదానిని ఆవిరి చేసేస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై భారీ అప్పుల భారం మోపుతున్నారు.

Rebellion of senior IPS officers In police department4
‘గుప్తా’ధిపత్యంపై గుర్రు

సాక్షి, అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల తిరుగుబాటు బావుటా పోలీసు శాఖలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఏకపక్ష వైఖరిపట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న డైరెక్టర్‌ జనరల్‌(డీజీ)స్థాయి అధి­కారులను బుజ్జగించేందుకు ప్రభుత్వం చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. అసంతృప్తితో ఉన్న డీజీలను ప్రత్యేక భేటీకి పిలిచి సర్దిచెప్పేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) విజయానంద్‌ చేసిన యత్నాలు ఫలించలేదు. పోలీసు శాఖతో­పాటు యావత్‌ ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికార­వర్గాల్లో సంచలనంగా మారిన పరిణామాలు ఇలా ఉన్నాయి.మాట్లాడుకుందాం రండి..డీజీలకు సీఎస్‌ పిలుపుడీజీస్థాయి ఐపీఎస్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉండటం ప్రభుత్వ పెద్దలను కలవరానికి గురి చేసింది. తమ ఒంటెత్తు పోకడలతో విసిగి వేసారిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు అసంతృప్తితో సహాయనిరాకరణ చేస్తే ప్రభుత్వం అభాసుపాలవుతుందని ఆందోళన చెందింది. దాంతో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బదిలీ ప్రక్రియను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ పరిణా­మాలు ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా పరిణ­మించాయి. ఐపీఎస్‌ అధికారుల బదిలీలూ చేపట్ట­లేని నిస్సహాయ స్థితి ప్రభుత్వానికి అవమాన­కరమేనని అధికారవర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసంతృప్తితో ఉన్న డీజీలను డీజీపీ హరీశ్‌ కుమార్‌గుప్తాను సమావేశపరిచి సర్దుబాటు చేయాలని ఆయన సీఎస్‌ కె.విజయానంద్‌ను ఆదేశించినట్టు సమాచారం. ఫలితంగా విజయానంద్‌ డీజీస్థాయి ఐపీఎస్‌ అధికారులకు గురువారం కబురు పంపించారు. ఓసారి సమావేశమై మాట్లాడుకుందామని చెప్పారు. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా కూడా ఆ సమావేశంలో పాల్గొంటారని అన్ని విషయాలనూ మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుందామని చెప్పారు. డీజీలు సమావేశానికి వస్తే ఏదో విధంగా వ్యవహారాన్ని సర్దుబాటు చేయాలని ఆయన భావించారు. అన్నీ మీకు తెలుసు కదా... మేమెందుకు రావాలి...!? డీజీల తిరస్కరణ సీఎస్‌ ప్రతిపాదనను డీజీలు తిప్పికొట్టారు. ఈ సమావేశానికి తామెందుకు రావాలని ఎదురు ప్రశ్నించారు. అధికారిక సమావేశమా? అనధికా­రిక సమావేశమా? అని కూడా సూటిగా ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెప్పలేక­పో­యారు. అఖిలభారత సర్వీసులకు చెందిన సీని­యర్‌ అధికారి అయిన సీఎస్‌కు ప్రభుత్వ పాల­న, ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉంటుంది. ఆ నిబంధనలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రస్తుతం పోలీసు శాఖలో సాగుతున్న వ్యవహా­రాలు కూడా ఆయ­నకు తెలుసు. అంతగా సర్దు­బాటు చేయాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ అవకతవకలను సరిదిద్దాలని డీజీలు వ్యాఖ్యానించారు. అంతేగానీ తామంతట తాము వచ్చి తమకు జరుగు­తున్న అవమా­నాలు, నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగుల గురించి ఎందుకు ఏకరువు పెట్టాలని ప్రశ్నించారు. రిటైర్మెంట్‌కు కేవలం రెండు నెలల ముందు రెగ్యులర్‌ డీజీపీగా హరీశ్‌కుమార్‌ గుప్తాను ఎలా నియమిస్తారని డీజీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. డీజీపీగా నియమి­తు­లైన తరువాత కూడా కీలకమైన విజిలెన్స్‌–­ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి ఆయనే చీఫ్‌గా ఉండటం.. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీఐడీ విభాగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని ఆ విభాగం డీజీని నామమాత్రపు పాత్రకు పరిమితం చేయడం.. అగ్నిమాపక శాఖ డీజీని బదిలీ చేసి ఆ స్థానంలో ఐజీస్థాయి అధికారిని నియమించాల­ని భావించడం... సీఐడీ, విజిలెన్స్‌–­ఎన్‌­ఫోర్స్‌­­మెంట్, అగ్నిమాపక శాఖల చీఫ్‌లుగా జూని­యర్‌ అధికారులను నియమించి తానే నియంత్రించాలని యోచించడం.. ఇవన్నీ డీజీపీ గుప్తా చేస్తున్న అవకతవక పనులే కదా అని డీజీలు సూటిగానే సీఎస్‌తో వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ విషయాలన్నీ తెలిసిన తరువాత ఆ తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వా­నిదే తప్ప .. తాము వచ్చి తమ అభ్యంతరాలు వెల్లడించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. డీజీలకు లెవల్‌ 17 పేస్కేల్‌ అమలు చేయాలని తాము ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ దాఖ­లుచేసి తీరుతామని కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇదే రీతిలో గుర్తింపు లేకుండా చేసి అవమానిస్తే తాము మరింత తీవ్ర నిర్ణయం తీసుకునేందుకూ వెనుకాడబోమని డీజీలు కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామం ప్రస్తుతం పోలీసు శాఖతోపాటు ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారవర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

Rasi Phalalu: Daily Horoscope On 19-07-2025 In Telugu5
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.నవమి ప.1.28 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: భరణి రా.12.17 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ప.10.53 నుండి 12.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.32 నుండి 7.17 వరకు, అమృతఘడియలు: రా.7.45 నుండి 9.14 వరకు సూర్యోదయం : 5.38, సూర్యాస్తమయం : 6.34, రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కళాకారులకు కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.వృషభం: కొన్ని పనులలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ధనవ్యయం. వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మిథునం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాల పరిష్కారం. ఇంట్లో శుభకార్యాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం.సింహం: కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కన్య: పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.తుల: శుభవార్తా శ్రవణం. ఇంటాబయటా అనుకూలం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.వృశ్చికం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ఉద్యోగయత్నాలలో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.ధనుస్సు: ఆరోగ్యసమస్యలు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు సామాన్యస్థితి.మకరం: చేపట్టిన పనులు నిరాశ పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. స్వల్ప అనారోగ్యం.కుంభం: శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విద్యావకాశాలు దక్కుతాయి.మీనం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో చికాకులు.

SBI crowned the World Best Consumer Bank for 2025 by Global Finance magazine6
ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్‌ ఇండియాలోనే..

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా 2025 సంవత్సరానికి గాను గ్లోబల్‌ ఫైనాన్స్‌ మ్యాగజైన్‌ నుంచి ‘ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జూమర్‌ బ్యాంక్‌’ గుర్తింపు దక్కించుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 18న అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్‌ వార్షిక సదస్సులో ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తమ వృద్ధి వ్యూహానికి కీలకమని శెట్టి తెలిపారు. ఆన్‌–బోర్డింగ్‌ను సరళతరం చేయడం, ప్రాంతీయ భాషల్లో వాయిస్‌ బ్యాంకింగ్‌లాంటి కొత్త ఆవిష్కరణలతో 52 కోట్ల పైగా కస్టమర్లకు ప్రపంచ స్థాయి సర్వీసులు అందిస్తున్నామని పేర్కొన్నారు. 24/7 డిజిటల్ సర్వీసులకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో సేవలను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 310.. ధర ఎంతంటే..కృత్రిమ మేధస్సుతో నడిచే హైపర్-పర్సనలైజ్డ్ ఆఫర్లతో బ్యాంక్ ఓమ్ని-ఛానల్ ఎంగేజ్‌మెంట్‌ మోడళ్లను రూపొందిస్తోంది. యోనో వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 8.77 కోట్ల మంది వినియోగదారులను ఆకర్షించింది. ఈ గుర్తింపు కేవలం ఎస్‌బీఐకి మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులకు గర్వకారణమని శెట్టి తెలిపారు.

Keerthy Suresh Movie Career Now7
ఒక్కోసారి నేను కూడా అప్‌సెట్‌ అవుతాను: కీర్తి సురేష్

ఇంతకు ముందు తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటి కీర్తిసురేశ్‌( Keerthy Suresh ). కాగా ఎప్పుడైతే హిందీ చిత్రంలో నటించడానికి అంగీకరించిందో, అప్పటి నుంచి దక్షిణాదిలో నటించిన చిత్రాలు సక్సెస్‌కు దూరం అయ్యాయి. బాలీవుడ్‌లో నటించిన ఏకైక చిత్రం బేబిజాన్‌ పూర్తిగా నిరాశ పరచింది. అదే సమయంలో తన చిరకాల బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని, సంసార జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే సమీప కాలంలో కీర్తి సురేశ్‌ నటించిన ఉప్పు కారం చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం గురించి కీర్తి సురేశ్‌ చాలా ఎక్కువగానే ఊహించుకుంది. కానీ ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేక పోయింది. ఆ తరువాత మరో కొత్త చిత్రంలో నటించలేదు. కమర్శియల్‌ చిత్రాల్లో నటించి, హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రాల్లో నటించి, జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న నటికి ఇప్పుడు అవకాశాలు లేవంటే నమ్మశక్యం కాని పరిస్థితి. కొత్తగా అవకాశాలు రావడం లేదా? లేక ఈ బ్యూటీ అంగీకరించడం లేదా? అన్నది తెలియని పరిస్థితి. అయినా కీర్తిసురేశ్‌ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఉంది. కాగా ఇటీవల ఈ బ్యూటీ ఒక భేటీలో పేర్కొంటూ ‘ఒక్కోసారి నేను అప్‌సెట్‌ అవుతుంటానని, అప్పుడు ఏం చేస్తానో తెలుసా. ఫుల్‌గా భోజనం చేస్తాను. అలాగే కారు తీసుకుని ఒంటరిగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లతాను. ఆ సమయంలో కారులో మంచి సంగీతం వింటాను. అలానే ఇంట్లో ఒక పెట్‌ కుక్కను పెంచుకుంటున్నాను. నేను అప్‌సెట్‌ అయితే దాని ముఖం చూస్తే వెంటనే అంతా మాయం అవుతుంది.’ అని కీర్తి సురేశ్‌ పేర్కొంది. కాగా ఈ అమ్మడు ఇంతకు ముందు నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలు రివాల్వర్‌ రిటా, కన్నివెడి విడుదల కావలసి ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి హిట్‌ అయినా కీర్తిసురేశ్‌కు మళ్లీ క్రేజ్‌ పెరిగే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ఈ అమ్మడు మాత్రం సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

Heavy Rain in Hyderabad: Two Hours Of Rain Triggers Severe Waterlogging and Traffic Chaos8
చినుకు సిటీ అంతా వణుకు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరంలో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రెండు, మూడు గంటల పాటు కురిసిన అతి భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ వాగుల్ని తలపించాయి. ఫ్లైఓవర్లపై సైతం వరద ఏరులా ప్రవహించింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. పలు ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కొన్నిచోట్ల వరద ఉధృతికి ఆటోలు, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు కొట్టుకు పోయాయి. నగరం నలుమూలలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.ప్యాట్నీ నగర్‌లో వరదలో చిక్కుకున్న వారిని పడవల ద్వారా తరలిస్తున్న సహాయక సిబ్బందికంటోన్మెంట్, బోయిన్‌పల్లి ప్రాంతాల్లో అత్యధికంగా 11.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో 6 సెం.మీ పైగా వర్షం కురిసింది. ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన వారు నరకయాతన పడ్డారు. రోడ్లపై మోకాలిలోతు నీళ్లు ప్రవహిస్తుండటంతో మెట్రో స్టేషన్లు, ఫ్లైఓవర్ల కింద, పెట్రోల్‌ బంకులు వద్ద గంటల కొద్దీ తలదాచుకున్నారు. ఎటు చూసినా వరదే.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ నెక్టార్‌ గార్డెన్‌ వద్ద, ఎల్‌బీనగర్, మలక్‌పేట, మూసారంబాగ్, చైతన్యపురి ప్రాంతాల్లో రోడ్లపై వరద వాగుల్ని తలపించింది. షేక్‌పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చి»ౌలి, కొండాపూర్, హఫీజ్‌ పేట్, మాదాపూర్, హైటెక్‌ సిటీ, మియాపూర్, ఏఎంబీ మాల్‌ వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. టోలిచౌకి నానల్‌ నగర్‌ జంక్షన్‌ వద్ద నాలా పొంగిపొర్లింది. పాతబస్తీలోని డబీర్‌పురా, శివగంగా నగర్, రాజన్న బావి, ఛత్రినాక చౌరస్తా, అచ్చయ్య నగర్, హనుమాన్‌ నగర్, అంబికా నగర్, పటేల్‌ నగర్‌ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చింతల్‌బస్తీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, శ్రీనగర్‌ కాలనీ, శ్రీకష్ణానగర్, ఇందిరానగర్, ఫిలింనగర్, వెంకటగిరి, అమీర్‌పేట తదితర ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఫిలింనగర్‌లోని పలు బస్తీల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. ఉప్పల్, రామాంతపూర్, అంబర్‌పేట, తార్నాక, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై నిలిచి పోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో నగరం రోడ్లపై వరద ప్రవాహంతో వాహనాలన్నీ ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుపోయాయి. అర కిలోమీటరు దూరం ప్రయాణించడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. సాయంత్రం కార్యాలయాలు, కాలేజీలు, పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లే టైమ్‌ కావడంతో ఎక్కడ చూసినా వాహనాల బారులు కిక్కిరిసిపోయి కని్పంచాయి. ప్రధానంగా ఐటీ కారిడార్‌ రాయదుర్గం, షేక్‌పేట్‌ మార్గంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాయదుర్గం, బయో డైవర్సిటీ, ఐకియా జంక్షన్, గచి్చ»ౌలి పీజేఆర్‌ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. నాంపల్లి, మెహదీపట్నం, టోలిచౌకి మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. హఫీజ్‌పేట్, ఆల్విన్‌ కాలనీ, చందానగర్‌ మార్గంలో కిలోమీటరు ప్రయాణానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అంబర్‌పేట పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, అలీకేఫ్‌ చౌరస్తాల్లో, బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు నుంచి జూబ్లీహిల్స్‌ చౌరస్తా మాదాపూర్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. అమీర్‌పేట, పంజగుట్ట, ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంక్, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ చౌరస్తా, విరించి ఆస్పత్రి చౌరస్తా, యూసుఫ్‌గూడ శ్రీకష్ణానగర్‌ రోడ్లలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మూసారంబాగ్‌ బ్రిడ్జిని వరద ముంచెత్తింది. సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించిన హైడ్రా కమిషనర్‌వరద ఉధృతికి సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని ప్యాట్నీనగర్‌ పూర్తిగా ముంపునకు గురైంది. పలు భవనాల సెల్లార్లలోకి వర్షపునీరు చేరింది. దీంతో నాలుగు పడవల ద్వారా అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. స్థానికులను, వివిధ కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులు సుమారు 80 మందిని బయటకు తీసుకొచ్చారు. ఫైరింజన్‌ ద్వారా వర్షపు నీటిని తోడారు. మొదటి. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న స్థానికులు ఇళ్లను విడిచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు. కంటోన్మెంట్‌ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పర్యవేక్షించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం... ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సుమారు 270 ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన విద్యుత్‌ అధికారులు సిబ్బందిని రంగంలోకి దింపి దాదాపు 200 ఫీడర్ల పరిధిలో కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలో సరఫరా పునరుద్ధరించినట్లు ట్రాన్స్‌కో సీఎండీ ముషారఫ్‌ ఫరూఖి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడంతో సరఫరా పునరుద్ధరణకు కొంత అదనపు సమయం పట్టిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైడ్రా మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మొయినాబాద్‌ మండలం నదీమ్‌నగర్‌ గ్రామంలో మైసమ్మ దేవాలయం వద్ద దాదాపు 200 ఏళ్ల వయసున్న వేప చెట్టు నేలకొరిగింది.

US Faces 70-80percent Drop In Indian Students As Visa Crisis9
అమెరికా కల చెదురుతోంది..!

ముదురు పాకాన పడుతున్న అమెరికా వీసా సంక్షోభం భారతీయ విద్యార్థుల పాలిట పిడుగుపాటుగా మారుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటినుంచీ విద్యార్థి వీసాలపై నానారకాల ఆంక్షలు విధిస్తుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి అన్న చందంగా తయారవుతోంది. దాంతో పై చదువుల నిమిత్తం అగ్ర రాజ్యానికి వెళ్లే మనవాళ్ల సంఖ్యలో ఈ ఏడాది ఏకంగా 70 నుంచి 80 శాతం తగ్గుదల నమోదైందని హైదరాబాద్‌కు చెందిన పలు ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్లు ఆందోళన వెలిబుచ్చారు. వీసా అపాయింట్‌మెంట్లను ఉన్నట్టుండి ఫ్రీజ్‌ చేయడం, వీసా దరఖాస్తుల తిరస్కరణల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటం వంటివి కూడా ఇందుకు కారణంగా నిలుస్తున్నట్టు వారు వివరించారు. ‘‘మామూలుగానైతే ఏటా ఈ సమయానికల్లా విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, అమెరికా వెళ్లే ఏర్పాట్లలో తలమునకలుగా ఉంటారు. ఈసారి మాత్రం మేమింకా వీసా స్లాట్లు అందుబాటులోకి వచ్చాయా అని రోజూ ఎంబసీ పోర్టల్‌ను చెక్‌ చేసుకునే దశలోనే ఉన్నాం! ఇంత దారుణ గత కొన్నేళ్లలో ఎన్నడూ లేదు’’ అంటూ వాపోయారు. ఇది చాలదన్నట్టు ఈసారి వీసా స్లాట్లను అమెరికా ఎంబసీలు దశలవారీగా విడుదల చేస్తున్నాయి. చెప్పా పెట్టకుండా ఉన్నట్టుండి కొత్త నిబంధనలు తెచ్చేస్తున్నాయి. ఇలాంటి ఆకస్మిక నిర్ణయాలు మొత్తం వీసా ప్రక్రియపై విద్యార్థుల్లో టెన్షన్‌ పెంచేస్తున్నాయి. అంతేకాదు. ఎలాగోలా వీసా స్లాట్లు బుక్కయినా, స్లాట్‌ దొరికిందంటూ విద్యార్థులకు కన్ఫర్మేషన్‌ రావడం లేదు. కొత్తగా అప్‌డేట్‌ చేసిన స్లాట్‌ సిస్టంను ఎంబసీలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చని కన్సల్టెంట్లు అంటున్నారు. కానీ ఈ పరిణామం విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి లోను చేస్తోంది. ‘‘మరికొద్ది రోజుల్లో గనక వీసా స్లాట్లను విడుదల చేయకపోతే వేలాది మంది భారత విద్యార్థుల అమెరికా చదువుల కల కల్లగా మిగిలిపోనుంది. వాళ్లు తీవ్ర ఆందోళనతో రోజూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు’’ అని ఓ కన్సల్టెంటు ఆవేదన వెలిబుచ్చారు. హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ మాత్రం వీసా స్లాట్ల ప్రక్రియ పునఃప్రారంభమైందని, అపాయింట్‌మెంట్ల కోసం విద్యార్థులు తరచూ వెబ్‌సైట్లో చూస్తుండాలని సూచించారు. గతేడాది రికార్డు స్థాయిలో ఏకంగా 3.3 లక్షల మందికి పైగా భారత విద్యార్థులు పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ విషయంలో చైనాను అధిగమించి భారత్‌ తొలి స్థానంలో నిలిచింది కూడా! కానీ ట్రంప్‌ రాకతో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. 2024 జనవరి నాటికి 11.6 లక్షలకు పైగా భారత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. యూరప్‌ దేశాలకు వెళ్తున్న మన విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇతర దేశాలే ముద్దు అమెరికా వీసా కోసం అష్టకష్టాలు పడేకంటే ఇతర దేశాలను చూసుకోవడమే మేలని భారత విద్యార్థుల్లో అత్యధికులు భావిస్తున్నారు. ‘‘అమెరికా కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఇప్పటికే ఏడాది వృథా చేసుకున్నా. ఇంకా దానిమీదే ఆశలు పెట్టుకుని మరో ఏడాది కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేను. నాలాంటి ఎంతోమంది విద్యార్థుల అమెరికా కలలకు నా ఉద్దేశంలోనైతే ముగింపు కార్డు పడ్డట్టే’’ అని 23 ఏళ్ల ఓ ఆశావహ విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇప్పుడతను ఆటోమోటివ్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేసేందుకు జర్మనీ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.214(బి)తోనే సమస్య! గత మార్చిలోనే వీసా స్లాట్లు బుక్‌ చేసుకుని ఎట్టకేలకు ఇంటర్వ్యూ దాకా వెళ్తున్న భారత విద్యార్థుల్లో అత్యధికులకు ఎంబసీ నుంచి మొండిచెయ్యే ఎదురవుతోంది! ఈ పరిణామంపై కన్సల్టెంట్లే విస్తుపోతున్నారు. మంచి అకడమిక్, సోషల్‌ మీడియా రికార్డు తదితరాలుండి, గతేడాది దాకా అనాయాసంగా వీసాలు లభించిన ప్రొఫైళ్లను ఈసారి నిర్ద్వంద్వంగా తిరస్కరించేస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ యాక్ట్‌లోని 214(బి) సెక్షనే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చదువు పూర్తయ్యాక మాతృదేశానికి కచ్చితంగా తిరిగి వెళ్తామన్న నమ్మకాన్ని ఎంబసీ అధికారులకు మనవాళ్లు కల్పించలేకపోతున్నారు. ‘‘ఈ నిబంధనలు కొత్తవేమీ కాదు. ఏళ్లుగా ఉన్నవే. కానీ వాటిని ఈ ఏడాదే తొలిసారి అమలు చేస్తున్నారు’’ అని డాలస్‌లో ఇమిగ్రేషన్‌ కన్సల్టింగ్‌ సంస్థ నడుపుతున్న రవి లోతుమల్ల వివరించారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

India womens team to play second ODI against England today10
ఈ ఒక్కటి గెలిస‍్తే చాలు!

లండన్‌: భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు ఒక్క విజయం దూరంలో ఉంది. నేడు ‘క్రికెట్‌ మక్కా’ లార్డ్స్‌ మైదానంలో జరిగే రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం గెలిస్తే వరుస సిరీస్‌లతో పండగ చేసుకోవడం ఖాయం. టాపార్డర్‌ సూపర్‌ ఫామ్, బౌలింగ్‌లో నిలకడ కనబరుస్తున్న టీమిండియాకు విజయం, సిరీస్‌ కైవసం ఏమంత కష్టం కానేకాదు. ఇంగ్లండ్‌ మాత్రం వన్డే సిరీస్‌ రేసులో నిలబడాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడిని నెత్తిన పెట్టుకొని బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌ వైఫల్యం ఆతిథ్య జట్టుకు ప్రతికూల ఫలితాలిస్తున్నాయి. గత ఓటమి నుంచి బయటపడి, కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. జోరుమీదున్న భారత్‌ బ్యాటర్లు, బౌలర్లు అందరు ఫామ్‌లో ఉండటం భారత జట్టులో సమరోత్సాహాన్ని అమాంతం పెంచుతోంది. వన్డే జట్టులోకి రాగానే ప్రతీక రావల్‌ సత్తా చాటుకుంది. స్మృతి, హర్లీన్‌ డియోల్‌లు కూడా మెరుగ్గానే ఆడారు. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్‌... ఈ ఇద్దరు మాత్రమే రెండు పదుల స్కోరైనా చేయలేకపోయారు. కానీ మిడిలార్డర్లో జెమీమా, దీప్తి శర్మ మ్యాచ్‌లను గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడటంతో బ్యాటింగ్‌ మరింత పటిష్టమైంది. బౌలింగ్‌లో క్రాంతి, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, అమన్‌జోత్‌లు సమష్టిగా ఇంగ్లండ్‌ బ్యాటర్ల భరతం పట్టారు. లార్డ్స్‌ లోనూ మరో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిస్తే ఎంచక్కా ఇక్కడే సిరీస్‌ను చేజిక్కించుకోవచ్చు. ఓడితే ఇక నెగ్గలేరు మరోవైపు భారత్‌తో పోలిస్తే... ఆతిథ్య ఇంగ్లండ్‌ది భిన్నమైన పరిస్థితి. సొంతగడ్డపై ఇదివరకే టి20 సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయే స్థితిలో ఉంది. ‘లార్డ్స్‌’ పోరులో ఓడితే ఇక సిరీస్‌ నెగ్గే అవకాశమే ఉండదు. ప్రధాన ప్లేయర్లంతా కీలకమైన తరుణంలో చేతులెత్తేయడం... పరుగులో వెనుకబడటం, వికెట్లు తీయడంలో అలసత్వం... ఇవన్నీ ఆతిథ్య జట్టుకు కొండంత కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి ఒత్తిడి ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌లో నిలవడం కాస్త కష్టమైన పనే! గత మ్యాచ్‌లో ఓపెనర్లు టామీ బ్యూమోంట్, అమీ జోన్స్‌ల ఘోరమైన వైఫల్యం జట్టుకు ప్రతికూలమైంది. మిడిలార్డర్‌లో సోఫియా డంక్లీ, అలైస్‌ రిచర్డ్స్‌ల అర్ధసెంచరీలతో జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది. అయితే బౌలర్లు నిరుత్సాహపరిచే ప్రదర్శనతో లక్ష్యాన్ని భారత్‌ సులువుగా ఛేదించింది. కేట్‌ క్రాస్, లారెన్‌ బెల్, సోఫీ ఎకిల్‌స్టోన్‌లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అయితే సిరీస్‌లో నిలవాల్సిన ఈ మ్యాచ్‌లో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు బాధ్యత కనబరిస్తేనే ఆశించిన ఫలితాన్ని రాబట్టొచ్చు. తుదిజట్లు (అంచనా) భారత్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్), ప్రతీక, స్మృతి మంధాన, హర్లీన్, జెమీమా, దీప్తిశర్మ, రిచా ఘోష్, అమన్‌జ్యోత్, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, క్రాంతి గౌడ్‌.ఇంగ్లండ్‌: నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (కెప్టెన్), బ్యూమోంట్, అమీ జోన్స్, ఎమ్మా లాంబ్, సోఫియా డంక్లీ, అలైస్‌ రిచర్డ్స్, సోఫీ ఎకిల్‌స్టోన్, చార్లీ డీన్, కేట్‌ క్రాస్, లారెన్‌ ఫైలెర్, లారెన్‌ బెల్‌. ఇంగ్లండ్‌ జట్టు, ప్రతీకలపై జరిమానా భారత టాపార్డర్‌ బ్యాటర్‌ ప్రతీక రావల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు. సౌతాంప్టన్‌లో తొలి వన్డే సందర్భంగా 18వ ఓవర్‌ వేసిన లారెన్‌ ఫైలెర్, ఆ మరుసటి ఓవర్‌ వేసిన సోఫీ ఎకిల్‌స్టోన్‌తో ప్రతీక అనుచితంగా ప్రవర్తించింది. ఇది ప్లేయర్ల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడమే అని తేల్చిన రిఫరీ ఆమె మ్యాచ్‌ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్‌ పాయింట్‌ విధించారు. మరోవైపు మందకొడి బౌలింగ్‌ నమోదు చేసినందుకు ఇంగ్లండ్‌ జట్టు మొత్తానికి జరిమానా పడింది. నిర్ణీత సమయంలో కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోవడంతో ప్లేయర్ల మ్యాచ్‌ ఫీజులో 5 శాతం కోత పెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.4 లార్డ్స్‌ మైదానంలో భారత్, ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు నాలుగు వన్డేలు జరిగాయి. రెండింటిలో భారత్, మరో రెండింటిలో ఇంగ్లండ్‌ గెలిచాయి. ఈ మైదానంలో ఇంగ్లండ్‌పై భారత్‌ అత్యధిక స్కోరు 230 కాగా, అత్యల్ప స్కోరు 169.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement