రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి సీఎం వైయస్ జగన్ చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. పాఠశాల విద్యలో తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏపీని దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిపాయి. ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం ఫౌండేషన్ విద్య అందుబాటు అంశంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 38.50 స్కోరుతో ఏపీ కేరళను అధిగమించింది.