Top Stories
ప్రధాన వార్తలు

ఒక్కో బిల్డింగ్‌కు ఒక్కో రేటు.. ముడుపుల రూటు సపరేటు
సాక్షి, అమరావతి: ‘మామూలుగా భవనాల (బిల్డింగ్) నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫైవ్ స్టార్ వసతులు కల్పిస్తూ నిర్మించినా చదరపు అడుగుకు రూ.4,500కు మించి ఖర్చు కాదు’ అని ఇంజినీరింగ్ నిపుణులు తేల్చి చెబుతుంటే రాజధాని అమరావతిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇక్కడ భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు వచ్చాయి. నిర్మాణ వ్యయం బిల్డింగ్ బిల్డింగ్‌కు మార్చేశారు. చదరపు అడుగుకు రూ.10,418.97 చొప్పున భవనాల నిర్మాణ పనులను ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేట్ కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టేయడంపై ఇంజినీరింగ్ నిపుణులు, బిల్డర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటాలియన్ మార్బుల్స్‌తో ఫైవ్ స్టార్ సదుపాయాలతో కట్టినా చదరపు అడుగు రూ.4వేలు–రూ.4,500కు మించదని హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో హైరైజ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్న బిల్డర్లు నివ్వెరపోతున్నారు. ఆ భవనాలను ఏమైనా వెండితో కడుతున్నారా.. బంగారపు పూత పూస్తున్నారా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం కమీషన్ల రూపంలో చేరాల్సిన జేబులోకి వెళ్తోందంటూ అధికార వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. అప్పు తెచ్చిన సొమ్ముతో...ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), కేఎఫ్‌డబ్ల్యూ (జర్మనీ) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, హడ్కో వంటి జాతీయ సంస్థ నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులతో చేపట్టిన పనుల్లో ఈ స్థాయిలో దోపిడీకి తెర తీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం (ఐదు ఐకానిక్ టవర్లు), మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాల (క్వార్టర్స్) నిర్మాణ పనులకు 2016–18లోనే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అప్పట్లో చేయగా మిగిలిన పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి.. ఇటీవల సీఆర్డీఏ మళ్లీ టెండర్లు పిలిచింది. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 65 శాతం నుంచి 105 శాతం వరకు పెంచేసి టెండర్లు పిలిచి.. అధిక ధరలకు సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేసింది. కాంట్రాక్టు ఒప్పందం విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్టర్లకు ఇచ్చి.. అందులో ఎనిమిది శాతం ముఖ్య నేత, మిగతా రెండు శాతం కాంట్రాక్టర్లు నీకింత.. నాకింత.. అంటూ పంచుకున్నారు. మంత్రుల బంగ్లా వ్యయం రూ.6.99 కోట్లు రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్ కేపిటల్ ఏరియా)లో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం జీ+1 పద్ధతిలో 35 బంగ్లాలు.. 24.13 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనుల్లో మిగిలిన పనులను రూ.495.86 కోట్లకు బీఎస్సార్ ఇన్ఫ్రాకు అప్పగించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులకు నిర్మిస్తున్న 71 బంగ్లాల్లో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్లో పేర్కొన్నారు. కానీ.. టెండర్ డాక్యుమెంట్‌ను పరిశీలిస్తే మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల్లో ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే.. మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే.. నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లు స్పష్టమవుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10,418.97. ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.6.99 కోట్లు. పైగా ఇసుక ఉచితం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.4 కోట్లలోపేనని బిల్డర్లు ఎత్తి చూపుతున్నారు. ఐఏఎస్‌ల బంగ్లా చదరపు అడుగు రూ.9,771 రాజధానిలో రాయపూడి వద్ద 30.47 ఎకరాల్లో ఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 90 బంగ్లాల నిర్మాణంలో మిగిలిన పనులను రూ.516.02 కోట్లకు కేఎమ్వీ ప్రాజెక్ట్స్‌కు అప్పగించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 115 బంగ్లాల నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు. అంటే.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,771.25. అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరా వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలతో ఇలాంటి బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4,500కు మించదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఐఏఎస్ అధికారుల ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.4.49 కోట్లు. హైదరాబాద్, బెంగుళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.3 కోట్లకు మించదని రియల్టర్లు స్పష్టం చేస్తున్నారు.నాడూ నేడు ఒకే రీతిలో దోపిడీ ⇒ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లు ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపులతో అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసు భయంతో హైదరాబాద్ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ⇒ ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ, వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ⇒ ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి సీఎం తరఫున కమీషన్లు వసూలు చేసి, ఐటీ శాఖకు సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నుంచి అధికారుల నివాసాల వరకు.. డిజైన్ మారిందని.. పని స్వభావం మారిందని.. ధరలు పెరిగాయనే సాకు చూపి.. 2015–19 తరహాలోనే దోపిడీకి తెర తీశారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం ఆకాశమంత ⇒ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐదు ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్‌ృజెనిసిస్ ప్లానర్స్‌ృడిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు (ఆకృతులు) రూపొందించాయి. ⇒ ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మిగిలిన పనులకు రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ⇒ నాలుగు టవర్లను బీ+జీ+39 అంతస్తులతో.. ఐదో టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనుంది. ఈ ఐదు టవర్ల మొత్తం నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). దీన్ని బట్టి చూస్తే ఐకానిక్ టవర్లలో మిగిలిన పనుల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.8,981.56. ఈ లెక్కన చూసుకుంటే 2018 నాటితో పోల్చితే ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం రూ.2,417.68 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ⇒ అంటే.. అంచనా వ్యయం 105 శాతం పెంచేశారన్న మాట. నిజానికి 2018ృ19 ధరలతో పోల్చితే ప్రస్తుతం సిమెంటు, స్టీలు, పెట్రోల్, డీజిల్ సహా నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇక ఇసుక ఉచితం. ఈ లెక్కన నిర్మాణ వ్యయం పెరగడానికి వీల్లేదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. నిజానికి డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని, చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించి వ్యయం కాదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పాకిస్తాన్‌కు అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్
మనామా: దాయాది దేశం పాకిస్తాన్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఓ విఫల దేశమని ఘాటు విమర్శలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం కారణంగా ప్రపంచమే ముప్పును ఎదుర్కొంటోందన్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం.. ప్రతీ భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి అన్న చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో వచ్చిన ఏడుగురు సభ్యుల అఖిల బృందం శనివారం బహ్రెయిన్‌కు చేరుకుంది. ఈ బృందంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు. ఈ సందర్బంగా బహ్రెయిన్‌లో ఎంపీ అసద్ మాట్లాడుతూ.. ‘చాలా సంవత్సరాలుగా భారత్ ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేసేలా మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపింది. దురదృష్టవశాత్తు పాకిస్తాన్ కారణంగా మేము చాలా మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయాం. పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడం, స్పాన్సర్ చేస్తోంది. ఇలాంటి కార్యక్రమాలను పాకిస్తాన్ ఆపకపోతే ఉగ్రవాద సమస్య తొలగిపోదు.ప్రతీ భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారత్ మరింత దూకుడుగా వ్యవహరించేందుకు, మర్నిని దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈసారి ప్రతిదాడి మామూలుగా ఉండదు. పాకిస్తాన్‌కు సరైన బుద్ధి చెబుతాం. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్తోంది. పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటకీ భారత్ సంయమనం పాటించింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాది విషయమై అందరూ ఆలోచించండి. ఆరు రోజుల క్రితం వివాహం చేసుకున్న ఒక మహిళ ఏడో రోజున వితంతువు అయ్యింది. కేవలం రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న మరో మహిళ కూడా ఈ దాడిలో తన భర్తను కోల్పోయింది. ఇలాంటి దారుణాలు పాకిస్తాన్ వల్లే జరుగుతున్నాయి.మేమంగా వేరువేరు రాజకీయ పార్టీలకు చెందినప్పటికీ దేశం విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాం. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. దేశ సమగ్రత విషయానికి వస్తే అందరం ఒక్కటయ్యాం. పాకిస్తాన్‌ను FATF గ్రే లిస్ట్‌లోకి తీసుకురావడంలో బహ్రెయిన్ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటూ చెప్పుకొచ్చారు.#WATCH | Manama, Bahrain: During an interaction with the prominent personalities, AIMIM MP Asaduddin Owaisi says, "...Our govt has sent us over here...so that the world knows the threat India has been facing since last so many years. Unfortunately, we have lost so many innocent… pic.twitter.com/ckukFxpGAc— ANI (@ANI) May 24, 2025ఇదిలా ఉండగా.. రాజకీయంగా భిన్నమైన అభిప్రాయాలను కలిగిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ నేత నిశికాంత్ దూబేలు ఒక అంశంలో కలిసి పనిచేయాల్సి రావడం ప్రాధాన్యాన్ని సంతరించకుంది. భిన్న ధ్రువాలుగా ఉండే ఈ ఎంపీలు పాకిస్తాన్ ఉగ్రవాద ఉన్మాదాన్ని ఎండగట్టేందుకు పాక్ దుర్మార్గాలను వివరించేందుకు సౌదీ అరేబియాతో పాటు కువైట్, బహ్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్
న్యూయార్క్: ‘నేను ప్రభుత్వం కోసం పనిచేయను. ప్రతిపక్ష పార్టీ కోసం పని చేస్తాను. భారతదేశంలోని ప్రముఖ పత్రికలలో పహల్గామ్ ఘటన అనంతరం వ్యాసాలు రాశాను. ఉగ్రవాదాన్ని తెలివిగా తిప్పితిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని, భారత్ సరిగ్గా అదే చేసిందని వాటిలో పేర్కొన్నాను’ అని ఎంపీ శశిధరూర్(MP Shashi Dharur) వ్యాఖ్యానించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచానికి తెలియజెప్పేందుకు, దీనిపై పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం వివిధ దేశాలలో పర్యటిస్తోంది. ప్రస్తుతం ఈ బృందం న్యూయార్క్‌లో ఉంది. దీనిలో సభ్యునిగా ఉన్న ఎంపీ శశిధరూర్ భారత కాన్సులేట్‌లో ప్రసంగించారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుందో, తొమ్మిది ఉగ్రస్థావరాలను ఏ విధంగా నేలమట్టం చేసిందో ఎంపీ శశిథరూర్ వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు ప్రపంచమంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూయార్క్‌లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించడం అఖిలపక్ష బృంద సభ్యులకు మొదటి మజిలీ అన్నారు. ఉగ్రవాదం అనేది ఉమ్మడి సమస్య అని, బాధితులకు సంఘీభావం ప్రకటించేందుకు తాము వచ్చామని అన్నారు.అఖిలపక్ష ప్రతినిధి బృందం సందర్శన లక్ష్యం గురించి థరూర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఉగ్రవాదం, ఇటీవల జరిగిన ఉగ్రవాద ఘటనలపై విభిన్న వర్గాలతో చర్చించడమే తమ ఆలోచన అని అన్నారు. ప్రతి దేశంలోని కార్యనిర్వాహక సభ్యులను, విదేశాంగ విధాన నిపుణులను కలవడం, మీడియాతో సంభాషించడం దిశగా తమ ప్రయాణం సాగుతుందని అన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి(Pahalgam terror attack) గురించి ప్రస్తావించిన ఆయన మతాల ఆధారంగా ప్రజలను గుర్తించి, వారిని అంతమొందించడానికి కొందరు తిరుగుతున్నారని అన్నారు. బాధితుల్లో ఎక్కువగా హిందువులు ఉన్నారని, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నదని థరూర్ పేర్కొన్నారు.పహల్గామ్లో దారుణం జరిగిన ఒక గంట సేపటికే రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ దీనికి బాధ్యతను ప్రకటించుకున్నదని, ఈ సంస్థ కొన్నేళ్లుగా నిషేధిత లష్కరే తోయిబాకు సహకరిస్తున్నదన్నారు. శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో శాంభవి చౌదరి (లోక్ జనశక్తి పార్టీ), సర్ఫరాజ్ అహ్మద్ (జార్ఖండ్ ముక్తి మోర్చా), జి.ఎం. హరీష్ బాలయోగి (తెలుగు దేశం పార్టీ), శశాంక్ మణి త్రిపాఠి, తేజస్వి సూర్య, భువనేశ్వర్ కె. లత (బీజేపీ), మల్లికార్జున్ దేవ్డా (శివసేన), అమెరికాలోని మాజీ భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి: COVID-19: తేలికపాటివిగా అత్యధిక కేసులు.. గృహ సంరక్షణలో చికిత్స

ఏడాది పాలన పొట్ట విప్పి చూడ..!
చంద్రబాబు అనే నాలుగు అక్షరాలకు అర్థమూ, తాత్పర్యమూ, నిర్వచనమూ అన్నీ కూడా అభివృద్ధేనని యెల్లో మీడియా మనకు ఎప్పటి నుంచో నేర్పిస్తున్నది. ముప్పయ్యేళ్ల లోపు వయసున్న తరానికైతే దొండాకు పసరు నాడే ఈ వసను కూడా కలిపి తాగించారు. అటువంటి రెండు కాళ్ల మీద నడిచే అభివృద్ధి నాలుగోసారి కుర్చీ ఎక్కి సంవత్సరకాలం పూర్తవు తున్నది. ఈ ఏడాది కాలంలో విరగబూసిన అభివృద్ధిని కళ్లారా వీక్షించాలన్న కోరిక ఎవరికి మాత్రం ఉండదు? ఆ వీక్షణ కోసం కొన్ని ‘వ్యూ పాయింట్స్’ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.హిందూపూర్ రైల్వే స్టేషన్ కూడా ఒక వ్యూ పాయింట్.హిందూపూరంటే చంద్రబాబు పార్టీకి కంచుకోట కదా! ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఓటమి చవిచూడలేదట! పైగా ముఖ్యమంత్రికి స్వయానా బావమరిది ప్లస్ వియ్యంకుడు ప్లస్ మాస్ మసాలా హీరో – బాక్సాఫీస్ బొనాంజా బాలయ్యబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇంత బిల్డప్ ఉన్నచోట అభివృద్ధి దద్దరిల్లకుండా ఉంటుందా? ఉదయం నాలుగున్నర నుంచి రెండు గంటలసేపు ఆ స్టేషన్లో నిలబడితే రైలు కూత వాయిస్‌లో అభివృద్ధి సౌండ్ వినిపిస్తుంది.బెంగళూరు నగరంలోని ఇళ్లలో పాచి పనులు చేసేందుకు, వీధుల్లో మూటలు మోసేందుకూ, ఇంకా ఇతర పనుల కోసం దాదాపు మూడు వేలమంది దాకా రోజూ అక్కడ ప్యాసింజర్ బండ్లెక్కి వెళుతున్నారు. ఇలా ప్రతిరోజూ వెళ్లి పనిచేసుకుని రావడం కొత్తేమీ కాదు. కాకపోతే ఏడాది కిందట వీరి సంఖ్య ఆరేడు వందలు దాటేది కాదు. ఈ ఏడాదిలో క్రమంగా మూడు వేల మార్కుకు చేరుకున్నది. ఈ పెరుగుదలను ఏడాది పాలన అభివృద్ధి ఖాతాలోనే కదా వేయాల్సింది. రోజువారీ చాకిరీ ముగిసిన తర్వాత మళ్లీ రైలు బండెక్కి రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఇంటికి చేరుకుంటారు. మళ్లీ పొద్దున మూడు గంటలకే లేచి ఇంటి పనులు పూర్తి చేసుకుంటేనే... స్టేషన్లో బతుకు బండిని అందుకోగలుగుతారు.మహానగరానికి సమీపంలో ఉన్నందువలన హిందూపూర్ వలసల్లో డైలీ షటిల్ పద్ధతి కనిపిస్తున్నది. ఆ సమీపంలోనే ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలోనైతే మూడో వంతు జనాభా మాత్రమే మిగిలిపోయిన గ్రామాలు కూడా ఉన్నాయి. అలా మిగిలిపోయిన వాళ్లలో వృద్ధులూ, పిల్లలే ఎక్కువ. భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి నెల్లూరు నగరంలో స్థిరపడ్డ కార్మికుల్లో ఇరవై వేలమంది ఈ మధ్యకాలంలోనే పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ వలసలపై గ్రామ సచివాలయాల సర్వేను ఆధారం చేసుకొని ఇటీవల ‘ప్రజాశక్తి’ పత్రిక ఒక కథ నాన్ని ప్రచురించింది. దానిప్రకారం ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా వలసలు పెరిగాయి. గణనీయ సంఖ్యలో జనం వలస బాట పట్టారు.వలసలన్నీ అభివృద్ధికి వ్యతిరేకమైనవి కావు. మెరుగైన జీవితం కోసం, నైపుణ్యతకు తగిన ఉపాధి కోసం, ఉన్నతో ద్యోగాల కోసం నిరంతరం వలసలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి వలసలను ప్రగతిశీలమైనవిగానే పరిగణిస్తారు. కానీ ఈ సంవత్సరం ఈ తరహా వలసల సంఖ్య చాలా తక్కువనీ, బతుకుదెరువు వలసలే ఎక్కువనీ సర్వే సారాంశమట! వ్యవ సాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, రైతన్నలకు చేసిన హామీలను ఎగవేయడం, కరువు పరిస్థితులు, ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన బిల్లులు ఆపేయడం, నిర్మాణరంగం పూర్తిగా కుదేలవడం వంటి కారణాలు పెద్ద ఎత్తున వలసలకు కారణమయ్యాయి.తొలి ఏడాది అభివృద్ధికి సంబంధించి పెరిగిన వలసలు ఒక కొలమానమైతే, అధికారిక లెక్కలు వెల్లడించే డాక్యుమెంట్లు మరో బలమైన సాక్ష్యంగా ఉంటాయి. ఇదిగో ఈ సాక్ష్యాలను ముందుపెట్టుకొనే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర యథార్థ పరిస్థితులను మీడియా సమావేశం ద్వారా మొన్న జనం ముందు ఉంచారు. ఈ సమావేశంలో తన పార్టీ వాళ్లు తయారుచేసిన నివేదికల ఆధారంగా ఆయన మాట్లాడలేదు. ప్రభుత్వం తయారుచేసిన బడ్జెట్ పత్రాల్లోని లెక్కల్ని ఆధారంగా చేసుకునే మాట్లాడారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రిపోర్టుల్లోని విషయాలపైనే మాట్లాడారు. ‘కాగ్’కు తన ప్రమాణాలను పాటించడం తప్ప ఎటువంటి పక్షపాత ధోరణీ ఉండదనేది తెలిసిందే. తప్పొప్పులను తూర్పారపట్టడమే దాని పని. ఈ లెక్కల ఆధారంగానే కూటమి సర్కార్ మాటల్లోని కపటత్వాన్నీ, వారి ప్రచారాల్లోని డొల్లతనాన్నీ ఆయన చీల్చి చెండాడారు. ప్రభుత్వంపై ఆయన చేసిన దాడి ఎంత సాధికారికంగా, ఎంత శక్తిమంతంగా జనంలోకి వెళ్లిందంటే... మూడు రోజులు గడిచినా సర్కార్ వైపు నుంచి ఏ ఒక్కరూ ప్రతిపక్ష నేతకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేకపోయారు. కొన్ని పిల్లి అరుపులు వినిపించడం, కొన్ని కుప్పిగంతులు కనిపించడం తప్ప!మూలధన వ్యయం పెరుగుదలను ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి గుర్తుగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థపై నమ్మకానికీ, ఉద్యోగాల కల్పనకూ, జీడీపీ ఉద్దీపనకూ ఈ మూలధన వ్యయం దోహదపడుతుంది. మరి, అభివృద్ధికి పర్యాయపదంగా యెల్లో మీడియా పలవరించే చంద్రబాబు తొలి ఏడాదిలో ఈ మూల ధన వ్యయం ఏ మేరకు పెరిగింది? పెరగలేదు సరికదా,అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 17.80 శాతం తగ్గిందని ‘కాగ్’ నివేదికలోని అంశాన్ని జగన్ జనం ముందు పెట్టారు. జగన్ ప్రభుత్వపు చివరి సంవత్సరంలో మూలధన వ్యయం రూ. 23,330 కోట్లయితే చంద్రబాబు తొలి సంవత్సరం అది రూ. 19,177 కోట్లు మాత్రమేనని ‘కాగ్’ కుండబద్దలు కొట్టింది.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏటికేడు పెరుగుతుంటేనే అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు! కానీ గత సంవత్సరంతో పోలిస్తే చంద్రబాబు తొలి సంవత్సరంలో ఈ ఆదాయం 7.39 శాతం తగ్గింది. జగన్మోహన్రెడ్డి జనం ముందుంచిన ప్రభుత్వ గణాంకాల్లో అత్యంత ఆసక్తికరమైనది ఎక్సైజ్ ఆదాయం.ఎందుకంటే అంతకుముందు కంటే మద్యం షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మద్యం షాపుకు అనుబంధంగా ఓ పర్మిట్ రూమ్ తయారైంది. ఇక బెల్ట్‌షాపుల సంఖ్య నలభై వేలు దాటింది. ఒక్కో బెల్ట్‌షాపు అనధికార పాటల్లో పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు పలికిందని వార్తలొచ్చాయి. బెల్ట్‌షాపుల కేటాయింపులోనే నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల మేరకు అనధికారిక డీల్ కనబడుతుంటే... ప్రభుత్వానికి పెరిగిన ఎక్సైజ్ ఆదాయం కేవలం రూ. 3,800 కోట్లు మాత్రమే!ఇక ఈ 40 వేల పైచిలుకు బెల్ట్ షాపుల్లో అమ్మిన సరుకెంత? వచ్చిన ఆదాయమెంత? 4,400 మద్యం దుకాణాల్లో, వాటికి అనుబంధంగా కొత్తగా వెలసిన పర్మిట్ రూమ్‌ల సౌకర్యంతో పెరిగిన అమ్మకాలెన్ని? వచ్చిన ఆదాయమెంత? మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు, బెల్ట్‌షాపులు, బార్లు రౌండ్ ది క్లాక్ చేస్తున్న వ్యాపారం వల్ల పెరిగిన ఆదాయమెంత? ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళుతున్నది? లేని స్కామ్‌పై నెలల తరబడి చేసిన దుష్ప్రచారం తర్వాత ఇప్పుడు ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు చల్లగా ఆదేశాలివ్వడం వెనుక రహస్యమేమిటి? ఆధారాలు తుడిచేశారని ‘ఈనాడు’, దర్యాప్తు ఇప్పుడప్పుడే పూర్తి కాదని ‘ఆంధ్రజ్యోతి’ రాయడం వెనుక మర్మమేమిటి? ఇప్పుడు నడిపిస్తున్న విశృంఖల అవినీతి బయటికొస్తుందేమోనని భయ పడుతున్నారా? కేవలం 24 శాతం పెరుగుదలనే నమోదు చేసిన ఎక్సైజ్ ఆదాయం తీగ అవినీతి డొంకను కదిలించింది.సంపద సృష్టికర్తగా స్వీయ కీర్తనలు చేసుకొని, యెల్లో మీడియా కితాబులందుకునే చంద్రబాబు తొలి ఏడాది పాలనలో రాష్ట్ర సొంత వనరుల ద్వారా పెరిగిన ఆదాయం కేవలం 3.08 శాతం మాత్రమే! అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం 13.76 శాతం పెరిగింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ఆదాయం 12 శాతం పెరిగింది. అప్పుల్లో మాత్రం 30 శాతం అదనంగా చంద్రబాబు ప్రభుత్వం హైజంప్ చేసింది. ఇది బడ్జెటరీ అప్పుల సంగతే! అమరావతి అప్పులు, ఇతరత్రా అప్పులు వేరే ఉన్నాయి. అయిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 41 శాతాన్ని చంద్రబాబు సర్కార్ తొలి సంవ త్సరంలోనే చేసేసిందని జగన్మోహన్రెడ్డి ఆధారసహితంగా జనం ముందు పెట్టారు. ఒకపక్క అప్పులు పెరుగుతున్నాయి. అవినీతి మహమ్మారి మాదిరిగా విస్తరిస్తున్నది. అభివృద్ధి మృగ్యమైందని సాక్ష్యాలు చెబుతున్నాయి. మరి సంపద సృష్టికీ, అభివృద్ధికీ బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్పుకునే అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆయన తైనాతీలు, భజంత్రీలు అమరావతి వంక చూపెడుతున్నారు. అసలా అమరావతి నిర్మాణమే అతి పెద్ద స్కామ్‌గా గణాంకాల సహితంగా జగన్ నిరూపించారు.గతంలో పిలిచిన టెండర్లను, అసాధారణ రీతిలో పెంచి పిలవడం వెనుక, టెండర్లు దక్కించుకున్న వారికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇప్పించడం వెనుకనున్న మర్మం కమీషన్లు దండుకోవడం కాదా అని ప్రశ్నించారు. సచివాలయం, హెచ్ఓడీ భవనాలను 53 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించడంలోని ఔచిత్యాన్నీ, చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ. 8,931గా నిర్ణయించడంలో లోగుట్టునూ కూడా ఆయన ప్రశ్నించారు.అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగూ అనుమానాస్పదంగానే ఉన్నది. ఎన్నికలకు ముందు రాజధానికి ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదని చెప్పారు. భూముల అమ్మకం ద్వారానే నిర్మాణం పూర్తి చేయొచ్చనీ, ఆ రకంగా అది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమనీ ప్రచారం చేసిన సంగతి ఎవరూ మరచిపోలేదు. ఇప్పుడేమో తొలిదశ 50 వేల ఎకరాలకే రూ.80 వేల కోట్లు కావాలని చంద్రబాబు చెబుతున్నారు. అందులో 30 వేల కోట్లు ఇప్పటికే అప్పుగా తెచ్చారు. మరో 45 వేల ఎకరాలతో రెండో దశ భూసమీకరణ కూడా జరుగుతుందట! ఈ లెక్కన రాజధాని నగరానికి రెండు లక్షల కోట్ల దాకా ఖర్చు పెట్టవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసి మోపెడవుతుందని జగన్మోహన్రెడ్డి కూడా హెచ్చరించారు. భూముల అమ్మకాలు జరిపినా అప్పులు తీర్చలేరని, చివరికి రాష్ట్ర ప్రజలపై అమరావతి ఒక గుదిబండ కాబో తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చౌకగా వసతి సౌకర్యాలు, అపారంగా ఉపాధి అవకాశాలను సృష్టించ గలిగితేనే ఆ నగరం నెమ్మదిగా ఒక రూపు తీసుకుంటుంది. రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మితం కాలేదన్న సామెతకు ఒక అర్థం ఉన్నది.ఒక భారీ సంకల్పం నెరవేరాలంటే కావాల్సినంత సమ యం, సహనం, నిరంతర ప్రయత్నం, అంకితభావం ఉండాలి. అమరావతి ప్రాంతం ఇప్పటికే సామాన్యులకు అందు బాటులో లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ ప్రాంతంలో జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయిస్తే రాజధాని సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు బృందం కోర్టుకెక్కిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇటువంటి చోట ఎంత ప్రయాసపడ్డా వచ్చే పదేళ్లలో మరో మహానగరం కాదు, ఇంకో మంగళగిరి కూడా ఆవిర్భవించదు! ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం పూర్తిగా పడకేసింది. అభివృద్ధి అలికిడే లేదు. అవినీతి విశ్వరూపం దాల్చింది. రాజకీయాల్లో ఒక అరాచక బర్బర సంస్కృతిని ప్రవేశపెట్టారు. ప్రత్యర్థులను వేటాడుతూ భయానక పాలనకు తెరతీశారు. ఈ రకంగా ప్రత్యర్థుల నోళ్లు నొక్కాలని ప్రయత్ని స్తున్నారు. శిరస్సుల మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకొని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుము కొని ఏడాది ఉత్సవాల పల్లకీలపై ఏలికలు ఊరేగబోతున్నారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

ఇస్రో రాకెట్ 7 నిమిషాల్లోనే విఫలం.. పరిశీలనకు కమిటీ
న్యూఢిల్లీ: ఇస్రో అత్యంత కీలకంగా భావించిన భూమి పరిశీలన ఉపగ్రహాన్ని ఆదివారం విజయవంతంగా ప్రయోగించలేకపోయింది. దానిని మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సీ61(PSLV-C61) గాలిలోకి ఎగిరిన ఏడు నిమిషాలకే విఫలమయ్యింది. దీనికి కారణాన్ని కనుగొనేందుకు ఇస్రో జాతీయ వైఫల్య విశ్లేషణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాకెట్‌కు సంబంధించిన ఆడిట్ జరుగుతోంది. దానిలోని వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లాంటి ప్రముఖ సంస్థలకు చెందిన సభ్యులు ఉన్న కమిటీ నెలరోజులలో దీనిపై నివేదికను సమర్పించే అవకాశం ఉంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(Polar Satellite Launch Vehicle) (పీఎస్ఎల్వీ)లోని ప్రతి విభాగాన్ని పరిశీలించేందుకు ఇస్రో పలు అంతర్గత కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం ఇది అత్యంత విశ్వసనీయమైన రాకెట్. 94 శాతానికి మించిన విశ్వసనీయత కలిగివుంది. అలాగే 63 ప్రయోగాలలో కేవలం నాలుగుసార్లు మాత్రమే వైఫల్యాలను చవిచూసింది.మూడవ దశలో ఘన ఇంధన మోటారును ఉపయోగిస్తున్నందున పీఎస్ఎల్వీ మాత్రమే కాకుండా మరే ఇతర రాకెట్ కూడా విఫలం కాలేదని అంతరిక్ష సంస్థ వర్గాలు తెలిపాయి. జాతీయ వైఫల్య విశ్లేషణ కమిటీ తన నివేదికను సమర్పించిన తర్వాతనే భవిష్యత్ ప్రయోగాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.ఇది కూడా చదవండి: యూపీలో నాలుగు కోవిడ్-19 కేసులు నమోదు

బీజేపీ మమ్మల్నిటార్గెట్ చేసింది.. బాల్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు
ముంబై: బీజేపీపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్, థాక్రే బ్రాండ్లను అంతం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కానీ, అలాంటివి జరిగే ప్రసక్తే లేదని నొక్కి చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. థాక్రే బ్రాండ్ అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అది అంత సులభం కాదు. థాక్రే బ్రాండ్ విషయానికి వస్తే నా తాత ప్రభోదంకర్ థాక్రే మహారాష్ట్రపై మొదటి ప్రభావాన్ని చూపారు. ఆయన తర్వాత, బాలాసాహెబ్ థాక్రే, తరువాత నా తండ్రి శ్రీకాంత్ థాక్రే తమదైన ముద్ర వేశారు. అనంతరం, థాక్రే వారుసులమైన నేను, ఉద్దవ్ థాక్రే మా సత్తా ఏంటో చూపించాం అని అన్నారు.ఇదే సమయంలో..‘నేను ఒక ఫోటో చూశాను. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, సునీల్ తత్కరే, అశోక్ చవాన్, నారాయణ్ రాణే, ఛగన్ భుజ్బాల్, ఇతర నాయకుల మధ్యలో కూర్చున్నారు. ఆ ఫోటో చూసినప్పుడు, నేను ఆశ్చర్యపోయాను. బీజేపీ మద్దతుదారులు దానిని ఎలా చూస్తున్నారో ఆలోచించాను?. మేము వారికి అధికారం రాకుండా ఎంతో కష్టపడ్డామని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వారు ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలతో కూర్చున్నారు అని ఆలోచిస్తున్నారు. ఇది వారి మనసులో ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు.అనంతరం, పహల్గాం ఘటనపై స్పందిస్తూ..‘పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు?. పాకిస్తాన్‌తో యుద్ధం అనేది ఒక ఎంపిక కాదు. మనం చేసింది యుద్ధం కూడా కాదు. యుద్ధం గురించి మీకు ఏం తెలుసు?. గాజాను చూడండి, అప్పుడు యుద్ధం ఎలాంటి విధ్వంసం తెస్తుందో మీకు అర్థమవుతుంది. పాకిస్తాన్‌పై మన దాడులు పర్వాలేదు. కానీ, మన 26 మందిని చంపిన ఆ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు? వారు ఇప్పటికీ పరారీలో ఉన్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘భర్తల ప్రాణాల కోసం వేడుకోకుండా.. ఉగ్రవాదులపై తిరగబడాల్సింది’
భివానీ: పహల్గాం ఉగ్ర దాడిపై బీజేపీ నేతల నోటిదురుసు తగ్గడం లేదు. మంత్రుల స్థాయి నేతలే మతిలేని వ్యాఖ్యలు చేసి కోర్టులతో మొట్టికాయలు తింటున్నా కనువిప్పు కలగడం లేదు. పహల్గాం దాడిలో మహిళల కళ్లముందే వారి భర్తలను ముష్కరులు కర్కశంగా కాల్చి చంపడం తెలిసిందే. అలా సర్వం కోల్పోయి వితంతువులుగా మిగదిలిన వారినుద్దేశించి హరియాణాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాంచందర్ జంగ్రా శనివారం దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బీజేపీ ఎంపీ రాంచందర్ జంగ్రా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భర్తలను చంపొద్దని ఉగ్రవాదులను వేడుకునే బదులు వారిపై తిరగబడాల్సింది. కానీ వారిలో యోధుల స్ఫూర్తి లోపించింది. ఉగ్రవాదులకు చేతులు జోడించారు. పర్యాటకులంతా అగ్నివీరుల్లాగా వారిని ప్రతిఘటిస్తే ప్రాణనష్టం బాగా తగ్గేది’ అంటూ కామెంట్స్ చేశారు. రాణీ అహల్యాబాయి మాదిరిగా మన సోదరీమణుల్లో సాహస స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందంటూ హితోక్తులు పలికారు. జంగ్రా వాచాలతపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమంటూ కాంగ్రెస్ నేతలు దీపీందర్‌సింగ్ హుడా, సుప్రియా శ్రీనేత్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు మండిపడ్డారు.महिलाओं का उपहास उड़ाना तो बीजेपी का कर्म और धर्म दोनों बन चुका है।इसी क्रम में भाजपा के सांसद रामचंद्र जांगरा देश के गृहमंत्री की विफलता का ठीकरा शहीदों की पत्नी के सिर फोड़ना चाह रहे हैं।उनका कहना है कि उन महिलाओं को भी साथ में शहीद हो जाना चाहिए था।pic.twitter.com/vL2x97ePQU— Uttar Pradesh Congress Sevadal (@SevadalUTP) May 25, 2025ఇదిలా ఉండగా.. ఇటీవలే భారత సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విజయ్ షా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటువేయాలని కాంగ్రెస్ నేతలు ప్రధానికి విజ్ఞప్తిచేశారు. అనంతరం, జరిగిన పరిణామాల తర్వాత సదరు మంత్రి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. అది ‘భాషా పరమైన తప్పిదమే’ తప్ప ఏ మతాన్నీ కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇండియన్ ఆర్మీకి, సోదరి కర్నల్ సోఫియా ఖురేషీకి, యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు.

24ఏళ్ల తర్వాత ఆ హీరో కోసం రీఎంట్రీ ఇస్తున్న బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పుడు మెల్లిగా సౌత్ ఇండియా పరిశ్రమైపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ టాప్ నటీనటులు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు. అయితే, 24ఏళ్ల క్రితమే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్( Raveena Tandon). మళ్లీ తమిళ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్లో హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటారు. అంతేకాకుండా బెంగాలీ, కన్నడం, తెలుగు భాషల్లోనూ పలు చిత్రాల్లో కథానాయకిగా నటించారు. తమిళంలో అర్జున్‌కు జంటగా సాదు అనే చిత్రంతో 1994లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2001లో కమలహాసన్‌కు జంటగా ఆళవందాన్ "అభయ్" చిత్రంలో నటించారు. కాగా ఇటీవల కాలంలో కన్నడ హీరో యష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో ముఖ్య భూమికను పోషించారు. తెలుగులోనూ అడపా దడపా నటిస్తున్న రవీనా టాండన్ తాజాగా కోలీవుడ్ ప్రేక్షకులను మరోసారి పలకరించడానికి సిద్ధమవుతున్నారు. నటుడు, సాంకేత దర్శకుడు విజయ్ ఆంటోని ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా లాయర్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి జాషువా సేతురామన్ కథా,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. కాగా విజయ్ ఆంటోనీ తన విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఇందులో విజయ్ ఆంటోనికి దీటైన పాత్రలో ఒక ప్రముఖ నటి నటించబోతున్నట్లు దర్శకుడు ఇదివరకే చెప్పారు. కాగా ఆమె ఎవరని చిత్ర వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆమే నటి రవీనా టాండన్. దీని గురించి దర్శకుడు తెలుపుతూ నటి రవీనా టాండన్ 1999లో నటించిన శూల్ చిత్రంలో ఆమె నటన తనకు ఎంతగానో నచ్చిందన్నారు. అలాంటి నటి తమ చిత్రానికి అవసరం అనిపించిందన్నారు. లాయర్ చిత్రంలో రవీనా టాండన్ పాత్ర నటుడు విజయ్ ఆంటోని పాత్రకు దీటుగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఎల్ఐసీ గిన్నిస్ బుక్ రికార్డు..
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అరుదైన ఘనత సాధించింది. 24 గంటల వ్యవధిలో అత్యధిక సంఖ్యలో జీవిత బీమా పాలసీలను విక్రయించినందుకు గిన్నిస్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.‘‘ఈ ఏడాది జనవరి 20న మొత్తం 4,52,839 మంది ఏజెంట్లు 5,88,107 జీవిత బీమా పాలసీలను జారీ చేశారు. తద్వారా గిన్నిస్ రికార్డు సొంతమైంది. ఇది చరిత్రాత్మక విజయం. అంకితభావం గల ఏజెన్సీ నెట్వర్క్ అసాధారణ పనితీరును గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించింది’’ అని వివరించింది.జనవరి 20న ’మ్యాడ్ మిలియన్ డే’ సందర్భంగా ఒక్కో ఏజెంట్ కనీసం ఒక్క పాలసీ అయినా జారీ చేయాలని ఎల్ఐసీ ఎండీ, సీఈఓ సిద్దార్థ మొహంతి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకే గిన్నిస్ఫీట్ను ఎల్ఐసీ సొంతం చేసుకుంది. అరుదైన మైలురాయిని సాధించడం పట్ల కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు మొహంతి కృతజ్ఞతలు తెలిపారు.

మాయమవుతున్న 'వై' క్రోమోజోమ్
మగజాతి ఉనికికి కీలకమైన ‘వై’ క్రోమోజోమ్ క్షీణించిపోతోంది. ఈ పరిస్థితిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భూమ్మీద మగజాతి అంతరించిపోతుందా అనే భయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడే అంత ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకు కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. ‘వై’ క్రోమోజోమ్ క్షీణతపై ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా వైద్య పరిశోధకుల్లో చర్చ జరుగుతోంది. దీనిపై విస్తృత పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఈ ‘వై’ వర్రీ గురించి తెలుసుకుందాం.పురుషుల కంటే మహిళల ఆయుర్దాయం ఎక్కువ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. పురుషుల ఆయుర్దాయం తక్కువగా ఉండటానికి అనేక సామాజిక, శారీరక కారణాలు ఉన్నాయి. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు పురుషుల్లోనే ఎక్కువ. ఇక మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ వారికి రకరకాల ఆరోగ్య పరిస్థితుల నుంచి సహజ రక్షణ కల్పిస్తుంది. మహిళల్లోని ఇరవైమూడు జతల క్రోమోజోమ్లలోనూ రెండేసి ఎక్స్ క్రోమోజోమ్‌లు ఉంటాయి. పురుషుల్లో ఇరవైమూడో జతలో ఒక ‘ఎక్స్’, ఒక ‘వై’ క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ కంటే, రెండు ‘ఎక్స్’ క్రోమోజోమ్‌లు ఉండటం కూడా మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటానికి కారణం అనే అభిప్రాయం కూడా ఉంది. ఇలా చెబుతూ పోతే ఈ జాబితా చాలానే ఉంటుంది. పురుషుల కంటే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటానికి గల కారణాలపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వాస్తవాలు, ఇంకొన్ని అవాస్తవాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పురుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్ క్షీణిస్తున్నట్లుగా ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ‘వై’ క్రోమోజోమ్ పురుషుల అస్తిత్వానికి కీలకమైనది. వయసు పెరిగే కొద్ది పురుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్ తన జన్యుకణాలను కోల్పోతూ ఉంటుంది. ఈ కణాలు కోల్పోయే వేగాన్ని బట్టి వార్ధక్య లక్షణాలు కనిపిస్తాయి. వార్ధక్యంలో వచ్చే వ్యాధులు కూడా చుట్టుముడతాయి. ‘వై’ క్రోమోజోమ్ కణాల క్షీణత ఈ మేరకు మాత్రమే పరిమితమైతే ఏ ఆందోళనా అక్కర్లేదు. ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి కూడా ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే జరిగితే, భూమ్మీద పురుషజాతి అంతరించిపోతుంది. పురుషజాతి పూర్తిగా అంతరించిపోతే, భూమ్మీద మహిళలు మాత్రం ఎంతకాలమని మనుగడ సాగించగలరు? ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోతే, యావత్ మానవాళి కూడా భూమ్మీద అంతరించిపోతుందా? ఇలా ఈ అంశంపై అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ‘వై’ క్రోమోజోమ్ క్షీణత వల్ల ఏర్పడబోయే పరిణామాలపై తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించడానికి, మానవాళి అంతరించిపోయే ముప్పును తప్పించే మార్గాలను కనుగొనడానికి శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నారు. భూమ్మీద మానవుల మనుగడ మొదలైన నాటి నుంచి మానవజాతిలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిలో భాగంగానే పురుషజాతి అస్తిత్వానికి కీలకమైన ‘వై’ క్రోమోజోమ్‌లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనుషుల్లో 23 జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి. వాటిలో ఒక జత లింగనిర్ధారణకు కీలకమైనది. మహిళల్లో ఈ జతలో రెండు ‘ఎక్స్’ క్రోమోజోమ్‌లు, పురుషుల్లో ఒక ‘ఎక్స్’, ఒక ‘వై’ క్రోమోజోమ్ ఉంటాయి. ‘ఎక్స్’ క్రోమోజోమ్‌లోని జన్యుకణాల సంఖ్యతో పోల్చుకుంటే, ‘వై’ క్రోమోజోమ్‌లోని జన్యుకణాల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిణామంపై రకరకాల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాటికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకుందాం.దీనివల్లే పురుషుల్లో వంధ్యత్వం‘వై’ క్రోమోజోమ్ క్షీణత వల్లనే పురుషుల్లో వంధ్యత్వం కలుగుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా – ‘వై’ క్రోమోజోమ్‌లో ఉన్న జన్యు కణాల్లోని ‘అజూస్పెర్మియా ఫ్యాక్టర్’లో (ఏజెడ్‌ఎఫ్) ‘మైక్రో డిలీషన్స్’ రూపంలో చోటు చేసుకునే క్షీణత పురుషుల్లో వంధ్యత్వానికి కారణమవుతోందని కూడా గుర్తించారు. ‘వై’ క్రోమోజోమ్‌లోని ‘ఏజెడ్‌ఎఫ్’ కణాల క్షీణత పురుషుల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణంగా ఉంటోందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సెయింట్ లూయీలోని సెయింట్ ల్యూక్స్ హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణులు జరిపిన పరిశోధనల్లో ‘వై’ క్రోమోజోమ్‌లోని జన్యుకణాల్లో పునస్సంయోగానికి అవకాశాలు తక్కువగా ఉండటం వల్లనే ఇందులోని జన్యువులు క్షీణిస్తున్నాయని వెల్లడైంది. ‘వై’ క్రోమోజోమ్ క్షీణత వల్ల పురుషుల్లో వంధ్యత్వం మాత్రమే కాకుండా, మరిన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని పలు అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. వారు చెబుతున్న ప్రకారం ‘వై’ క్రోమోజోమ్ క్షీణత వల్ల పురుషుల్లో పెరిగే ఆరోగ్య సమస్యలు ఇవీ:∙‘వై’ క్రోమోజోమ్‌లో ఏర్పడే ‘మొజాయిక్ లాస్’ వల్ల పురుషుల్లో గుండె కండరాలు బలహీనపడి గుండెజబ్బులు, నాడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి అల్జీమర్స్ వంటి నాడీ వ్యాధులు, త్వరగా వార్ధక్య లక్షణాలు సంభవిస్తాయని ఎన్ఐహెచ్ పరిశోధనలు చెబుతున్నాయి. పురుషుల శరీరంలోని కణాలు ‘వై’ క్రోమోజోమ్‌ను పూర్తిగా కోల్పోయే పరిస్థితినే ‘మొజాయిక్ లాస్’ అంటారు.∙‘వై’ క్రోమోజోమ్ మొజాయిక్ లాస్ వల్ల శరీరంలోని కండరాల బిగువు సడలిపోవడం, ఎముకల పటుత్వం తగ్గిపోవడం, రోగ నిరోధక కణాలు వేగంగా నశించడం జరిగి అకాల మరణాలు సంభవించే అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని ఎన్ఐహెచ్ పరిశోధకులు చెబుతున్నారు.అంతరించిపోతే జరిగేదేమిటి?‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోయినట్లయితే, మానవులలో మగజాతి అంతరించిపోతుంది. ఇది వెంటనే జరిగే పరిణామం. ఫలితంగా మానవుల పునరుత్పత్తి నిలిచిపోతుంది. ‘వై’ క్రోమోజోమ్‌లో పురుష లక్షణాల అభివృద్ధికి కీలకమైన ‘ఎస్‌ఆర్‌వై’ (సెక్స్ రీజియన్ ఆన్ ది వై) జన్యువు ఉంటుంది. ఇది నశించినట్లయితే, మానవాళికి తీవ్రమైన అనర్థంగానే భావించవచ్చు. అయితే, జీవపరిణామంలో భాగంగా మానవజాతి పునరుత్పాదలోను, పురుషజాతి లింగనిర్ధారణలోను కొత్త మార్పులు సంభవించవచ్చని, ఇలాంటి మార్పులు కొన్ని ఇతర జంతు జాతుల్లో జరగడాన్ని ఇప్పటికే గమనించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవ పరిణామం ఒక నిదానమైన ప్రక్రియ అని, సుదీర్ఘకాలంలో లింగనిర్ధారణకు కీలకమైన కొత్త జన్యువులు పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంటుందని వారు చెబుతున్నారు. మనుషుల జన్యువులలో ఈ స్థాయి మార్పు జరిగితే, మానవజాతి విభిన్నంగా పరిణామం చెందగలదని అంటున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే అంతరించిపోయినవి అంతరించిపోగా ‘వై’ క్రోమోజోమ్‌లో మిగిలిన జన్యువులను కాపాడుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అంతర్జాతీయ వైద్యపరిశోధకులు చెబుతున్నారు. ‘వై’ క్రోమోజోమ్‌లోని జన్యువులలో జరిగే హానికరమైన ఉత్పరివర్తనలను నిరోధించి, కీలకమైన జన్యువులను కాపాడుకోవడానికి అవసరమైతే జన్యుసవరణ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ‘వై’ క్రోమోజోమ్ క్షీణత పురుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, దీనివల్ల కొన్నిరకాల క్యాన్సర్లు, గుండెజబ్బులు సహా పలు వ్యాధులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ‘వై’ క్రోమోజోమ్ క్షీణతను అరికట్టడానికి, ఇందులోని మిగిలిన జన్యువులు అంతరించిపోకుండా ఉండటానికి మరిన్ని పరిశోధనలు విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ఆ ఎలుకల్లో ఏం జరిగిందంటే?రెండు జాతులకు చెందిన ఎలుకల్లో ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోయింది. దాంతోపాటే ‘ఎస్‌ఆర్‌వై’ జన్యువు కూడా అంతరించింది. అయినా వాటి పునరుత్పత్తి నిలిచిపోలేదు. ఇంకా మనుగడ సాగిస్తూనే ఉన్నాయి. అమెరికాలోని మిసోరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ షెరిల్ రోజన్‌ఫీల్డ్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు కొద్ది సంవత్సరాల కిందట జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మనుషులు సహా సమస్త స్తన్యజీవుల్లోను మగ జీవుల లింగ నిర్ధారణకు దోహదపడేది ‘వై’ క్రోమోజోమ్‌లోని ‘ఎస్‌ఆర్‌వై’ జన్యువు. మగ జీవుల్లోని పునరుత్పత్తికి కీలకమైనది ‘వై’ క్రోమోజోమ్, అందులోని ‘ఎస్‌ఆర్‌వై’ జన్యువు ‘వై’ క్రోమోజోమ్ లేకుండానే, జపాన్ తీర ప్రాంతంలో కనిపించే ‘అమామీ స్పైనీ ర్యాట్’, ‘ర్యుక్యు స్పైనీ ర్యాట్’ అనే జాతులకు చెందిన ఎలుకలు మనుగడ సాగించగలుగుతున్నాయి. ఇవి యథాప్రకారం పునరుత్పత్తి కొనసాగించగలుగుతున్నాయి. వీటిలో ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోయినా, లింగ నిర్ధారణకు అవసరమైన ప్రత్యామ్నాయ జన్యు ఉత్పరివర్తనలు జరిగాయని, వాటి ఫలితంగానే ఇవి మనుగడ సాగించగలుగుతున్నాయని ప్రొఫెసర్ షెరిల్ రోజన్‌ఫీల్డ్ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ఎలుకల్లోని ఎక్స్ క్రోమోజోమ్‌లోని ‘ఎస్ఓఎక్స్9’ అనే జన్యువు పురుష లింగనిర్ధారణకు కీలకమైన ‘ఎస్‌ఆర్‌వై’ జన్యువులా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎలుక జాతుల్లో జరిగిన జన్యు ఉత్పరివర్తనల ఫలితంగా వీటిలో విలక్షణమైన లింగనిర్ధారణ వ్యవస్థ ఏర్పడినట్లు వారు కనుగొన్నారు. యూరోప్‌లో కనిపించే ‘మోల్‌వోల్’ అనే ఎలుక జాతిలోనూ ఇదే పరిస్థితిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘మోల్‌వోల్’ జాతి ఎలుకల్లో కూడా ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోయింది. అయినా, ఇవి కూడా మనుగడ సాగించగలుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఇప్పటి వరకు తేలిన ఫలితాల ఆధారంగా ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోయినంత మాత్రాన మనుషుల మనుగడకు ముప్పు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోయిన ఎలుకల్లో మాదిరిగానే మనుషుల్లోనూ ప్రత్యామ్నాయ జన్యు ఉత్పరివర్తనలు జరిగి విలక్షణమైన లింగనిర్ధారణ వ్యవస్థ ఏర్పడవచ్చని భావిస్తున్నారు.పాతికేళ్లుగా పరిశోధనలుమనుషుల్లో ‘వై’ క్రోమోజోమ్ క్షీణతపై దాదాపుగా పాతికేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. వేర్వేరు దేశాల శాస్త్రవేత్తలు ఈ అంశంపై వేర్వేరు అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జెనెటిక్స్ ప్రొఫెసర్ బ్రియాన్ సైక్స్ ‘వై’ క్రోమోజోమ్ క్షీణతపై ‘ఆడమ్స్ కర్స్: ఎ ఫ్యూచర్ వితౌట్ మెన్’ అనే పుస్తకాన్ని 2003లో ప్రచురించారు. మనుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్ జన్యువులు నశిస్తున్న తీరుపై ఆయన విస్తృత పరిశోధనలు జరిపారు. మరో ఐదువేల తరాలు గడిచే నాటికి– అంటే, ఇంకో లక్షా పాతికవేల సంవత్సరాలలోనే మనుషుల్లో ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోగలదని, భవిష్యత్తులో పురుషులు లేని ప్రపంచం ఏర్పడుతుందని ఆయన తన పుస్తకంలో రాశారు. పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుండటానికి ‘వై’ క్రోమోజోమ్ క్షీణతే కారణమని ప్రొఫెసర్ బ్రియాన్ తన పుస్తకంలో వెల్లడించారు. ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా నశించడం వల్ల పురుషులు అంతరించిపోయాక కూడా భూమ్మీద మనుషులు మనుగడ సాగించాలంటే, ఒకే ఒక్క మార్గం ఉంటుందని తెలిపారు. అదేమిటంటే, ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్‌తో మహిళల అండాలను ఫలదీకరించి, ‘ఇన్ విట్రో ఫర్టిలైజేషన్’ (ఐవీఎఫ్) పద్ధతి ద్వారా మాత్రమే మనుషుల్లో పునరుత్పత్తి సాధ్యం కాగలదని అభిప్రాయపడ్డారు. బ్రియాన్ తన పుస్తకంలో వెల్లడించిన అభిప్రాయాలపై ఇప్పటికీ విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు మనుషుల్లో ‘వై’ క్రోమోజోమ్ క్షీణతపై కూడా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, కొందరు పరిశోధకులు ‘వై’ క్రోమోజోమ్ క్షీణత గురించి అనవసరంగా అతిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా నశించినంత మాత్రాన భూమ్మీద మానవాళి మనుగడ పూర్తిగా అంతరించిపోతుందని చెప్పలేమని ఇంకొందరు పరిశోధకులు చెబుతున్నారు. పురుషుల్లో ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా క్షీణించే పరిస్థితి తలెత్తితే, అందుకు ప్రత్యామ్నాయ జన్యు ఉత్పరివర్తనలు కూడా జరుగుతాయని, ఆ ఉత్పరివర్తనలు పునరుత్పత్తిని కొనసాగించగలవని అమెరికన్ జన్యు పరిశోధకులు జె.విల్సన్, జె.ఎం.స్టాలీ, జి.జె.వైకాఫ్ ‘నేచర్’ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో తెలిపారు. ‘వై’ క్రోమోజోమ్ లేకున్నా, ఎలుక జాతులు మనుగడ సాగిస్తున్నట్లుగానే, మనుషులు కూడా మనుగడ సాగించగలరని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘వై’ క్రోమోజోమ్ క్షీణతమానవజాతి మనుగడ మొదలైనప్పుడు పురుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్‌లో 1438 జన్యుకణాలు ఉండేవి. ఇప్పుడు వాటిలోని 1383 జన్యుకణాలు అంతరించిపోయాయి. ఇప్పుడు ‘వై’ క్రోమోజోమ్‌లో మిగిలినవి 55 జన్యుకణాలు మాత్రమే! దాదాపు 30 కోట్ల సంవత్సరాల వ్యవధిలో ఈ క్షీణత సంభవించింది. ఈ లెక్కన సగటున ప్రతి పదిలక్షల సంవత్సరాలకు ‘వై’ క్రోమోజోమ్‌లోని 4.6 జన్యుకణాలు అంతరించిపోతున్నాయి. ఇదే రీతిలో ‘వై’ క్రోమోజోమ్ క్షీణత కొనసాగితే, మరో కోటి సంవత్సరాలలో పూర్తిగా అంతరించిపోతుంది. నిజానికి 16.6 కోట్ల సంవత్సరాల కిందటి వరకు ‘ఎక్స్’ క్రోమోజోమ్‌లోను, ‘వై’ క్రోమోజోమ్‌లోను జన్యువులు సరిసమానంగా ఉండేవి. పరిణామక్రమంలో ‘వై’ క్రోమోజోమ్‌లో జన్యువులు క్రమంగా కనుమరుగవడం మొదలైంది. ప్రస్తుతం ‘వై’ క్రోమోజోమ్‌లో 55 జన్యువులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మానవజాతి మనుగడ మొదలైన తర్వాత గడచిన కోట్లాది సంవత్సరాలలో జరిగిన ఉత్పరివర్తనల పర్యవసానంగా ‘వై’ క్రోమోజోమ్‌లోని జన్యుకణాలు ప్రస్తుత స్థితికి క్షీణించాయి.
పదో తరగతి తర్వాత
క్రిమినల్... కిడ్నాపర్స్
ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్
సంతప్తకుడు పంచప్రేతాలు
ఈ వారం కథ: పూలమ్మి
మన ముచ్చట: పుస్తకానికి గుడి
హోండా నుంచి రెండు కొత్త బైకులు
మాయమవుతున్న 'వై' క్రోమోజోమ్
బీజేపీ మమ్మల్నిటార్గెట్ చేసింది.. బాల్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు
ఎల్ఐసీ గిన్నిస్ బుక్ రికార్డు..
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రైతు బిడ్డలు
ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)
గంట సేపు సముద్రం చీలుతుంది
ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
రాజ్యాంగం, 'సుప్రీం' మధ్య విడదీయరాని బంధం - సీజేఐ జస్టీస్ బీఆర్ గవాయ్
భారత్‌కు అండగా ఉంటాం
కూటమి పార్టీలకు ఓటేసినందుకు మాదీ అదే పరిస్థితి
గరుడన్ తెలుగు రీమేకె 'భైరవం'.. ఏ ఓటీటీలో ఉందంటే
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, జెన్నీఫర్‌ల రొమాంటిక్ సాంగ్ విడుదల
తండ్రైన కిరణ్ అబ్బవరం.. క్యూట్ పిక్ షేర్ చేసిన హీరో
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పవన్ కళ్యాణ్
ఏఐ వ్యవస్థలు రూపొందించి వాటివల్లే ఉద్యోగాలు కోల్పోతున్న టెక్ సంస్థల సిబ్బంది
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
హైదరాబాద్ మెట్రో రెండో దశ.. స్టేషన్లు ఇవే
ముగ్గెట్టా పోసేది..?!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పదో తరగతి తర్వాత
క్రిమినల్... కిడ్నాపర్స్
ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్
సంతప్తకుడు పంచప్రేతాలు
ఈ వారం కథ: పూలమ్మి
మన ముచ్చట: పుస్తకానికి గుడి
హోండా నుంచి రెండు కొత్త బైకులు
మాయమవుతున్న 'వై' క్రోమోజోమ్
బీజేపీ మమ్మల్నిటార్గెట్ చేసింది.. బాల్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు
ఎల్ఐసీ గిన్నిస్ బుక్ రికార్డు..
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రైతు బిడ్డలు
గంట సేపు సముద్రం చీలుతుంది
ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
రాజ్యాంగం, 'సుప్రీం' మధ్య విడదీయరాని బంధం - సీజేఐ జస్టీస్ బీఆర్ గవాయ్
భారత్‌కు అండగా ఉంటాం
కూటమి పార్టీలకు ఓటేసినందుకు మాదీ అదే పరిస్థితి
గరుడన్ తెలుగు రీమేకె 'భైరవం'.. ఏ ఓటీటీలో ఉందంటే
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, జెన్నీఫర్‌ల రొమాంటిక్ సాంగ్ విడుదల
తండ్రైన కిరణ్ అబ్బవరం.. క్యూట్ పిక్ షేర్ చేసిన హీరో
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పవన్ కళ్యాణ్
ఏఐ వ్యవస్థలు రూపొందించి వాటివల్లే ఉద్యోగాలు కోల్పోతున్న టెక్ సంస్థల సిబ్బంది
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
హైదరాబాద్ మెట్రో రెండో దశ.. స్టేషన్లు ఇవే
ముగ్గెట్టా పోసేది..?!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పారిపోండ్రోయ్..!!
సినిమా

మన ఊరి కథ అనేలా...
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, ఇ.రామ శంకర్ నిర్మించారు. జూన్ 6న ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్స్ సంస్థ విడుదల చేస్తోంది. తేజ కూనూరు సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘జిందగీ బిలాలే...’ అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్‌ని నటుడు ప్రియదర్శి రిలీజ్ చేసి, మాట్లాడుతూ–‘‘బద్మాషులు’ టీజర్ వినోదాత్మకంగా ఉంది.‘జిందగీ బిలాలే...’పాటని చరణ్ అర్జున్, విహ చక్కగాపాడారు. ఈ సినిమా చక్కని విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఇది మన ఊరి కథ అనేలా ఈ సినిమాలోనిపాత్రలు సహజంగా ఉంటాయి. ప్రేక్షకులను ఫుల్లుగా నవ్వించాలనే ఉద్దేశంతో శంకర్ చేగూరి ఈ సినిమాని తెరకెక్కించారు’’ అని యూనిట్ పేర్కొంది.

అనంతపురంలో హారర్ కామెడీ
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తాజా షెడ్యూల్ అనంతపురంలో ముగిసినట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘ఇండో–కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతోన్న చిత్రం ‘వీటీ 15’. అనంతపురంలో థ్రిల్లింగ్ సన్నివేశాలతోపాటు పంచ్ హ్యూమర్‌తో కూడిన సీన్స్ షూట్ చేశాం. వరుణ్ తేజ్, రితికా నాయక్‌పై పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. మా చిత్రం తర్వాతి షెడ్యూల్ కొరియాలో ప్రారంభం అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

ఇది సినిమా కాదు... ఒక జీవితం: అడివి శేష్
‘‘అనగనగా’ చిత్రంలో వ్యాస్పాత్రను సుమంత్‌గారు అంత బాగా చేయడానికి కారణం ఆయన నిజ జీవితంలోనూ అలానే ఉంటారు. సన్నీ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. ఓటీటీలో ఈ సినిమా చూస్తున్నంత సేపూ థియేటర్లో చూడాల్సిన సినిమా కదా అనిపించింది’’ అన్నారు అడివి శేష్. సుమంత్ కుమార్, కాజల్ చౌదరి జంటగా సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా’. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో ఈ నెల 15న విడుదలైంది.ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కి అతిథిగా హాజరైన అడివి శేష్ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో రామ్‌పాత్ర కంటతడి పెట్టించింది. విద్యా వ్యవస్థ మారాలని కోరుకునేలా చేయించింది. ఇది సినిమా కాదు..ఒక జీవితం’’ అన్నారు. సుమంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మేము అనుకున్న దానికంటే అద్భుతమైన ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమాకి వస్తున్న స్పందన చూసి ఇప్పుడు థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సినీ ప్రపంచానికి నన్ను, మా టీమ్‌ను పరిచయం చేసిన చిత్రం ఇది’’ అన్నారు సన్నీ సంజయ్. ‘‘ఇంత పెద్ద సక్సెస్ సుమంత్‌గారి వల్లే సాధ్యమైంది’’ అని రాకేశ్ రెడ్డి గడ్డం తెలిపారు. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడారు.

ఆలియా అరంగేట్రం అదిరిందయ్యా
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిశారు హీరోయిన్ ఆలియా భట్. నిజానికి ఈ చిత్రోత్సవాల తొలి రోజు (మే 13)నే ఆలియా ఈ వేడుకలకు హాజరు కావాల్సింది. అయితే వెళ్లలేదు. దీంతో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా –పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆలియా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కాలేదనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లోని ‘లవ్ అండ్ వార్’ (రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు) సినిమా చిత్రీకరణతో బిజీగా ఉండటం వల్లే ఆలియా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి రోజున వెళ్లలేదట.ఫైనల్‌గా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చివర్లో ఆమె రెడ్ కార్పెట్‌పై మెరిశారు. అయితే ఆలియా భట్ ధరించిన కాస్ట్యూమ్స్‌పై భిన్నాబీప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2017లో 70వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటి మల్లికా షెరావత్ ధరించిన కాస్ట్యూమ్ డిజైన్‌నే ఆలియా అనుకరించారని కొందరు నెటిజన్లు, ఫ్యాషన్ లవర్స్పోలికలు పెట్టారు. అయితే ఆలియా ఎంట్రీ అదిరిందని, చాలా క్యూట్‌గా కనిపించారనే ప్రశంసలూ ఆమెకు దక్కాయి.ఇక కెల్లీ రిచర్డ్స్ డైరెక్షన్‌లోని ‘ది మాస్టర్ మైండ్’ సినిమాను ప్రదర్శించగా, ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఫ్రాన్స్‌లో పవర్ కట్స్ కారణంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చివరి రోజు వేడుకల నిర్వహణకు ఇబ్బందులు ఎదరయ్యాయని, అయినా నిర్వాహకులు అనుకున్నప్లాన్ పరంగానే ఉత్సవాలు పూర్తయ్యేలా సన్నాహాలు చేశారనే వార్తలు వస్తున్నాయి.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

నోరిస్‌కు పోల్ పొజిషన్
మొనాకో: ఫార్ములా వన్ సీజన్ తొమ్మిదో రేసు మొనాకో గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ క్రమంలో నోరిస్ ట్రాక్ రికార్డును తిరగరాశాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో నోరిస్ 1 నిమిషం 9.954 సెకన్లలో ల్యాప్‌ను పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. 2019లో లూయిస్ హామిల్టన్ టైమింగ్‌ను తాజాగా నోరిస్ అధిగమించాడు. ఈ సీజన్ ఆరంభ ఆ్రస్టేలియా గ్రాండ్ ప్రి తర్వాత నోరిస్‌కు ఇదే తొలి పోల్ పొజిషన్. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు.గతేడాది ఈ రేసులో విజేతగా నిలిచిన స్థానిక డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 నిమిషం 10.063 సెకన్లు; ఫెరారీ) రెండో స్థానం దక్కించుకోగా... మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (1 నిమిషం 10.063 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయిన ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 10.382 సెకన్లు) నాలుగో స్థానంలో నిలవగా... డిఫెండింగ్ చాంపియన్, రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 నిమిషం 10.669 సెకన్లు) ఐదో ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతుండగా... ఎనిమిది రేసులు ముగిసేసరికి డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పియాస్ట్రి 146 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లాండోనోరిస్ 133 పాయింట్లతో రెండో ప్లేస్‌లో కొనసాగుతుండగా... నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ (124 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు.

ఇంగ్లండ్ ఘన విజయం
నాటింగ్‌హామ్: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు సొంతగడ్డపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అదరగొట్టింది. జింబాబ్వేతో 22 ఏళ్ల తర్వాత ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా... జింబాబ్వే ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరు 30/2తో శనివారం మూడో రోజు ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే చివరకు 59 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (82 బంతుల్లో 88; 16 ఫోర్లు), సికందర్ రజా (68 బంతుల్లో 60; 10 ఫోర్లు) అర్ధ శతకాలతో పోరాడారు. ఈ జంట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మెరుగ్గా కనిపించిన జింబాబ్వే... ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకునేలా అనిపించినా... ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు పంపి జింబాబ్వే ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ జంట మూడో వికెట్‌కు 122 పరుగులు జోడించింది. బెన్ కరన్ (37), వెస్లీ మధెవెరె (31) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ ఇర్విన్ (2), బెనెట్ (1), తఫద్జా (4), బ్లెస్సింగ్ ముజర్బానీ (4) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 6 వికెట్లతో సత్తా చాటాడు. అంతకు ముందు ఇంగ్లండ్ 565/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 265 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన బషీర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

శ్రీకాంత్ ఎట్టకేలకు ఫైనల్‌కు...
కౌలాలంపూర్: భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ నాలుగేళ్ల తర్వాత టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 21–18, 24–22తో ప్రపంచ 23వ ర్యాంకర్ యుషి తనాకా (జపాన్)పై తుదికంటా పోరాడి గెలిచాడు. ప్రతీ గేమ్‌లోనూ జపనీస్ ప్రత్యర్థి నుంచి కఠినమైన సవాళ్లు ఎదురైనా... ఏ దశలోనూ పట్టుసడలించని భారత స్టార్ వరుస గేముల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. ‘చాలా అనందంగా ఉంది. గతేడాది ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. ఈ ఫలితం కోసం ఎంతగానో శ్రమించాను’ అని శ్రీకాంత్ అన్నాడు. 32 ఏళ్ల ఈ షట్లర్ చివరిసారిగా 2021లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరి రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీల విషయానికొస్తే అతను ఆరేళ్ల తర్వాత టైటిల్ పోరుకు అర్హత సాధించినట్లయింది. 2019లో జరిగిన ఇండియా ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్ వెటరన్ స్టార్ రన్నరప్‌గా నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ చైనాకు చెందిన రెండో సీడ్ లీ షి ఫెంగ్‌తో తలపడతాడు.

‘శుబ్’ సమయం మొదలు
భారత టెస్టు క్రికెట్‌కు కొత్త నాయకుడు వచ్చాడు...నాలుగున్నరేళ్ల కెరీర్ అనుభవం ఉన్న శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు... 93 ఏళ్ల భారత టెస్టు చరిత్రలో 37వ సారథిగా గిల్ బాధ్యతలు చేపడుతున్నాడు...గత కొంత కాలంగా చర్చ సాగినట్లుగా ఎలాంటి అనూహ్య నిర్ణయాలు లేకుండా సెలక్టర్లు 25 ఏళ్ల గిల్‌కే మద్దతు పలికారు... ఇంగ్లండ్ పర్యటనలో అతను తొలిసారి టెస్టు జట్టును నడిపించనున్నాడు. టెస్టు జట్టులో సాయిసుదర్శన్, అర్ష్ దీప్ లకు తొలి అవకాశం లభించగా...ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్ నాయర్ మళ్లీ టీమ్‌లోకి రావడం విశేషం. ముంబై: ఇంగ్లండ్‌తో గడ్డపై జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. 18 మంది సభ్యుల ఈ బృందానికి శుబ్‌మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ దక్కింది. ఆసీస్‌తో సిరీస్‌లో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించినా...అతని ఫిట్నెస్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్సీ కోసం బుమ్రా పేరును పరిశీలించలేదు. కోహ్లి, రోహిత్, అశ్విన్‌ల శకం ముగిసిన తర్వాత భవిష్యత్తు కోసం టీమ్‌ను సిద్ధం చేసే కోణంలో జట్టు ఎంపిక జరిగింది. 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్ పాల్గొనే తొలి సిరీస్ ఇదే కానుంది. భారత జట్టు చివరిసారిగా ఆ్రస్టేలియాలో ఆడిన టెస్టు సిరీస్‌తో పోలిస్తే జట్టులో ఐదు మార్పులు జరిగాయి. కోహ్లి, రోహిత్, అశ్విన్ రిటైర్ కాగా...రెండు టెస్టులు ఆడిన పేసర్ హర్షిత్ రాణా, ఒక్క మ్యాచ్ కూడా ఆడని బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానం కోల్పోయారు. వీరి స్థానాల్లో కరుణ్ నాయర్, సాయిసుదర్శన్, అర్ష్ దీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత... 33 ఏళ్ల కరుణ్ నాయర్ తన కెరీర్లో 6 టెస్టులు ఆడాడు. తన మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై 303 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అతను...సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత మరో 3 టెస్టులు మాత్రమే ఆడి జట్టులో 2017లో జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో 9 మ్యాచ్‌లలో 863 పరుగులు సాధించి రేసులోకి వచ్చాడు. కోహ్లి రిటైర్మెంట్తో మిడిలార్డర్లో ఖాళీ ఏర్పడి మరో అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్లో, భారత్ ‘ఎ’ తరఫున టన్నుల కొద్దీ పరుగులు చేసి అభిమన్యు ఈశ్వరన్‌కు మరోసారి పిలుపు లభించింది. ఇక ఇప్పటికీ వన్డేలు, టి20లు ఆడిన పేసర్ అర్ష్ దీప్ సింగ్, సాయి సుదర్శన్‌కు టెస్టుల్లో ఇదే తొలి అవకాశం. షమీ అవుట్... సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి ఊహించినట్లుగానే చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత వన్డేలు, టి20లు ఆడినా...టెస్టు మ్యాచ్‌లకు తగిన స్థాయిలో అతని ఫిట్నెస్ లేదని సెలక్టర్లు తేల్చారు. కివీస్‌తో సిరీస్‌లో చివరి రెండు టెస్టుల్లో విఫలమై మళ్లీ మ్యాచ్ అవకాశం దక్కని సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా పక్కన పెట్టారు. ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు ఆడిన హర్షిత్ రాణాను కూడా ఎంపిక చేయలేదు. ‘కోహ్లి, రోహిత్, అశ్విన్‌లాంటి ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం కష్టం. అయితే కొత్తగా జట్టులోకి వచ్చే వారికి తమ సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. ఫిట్నెస్ సమస్యల కారణంగా బుమ్రా అన్నీ టెస్టులూ ఆడతాడనే నమ్మకం లేదు. అందుకే కెప్టెన్సీ భారం లేకుండా అతను బౌలర్‌గా మాకు అందుబాటులో ఉంటే చాలు. ఈ విషయాన్ని బుమ్రా కూడా అర్థం చేసుకున్నాడు. గిల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న విషయాన్ని గమనించాం. చాలా మంది అభిప్రాయాలు కూడా విన్నాం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే కెప్టెన్, జట్టును ఎంపిక చేశాం. ప్రస్తుత స్థితిలో సర్ఫరాజ్‌తో పోలిస్తే అనుభవజ్ఞుడైన కరుణ్ సరైనవాడు అనిపించింది’ అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించారు. భారత జట్టు వివరాలు గిల్ (కెప్టెన్ ), పంత్ (వైస్ కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, జురేల్, జడేజా, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిధ్, సుదర్శన్, ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, సుందర్, శార్దుల్, అర్ష్ దీప్ భారత జట్టు విజేతగా నిలిచిన 2020–21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో శుబ్‌మన్ గిల్ టెస్టుల్లోకి అడుగు పెట్టాడు. 91 పరుగులతో చారిత్రాత్మక గాబా టెస్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత టెస్టు టీమ్‌లో గిల్ రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. భారత జట్టు ఆడిన రెండు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లలో గిల్ ఆడాడు. 32 టెస్టుల కెరీర్లో గిల్ 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.స్వదేశంలో ప్రదర్శనతో పోలిస్తే విదేశీ గడ్డపై అతని రికార్డు పేలవంగా ఉన్నా...మంచి ప్రతిభావంతుడైన బ్యాటర్‌గా మున్ముందు సత్తా చాటగలడని సెలక్టర్లు నమ్ముతున్నారు. భారత అండర్–19 జట్టు తరఫున ఆడినా అతను కెపె్టన్‌గా ఎప్పుడు వ్యవహరించలేదు. రంజీ ట్రోఫీలో కూడా పంజాబ్‌కు ఒకే ఒక మ్యాచ్‌లో సారథ్యం వహించాడు. అయితే భారత్‌కు 5 టి20 మ్యాచ్‌లలో కెప్టెన్ గా పని చేసిన అనుభవం గిల్‌కు ఉంది. రెండు సీజన్లుగా ఐపీఎల్లో గుజరాత్ జట్టును నడిపిస్తున్నాడు.
బిజినెస్

ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై కేంద్రం ప్రకటన
2024 - 25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ రేటును ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సిఫార్సు చేశాయి.ఈపీఎఫ్ వడ్డీ రేటు.. దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా జీతం పొందే చందాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. 2023-24 సంవత్సరానికి అందించే రేటునే.. ఈ ఏడాది కూడా కొనసాగించారు. 2022-23 సంవత్సరంలో ఈ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉండేది.ఈపీఎఫ్‌వోలోకి 14.58 లక్షల సభ్యులుఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో 14.58 లక్షల మంది సభ్యులు మార్చిలో చేరారు. వీరిలో సగం మంది (7.54 లక్షల మంది) కొత్త సభ్యులే కావడం గమనార్హం. అంటే మొదటివారి వీరు ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చారు. సంఘటిత రంగంలో పెరిగిన ఉపాధి అవకాశాలను ఇది ప్రతిఫలిస్తోంది. క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 1 శాతం ఎక్కువ మంది చేరినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా 2 శాతం వృద్ధి కనిపించింది. ఈ మేరకు మార్చి నెల పేరోల్ గణాంకాలు విడుదలయ్యాయి.పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..మిస్డ్‌కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 9966044425 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈ నెంబర్‌కు కాల్ చేయగానే ఆటోమేటిక్‌గా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎమ్ఎస్ రూపంలో వస్తుంది.ఇదీ చదవండి: ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీపీఎఫ్ బ్యాలెన్స్ మీకు ఎస్ఎమ్ఎస్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు రావాలంటే.. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. అంతే కాకుండా మీ నెంబర్ UANకు లింక్ అయి ఉండాలి. కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలి. ఇవన్నీ పూర్తి చేసి ఉంటేనే మీరు పీఎఫ్ బ్యాలెన్సును మెసేజ్ రూపంలో తెలుసుకోగలరు. 7738299899 నెంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు.

ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీ
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి.. కొత్త టోల్ పాలసీపై కసరత్తు చేస్తోంది. టోల్ ప్లాజా గుండా వెళ్లిన ప్రతిసారీ టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఏడాదికి ఒకేసారి చెల్లించే విధంగా ప్లాన్ చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఏడాదికి ఒకేసారి 3000 రూపాయలు టోల్ ఫీజు(యాన్యువల్ ప్యాకేజీ)ను చెల్లించడం ద్వారా.. డ్రైవర్లు/వాహనదారులు ఏడాది పొడవునా అన్ని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, స్టేట్ ఎక్స్‌ప్రెస్‌వేలలో అపరిమిత దూరం ప్రయాణించవచ్చు. ప్రతి టోల్ గేటు దగ్గర టోల్ ఫీజును ప్రత్యేకించి చెల్లించాల్సిన అవసరం లేదు.యాన్యువల్ ప్యాకేజీ కోసం.. వాహనదారులకు లేదా డ్రైవర్లకు అదనపు డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న ఫాస్ట్‌ట్యాగ్(FASTag)ను రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే జీవితకాల ఫాస్ట్‌ట్యాగ్ ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. ఈ విధానం కింద రూ. 30,000 చెల్లిస్తే.. 15 సంవత్సరాలు రోడ్డుపై అపరిమిత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. దీనిని ప్రభుత్వం అమలుచేసే అవకాశం లేదు.ఇదీ చదవండి: కారు కొనడానికి హెలికాఫ్టర్‌లో వచ్చిన బిజినెస్ మ్యాన్ - వీడియోవార్షిక ప్యాకేజ్ మాత్రమే కాకుండా డిస్టెన్స్ బేస్డ్ ప్రైస్ విధానం కూడా అందుబాటులోకి రానుంది. ఈ డిస్టెన్స్ బేస్డ్ ప్రైస్ విధానంలో 100 కిలోమీటర్ల దూరానికి రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది.

బలపడిన ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మార్చి త్రైమాసికంలో రూ.26 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 138 శాతం పెరిగింది. ఆదాయం 35 శాతం పెరిగి రూ.726 కోట్లకు చేరింది. డిజిటల్ బ్యాంక్‌గా తమ స్థానం మరింత బలపడినట్టు పేర్కొంది.గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లాభం 81 శాతం పెరిగి రూ.63 కోట్లకు చేరగా, ఆదాయం 47 శాతం వృద్ధితో రూ.2,709 కోట్లుగా నమోదైంది. కస్టమర్ అకౌంట్ బ్యాలన్స్లు రూ.3,659 కోట్లకు చేరినట్టు.. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 31 శాతం పెరిగినట్టు ప్రకటించింది.సురక్షితమైన రెండో ఖాతాను స్వీకరించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్టు.. డిజిటల్ చెల్లింపులకు ప్రత్యామ్నాయ బ్యాంక్ ఖాతాకు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో అనుబ్రత బిశ్వాస్ తెలిపారు.

X Outage: ఎక్స్ సేవల్లో అంతరాయం
ప్రపంచ కుబేరుడు.. టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ఆధీనంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్, ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 5:30 గంటల నుంచి యూజర్లు సమస్యలను నివేదిస్తూనే ఉన్నారు. లాగిన్ అవ్వడంలో, టైమ్‌లైన్‌లను యాక్సెస్ చేయడంలో మాత్రమే కాకుండా ట్వీట్స్ చేయడంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.ట్రాకింగ్ సర్వీస్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. 2,100 కంటే ఎక్కువ మంది యూజర్లు సమస్యలను నివేదించారు. కంపెనీ ప్రస్తుతానికి ఈ సమస్యకు కారణం ఏమిటనే విషయాన్ని వెల్లడించలేదు.శుక్రవారం కూడా భారతదేశంతో పాటు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. డేటా సెంటర్లో ఏర్పడిన టెక్నికల్ సమస్య కారణంగా.. అంతరాయం ఏర్పడిందని ఎక్స్ ఇంజినీర్లు వెల్లడించారు. అయితే ఈ రోజు అంతరాయం కలగడానికి కారణం ఏమిటనే విషయం తెలియాల్సి ఉంది.
ఫ్యామిలీ

Pressure Cooker: వీటిని అస్సలు కుక్ చేయెద్దు!
ప్రెజర్ కుకర్ ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. వంటకు ప్రెజర్ కుకర్‌ను ఉపయోగించని వారుండరు. అయితే ఈ ఐదు వస్తువులను ప్రెజర్ కుకర్‌లో ఎప్పుడూ ఉడికించకూడదని పరిశోధకులు చెబుతున్నారు. పాలు మరిగించరాదు పాలు, క్రీమ్ వంటి పాల ఉత్పత్తులను ప్రెజర్ కుకర్‌లో అస్సలు వండకూడదు. ఇలా చేయడం వల్ల వాటి రుచి చెడిపోతుంది. పోషకాలు కూడా తగ్గుతాయి. ఇలా కుకర్‌లో కాచిన పాలు ఆరోగ్యానికి హాని కరం.పాలు వేడి చేయడం సులభం అయినా సరే కొంతమందిపాలను కుకర్‌లో వేడి చేస్తున్నారు. పైగాపాలను వేడి చేసేందుకు స్పెషల్ కుకర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అయినా సరే ఇలా వేడి చేసిన పాలు ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు.ఇదీ చదవండి: ఆటో డ్రైవర్‌గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్ నెం.1 లగ్జరీ కారువేయించిన పదార్థాలుఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు వంటి వేయించాల్సిన ఆహార పదార్థాలను కుక్కర్లో వండకూడదు. వేయించిన వీటిని ప్రెజర్ కుకర్‌లో ఆవిరి మీద ఉడికిస్తే కరకరలాడే అనుభూతిని ఇవ్వదు. ఎందుకంటే వీటిని కుక్కర్లో డీప్ ఫ్రై చేయలేరు.ఇలా చేయడం వల్ల వాటికి మంచి రుచి రాదు. అందుకే వీటిని ఎప్పుడూ కుకర్‌లో తయారు చేసుకోవద్దు. అంతేకాదు అధిక నూనెతో వంటలు చేయడం వలన పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. ఎందుకంటే కుకర్ సీల్, భద్రతా విధానాలు అధిక ఉష్ణోగ్రత ప్రతిచర్యలను తట్టుకోలేవు.చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుందిపాస్తా , నూడుల్స్ పాస్తా, నూడుల్స్ త్వరగా ఉడికించవచ్చు. ఇవి ఉడికిన తర్వాత మెత్తగా అవుతాయి. కనుక వీటిని ఎప్పుడూ ప్రెజర్ కుకర్‌లో ఉడికించకూడదు. అవి ఎక్కువగా ఉడికితే.. మెత్తం పేస్ట్‌లా మారతాయి. అందువల్ల వీటిని ప్రెజర్ కుకర్‌లో ఉడికించవద్దు.ఆకుకూరలుపాలకూర, కాలే వంటి ఆకుకూరలను కుకర్‌లో ఎప్పుడూ ఉడికించకూడదు. ఎందుకంటే ఆకుకూరల్లో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అయితే ప్రెజర్ కుకర్‌లో వీటిని ఉడికించడం వల్ల ముఖ్యమైన పోషక పదార్థాలు తగ్గుతాయి. ఇది ఆరోగ్యానికి హానికరం.కేక్ప్రెజర్ కుకర్‌లో కేక్ కాల్చడం సరైనది కాదు. తరచుగా ప్రజలు ఓవెన్ లేకపోతే ప్రెషర్ కుక్కర్లో కేక్‌ని తయారు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం పూర్తిగా తప్పు ఎందుకంటే ప్రెషర్ కుకర్ అనేది వంట కోసం తయారు చేయబడింది. బేకింగ్ కోసం కాదు. కనుక కుకర్‌లో కేక్ ఎప్పుడూ కాల్చకూడదు.

Schizophrenia చికిత్సతో సరిచేయవచ్చు!
మానవాళి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో మానసిక రుగ్మతలు ఇప్పటికీ అలక్ష్యానికి గురవుతున్నాయి. శారీరక వ్యాధులతో పోలిస్తే, స్కిజోఫ్రెనియా (Schizophrenia) వంటి మానసిక సమస్యల గుర్తింపు, చికిత్సలో సమాజం వెనుకబడి ఉంది. అందుకే ఈ వ్యాధి గురించి ప్రజల్లో చైతన్యం పెంచడం, బాధితుల పట్ల సానుభూతి చూపడం, అపోహలు తొలగించడం వంటి ప్రధాన ఉద్దేశాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 24న ‘స్కిజోఫ్రెనియా అవగాహన దినో త్సవం’ జరుపుకొంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, ప్రపంచంలో 0.3–0.7% మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. సుమారు 1 కోటి మంది స్కిజోఫ్రెనియాతో జీవిస్తున్నట్టు అంచనా. ఈ వ్యాధిగ్రస్థులు తరచుగా భ్రమలకు లోనవు తారు. ఉదాహరణకు తనను ఎవరో హత్య చేయాలనుకుంటు న్నారని భావిస్తూ భయపడుతుంటారు. అలాగే వారికి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నట్లు, ఏవో దృశ్యాలు కనిపిస్తు న్నట్లు ఉంటుంది. సంభాషణలో అస్పష్టత ఉంటుంది.బంధువుల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించడం, హఠాత్తుగా కోపగించుకోవడం, చికాకుపడడం, నిరాశకు లోనవ్వడం వీరి ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధికి స్పష్టమైన ఒకే కారణం లేకపోయినా... జన్యుపరమైన సున్నితత్వం, మెదడులో రసాయన అసమ తుల్యత, బాల్యంలో జరిగిన మానసిక గాయాలు, మత్తు పదార్థాల వినియోగం వంటి అంశాలు ఉమ్మడిగా ప్రభా వితం చేస్తాయి. మందులు (యాంటీ సైకోటిక్స్) వాడితే భ్రమలు వంటివి తగ్గుతాయి. ఆలోచనలను సమతుల్యం చేయడానికి తగిన మానసిక చికిత్స అందించాలి.కుటుంబం ఓర్పు, ప్రేమతో నిలబడటం బాధితుల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. స్కిజోఫ్రెనియా బాధితులు ప్రమాదకరమనీ, వారికి సాధారణ జీవితం సాధ్యం కాదనీ చెప్పే మాటలు నిజం కాదు. చికిత్స అందిస్తే వారూ మన లాగే జీవిస్తారు. – డా.బి. హర్షిణి (ఎమ్డీ, సైకియాట్రీ), ఫాదర్స్ ముల్లర్స్ మెడికల్ సైన్సెస్, మంగళూరు (నేడు ప్రపంచ స్కిజోఫ్రెనియా అవగాహన దినోత్సవం)

మెడికల్ టూరిజంలో ముందంజలో మనం
ఇవాళ ‘మెడికల్ టూరిజం’ (వైద్య పర్యాటకం) వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడానికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేషెంట్లు వివిధ వ్యాధులకు అత్యున్నత చికిత్స పొందడానికీ వాహకంగా నిలుస్తోంది. ఈ రంగంలో భారత్ పైపైకి దూసు కుపోతుండటం మనందరికీ గర్వకారణం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్’ (టీటీడీఐ)– 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 119 దేశాల్లో మన భారతదేశం 39వ స్థానంలో ఉంది. అదే 2001లో మనం54వ స్థానంలో ఉన్నాం. కీలకమైన అంశాల్లో భారత్ అద్భుతంగా రాణిస్తోంది. ఉదాహరణకు మిగతావారి కంటే మంచి ధరకువైద్య సేవలు అందించడంలో 18వ స్థానం, విమాన రవాణా సామర్థ్యంలో 26వ స్థానం, అలాగే ఉపరితల రవాణాతో పాటు నౌకారవాణాలో 25వ స్థానంలో ఉంది. అందుకే ఈ ఏడాది నాటికి మెడికల్ టూరిజమ్‌లో భారత్‌లో మరో 12% పెరుగుదల నమోదవు తుందని అంచనా. ఈ రంగంలో ప్రస్తుతం ఫ్రాన్స్ అగ్రస్థానంలోఉంది. పేషెంట్స్‌కు ఇవాళ చాలా ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. వాళ్లు ఏదైనా మెడికల్ టూరిజమ్ తాలూకు గమ్యాన్నిఎంపిక చేసుకోవాలంటే... అక్కడున్న ఆరోగ్య మౌలిక సదుపా యాలు, తేలిగ్గా చేరేందుకు అవసరమైన ప్రయాణ సౌకర్యాలు, తమ ప్రాంతానికీ, అక్కడికీ సాంస్కృతికంగా ఉన్న పోలికలూ, అక్కడ దొరికే వైద్యసదుపాయాల నాణ్యత, అక్కడి వైద్యుల విద్యార్హతలూ – నైపుణ్యాలూ, అంతర్జాతీయ థర్డ్ పార్టీ ద్వారా వాళ్లకు లభించిన ప్రశంసలూ కితాబులూ (అక్రెడిటేషన్స్), తాము వాళ్లతో ఎంత తేలిగ్గా సంభాషించడం సాధ్యమవుతుంది వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 2020-2021 మధ్యకాలంలో అంతర్జాతీయంగా/ప్రపంచవ్యాప్తంగా 46 ప్రాంతాలు అత్యద్భుతమైన మెడికల్ టూరిజమ్ గమ్యస్థానాలుగా ప్రఖ్యాతి పొందాయి. అనేక అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకింగ్‌లు ఇవ్వడం జరిగింది. మన భారతదేశం... ఆసియా ఖండంలోనే అత్యుత్తమమైన మెడికల్ టూరిజమ్ డెస్టినేషన్స్‌లో ఒకటిగా ప్రశస్తి పొందింది. మనం ఆరో స్థానంలో నిలిచాం. సౌకర్యాల నాణ్యతలోనే కాదు... విభిన్నమైన అనేక సేవలూ అందించగల మనే ప్రఖ్యాతి పొందాం. మన మెడికల్ వీసా విధానం ఎంత అత్యుత్తమైనదంటే... ఓ పేషెంట్‌తో పాటు అతడి సహాయకులూ (అటెండెంట్స్) దాదాపు 60 రోజులకు పైబడి ఇక్కడ అత్యంత సౌకర్యవంతంగా ఉండిపోయి సేవలందుకునేంత ఉత్తమమైన గమ్యస్థానంగా పేరొందడమన్నది అంతర్జాతీయంగా అన్ని దేశాల పేషెంట్స్నూ ఆకర్షిస్తోంది. ‘గ్లోబల్ హెల్త్‌కేర్ అక్రెడిటేషన్ (జీహెచ్ఏ) వంటివి... భారతదేశాన్ని పేషెంట్ల పాలిట ఓ సురక్షిత మైన, నాణ్యమైన, సాంస్కృతికంగా ఉత్తమమైన సేవలందించే, భాషాపరంగా కూడా ఇబ్బందులు లేని మెడికల్ టూరిజమ్ గమ్య స్థానంగా సిఫార్సు చేస్తున్నాయి. భారతదేశంలో అనేక ఆస్పత్రులు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలందిస్తున్నాయి. అనేక మంది సందర్శించే నగరాల్లో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. మనం అనేక రకాల వైద్యసేవలందించేలా సుశిక్షితులమై ఉన్నాం. ఉదాహరణకు జబ్బుపడకముందే నివారించగల సేవలు (ప్రివెంటివ్ మెడిసిన్) వంటివాటినీ అంది స్తున్నాం. ఎన్నో వ్యాధులకు చికిత్స నివ్వగల నిపుణులమంటూ గర్వంగా ప్రకటించుకో గలిగేంత పటిష్ఠమైన స్థానంలో ఉన్నాం. వైద్య సేవల కోసం నేడు అనేక ఆఫ్రికన్ దేశాలూ, పశ్చిమ ఆసియా, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్)తో పాటు... యూరప్‌లోని పలు దేశాలు, ఉత్తర అమెరికా నుంచి కూడా ఇవాళ భారత్‌ను... మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ను పలువురు పేషెంట్లు సందర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంక్లిష్టమైన సర్జరీలు, సంతాన సాఫల్య చికిత్సలు, క్యాన్సర్ థెరపీలు, సౌందర్యసాధనాల ఉత్పా దనల రవాణా వంటివి మెడికల్ టూరిజమ్ రంగాన్ని మరింతముందుకు నడిపే అంశాలు. దాంతోపాటు గణనీయమైన ప్రైవేటు పెట్టుబడులు, అలాగే అనుకూలమైన ప్రభుత్వ విధానాల వంటి వాటితో ఇంకాస్త మెరుగుదల సాధ్యమవుతుంది. దీన్ని సుసాధ్యం చేసేలా బడ్జెట్లో ఈ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు చేయాలి. వీసా విధానాలను సులభతరం చేయాలి. తద్వారా మన ‘హీల్ ఇన్ఇండియా’ నినాదానికి ఓ ఉద్యమరూపం కల్పించవచ్చు. మన హైదరాబాద్ విషయానికి వస్తే... ఇప్పటికే ఈ నగరం వైద్య పర్యాటక రంగంలో ప్రపంచవ్యాప్త గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది. కానీ అంతర్జాతీయంగా వైద్య సేవలను కోరుకుంటున్న కొన్ని దేశాలతో నేరుగా విమానయాన సర్వీసులు లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకి అయ్యింది. వైద్యసేవలు ఇక్కడ చాలా చవగ్గా దొరుకుతుండటమూ, ఇంగ్లిష్‌లో సంభాషించగలిగినవారు ఉండ టమూ, కాస్మోపాలిటన్ సంస్కృతి, సురక్షితమైన భద్రత వంటివి ఇక్కడి సానుకూల అంశాల్లో కొన్ని. అయితే ఈ పరిశ్రమలో రిఫరల్ ఫీజుల వంటి అనేక అనైతిక అంశాల వల్ల, అలాగే ఈ రంగంలోని మధ్యవర్తుల కారణంగా కొన్ని నిందలూ, అపవాదులు వినాల్సి రావడం ఓ దురదృష్టకరమైన అంశం. ఇక్కడికి వచ్చే విదేశీయుల్లో కొందరికి ఇంగ్లిష్ రాకపోవడం వల్ల ఇక్కడి మధ్యవర్తులు (దుబాసీలు) దోపిడీ చేస్తుండటమూ గర్హనీయమైన మరో అంశం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఓ మంచి హెల్త్ టూరిజమ్ డెస్టినే షన్‌గా వృద్ధి చెందాలంటే... విదేశీ పేషెంట్స్‌కు అవసరమైన అనువాదకులను ఏర్పాటు చేయడం, వారు ఏ విధంగానూ దోపిడీకి గురి కాకుండా చూసే ప్రత్యేక రక్షణ వ్యవస్థను సృష్టించడం, వారి సంస్కృతికి తగ్గట్లుగా ఆహారాలు, పానీయాలు అందేలా చేయడం, వారి మత ఆచారాలూ, విధానాలకు తగ్గట్లుగా ప్రార్థనా సౌకర్యాలు కల్పించడం, వారు ఖర్చు చేసే ప్రతి పైసాకూ తగిన ప్రతిఫలం అందేలా చూడటం అవసరం. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఓ మంచి వైద్యుడిగా,వైద్య సేవలు అదించే బృందాలకు నేతృత్వం వహిస్తున్నవాడిగా, ఇక్కడా, అలాగే అమెరికాలో కూడా సంపాదించిన అనుభవంతో చెప్పొచ్చేదేమిటంటే... మెడికల్ టూరిజమ్ రంగంలో మనం ప్రపంచంలోనే అందరూ కోరుకునే ఆదర్శ వనరులతో ఓ అద్భుతమైన గమ్యంగా ఉన్నాం. ఈ వేల కోట్ల డాలర్ల పరిశ్రమలో హైదరా బాద్నూ, మన రాష్ట్రాలనూ అగ్రస్థానంలో ఉంచడానికి కృషి చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వినమ్రపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. డా. గురుఎన్రెడ్డి వ్యాసకర్త కాంటినెంటల్ హాస్పిటల్స్ స్థాపకుడు–చైర్మన్

ఆటో డ్రైవర్‌గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్ నెం.1 లగ్జరీ కారు
కలలను సాకారం చేసుకోవాలంటే..కలలు కంటూ కూర్చుంటే సరిపోదు.. నాకేదీ కలసి రావడం లేదంటూ నిట్టూరిస్తే కుదరదు. కష్టాలను, కన్నీటి సుడిగుండాలను దాటాలి. అడ్డంకులెన్నెదురైనా ఛేదించాలి, అవరోధాలను అధిగమించాలి, ఆలోచనలకు పదునుపెట్టాలి. అదే విజయానికి బాటలు వేస్తోంది. ఆటో డ్రైవర్ నుండి రూ.800 కోట్ల వ్యాపారవేత్త వరకూ ఎదిగిన సత్యశంకర్ స్ఫూర్తిదాయక కథ గురించి తెలిస్తే.. ఎలాంటి వారికైనా ఉత్సాహ రాకమానదు.దృఢ సంకల్పం, అంకితభావం ఉంటే అత్యంత అసాధ్యమైన కలలను కూడా నిజం చేసుకోవచ్చు అనడానికి ఒక చక్కని ఉదాహరణ.కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్లారేలో ఒక పేద గ్రామ పూజారి నలుగురు కుమారులలో మూడవవాడు సత్య శంకర్. పేదరికం కారణంగా 12వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ చేతిలో ఉండటంతో, కేంద్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకం కింద రుణం తీసుకుని ఆటోరిక్షా కొన్నాడు. ఆటో-రిక్షా డ్రైవర్‌గా టెక్ సిటీ ఉత్సాహం సత్యాన్ని కూడా ఆవిరించిందో ఏమో గానీ వ్యాపారవేత్తగా మారాలన్న ఆలోచనకు మరింత పదును పెరిగింది. 1980లలో ఆటో-రిక్షా డ్రైవర్‌గా బెంగళూరులోని ట్రాఫిక్ సాగరంలో మునిగి తేలుతూ వీధుల్లో పయనించేవాడు. కష్టపడి ఆటో అప్పు తీర్చేశాడు. దానిని అమ్మి అంబాసిడర్ కారు కొన్నాడు. ఈ ఉత్సాహంతో జీవితాన్ని మెరుగు పరచు కోవాలనే కల సాకారం వైపు అడుగులు వేశాడు. తరువాత కొన్ని రోజులు ఆటోమోటివ్ గ్యారేజ్ వ్యాపారంలోకి ప్రవేశించి టైర్లు అమ్మడం ప్రారంభించాడు. ఆటోమొబైల్ దుకాణాన్ని నడుపు తున్నప్పుడు అతను ఫైనాన్స్ నిర్వహణలోసూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కస్టమర్లు విడిభాగాలను అప్పుకింద కొనుగోలు చేసి, తరువాత వాయిదాలలో చెల్లించేవారు. అతను ఆ అనుభవాన్ని ఉపయోగించి ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. 1994లో, అతను ప్రవీణ్ క్యాపిటల్‌ను ప్రారంభించి, తక్కువ వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చాడు. ప్రవీణ్ క్యాపిటల్‌ను ప్రత్యేకంగా నిలిపిన విషయం ఏమిటంటే, అది కొత్త వాహనాలను మాత్రమే కాకుండా, సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయడానికి రుణాలు అందించింది.ఆ తరువాత మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2000లో పుత్తూరు సమీపంలోని నరిమోగేరులో ‘బిందు’ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీని ప్రారంభించాడు. గ్రామీణులకు ఉద్యాగాల కల్పన, శుభ్రమైన నీరు అందించడమే లక్ష్యం. రెండేళ్లకు శంకర్ ఒక ప్రత్యేకమైన రుచితో కార్బోనేటేడ్ డ్రింక్‌తో వ్యాపారంలోకి దిగాడు. స్నేహితులతో ఉత్తర భారతదేశ పర్యటనలో అతను చూసిన సోడా అమ్మే దుకాణమే దీనికి నాంది. జీరా, ఉప్పు మిశ్రమంతో సోడా కలిపితే మంచి ప్రొడక్ట్ అవుతుంది, లాభాలొస్తాయని ఊహించాడు. అంతే 2002లో తన సొంత కంపెనీ ఎస్జీ కార్పొరేట్స్ను స్థాపించాడు. తొలుత “బిందు జీర మసాలా సోడా”ను మార్కెట్లోకి వదిలాడు. కాలం గడిచే కొద్దీ, బిందు జీర మసాలా సోడా ప్రజాదరణ పొందింది. ఇలా ఎస్జీ కంపెనీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , స్నాక్స్ 55 ఉత్పత్తులను విక్రయిస్తుంది. బెంగళూరు దాటి కర్ణాటక అంతటా, అంతకు మించి వినియోగదారులను ఆకర్షించింది. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. ఇక వెనుదిరిగి చూసింది లేదు. దాదాపు 20 ఏళ్ల కష్టం సత్యానికి గొప్ప సక్సెస్‌ను అందించింది.ఇదీ చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు ఈ విజయం అంత తేలిగ్గా రాలేదు. సత్యశంకర్ కె స్థాపించిన ఎస్జీ గ్రూప్ బహుళ రంగాల వ్యాపారంగా ఎదిగింది. ఆహారం, పానీయాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఆటో ఫైనాన్స్, సేంద్రీయ వ్యవసాయం,పండ్ల ప్రాసెసింగ్ లాంటి రంగాల్లో విలువైన సేవలు అందించింది. ఫలితంగా ఎస్జీ గ్రూపు వార్షిక టర్నోవర్ దాదాపు రూ. 800 కోట్లు. ఇదీ చదవండి : కాన్స్‌లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్తోఅంతేనా ఆటో రిక్షాతో ప్రారంభమైన సత్య జీవితం ఇప్పుడు రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIIIదాకా చేరింది. దీని ధర రూ. 11 కోట్లకు పై మాటే. మరో విశేషం ఏమిటంటే సత్యశంకర్ కోసంప్రత్యేకంగా తయారు చేయబడిందన్న ఘనతను కూడా దక్కించుకున్నాడు. బెంగళూరు వీధుల్లో ఆటో నడపడం నుండి రోల్స్ రాయిస్ వరకు, అతని కథ నిజంగా ఆశ, ధైర్యం ,విజయంతో కూడుకున్నది. ఆలోచనలకు, ఆవిష్కరణ హద్దులు లేవన్న స్ఫూర్తికి నిదర్శనం.
ఫొటోలు
అంతర్జాతీయం

‘రాజీనామా చేస్తానని ఆయన చెప్పలేదే!’
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus) వైదొలుగుతారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ మేరకు యూనస్ మంత్రివర్గ సలహాదారు శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ‘‘బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనసే కొనసాగుతారు. ఆయనేం రాజీనామా చేస్తానని చెప్పలేదు కదా. ఆ వార్తలు కేవలం అసత్య ప్రచారాలే’’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని ఇంగ్లీష్ మీడియా హౌజ్‌లు తాజాగా కథనాలు ఇచ్చాయి. ఇదే విషయాన్ని నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) చీఫ్ నహిద్ ఇస్లామ్ సైతం ధృవీకరించడంతో ఆయన పదవి నుంచి దిగిపోవడం ఖాయమనే చర్చ నడిచింది.మరోవైపు.. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌కి యూనస్ ప్రభుత్వానికి పొసగడం లేదు. సైనిక వ్యవహరాల్లో యూనస్ నిర్ణయాలు తీసుకోవడంపై వకార్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. 2026 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ ప్రకటన చేయగా.. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని వకార్ పట్టుబడుతున్నారు.

ఉగ్రవాదుల వేటకు భారత్-నేపాల్ సంయుక్త ఆపరేషన్
న్యూఢిల్లీ: భారత్-నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుల్లో అనుమానిత పాకిస్తానీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందిన దరిమిలా ఇరు దేశాలు సంయుక్తంగా పెట్రోలింగ్ ఆపరేషన్లు నిర్వహించాయి. పాకిస్తానీ ఉగ్రవాదులను(Pakistani terrorists) గుర్తించేందుకు నేపాలీ దళాలతో కలిసి ఎస్ఎస్బీ అధికారులు భారత-నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించారని ఇండియా టుడే పేర్కొంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం భారతదేశ సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ),నేపాల్‌కు చెందిన సాయుధ పోలీసు దళం (ఏపీఎఫ్)లు సరిహద్దుల్లోని దట్టమైన అడవులలో సంయుక్తంగా గాలింపు చేపట్టాయని సమాచారం. భారత్-నేపాల్ 1,700 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఎస్ఎస్బీ కమాండెంట్ గంగా సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాము జరిపిన ఉమ్మడి పెట్రోలింగ్(Joint patrolling)లో నేపాల్ సైనికులు ఉగ్రవాదంపై పోరాటానికి తమతో సహకరించారని అన్నారు. నేపాలీ సైనిక దళాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, ప్రతి నెలా రెండు దేశాల సరిహద్దు దళాల సమన్వయ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. నేపాల్ సైనికాధికారులు తమ నిఘా సమాచారాన్ని భారత్‌తో పంచుకున్నారని, తాము కూడా వారితో సమాచారాన్ని షేర్ చేసుకున్నామన్నారు.నేపాల్‌గంజ్ ప్రాంతంలో ఒక మర్కాజ్ (ఇస్లామిక్ సంస్థ) ఉందని, అక్కడనిర్వహించే కార్యక్రమాలకు పాకిస్తానీలు తరచూ వచ్చేవారని సింగ్ తెలిపారు. ఎస్ఎస్బీ దళాలు నేపాల్ సరిహద్దుల్లో వాచ్ టవర్ల నుండి నిఘా సారించాయని చెప్పారు. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో నేపాల్ ప్రభుత్వం భారత్‌కు సంఘీభావం ప్రకటించింది. నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ‘ఉగ్రవాదంపై పోరాటంలో నేపాల్ అందరితో కలిసి పనిచేస్తుందని’ పేర్కొన్నారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతిచెందగా, వారిలో ఒక నేపాలీ జాతీయుడు కూడా ఉన్నారు.ఇది కూడా చదవండి: ఉగ్రవాదానికి 20 వేలమంది భారతీయులు బలి: ఐక్యరాజ్యసమితిలో భారత్

ఉగ్రవాదానికి 20 వేలమంది భారతీయులు బలి: ఐక్యరాజ్యసమితిలో భారత్
న్యూఢిల్లీ: గడచిన నాలుగు దశాబ్ధాలలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడులకు 20 వేల మందికిపైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి(United Nations)లో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన దరిమిలా పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నదని ఐక్యరాజ్య సమితిలో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూయార్క్లోగల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన సభలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్(Pakistan) ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్నదని, అది సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విరమించే వరకూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిలో ఈ ఒప్పంద అంశాన్ని లేవనెత్తిన తర్వాత భారత్ ఘాటుగా స్పందించింది. #IndiaAtUNPR @AmbHarishP delivered India’s statement at the Arria Formula Meeting on Protecting Water in Armed Conflict – Protecting Civilian Lives. @MEAIndia @UN pic.twitter.com/SV0wzzW5XS— India at UN, NY (@IndiaUNNewYork) May 23, 202565 ఏళ్ల క్రితం భారత్ సింధు జలాల ఒప్పందంపై చిత్తశుద్ధితో సంతకం చేసిందని, అయితే పాకిస్తాన్ భారత్‌పై మూడు యుద్ధాలు జరిపి, లెక్కకుమించిన ఉగ్రవాద దాడులను చేయడం ద్వారా ఆ ఒప్పందపు స్ఫూర్తిని ఉల్లంఘించిందని హరీష్ పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాలలో 20 వేల మందికి పైగా భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం ఎల్లప్పుడూ పాకిస్తాన్ విషయంలో అసాధారణ సహనం, ఉదారతను ప్రదర్శించిందని హరీష్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: తోటి సైనికుని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం

Brothers Day: నాన్న తరువాత..
ప్రేమికుల దినోత్సవం, స్నేహితులు దినోత్సవం మాదిరిగానే అన్నదమ్ముల దినోత్సవం(Brother's Day) ఉందనే సంగతి మీకు తెలుసా? అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏ కుటుంబంలోనైనా అన్నదమ్ములే ఇంటిని చక్కదిద్దేవారుగా నిలుస్తుంటారు. వీరి అనుబంధం చక్కగా ఉన్నప్పుడే వారి కుటుంబానికి సమాజంలో మంచిపేరు వస్తుంది. ఈ రోజు మే 24.. జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ఈ సందర్భంగా ఈ రోజుకున్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం.భారతదేశంలో అనుబంధాలకు ఎంతో ప్రాముఖ్యత కనిపిస్తుంది. వాటిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. అన్న, తమ్ముడు ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తుంటారు. అన్నదమ్ముల దినోత్సవాన్ని తొలుత తొలుత అలబామాకు చెందిన ఓ సిరామిక్ కళాకారుడు, సి డేనియల్ రోడ్స్ జరుపుకున్నారని చెబుతారు. 2005 నుంచి ప్రతి సంవత్సరం మే 24న ఈ బ్రదర్స్ డేని చేసుకుంటున్నారు. మొదట్లో దీనిని అమెరికాలో మాత్రమే జరుపుకునేవారు. తర్వాత ప్రపంచమంతటా జరుపుకోవడం ప్రారంభించారు. కొన్ని దేశాలలో అయితే ఈ రోజున అధికారిక సెలవుదినం(Holiday)గానూ ప్రకటించారు.అన్న అంటే ఓ బాధ్యత. నాన్న తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సింది ఆయనే. అదే విధంగా తమ్ముడు కూడా బాధ్యతగానే మెలుగుతాడు. ఇక అమ్మాయిలైతే తమ బ్రదర్స్‌ను తమకు సెక్యూరిటీ కల్పించేవారిగా భావిస్తుంటారు. రక్త సంబంధం లేకపోయినా ఆత్మీయంగా ఇతరులను సోదర భావంతో చూసుకునే ప్రత్యేకమైన రోజు ఇది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా తమ ప్రియమైన సోదరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈరోజున తమ అన్నదమ్ములకు నచ్చిన వంటకాలను చేయడంతో పాటు వారికి నచ్చిన వస్తువులను కానుకలుగా అందజేస్తుంటారు. కొన్ని దేశాల్లో అన్నదమ్ముల దినోత్సవం నాడు సోదరులతో రోజంతా సరదాగా గడపడం, వారితో కలిసి టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్లడంలాంటివి చేస్తుంటారు.ఇది కూడా చదవండి: తోటి సైనికుని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం
జాతీయం

మెట్రో విస్తరణకు నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ, ప్రాంతీయ రింగ్‌రోడ్డు, రింగ్ రైలు తదితర ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేందుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లిన అంశాలు హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2 మెట్రో రైలు ఫేజ్–1లో 69 కిలోమీటర్ల నిడివితో మూడు కారిడార్లు ఉన్నాయి. నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రోను తక్షణం విస్తరించాల్సిన అవసరం ఉంది. ఫేజ్–2 కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించాం. ఇందులో 76.4 కిలోమీటర్ల నిడివితో 5 కారిడార్లు ఉంటాయి. కేంద్రం, రాష్ట్రం కలిసి చేపట్టాల్సిన ఈ జాయింట్ వెంచర్ మొత్తం ఖర్చు రూ.24,269 కోట్లు. ఇందులో కేంద్రం వాటా 18 శాతం (రూ.4,230 కోట్లు).రాష్ట్ర వాటా 30 శాతం (రూ.7,313 కోట్లు). రుణం 48 శాతం (రూ.11,693 కోట్లు). 2024 అక్టోబర్‌లో చెన్నై మెట్రో ఫేజ్–2కు రూ.63,246 కోట్లు, 2021 ఏప్రిల్‌లో బెంగళూరు మెట్రో ఫేజ్–2 కు రూ.14,788 కోట్లు, 2024 ఆగస్టులో బెంగళూరు మెట్రో ఫేజ్–3కి రూ.15,611 కోట్లు కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2పై కేంద్రం కొన్ని వివరణలు కోరగా, వాటికి సమాధానాలిచ్చాం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలి. ప్రాంతీయ రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులతో కలిపి ప్రాంతీయ రింగు రోడ్డును (ఆర్ఆర్ఆర్)ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి – నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – భువనగిరి – చౌటుప్పల్ మధ్య 161వ నంబర్ జాతీయ రహదారి ఉండగా.. దక్షిణ భాగం చౌటుప్పల్ – ఆమన్‌గల్ – షాద్‌నగర్ – సంగారెడ్డి మధ్య ఎన్‌హెచ్ 65 ఉంది. ఉత్తర భాగం కోసం భూసేకరణ ప్రక్రియ 2022లో ప్రారంభమైంది.90 శాతం భూముల ప్రపోజల్స్ ఎన్హెచ్ఏఐకి పంపించాం. ఎన్హెచ్ఏఐ టెండర్లు కూడా పిలిచింది. అయితే, ఈ భాగానికి అవసరమైన ఆర్థిక, కేబినెట్ ఆమోదం ఇవ్వాలి. దక్షిణ భాగాన్ని కూడా ఉత్తర భాగంతోపాటే చేపట్టాలి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పూర్తయిన తర్వాత దక్షిణ భాగం నిర్మాణం చేపడితే భూ సేకరణ, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల రెండు భాగాలను కలిపి ఒకేసారి పూర్తి చేయాలి. ఉత్తరభాగంలాగే దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రింగ్ రైల్వే ప్రాజెక్టు.. గ్రీన్‌ఫీల్డ్ హైవే రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా 370 కి.మీ. పరిధిలో రైల్వే లైన్ ప్రతిపాదించాం. ఇది రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశలో మార్గం చూపుతుంది. బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే మంజూరు చేయండి. దేశం మొత్తం ఔషధాలలో తెలంగాణే 35 శాతం ఉత్పత్తి చేస్తోంది. బందరు పోర్ట్ – డ్రైపోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే సరుకు రవాణా ఖర్చు తగ్గించడంతో పాటు ఎగుమతులకు దన్నుగా నిలుస్తుంది. ఈ మార్గం తయారీ రంగానికి ప్రోత్సాహకంగా ఉండడంతో పాటు నూతన ఉద్యోగాలను సృష్టిస్తుంది. సెమీకండక్టర్ రంగానికి మద్దతివ్వండి ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తోంది. హైదరాబాద్‌లో ఏఎండీ, క్వాల్‌కాం, ఎన్విడియా వంటి ఆర్అండ్డీ కేంద్రాలు ఉన్నాయి. పరిశ్రమలకు స్థలాలు, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఐఎస్ఎం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. అది పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించి ఉద్యోగాలు సృష్టిస్తుంది. 2030 నాటికి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యానికి తోడ్పడుతుంది. రక్షణరంగ ప్రాజెక్టులకు తోడ్పాటునివ్వండి హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో, ఎంఎస్ఎంఈల్లో ఉన్న రక్షణరంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వండి. హైదరాబాద్‌లోని డీఆర్డీఓ, డిఫెన్స్ పీఎస్‌యూ లు ఉన్నత స్థాయిలో పని చేస్తున్నాయి. వాటి పరిధిలో వె య్యికి పైగా ఎంఎస్ఎంఈలు, స్థానిక, అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలకు విడి భాగాలు తయారు చేస్తున్నాయి. లాక్‌హీడ్ మారి్టన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్, హనీవెల్ వంటి సంస్థలు హైదరాబాద్‌పై ఆసక్తి చూపుతున్నాయి. రక్షణ రంగంలోని జేవీలు, ఆఫ్సెట్లకు కేంద్ర ఆర్డర్లు తక్షణ అవసరం. వీటికి ఆమోదం తెలిపేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలి. హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్ రక్షణ రంగానికి సంబంధించి ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రోత్సాహం ఉంది కానీ హైదరాబాద్‌కు లేదు. ఆయా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు కేంద్రం మద్దతు ఇవ్వాలి. రక్షణ రంగ పరికరాల తయారీలో ముందున్న హైదరాబాద్‌లో డిఫెన్స్ ఎక్స్పో నిర్వహించాలి.మరో 800 ఎలక్ట్రిక్ బస్సులివ్వండి కేంద్రమంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు మరో 800 ఎలక్ట్రిక్ బ స్సులు కేటాయించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రితో సీఎం శనివారం భేటీ అయ్యారు. ఇటీవల హైదరాబాద్‌కు రెండువేల ఈవీ బస్సులు కేటాయించారని, ప్రస్తుత నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద అదనంగా 800 బస్సులు కేటాయించాలని కోరారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లు బస్సు నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సుకు చేపట్టిన రెట్రోఫిట్టెడ్ సఫలమైందని, ఆ బస్సు నగరంలో రాకపోకలు సాగిస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్మెంట్ అవకాశం కల్పించాలని సీఎం కోరారు.

విమానాల కిటికీలు మూయండి!
న్యూఢిల్లీ: కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో రక్షణశాఖ పరిధిలోని విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే ప్రైవేట్ విమానాల, చార్టర్, ప్రైవేట్ జెట్ నిర్వహణ సంస్థలు కచ్చితంగా తమ విమానాల కిటికీలను మూసే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. డిఫెన్స్ స్థావరాలు, విమానాశ్రయాల పూర్తి వివరాలు బహిర్గతం కావొద్దనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కిటికీల నుంచి ఫొటోలు, వీడియోలు తీయకుండా నివారించే ఉద్దేశ్యంతో కిటికీలను మూసే ఉంచాలని, కిటికీల షేడ్స్ తొలగించకూడదని ప్రైవేట్ విమానయాన సంస్థలకు డీజీసీఏ పంపిన ఉత్తర్వులో స్పష్టంచేసింది. మొత్తంగా 32 ఎయిర్‌పోర్ట్‌లలో ఈ నిబంధనను అమలుచేయనున్నట్లు తెలుస్తోంది. లేహ్, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, ఆదంపూర్, చండీగఢ్, బఠిండా, జైసల్మేర్, నాల్, జో«ద్పుర్, హిండన్, ఆగ్రా, కాన్పూర్, బరేలీ, మహారాజ్‌పూర్, గోరఖ్‌పూర్, భుజ్, లొహెగావ్, డాబోలిమ్(గోవా), విశాఖపట్నంలోని విమానాశ్రయాలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సి ఉంది. ఆర్మీ, నేవీ విమానాల రాకపోకలతోపాటు సాధారణ ప్రయాణికుల విమానాల రాకపోకలు సాగించే ఎయిర్‌పోర్ట్‌లలో ముఖ్యంగా ఈ నిబంధనను అమలుచేయనున్నారు. అక్కడి నుంచి రాకపోకలు సాగించే ప్రైవేట్ విమానాలు, చార్టర్, ప్రైవేట్ జెట్లలో ప్రయాణించే వాళ్లు కిటికీల గుండా కెమెరా, స్మార్ట్ఫోన్లతో ఎయిర్‌బేస్‌ల ఫొటోలు, వీడియోలు తీసే ఆస్కారముందని గ్రహించి ప్రభుత్వం కొత్తగా పలు పశ్చిమ తీర ఎయిర్‌పోర్టుల్లో ఈ నిబంధనను అమల్లోకి తెస్తోంది. విమానం టేకాఫ్ అయ్యాక 10,000 అడుగుల ఎత్తుకు వెళ్లేదాకా విండో షేడ్స్ తొలగించకూడదు. 10,000 అడుగుల కంటే ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు విమానం ల్యాండింగ్‌కు సిద్ధమైతే ఆ ఎత్తులో విండో షేడ్స్ తెరుచుకోవచ్చు. కానీ ల్యాండింగ్ కోసం 10,000 అడుగుల దిగువకు దిగిరాగానే మళ్లీ విండో షేడ్స్‌ను మూసేయాల్సిందే. ఎమర్జెన్సీ కిటీకీలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. విండోషేడ్స్ తెరిచి ఫొటోలు, వీడియోలు తీసే ప్రయాణికులు తగు పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని వారికి తెలియజేయాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ సూచించింది. సాధారణంగా ఏదైనా ప్రయాణికుల విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో అగ్నిప్రమాదం లాంటివి ఏమైనా జరిగితే అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు వీలుగా విండోషీట్స్ను తెరచే ఉంచుతారు.

రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్
చైబాసా: కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీకి పరువు నష్టం కేసులో జార్ఖండ్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26వ తేదీన స్వయంగా న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ రాహుల్ లాయర్ చేసిన వినతిని తోసిపుచ్చింది. 2018లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో అప్పటి బీజేపీ చీఫ్ అమిత్ షాకు వ్యతిరేకంగా రాహుల్..‘హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైతం బీజేపీ అధ్యక్షుడవుతారు’అంటూ వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్ గాంధీ బీజేపీ కార్యకర్తలందరి మనోభావాలను దెబ్బతీశారంటూ ఆ పార్టీ నేత ప్రతాప్ కటియార్ చైబాసాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ/ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానానికి ఈ పిటిషన్ బదిలీ అయ్యింది. విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ రాహుల్ గాం«దీకి పలుమార్లు సమన్లు పంపారు. వీటిని ఆయన పట్టించుకోకపోవడంతో బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. దీంతో, రాహుల్ స్టే కోసం జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను 2024 మార్చిలో న్యాయస్థానం కొట్టివేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను సైతం చైబాసా కోర్టు తిరస్కరించింది. తాజాగా, మరింత కఠినమైన నాన్ బెయిలబుల్ వారెంట్లు పంపింది.

మనమంతా టీమిండియా
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలను ‘టీమిండియా’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అవి కలసికట్టుగా పని చేస్తే ఏ అభివృద్ధి లక్ష్యమూ అసాధ్యం కాబోదని ధీమా వెలిబుచ్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 10వ భేటీకి ఆయన సారథ్యం వహించారు. వికసిత భారత్–2047 థీమ్‌తో భేటీ సాగింది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు భేటీలో పాల్గొన్నట్టు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు. పశ్చిమబెంగాల్, బిహార్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు పాల్గొనలేదని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం ఏర్పాటయ్యేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. పహల్గాం ఉగ్ర దాడి లక్ష్యాల్లో జమ్మూకశీ్మర్‌లో పర్యాటకాన్ని దెబ్బ తీయడం కూడా ఉన్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి నగరం, ప్రతి రాష్ట్రమూ ప్రగతి సాధించడమే మన లక్ష్యం కావాలి. అప్పుడు దేశమంతా దానంతటదే వృద్ధి చెందుతుంది. గడువు లోపలే వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ దిశగా అభివృద్ధి పనుల వేగం మరింత పెంచుదాం. 140 కోట్ల పైచిలుకు భారతీయుల ఆకాంక్షలను నెరవేరుద్దాం’’ అని రాష్ట్రాలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత్‌లో పట్టణీకరణ శరవేగంగా సాగుతోందని గుర్తు చేశారు. కనుక నగరాలను సుస్థిరాభివృద్ధి, ఇన్నోవేషన్ల కలబోతగా, భవిష్యత్ అవసరాలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ‘‘మహిళా శక్తికి మరింత ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే మనమంతా ఆశించిన విధంగా దేశప్రగతి సాధ్యపడుతుంది. శ్రామిక శక్తిలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలి. అందుకు అనుగుణంగా చట్టాలు, విధానాలను రూపొందించుకోవాలి’’ అని మోదీ చెప్పారు.కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం: సీఎంలుకేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని తమిళనాడు, పంజాబ్ ముఖ్యమంత్రులు ఎం.కె.స్టాలిన్, భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇస్తామని మాటిచ్చారు. కానీ 33.16 శాతమే ఇస్తున్నారు. తమిళనాడు దేశంలోకెల్లా అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రం. అమృత్ 2.0 పథకం కింద రాష్ట్రానికి ప్రత్యేక పట్టణీకరణ మిషన్‌ను మంజూరు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. నమామి గంగ తరహాలో తమిళనాడులోని కావేరీ, వైగే తదితర నదుల ప్రక్షాళనకు ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయాలి’’ అని స్టాలిన్ కోరారు. ఆ ప్రాజెక్టులకు పేర్లను ఇంగ్లిష్‌లోనే పెట్టాలన్నారు. పంజాబ్‌లో పాకిస్తాన్‌ను ఆనుకుని ఉండే ఆరు సరిహద్దు జిల్లాలకు ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీ అందించాలని కేంద్రానికి మాన్ విజ్ఞప్తి చేశారు. సరిహద్దు ప్రాంతాల రైతులకు ఇస్తున్న ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని రూ.30 వేలకు పెంచాలన్నారు. సిక్కిం, పశ్చిమబెంగాల్లోని సిలిగురిలను కలుపుతూ ప్రపంచస్థాయి జాతీయ రహదారి నిర్మించాల్సిన అవసరం చాలా ఉందని సిక్కిం సీఎం ప్రేంసింగ్ తమాంగ్ అన్నారు.విధాన అడ్డంకులు తొలగించాలన్నారు: సీఈఓ భేటీ వివరాలను నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. ‘‘వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై మరింతగా దృష్టి సారించాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. పెట్టుబడులను మరింతగా ఆకర్షించాలని, తద్వారా ఇతోధికంగా ఉపాధి అవకాశాలను సృష్టించాలని, అందుకోసం విధానపరమైన అడ్డంకులను తొలగించుకోవాలని హితవు పలికారు’’ అని చెప్పారు. భేటీలో పాల్గొన్న సీఎంలు, నేతలు ఆపరేషన్ సిందూర్‌ను ముక్తకంఠంతో సమరి్థంచారన్నారు. జైరాంతో కాంగ్రెస్‌కే చేటు: బీజేపీ నీతి ఆయోగ్ ఓ ‘అయోగ్య’ (అసమర్థ) సంస్థ అన్న కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్‌కే చేటు చేసే వివాదాలను సృష్టించడం ఆయన నైజమని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ను జైరాం భూస్థాపితం చేయడం ఖాయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ జోస్యం చెప్పారు.నవ్వుల్ పువ్వుల్ ఆయోగ్ భేటీలో సరదా సన్నివేశాలు ప్రధాని, ముఖ్యమంత్రుల నడుమ పలు సరదా సన్నివేశాలకు నీతి ఆయోగ్ భేటీ వేదికైంది. సమావేశం ముగిశాక రేవంత్‌రెడ్డి, స్టాలిన్ తదితరులతో మోదీ సరదా సంభాషణలు జరిపారు. నవ్వుతూ, వారిని నవి్వస్తూ కని్పంచారు. భగవంత్ మాన్ (పంజాబ్), హేమంత్ సోరెన్ (జార్ఖండ్), కొన్రాడ్ సంగ్మా (నాగాలాండ్) తదితరులు మోదీతో చాలాసేపటిదాకా కరచాలనం చేస్తూ కన్పించారు. వారితో ప్రధాని సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలంతా తేనీరు సేవిస్తూ ఉల్లాసంగా గడిపారు.
ఎన్ఆర్ఐ

జార్ఖండ్‌లో శంకర నేత్రాలయ MESU ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరాలు
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్‌లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్యూలు అందిస్తున్నాయి. వీల్‌పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్‌కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్‌ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్‌లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.

డబ్లిన్‌లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్‌లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్‌పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్‌గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్‌ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

‘రాజస్థాన్ నేరం’ వెనుక లోకేంద్ర!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కాచిగూడకు చెందిన కార్టన్స్ ఫ్యాక్టరీ యజమాని హేమ్రాజ్ దుగ్గర్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లోకేంద్ర బహదూర్ షాహి నేతృత్వంలోని ముఠా మరో నేరం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పంజా విసరడానికి ఆరు నెలల ముందు ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో 5 కేజీల బంగారం తస్కరించినట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఈ నెల 14 రాత్రి రాజస్థాన్‌లోని జైపూర్‌లో నివసించే కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ చౌదరి ఇంట్లో రూ.6 కోట్ల సొత్తు దొంగతనానికీ ఇతడే సూత్రధారి అని ఆ పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని ఖరారు చేసుకోవడానికి హైదరాబాద్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వ్యవస్థీకృతంగా లోకేంద్ర వ్యవహారాలు.. కొన్నేళ్ల క్రితం నేపాల్ నుంచి వసలవచ్చిన లోకేంద్ర వ్యవస్థీకృతంగా ఈ చోరీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడి వ్యాపారుల ఇళ్లల్లో పని చేస్తున్న నేపాలీల్లో కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఆయా వ్యాపారుల కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తెలుసుకుంటున్నాడు. అదను చూసుకుని అప్పటికే పని చేస్తున్న వారి ద్వారానే, ఆ స్థానంలో మరో నేపాలీని పనిలో పెట్టిస్తున్నాడు. ఆపై తన ముఠాతో రంగంలోకి దిగి ఆ ఇంటిని కొల్లగొట్టిస్తున్నాడు. ముంబైకి చెందిన వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో ఐదు కేజీల బంగారం తస్కరించారు. గత నెల్లో కాచిగూడలోనూ ఇలానే భారీ చోరీకి పాల్పడ్డారు. ఇక్కడ ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులకు మత్తు మందు ఇచ్చి తమ పని కానిచ్చారు.వైశాలీ నగర్లోనూ .. జైపూర్‌లోని వైశాలీనగర్లో ఉన్న సందీప్ చౌదరి ఇంట్లోనూ ఇదే పం«థాలో నేరం జరిగింది. ఈ ఇంట్లో పని చేసే మహిళతో పాటు ఓ పురుషుడు అదను కోసం ఎదురు చూశారు. సందీప్ జైపూర్‌లో లేని విషయం గమనించి మరో ఇద్దరికి సమాచారం ఇచ్చారు. ఆయన కుటుంబీకులతో మత్తు మందు కలిపిన టీ తాగించారు. అంతా అపస్మారక స్థితిలో ఉండగా ఆ ఇద్దరితో పాటు మరొకరినీ రప్పించిన ఈ ద్వయం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వెండి, వజ్రాభరణాలతో సహా రూ.6 కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం భరత్ బిస్త్, హరి బహదూర్ దామిలను అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. నిందితుల విచారణలో సరైన వివరాలు రాకపోవడంతో ఈ పంథాలో జరిగిన నేరాల వివరాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే కాచిగూడ చోరీ వారి దృష్టికి వెళ్లింది. ఇక్కడా, అక్కడా ఒకేలా నేరం జరగడంతో జైపూర్ చోరీ వెనుకా లోకేంద్ర బహదూర్ షాహి పాత్రను అనుమానిస్తున్నారు. దర్యాప్తు కోసం వివరాలు కోరుతూ నగర పోలీసులను సంప్రదిస్తున్నారు.

లారీ–కారు ఢీ: ఆరుగురు దుర్మరణం
కొమరోలు/సాక్షి, అమరావతి/బాపట్ల టౌన్: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు గ్రామం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మహానంది పుణ్యక్షేత్రం దర్శనం అనంతరం తిరుగుముఖంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాలివీ.. బాపట్ల జిల్లా స్టూవర్టుపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది తమ కుటుంబ సమస్యలపై చర్చించుకునేందుకు నంద్యాల జిల్లా డోన్ వెళ్లారు. అక్కడ నుంచి మహానంది వెళ్లి దైవదర్శనం చేసుకుని కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై తాటిచెర్లమోటు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు కావడంతో వారిని 108లో గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులున్నారు. మృతులను గజ్జెల అంకాలు (40), గజ్జెల భవాని (25), గజ్జెల నరసింహులు (20), గజ్జెల జనార్ధన్ (30), బొచ్చు సన్ని (30), కర్రెద్దుల దివాకర్ (30)లుగా గుర్తించారు. గాయపడిన చిన్నారుల్లో జీతన్, శిరీష ఉన్నారు. వీరిలో జీతన్ పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల వైద్యశాలకు తరలించారు. కారు డ్రైవర్ దివాకర్ నిర్లక్ష్యంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. ప్రమాద స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. మృతదేహాలన్నింటిని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వారికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అత్యంత బాధాకరం: వైఎస్ జగన్ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దైవ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

గ్యాంగ్‌రేప్ నిందితులకు బెయిల్.. కార్లు, బైకులతో విజయోత్సవ ర్యాలీ
సాక్షి,బెంగళూరు: ఓ మహిళపై సామూహిక అత్యాచారం. ఆపై జైలు శిక్ష, బెయిల్‌పై విడుదల. ఈ తరహా దారుణాల నిందితులు చేసిన తప్పుకు పశ్చాతాపానికి గురవుతుంటారు. సమాజంలో తిరగలేక సిగ్గుతో తలదించుకుంటుంటారు. కానీ కర్ణాటక కేసు నిందితులు అందుకు భిన్నంగా వ్యవహించారు. బెయిల్ రావడంతో బైక్, కార్లలో తిరుగుతూ విజయోత్సవ ర్యాలీలు జరిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల,గ్యాంగ్ రేప్ కేసులో ఏడుగురు ప్రధాన నిందితులు అఫ్తాబ్, మదర్ సాబ్, సమీవుల్లా, మొహమ్మద్ సాదిక్, తౌసీఫ్, రియాజ్, షోయిబ్‌లకు కర్ణాటక హవేరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం, చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి సంబరాలు చేసుకున్నారు. వీధుల్లో కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. SHOCKING 🚨 7 Gang rape accused take out road show after securing BAIL in Karnataka's Haveri. Names — Mohammad Sadiq Agasimani, Shoib Mulla, Tausip Choti, Samiwulla Lalanavar, Aptab Chandanakatti, Madar Saab Mandakki, and Riyaz Savikeri. pic.twitter.com/pNMF21YXJy— Times Algebra (@TimesAlgebraIND) May 23, 2025కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.. 2024 జనవరి 8న కర్ణాటకలోని హవేరీ జిల్లాలో హనగర్‌కు చెందిన ఓ హోటల్ గదిలో దారుణం జరిగింది. నిందితులు హోటల్ గదిలోకి చొరబడి ఓ జంటపై దాడి చేశారు. అనంతరం బాధితురాల్ని స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తాజాగా, ఆ కేసులో ఏడుగురు ప్రధాన నిందితలు బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ రావడంపై నిందితులు హవేరి జిల్లా అక్కి అలూరు పట్టణంలో పెద్ద ఎత్తున మోటార్ బైక్‌లు, కార్లు, డీజే మ్యూజిక్‌తో కూడిన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చిరునవ్వుతో చేతులు ఊపుతూ, విజయోత్సవ సంకేతాలిచ్చిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. బాధితురాలు ఓ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారు. ఆమె కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో ఆమె, తన ప్రియుడితో కలిసి 2024 జనవరి 8న హనగల్‌కు చెందిన ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారు. బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. అయితే జనవరి 11న న్యాయమూర్తి ఎదుట బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో ఈ కేసులో పోలీసులు మొత్తం 19 మందిని అరెస్ట్ అయ్యారు. వీరిలో 12 మందిని దాదాపు 10 నెలల క్రితమే బెయిల్‌పై విడుదల చేశారు. కానీ, ఏడుగురు ప్రధాన నిందితులు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదే కేసులో ఆ ఏడుగురికి న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో నిందితులు బైక్‌లు,కార్లలో ర్యాలీతో సంబరాలు చేసుకున్నారు.ఈ ఘటనపై నెటిజన్లు, స్థానికులు.. న్యాయం గెలవాలన్న ఆశతో బాధితురాలు ఎదురుచూస్తున్న సమయంలో నిందితులు చేసిన విజయోత్సవాల ర్యాలీ బాధితురాలిని మరింత మానసికంగా దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు.

Be alert! మెట్రో రైళ్లలో అమ్మాయిల్ని క్లిక్‌మనిపించి..
క్రైమ్: మనకు తెలియకుండానే మన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షమవుతున్న రోజులివి. మరీ ముఖ్యంగా మహిళల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. వాళ్లలో కొందరు ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తుండడంతో నిందితులను సైతం పట్టుకోగలుగుతున్నారు. ఆ మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలను అసభ్యకరరీతిలో ఫొటోలు తీసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నడిపి ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బెంగళూరు మెట్రో రైళ్లలో అమ్మాయిలను ఫొటోలు తీసి.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు ఓ వ్యక్తి. పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో బుధవారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆపై ఆ పోకిరీపై నజర్ వేశారు. చివరకు.. అతన్ని పట్టుకున్నట్లు బెంగళూరు పోలీసులు శుక్రవారం ప్రకటించారు. Bangalore Metro Clicks (@metro_chicks) పేరిట నడిపిన ఆ అకౌంట్లో వందల కొద్దీ అమ్మాయిల చిత్రాలు ఉన్నాయి. ఆ అకౌంట్‌కు ఐదు వేళ మంది ఫాలోవర్స్ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అందులో ఉన్న మొత్తం ఫొటోలను తొలగించి.. అకౌంట్‌ను సైతం తొలగించారు. అయితే నిందితుడి వివరాలు వెల్లడించాల్సి ఉంది. తస్మాత్ జాగ్రత్త.. మీ చుట్టుపక్కలా ఇలాంటి కామాంధులు ఉండొచ్చు! జర జాగ్రత్త!!.