ప్రధాన వార్తలు

టార్గెట్ పెద్దిరెడ్డి.. నారావారి వికటాట్టహాసాలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘పెద్దాయన’గా పేరు ప్రతిష్టలు.. ప్రజా సేవే పరమావధిగా సేవలందించే కుటుంబసభ్యులు.. పేదలతో మమేకమై చేసే రాజకీయాలు.. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో అనుయాయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం. దశాబ్దాలుగా ఆయన సంపాదించుకుంది జనాభిమానం. ఇదే చంద్రబాబుకు మింగుడుపడని అంశం. అందుకే స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి తనకు కొరకరాని కొయ్యగా తయారైన పెద్దిరెడ్డిని లక్ష్యం చేసుకుని కుట్రలకు తెరతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్షగట్టి వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేందుకు తెగబడుతున్నారు. అందులో భాగంగానే నిరాధార ఆరోపణలతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయించారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబమే సీఎం చంద్రబాబు నాయుడుకు అడ్డు. తనకంటే పెద్దిరెడ్డి కుటుంబానికే ఆదరణ పెరుగుతోందని, అందుకే ఆ ఫ్యామిలీ లక్ష్యంగా చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదలు నేటి వరకు పెద్దిరెడ్డి కుటుంబంపై చేపట్టిన వేధింపులే నిదర్శనం అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అందరూ పెద్దిరెడ్డిని ‘పెద్దాయన’ అని పిలుస్తుండడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఏడాదిగా సాగుతున్న అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలే ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు.● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన వెనుక మాజీ మంత్రి, ఎమ్మె ల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హస్తం ఉందంటూ అప్పట్లో హడావుడి చేశారు. ఏదో జరిగిపోయిందని సీఎం చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్ ఏర్పాటు చేసి డీజీపీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని మదనపల్లెకు పంపించారు. తర్వాత ఆ ఘటనపై కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి అనుచరులు కొందరిని అరెస్టు చేశారు. అయితే అవేవీ ఇప్పటి వరకు రుజువు కాకపోవడంతో చివరకు ప్రభుత్వం వెనుకడుగు వేసింది.● రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులు అనేక మందిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. వ్యవసాయ పంటలను నాశనం చేశారు. ఇటుక బట్టీల్లోకి చొరబడి వాటిని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. సోమల మండలం కమ్మపల్లెలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులందరినీ నెలలపాటు చిత్రహింసలకు గురిచేశారు. కొంత మంది ఊరొదిలి వెళ్లేలా దౌర్జన్యాలకు తెగబడ్డారు. అనేక మందిపై దాడులు చేసి ఆస్పత్రుల పాలు చేశారు. ప్రధానంగా పుంగనూరులో భయానక వాతావరణం సృష్టించారు. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేసి రిమాండ్ తరలించి పెద్దిరెడ్డి వర్గాన్ని భయాందోళనకు గురిచేసేందుకు యత్నించారు.● రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గత ఏడాది జూలై 18న పుంగనూరు పర్యటనలో భాగంగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని టీడీపీ గూండాలు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంపై రాళ్ల దాడి చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కర్రలు, రాడ్లతో దారుణంగా తరిమికొట్టారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. మరికొన్ని వాహనాలను ఎందుకూ పనికిరాకుండా నాశనం చేశారు. దాడి చేసింది టీడీపీ గూండాలైతే.. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలువురు వైఎస్సార్సీపీ నేతలు మొత్తం 115 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు పలువురికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కూటమి నేతలు కంగుతిన్నారు.● పులిచెర్ల మండలం మంగళంపేట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన మామిడి తోటలలో అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయంటూ పచ్చమీడియాను అడ్డుపెట్టి ప్రభుత్వం నానా యాగీ చేసింది. డ్రోన్ కెమెరాలు, అధికారులను రంగంలోకి దింపి హంగామా సృష్టించింది.● తిరుపతిలోపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్న ప్రాంతం బుగ్గమఠానికి చెందిన భూముల్లోనే అని ఆరోపించి కూటమి ప్రభుత్వం కోర్టులో కేసులు దాఖలు చేసింది. అదే విధంగా కార్పొరేషన్ నిధులతో దారి ఏర్పాటు చేసుకున్నారని, అది కూడా ఆక్రమణేనంటూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసింది.జలయజ్ఞంపై బాబు విషంకృష్ణమ్మ జలాలను పుంగనూరుకు తీసుకొచ్చి నిల్వ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సంకల్పించారు. నాటి పాదయాత్రలో వైఎస్.జగన్మోహన్రెడ్డికి సమస్యను వివరించారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టులతో పడమటి ప్రాంతాలకు నీరు ఇచ్చే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లోని ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లెలో రూ.1200 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ మూడు ప్రాజెక్టులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తుందని, ఎన్నికల సమయంలో దీనిని అడ్డుకోవాలని చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై విషం చిమ్మారు. చోటా నేతలచే గ్రీన్ ట్రిబ్యూనల్‌లో తప్పుడు కేసులు వేసి పనులు అడ్డుకున్నారు. దీని కారణంగా పడమటి నియోజకవర్గాలకు జీవజలం లేక విలవిల్లాడే పరిస్థితి నెలకొంది.ఇప్పుడు తప్పుడు కేసులో..తాజాగా లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేసిన ఈ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు సామాన్యులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు.బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్న అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఇది కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.– భరత్, ఎమ్మెల్సీ, కుప్పంకుట్రలకు పెద్దిరెడ్డి కుటుంబం వెరవదుపెద్దిరెడ్డి కుటుంబ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిదశగా ఓ బూటకపు మద్యం కుంబకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులోకి ఎలాంటి సంబంధం లేని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో సిట్ కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేసింది. ప్రజాభిమానం కలిగిన మిథున్‌రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి నాయకుడిపై మద్యం కేసు నమోదు చేయడం దుర్మార్గం.-నూకతోటి రాజేష్, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తఎలాంటి ఆధారాలు లేకుండా..లిక్కర్ కేసులో గతంలోనే సిట్ ముందు ఎంపీ మిథున్‌రెడ్డి వాస్తవాలను చెప్పారు. కానీ ఆయన పీ ఎల్ఆర్ కంపెనీకి ఎవరో పెట్టుబడిగా పెట్టిన రూ.5 కోట్లపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. చంద్రబాబు ఎందుకు వీరిని టార్గెట్ చేశారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. న్యాయమే గెలుస్తుంది.– వెంకటేగౌడ, పలమనేరు మాజీ ఎమ్మెల్యేప్రశ్నిస్తుండడంతోనే అక్రమ కేసులుఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్నామనే ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష పూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. లేని మద్యం కేసును సృష్టించి అన్యాయంగా అరెస్టులు చేయడం దారుణం. దీనికి పచ్చమూక మూల్యం చెల్లించుకోక తప్పదు.– కృపాలక్ష్మి, గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కక్షగట్టి అరెస్ట్ చేశారుమాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారనే నెపంతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. కూటమి పాలన లో కక్షసాధింపులు తారస్థాయికి చేరాయి. ఉద్యోగులను బెదిరించి, బ్లాక్ మె యిల్ చేసి స్టేట్మెంట్లు తీసుకున్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టుల పరంపర జరుగుతోంది. 2014–19 పాలనాకాలానికి సంబంధించి చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, సన్నిహితులపై 13 అవినీతి కేసులు ఉన్నాయి. ఇందులో మద్యం కుంభకోణం కేసు కూడా కీలకమైంది. ఈ కేసులను నిర్వీర్యం చేసేందుకు సీఎం పదవి ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తున్నారు.– విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తలోకేష్ నీకు చిప్పకూడే గతికూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఎంపీ మిథు న్ రెడ్డిని అరెస్ట్ చేయడం బాధాకరం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా తమ స్వార్థం కోసం వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యువగళం పాద యాత్రలో ప్రజలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిన నారా లోకే ష్ పక్షాన ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దుర్మార్గం. కూ టమి ప్రభుత్వ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది.– వీ.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిసాక్షి టాస్క్‌ఫోర్స్

‘శశిథరూర్ మాతో లేరు.. మీటింగ్‌లకు పిలవం’
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యవహార శైలిపై సొంత పార్టీలో.. అదీ సొంత రాష్ట్రంలోనే తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఆయన్ను తమలో ఒకరిగా పరిగణించడం లేదంటూ తాజాగా పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దేశ భద్రత అంశంపై థరూర్ తన వైఖరిని మార్చుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానించేది లేదన్నారు మాజీ ఎంపీ కే మురళీధరన్. పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని శశిథరూర్ వ్యాఖ్యానించిన వేళ.. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత కే మురళీధరన్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘శశిథరూర్ తన తీరును మార్చుకునే వరకు.. తిరువనంతపురంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించబోం. ఆయన మాతో కలిసి లేరు. కాబట్టి.. ఆయన్ను బహిష్కరించే ప్రశ్నే పుట్టదు. అయితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది’’ అని మురళీధరన్ అన్నారు. ఇదిలా ఉంటే.. కే మురళి శశిథరూర్‌పై మండిపడ్డడం ఇదే తొలికాదు. ఎమర్జెన్సీ రోజులపై థరూర్ రాసిన వ్యాసంపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఆయనకు(శశిథరూర్ పేరును ప్రస్తావించకుండా) ఏమైనా ఆంక్షలు ఉన్నట్లు అనిపిస్తే.. స్పష్టమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఇంకోవైపు కేరళలోని యూడీఎఫ్ నేతల్లో సీఎం అభ్యర్థిగా శశిథరూర్ వైపే మొగ్గు ఉందంటూ ఓ సర్వేకు సంబంధించిన పోస్టుపైన మురళీధరన్ గతంలో విరుచుకుపడ్డారు. ఆయన ఏ పార్టీకి చెందినవారో ముందుగా నిర్ణయించుకోవాలన్నారు.గత కొంతకాలంగా శశిథరూర్‌కు కాంగ్రెస్ అధిష్టానాకి మధ్య పొసగడం లేదు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నుంచి శశిథరూర్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎవరేమనుకున్నా తాను బీజేపీలో చేరేది లేదని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానంటూ థరూర్ చెబుతూ వస్తున్నారు.

ప్రతి తప్పు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది: తమన్నా
పాన్ ఇండియా రేంజ్లో అనేక చిత్రాల్లో హీరోయిన్గా నటించిన నటి తమన్నా ఐటెం సాంగ్స్‌తో మరింత పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. రీసెంట్గా ఆమె నటించిన ఐటెం సాంగ్స్ అంతగా అభిమానుల్లో ప్రభావం చూపాయి. అలాంటి పాటలకు తమన్నా పారితోషికం కూడా బాగానే డిమాండ్ చేస్తారనే టాక్ ఉంది. ఏకంగా ఒక్కో పాటకు రూ. 2 కోట్ల వరకు తీసుకుంటారని టాక్ ఉంది. 18 ఏళ్ల వయసులోనే నటిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ అగ్రకథానాయకిగా రాణించిన ఈ ఉత్తరాది భామకు సమీప కాలంలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం కూడా స్వయం కృతాపరాధమే అని చెప్పవచ్చు. కెరీర్లో పెద్దగా వదంతులను ఎదుర్కొనని తమన్నా ఈమధ్య అలాంటి వాటిని ఎదుర్కోవడం గమనార్హం. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం సాగించిన తరువాతే ఈ మిల్కీ బ్యూటీపై ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. విందుకు వినోదాలకు ఈ జంట కలిసి తిరగడమే ఇందుకు కారణం. అయితే, చాలామంది నటిమణులు ఎదుర్కొంటున్న సమస్యనే ఇప్పుడు తమన్నా కూడా ఎదుర్కొంటున్నారు. తను ప్రేమించిన విజయ్‌వర్మ నుంచి విడిపోవడం వంటి వార్తలు ఇందుకు కారణం. వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఆపై వారు జంటగా ఈ మధ్య ఎప్పుడూ కనిపించలేదు. దీంతో ఈ వార్తలు నిజమే అనే సంకేతాన్ని ఇస్తున్నాయి.కాగా ఇటీవల ఈమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో కొన్ని ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేసి వేదాంతపు వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రతి తప్పు పాఠాన్ని నేర్పిస్తుంది. మెరిసే ప్రతి వస్తువు వెనుక ఒక మెరవని కార్యం ఉంది. నిర్ణయాలు, సంతోషాలు ఇవే ఆ కార్యాలు. అంటూ చెప్పిన ఈ బ్యూటీ మరోసారి ఇలా చెప్పింది 'జీవితంలో అద్భుతాలు జరగాలని ఎదురుచూడొద్దని ఆమె కోరారు. దాని బదులు మనమే అద్భుతాన్ని సృష్టించాలి' అన్నారు. మొత్తం మీద ఈమెకు ఏదో ఒక అనుభవం పెద్ద పాఠాన్నే నేర్పించిందని అర్థమవుతోంది. అది ప్రేమలో విఫలం కావడమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం మీద తమన్న ఆమధ్య కొంచెం బరువెక్కి ఇప్పుడు మళ్లీ స్లిమ్‌గా తయారైంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో తెలుగులో ఒక చిత్రం ,హిందీలో ఒక చిత్రం, మరో వెబ్ సిరీస్ ఉన్నాయి.

హెచ్–1బీ వీసాకు కొలువుతో లింకు!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షునిగా పాలించిన కాలంలో అమలై తర్వాత బైడెన్ హయాంలో బుట్టదాఖలైన ఒక విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ట్రంప్ తొలివిడత అమెరికా అధ్యక్షునిగా పరిపాలించిన కాలంలో హెచ్–1బీ వీసాల కోసం లాటరీ విధానాన్ని పక్కనబెట్టి ఆయా కంపెనీలు ఉద్యోగానికి ఇచ్చే జీతభత్యాల ఆధారంగా వీసాలను జారీచేయాలని నిర్ణయించారు. ఆ విధానాన్నే ఆనాడు అమలుచేశారు. దీంతో కంపెనీలు మరింత మంది ఉద్యోగులను ఉన్నత ఉద్యోగాలకు తీసుకుంటాయని, తక్కువ స్థాయి ఉద్యోగాలు అమెరికన్లకే దక్కుతాయని ట్రంప్ సర్కార్ భావించింది. అయితే విదేశాల నుంచి వచ్చే నిపుణులైన ఉద్యోగులకు అన్ని స్థాయిల ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో జో బైడెన్ సర్కార్ ఈ విధానాన్ని రద్దుచేసి మళ్లీ లాటరీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ లాటరీ విధానానికి స్వస్తిపలికి ఉద్యోగి జీతం, హోదా, పొజిషన్ ఆధారంగా హెచ్–1బీ వీసాలు ఇవ్వాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం భావిస్తోంది. ఇందులోభాగంగా సంబంధిత ప్రతిపాదనను సమీక్షించాలంటూ శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ విభాగానికి తన ప్రతిపాదనలను పంపింది.వాస్తవానికి ప్రతి సంవత్సరం ఎన్ని హెచ్–1బీ వీసాలు జారీ చేయాలనే పరిమితిని అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 85,000 హెచ్–1బీ వీసాలను జారీచేస్తున్నారు. వీటిలో 20,000 వీసాలను మాస్టర్స్ డిగ్రీ పట్టా ఉన్న ఉద్యోగులు ప్రత్యేకంగా కేటాయించారు. వీటిలో అత్యధికం అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలే సాధిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసి తమ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి వీసా దక్కేలా చేస్తున్నాయి. ఇక ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం కేటాయించారు.2026 ఏడాదికి జారీచేయాల్సిన వీసాల కోసం స్వీకరించాల్సిన దరఖాస్తులు సరిపడా రావడంతో వాటి ప్రాసెస్‌ను నిలిపివేశారు. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్ విభాగం శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ లెక్కన 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చని స్పష్టమైంది. పొజిషన్ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియలను అమెరికాలోని ఆర్థికరంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. అత్యధిక వృత్తి నైపుణ్యాలున్న వ్యక్తులకే అత్యధికంగా హెచ్–1బీ వీసాలు దక్కే అవకాశం ఉండటంతో వారి కృషి, పని ద్వారా అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారు ఆశిస్తున్నారు.

బాబు కుతంత్రం..‘అప్రూవర్’ తంత్రం
భయపెట్టి.. ప్రలోభపెట్టి.. మద్యం అక్రమ కేసులో తిమ్మినిబమ్మి చేసేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇంతా చేసి.. కోర్టుకు సమరి్పంచిన చార్జ్‌షీట్, రిమాండ్ రిపోర్ట్‌లో ఒక్క ఆధారమూ చూపలేదు. ఒకరిద్దరిని అప్రూవర్లుగా మార్చుకోవడమే తమ ముందున్న దారి అని చెప్పకనే చెప్పింది. ఫేక్ ఇన్వాయిస్లు అంటూ తనకు తానే స్వీయ ధ్రువీకరణ ఇచ్చుకుంది. ఫలానా సమయంలో ఫలానా సెల్ టవర్ పరిధిలో ఉండటమే ఆధారమని చెప్పుకు రావడం విడ్డూరం. సిట్ దర్యాప్తు తీరు చూస్తుంటే సీఎం చంద్రబాబునాయుడు కక్ష సాధింపు తప్ప ఈ కేసులో మరేమీ లేదని తేటతెల్లమవుతోంది. సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. బెదిరించి, వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సాగిస్తున్న అక్రమ కేసు కుతంత్రాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వమే మరోసారి బయట పెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం రచించిన ‘అప్రూవర్ కుట్ర’ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ కేసులో బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను ఇప్పటికే తీవ్రంగా వేధించి, మరీ అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వారి ద్వారా అప్రూవర్ కుట్రకు తెగబడేందుకు యత్నించడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ కుతంత్రాన్ని చక్కబెట్టేందుకు యత్నించిన వ్యవహారం బయటపడింది. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించింది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు తాము అబద్ధపు వాంగ్మూలాలపైనే ఆధార పడ్డామని నిస్సిగ్గుగా వెల్లడించింది. ఆ ఇద్దరూ సిట్ చీఫ్‌తో భేటీరాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతోగానీ, మద్యం విధానంతో గానీ ఏమాత్రం సంబంధం లేని వారిని కూడా ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ఏ30 నుంచి ఏ40 వరకు నిందితులుగా పేర్కొని సిట్ అరెస్టు చేసింది. వారిలో ప్రపంచ స్థాయి సిమెంట్ దిగ్గజ సంస్థ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పతోపాటు పలువురు ఉన్నారు. ఇదే కేసులో నిందితులైన వాసుదేవరెడ్డి(ఏ2), సత్య ప్రసాద్(ఏ3)లను బెదిరించి, అప్రూవర్లుగా మారేందుకు అనుమతించాలని, వారిద్దరితో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ వేయించాలని పన్నాగం పన్నింది. ఇందులో భాగంగా శనివారం వారు విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి వచ్చారు. ముందుగా సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం కొందరు సిట్ అధికారులతో కలసి న్యాయస్థానంలో అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. ఇలా వారిద్దరితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాలు న్యాయస్థానంలో నమోదు చేయించాలన్నది ప్రభుత్వ పెద్దల ఎత్తుగడగా స్పష్టమైంది. అయితే న్యాయ వర్గాలతో చర్చించిన వారు అప్రూవర్ పిటిషన్ దాఖలు చేయకుండా వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ పిటిషన్ నాటకం వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ అప్రూవర్ పిటిషన్లు వేయకుండా వెనుదిరగడంపై సిట్ అధికారులు ఆందోళనకు గురైనట్లు సమాచారం. వీరిద్దరూ ఎదురు తిరిగితే ఈ అక్రమ కేసు పూర్తిగా నీరుగారి పోతుందని బెంబేలెత్తిన సిట్ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆదేశాలతో కొత్త ఎత్తుగడ వేశారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌తో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయించారు. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానంలో వ్యతిరేకించకుండా సహకరిస్తామని సిట్ అధికారులు వారికి చెప్పినట్టు సమచారం. కాగా హడావుడిగా అప్పటికప్పుడు దాఖలు చేసిన ఆ పిటిషన్లకు తగిన పత్రాలు జతపరచ లేదు. దాంతో సాంకేతిక కారణాలతో న్యాయస్థానం ఆ పిటిషన్లను వెనక్కి పంపింది.అబద్ధపు వాంగ్మూలాలు ఇలా...⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా అమలైందని చంద్రబాబు ప్రభుత్వమే పరోక్షంగా అంగీకరించినట్లయిందని ఈ తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేశాయి. రెడ్‌బుక్ కక్ష సాధింపు కోసం తాము నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలపైనే ఆధార పడ్డామని ప్రభుత్వమే బయట పెట్టుకుంది.⇒ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితోపాటు ఇప్పటి వరకు ఇతర అధికారులు, సాక్షులతో తాము నమోదు చేయించినవన్నీ అబద్ధపు వాంగ్మూలాలే అన్నది స్పష్టమైంది. వాసుదేవరెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వేధించారు. సిట్ వేధింపులపై ఆయన మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.⇒ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించని వారిపై సిట్ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ⇒ ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి, మదన్ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్ రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతి కలిగించింది. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా.⇒ అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశ నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రభుత్వ పెద్దల అండతో ఈ అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ బరితెగించి సాగిస్తున్న అధికారిక గూండాగిరీకి ఈ పరిణామాలే నిదర్శనం.అబద్ధాలూ.. వక్రీకరణలే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రలో ప్రభుత్వం తన కుతంత్రాలకు మరింతగా పదును పెడుతోంది. పూర్తిగా అవాస్తవాలు, వక్రీకరణలతో నిబంధనలను ఉల్లంఘిస్తోంది. సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్, ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ నివేదికలే ఆ విషయాన్ని మరోసారి బయటపెట్టాయి. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు సిట్ యత్నిస్తోందని ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ నివేదిక వెల్లడించింది. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సృష్టించలేకపోయిన సిట్ అధికారులు వక్రభాష్యాలతో కనికట్టు చేసేందుకు యత్నించారు. ఈ కేసులో ఇతర నిందితులతోపాటు ఎంపీ మిథున్ రెడ్డి సమావేశమై అక్రమాలకు కుట్ర పన్నారని సిట్ రిమాండ్ నివేదికలో పేర్కొంది. అందుకు సిట్ చూపించిన ఆధారం ఏమిటో తెలుసా.. సెల్‌టవర్ లొకేషన్! హైదరాబాద్‌లో సమావేశం జరిగిందని చెబుతున్న రోజున ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర నిందితుల సెల్ ఫోన్లు అన్ని ఒకే చోట ఉన్నట్టు సెల్ టవర్ లొకేషన్ ద్వారా తెలుసుకున్నామని సిట్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే సెల్ టవర్ పరిధి 200 చ.మీటర్లు ఉంటుంది. అంత పరిధిలో హైదరాబాద్ వంటి కాంక్రీట్ జంగిల్ వంటి మహానగరంలో వేలాది సెల్ ఫోన్లు ఉంటాయి. అంత మాత్రాన ఆ వేలాది మంది కూడా ఒక గదిలో సమావేశమైనట్టు భావించాలా? ఎక్కడ న్యాయం? ఎక్కడ ధర్మం?ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన పలువురితో సెల్ ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా వివరాలు వెల్లడిస్తున్నాయని సిట్ అధికారులు రిమాండ్ నివేదికలో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎంపీ. లోక్‌సభలో వైఎస్సార్సీపీ నేతగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అటువంటి క్రియాశీల ప్రజాప్రతినిధి రోజూ ఎందరో నేతలు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలతో ఫోన్లో మాట్లాడుతునే ఉంటారు. అంత మాత్రాన వారిందరితో కలసి కుట్ర పన్నినట్టు ఎలా భావిస్తారు? ఎలాంటి ఆధారాలు లేనందునే సిట్ అధికారులు సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటాలను వక్రీకరిస్తూ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారన్నది స్పష్టమవుతోంది. దర్యాప్తు పేరిట సిట్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చార్జ్‌షీట్ వెల్లడిస్తోంది. కేంద్ర జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ సిట్ అధికారులు తమ పరిధిని అతిక్రమించారు. మద్యం సరఫరా చేయకుండానే చేసినట్టు ఫేక్ ఇన్వాయిస్లు సమర్పించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైనట్టు సిట్ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అవి ఫేక్ ఇన్వాయిస్లని ఎలా గుర్తించారో మాత్రం వెల్లడించనే లేదు. కేంద్ర జీఎస్టీ అధికారులు నిర్ధారించకుండా అవి ఫేక్ ఇన్వాయిస్‌లనీ సిట్ అధికారులు ఏకపక్షంగా ఎలా తుది నిర్ణయానికి వచ్చారో అర్థం కావడం లేదు. అంటే లేని ఆధారాలు ఉన్నట్టుగా సిట్ అధికారులు న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించేందుకు తెగిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. కుట్రపూరితంగానే కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఈ కేసులో సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఆధారంగానే నిగ్గు తేలింది. ఈ లెక్కన ఈ కేసులో ఎక్కడ న్యాయం ఉన్నట్లు? ఎక్కడ ధర్మం ఉన్నట్లు? ప్రభుత్వం కుట్రతోనే వ్యవహరిస్తున్నదని అడుగడుగునా స్పష్టమవుతోంది.

వెండితెర యాక్టర్.. వీగన్ అంబాసిడర్..
క్రీడల్లో రాణించాలని సాధన చేస్తున్నాం కదా.. గుడ్లు, పాలు తినాలి.. లేకపోతే బలం ఎలా వస్తుంది? జిమ్‌కి వెళ్తున్నాం.. మటన్, చికెన్ తినాల్సిందే.. లేకపోతే వర్కవుట్ ఏం చేస్తాం? మజిల్ ఎలా బిల్డ్ చేస్తాం? అని భావిస్తాం. అయితే ఇవన్నీ అపోహలేనని కొట్టిపారేస్తున్నారు సినీహీరో అరవింద్ కృష్ణ. అంతేకాదు గట్టిగా వాదిస్తున్నారు కూడా.. ఆ గట్టితనమే ఆయనకు వీగన్ వాయిస్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తెచ్చిపెట్టింది. అయితే ఒక సినిమా నటుడిగా మరోవైపు బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా తనను నిలబెట్టిన వీగన్ అంతకు మించిన లాభాలే తనకు అందించిందంటున్న అరవింద్ కృష్ణ ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘టీనేజ్ చదువు మొత్తం అమెరికాలోనే సాగింది. అదే సమయంలో నేను బాస్కెట్ బాల్ కూడా ఆడేవాడిని. అప్పుడు నేను కూడా చాలా మందిలాగే స్పోర్ట్స్‌లో రాణించాలంటే మటన్, చికెన్, ఎగ్స్ తప్పక తినాలని భావించే నాన్ వెజిటేరియన్నే’. స్లాటర్ హౌస్ తెచ్చిన ఛేంజ్.. నాకు 17ఏళ్ల వయసులో అనుకోకుండా స్లాటర్ హౌస్‌కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులు చూశాక, మూగజీవుల విలాపం.. నాలో అనూహ్య మార్పుకు దారితీసింది. నన్ను పూర్తి వెజిటేరియన్‌గా మార్చేసింది. విచిత్రం ఏమిటంటే.. నాన్ వెజ్ తిన్నప్పటి కంటే ఆ తర్వాతే నేను ఆటగాడిగా రాణిస్తున్నాననేది నాకు అర్థమైంది. అప్పటి నుంచి శాఖాహారం వైపు ఆకర్షితుడినయ్యాను. వీగన్.. విన్ విన్.. వీగన్ శైలి ఆహారం పరిచయం తర్వాత నా జీవితమే మారిపోయింది. 33 ఏళ్ల వయసులో వీగన్‌గా మారాను. పాలు సహా జంతు సంబంధ ఉత్పత్తులన్నీ మానేశాక.. నా ఆరోగ్యం మెరుగుపడింది. గ్లూటెన్‌కు శరీరంలో చోటు ఇవ్వకపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. తద్వారా శారీరక సామర్థ్యం పెరిగింది. చర్మం మరింత కాంతివంతగా మారింది.ఆలోచనల్లో వేగం, పదను పెరిగింది. ఇది క్రీడా జీవితానికి బాగా ఉపకరించింది. దీంతో వీగన్యురీ అంబాసిడర్ బాధ్యతలు ఆనందంగా స్వీకరించాను. గతేడాది భారత్‌లోనే అతిపెద్ద వీగన్ థీమ్ సదస్సు జరిగిన వీగన్ ఇండియా కాన్ఫరెన్స్‌లో వీగన్ వాయిస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్నా. డబుల్ రోల్లో సక్సెస్‌ఫుల్‌గా.. నటుడిగా రామారావు ఆన్ డ్యూటీ, ఏ మాస్టర్‌పీస్, రైజ్ ఆఫ్ సూపర్‌హీరో వంటి సినిమాలతో పాటు త్వరలో రానున్న అండర్ వరల్డ్ బిలియనీర్ వంటి వెబ్‌సిరీస్‌లతోనూ తగినంత గుర్తింపుతో సంతృప్తిగా ఉన్నాను. దేశంలోనే ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఉన్న ఏకైక నటుడిని కూడా. ఇప్పటికీ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటా. నా ఫిజిక్ చూసి వీగన్ ఫుడ్‌తో ఎలా సాధ్యం అని అడుగుతుంటారు. అయితే ఆ ఫుడ్ కాబట్టే ఇలాంటి ఒరిజినల్ ఫిట్నెస్ సాధ్యమైందని చెబుతుంటా. ‘అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య (ఎఫ్‌ఐబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఐపీఎల్ తరహాలో బాస్కెట్‌బాల్ పోటీ 3 బీఎల్‌లో పాల్గొన్నా. ప్రతిష్టాత్మక ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఏకైక భారతీయుడిని కావడం విశేషం. హైదరాబాద్ 3 బీఎల్ జట్టుకు నాయకత్వం వహించాను. ఇందులో ఇతర దేశాల ఆటగాళ్లు ఉన్నారు. జీవితంలో విజయానికి క్రమశిక్షణ కీలకం. అవి క్రీడలే నాకు నేర్పించాయి. నా క్రీడా నేపథ్యం నా వ్యక్తిత్వాన్ని రూపుదిద్దింది’ అని అరవింద్ చెప్పుకొచ్చారు. (చదవండి: వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..!)

‘కుబేర’ తరహాలో టీడీపీ నేతల భారీ స్కామ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కొందరు టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుడైన ఓ జర్నలిస్టు కలిసి గిరిజనులను అడ్డం పెట్టుకుని ప్రైవేటు బ్యాంకు నుంచి పెద్దఎత్తున రుణాలు తీసుకుని మోసగించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల విడుదలైన కుబేర సినిమాను తలపించే రీతిలో ఈ భారీ స్కామ్ జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన 56 మంది గిరిజనుల పేరిట రూ.10.60 కోట్లను టీడీపీ నేతలు కాజేసినట్టు వెలుగులోకి రాగా.. ఈ మొత్తం దాదాపు రూ.20 కోట్లపైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నెల్లూరులోని యాక్సిస్ బ్యాంక్ ద్వారా జరిగిన ఈ కుంభకోణంలో బ్యాంక్ అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజనుల్ని సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపి.. యాక్సిస్ బ్యాంక్‌కు నెల్లూరు, ముత్తుకూరులో బ్రాంచ్‌లు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన వారిని, కూలి పనులు చేసుకునే వారిని, పశువుల కాపరులను టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుడైన ఓ జర్నలిస్టు జాలి వాసుదేవనాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్, తదితరులు కలిసి బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని నమ్మించారు. వారి నుంచి ఆధార్ కార్డులు, ఫొటోలు తీసుకుని బ్యాంక్‌లో ఖాతాలు తెరిపించారు. ఇలా 100 మంది నిరక్షరాస్యులు, అమాయకుల రికార్డులు సేకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్ ఇన్ఫ్రా లైన్, గ్లోబల్ సొల్యుషన్, క్యాపిటల్ ట్రీ సాఫ్ట్వేర్ పేర్లతో నకిలీ కంపెనీలను సృష్టించారు. కూలీలను, పశువుల కాపరులను ఆ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించారు. వీళ్లంతా గిరిజనులే. ఒక్కొక్కరికి రూ.75 వేల నుంచి రూ.లక్షకు పైగా జీతాలు ఇస్తున్నట్లు రికార్డులు, పే స్లిప్పులు తయారు చేశారు. వారందరికీ 6 నెలల పాటు జీతాలు చెల్లించినట్టు బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా సృష్టించారు. వీటిని యాక్సిస్ బ్యాంక్‌కు సమర్పించి ఒక్కొక్కరి పేరిట రూ.15 లక్షల చొప్పున బ్యాంక్ నుంచి రుణం పొందారు. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంక్ సిబ్బంది ఏ ఒక్క లబ్ధిదారుడితోను నేరుగా మాట్లాడడం, కలవడం, రికార్డులు పరిశీలించడం వంటివేమీ లేకుండానే రుణాలిచ్చేశారు. ఈ విషయాలేవీ లబ్దిదారులకు తెలియకుండా టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. 4 నెలల పాటు బ్యాంక్ వాయిదాలు చెల్లించిన నకిలీ కంపెనీలు ఆ తర్వాత చెల్లింపులు నిలిపివేశాయి. రుణం వస్తుందని ఎదురుచూస్తున్న నిజమైన లబ్ధిదారులకు బకాయిలు చెల్లించాలని నోటీసులు అందడంతో వారు దిగ్బ్రాంతి కి గురయ్యారు. 8 నెలల క్రితమే ఫిర్యాదు అందినా.. ఈ లావాదేవీలపై అనుమానం రావడంతో నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మదన్మోహన్రావు 2024 డిసెంబర్ 12న ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ బ్యాంక్‌లో 56 మంది పేరిట రూ.10.60 కోట్లు రుణాలు పొందినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసినా దర్యాప్తు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బ్యాంక్ ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంపై స్పందించకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. దీనిపై బ్యాంక్ ఇంతవరకు విచారణ జరపలేదు. 56 మంది పేరిట రూ.10.60 కోట్ల రుణం కాజేసినట్టు ప్రాథమికంగా బయటకు వచ్చినా.. నిందితులు 100 మంది పేరిట రూ.20 కోట్లకు పైగా కాజేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక అసలు పాత్రధారులెవరో బయటకు పొక్కనివ్వకుండా టీడీపీ పెద్దలు చర్యలు తీసుకున్నట్టు సమాచారం. మీడియా ముందుకొచ్చిన బాధితులు మోసపోయిన బాధిత గిరిజనులు ఆదివారం మీడియా ముందుకొచ్చారు. సుమారు 60 మంది తమకు జరిగిన మోసాన్ని యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసీ పెంచలయ్య, జిల్లా సంఘం చైర్మన్ రాపూరు కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు మానికల మురళి, ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్ర, మహిళ అధ్యక్షురాలు చెంబేటి ఉషతో కలిసి మీడియాకు వివరించారు. పైసా కూడా తీసుకోలేదు నాకు బ్యాంకుల సంగతి తెలియదు. ఇప్పుడు లోన్ కట్టాలని బ్యాంకు వాళ్లు చెన్నై నుంచి లాయర్ నోటీసులు పంపించారు. కొన్ని నెలల కిందట కొందరు వ్యక్తులు మాకు రుణాలు ఇప్పిస్తామని ఆధార్ కార్డులు తీసుకున్నారు. కానీ, ఏమైందో తెలియదు. ఏనాడూ బ్యాంక్‌కు వెళ్లలేదు. ఇప్పుడు రూ.15 లక్షలు రుణం తీసుకున్నారంటూ మాకు నోటీసులు పంపారు. – చలంచర్ల లక్ష్మీనారాయణ, గిరిజనుడు, చౌకిచర్ల, విడవలూరు మండలం కఠిన చర్యలు తీసుకోవాలి యాక్సిస్ బ్యాంక్ కుంభకోణంపై సీఐడీ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. మా జాతి ప్రజలను మోసం చేసిన జాలి వాసుదేవనాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్‌లను వెంటనే అరెస్ట్ చేయాలి. ఫేక్ కంపెనీలను సృష్టించి ఎస్సీ, ఎస్టీలను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించి మోసం చేశారు. ఈ మోసం వెనుక ఉన్న అసలు మోసగాళ్లను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి. బాధితులకు న్యాయం చేయాలి. – కేసీ పెంచలయ్య, అధ్యక్షుడు, యానాదుల సంక్షేమ సంఘం

ఈ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.ఏకాదశి ఉ.8.36 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: రోహిణి రా.9.04 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ప.1.34 నుండి 3.04 వరకు, తదుపరి రా.2.21 నుండి 3.51 వరకు, దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.23 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు, అమృతఘడియలు: సా.6.04 నుండి 7.35 వరకు, మతత్రయ ఏకాదశి; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.38, సూర్యాస్తమయం: 6.33. మేషం... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. సోదరులు,సోదరీలతో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరాశ.వృషభం... సన్నిహితులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. గృహయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.మిథునం.. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నిరాశ తప్పదు.కర్కాటకం.... ఉద్యోగ, విద్యాయత్నాలు అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు. ధనలాభం. ఆహ్వానాలు అందుతాయి..వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి.సింహం.... వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు లక్షా్యలు సాధిస్తారు. పనులు సక్రమంగా సాగుతాయి. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. దూరప్రయాణాలు. కొత్త ఉద్యోగాలు దక్కుతాయి.కన్య.... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలునత్తనడకన సాగుతాయి.తుల.... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.వృశ్చికం... చేపట్టిన పనులు సకాలంలో పూర్తి. ఆకస్మిక ధనలబ్ధి. నూతన పరిచయాలు.వాహనయోగం. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు శుభవార్తలు.ధనుస్సు... పలుకుబడి పెంచుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులు దగ్గరవుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.మకరం......ప్రయాణాలు వాయిదా. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు.కుంభం...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.ఆలోచనలు నిలకడగా ఉండవు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు సంభవం.మీనం..ఆకస్మిక ధనలాభం. మిత్రులతో మంచీచెడ్డా విచారిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

నితీశ్ రెడ్డి అవుట్!
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు భారత జట్టుకు గాయాల సమస్య ఎదురైంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి మోకాలి గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఆదివారం జిమ్‌లో ట్రైనింగ్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. పరీక్షల అనంతరం అతని గాయం తీవ్రత తెలిసింది. సిరీస్‌లో రెండో, మూడో టెస్టు ఆడిన నితీశ్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. లార్డ్స్ టెస్టులో 3 వికెట్లు తీయడంతో పాటు మొత్తం 43 పరుగులు చేశాడు. తొలి టెస్టులో శార్దుల్ ఠాకూర్ బరిలోకి దిగగా, అతని వైఫల్యంతో అదే తరహా ఆల్‌రౌండర్ అయిన నితీశ్‌కు అవకాశం దక్కింది. ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ ఇదే కూర్పుతో తుది జట్టును ఎంపిక చేస్తే మళ్లీ శార్దుల్ ఆడే అవకాశం ఉంది. మరోవైపు పేసర్లు ఆకాశ్‌దీప్, అర్ష్ దీప్ సింగ్ కూడా గాయాలతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఆకాశ్‌దీప్ తొడ కండరాల గాయంతో బాధపడుతుండగా, అర్ష్ దీప్ ఎడమ చేతికి గాయమైంది. రెండో టెస్టులో 10 వికెట్లతో భారత్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాశ్‌దీప్ లార్డ్స్ టెస్టులో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో లయను అందుకోలేక ఇబ్బంది పడిన అతను నాలుగో రోజు మధ్యాహ్నమే చికిత్స కోసం మైదానం వీడాడు. బెకెన్‌హామ్‌లో జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొన్నప్పుడు ఆకాశ్‌దీప్ అసలు బౌలింగ్‌కే దిగలేదు. మరోవైపు ఇంకా అరంగేట్రం చేయని అర్ష్ దీప్ సింగ్ నాలుగో టెస్టుకు దూరం కానున్నాడు. ఆకాశ్‌దీప్ ఆడకపోతే అతని స్థానంలో అర్ష్ దీప్ బరిలోకి దిగేవాడు. అయితే అతను కూడా అనూహ్యంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో బౌలింగ్ చేస్తున్న సమయంలో సాయి సుదర్శన్ కొట్టిన షాట్‌ను ఫాలో త్రూలో ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతికి గట్టి దెబ్బ తగిలింది. లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్ష్ దీప్ ఆపై చేతికి కట్టుతో వెనుదిరిగాడు. అతని చేతికి కుట్లు వేసినట్లు సమాచారం. ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు... ప్రధాన బౌలర్లు గాయాలబారిన పడటంతో ముందు జాగ్రత్తగా సెలక్టర్లు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అన్షుల్ కంబోజ్ను జట్టులోకి ఎంపిక చేశారు. ఈ సిరీస్‌కు ముందు అన్షుల్ భారత్ ‘ఎ’ జట్టు తరఫున రెండు అనధికారిక టెస్టులు ఆడాడు. నార్తాంప్టన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హరియాణాకు చెందిన అన్షుల్ 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 79 వికెట్లు తీసి 486 పరుగులు చేశాడు. గత రంజీ ట్రోఫీలో సీజన్లో కేరళతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్ పది వికెట్లు (10/49) పడగొట్టి సంచలనం సృష్టించిన అతను...రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు.

ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత, ఎంపీ పీవీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను కప్పిపుచ్చుకోవడానికి, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి.. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్లు చిత్రీకరిస్తూ.. వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు వాంగ్మూలాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సీఎం చంద్రబాబు రాష్ట్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. 2014–19 మధ్య జరిగిన అనేక కుంభకోణాల్లో.. తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. ఆ కేసుల్లో ఆయనతో పాటు ఆయన సన్నిహితులపై దర్యాప్తు నిలిపేయించుకున్న చంద్రబాబు.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు మద్యం అంశానికి సంబంధించి వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికను జత చేస్తూ ‘ఎక్స్’లో ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారనేది తిరుగులేని సాక్ష్యం ‘వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యుడు పీవీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా అక్రమ కేసు. ప్రజల తరఫున పోరాడేవారి గొంతు నొక్కేయడానికి రూపొందించిన కుట్ర తప్ప మరొకటి కాదు. వరుసగా మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బెదిరించి బలవంతంగా సేకరించిన అబద్ధపు వాంగ్మూలాలతో కేసులో అక్రమంగా ఇరికించారు. టీడీపీ ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య. జరగని మద్యం స్కామ్‌ను జరిగినట్లుగా చిత్రీకరించడం కేవలం మీడియా నాటకాల కోసం.. నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సృష్టించిన కల్పిత కథనం తప్ప మరొకటి కాదు. ఈ కుంభకోణం మొత్తం కేసు ఒత్తిడి, బెదిరింపులు, థర్డ్–డిగ్రీ హింస, లంచాలు, ప్రలోభాలాల ద్వారా సేకరించిన తప్పుడు వాంగ్మూలాలపై సృష్టించిందే. 2014–19 మధ్య కాలంలో మద్యం విధానానికి సంబంధించి అక్రమాలపై కేసులో చంద్రబాబు స్వయంగా బెయిల్‌పై ఉన్నాడనే వాస్తవం.. ఆయన ఇప్పుడు ఎందుకు ఇంత దిగజారిపోయాడనేదానికి తిరుగులేని సాక్ష్యం. 2014–19 మధ్య కాలంలో ఆయనపై నమోదైన మద్యం కుంభకోణం కేసును రద్దు చేసుకోవడానికి.. ఇప్పుడు 2024–29 మద్యం విధానాన్ని సమర్థించుకోవడానికి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారన్నది వాస్తవం. ఇలాంటి కుట్రలను ధైర్యంగా ఎదుర్కొన్నాం వైఎస్సార్సీపీని అణచి వేయడానికి ఇలాంటి కుట్రలు జరిగిన ప్రతిసారి మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. ప్రజలతో నిలబడి వారి పక్షాన ప్రశ్నిచడం, పోరాడటం ద్వారా మేము ఎదిగాము. అన్యాయాలపై రాజీలేని పోరాటాలు చేయడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రజల హృదయాల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది. పైన వివరించిన విధంగా టీడీపీ అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్యంపై జరిగిన నేరపూరిత దాడి కంటే తక్కువ కాదు. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా, వైఎస్సార్సీపీ ప్రజలతో నిలుస్తుందని, వారి గొంతుకగా, కవచంగా ఉంటుందని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. మద్యం అంశానికి సంబంధించి సమగ్ర నివేదికను మీ పరిశీలన కోసం జత చేస్తున్నాను.’ గత ప్రభుత్వ విజయాలు అపహాస్యం మద్యం కుంభకోణం విషయంలో వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే.. ప్రస్తుత టీడీపీ కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ రద్దు చేసిన మద్యం అవినీతి పద్ధతులను పునరుద్ధరిస్తోంది. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌ల పేరుతో మద్యం దుకాణాలు తిరిగి వచ్చాయి. వేలాది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లను మూసి వేయడం, మద్యం దుకాణాలను గణనీయంగా తగ్గించడం వంటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తుత కూటమి సర్కార్ అపహాస్యం చేస్తూ మళ్లీ పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపులు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు బ్యాక్ డోర్ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. మద్యం నియంత్రణను బలహీన పరుస్తోంది. మద్యం దుకాణాల లైసెన్స్‌లలో మళ్లీ అవినీతి, మాఫియా ప్రవేశించాయి. ఎంపిక చేసిన డిస్టిలరీలకు ఆర్డర్లు ఇవ్వడం ద్వారా 2019లో మేము అమలులోకి తెచ్చిన పారదర్శక ప్రభుత్వ దుకాణాల వ్యవస్థను రద్దు చేసింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసుచంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు రాష్ట్ర సంస్థలను, ఎల్లో మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. అనేక తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్‌పై ఉన్న కేసుల్లో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మధ్యం కుంభకోణం కూడా ఉంది. అప్పట్లో మద్యం సిండికేటు మాఫియాను పెంచి పోషించి అవినీతిని వ్యవస్థీకరించారు. అధికారంలోకి వచ్చాక, చంద్రబాబునాయుడు తనపై, తన సన్నిహితులపై ఉన్న ఆ తీవ్రమైన అవినీతి కేసుల దర్యాప్తును నిలిపి వేశారు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ప్రేరేపితమైన మద్యం కేసును రూపొందించడానికి చంద్రబాబు కుట్ర పన్నాడు. ప్రజల హృదయాల్లో పాతుకుపోతున్నారని..టీడీపీ నిజమైన ఎజెండా ఇప్పుడు స్పష్టంగా ఉంది. దర్యాప్తు ముసుగులో వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేయడానికి, వారిని నిరవధికంగా జైలులో ఉంచడానికి చట్టపరమైన ప్రక్రియను లాగడానికి వారు సిట్‌ను ఉపయోగించాలనుకుంటున్నారు. కానీ.. విచారణ ప్రారంభమైన తర్వాత అసలు నిజం బయట పడుతుంది. ఇది పూర్తిగా చట్టపరమైన అర్హత లేని నిరాధారమైన, రాజకీయంగా ప్రేరేపితమైన కేసు. వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేస్తున్నది వారు దోషులు కాబట్టి కాదు.. ప్రజల హృదయాల్లో లోతుగా పాతుకుపోతున్నారు కాబట్టి. ఇది చట్టపరమైన ప్రక్రియ కాదు. ఇది బలమైన ప్రతిపక్షాన్ని అస్థిర పరచడానికి ఉద్దేశించి సాగిస్తున్న రాజకీయ వేట.
‘నేను తగినవాడిని కాదనిపించింది’
నిద్రమాత్రలతో అతడికి ఏమీ కాలేదు
టార్గెట్ పెద్దిరెడ్డి.. నారావారి వికటాట్టహాసాలు
వెండితెర యాక్టర్.. వీగన్ అంబాసిడర్..
‘కుబేర’ పైరసీ చేసింది ఇలా..!
హమాస్ కమాండర్ హతం
వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..!
‘శశిథరూర్ మాతో లేరు.. మీటింగ్‌లకు పిలవం’
ప్రతి తప్పు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది: తమన్నా
ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు ముద్రగడ
రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
ఎలుక... ఎంత పని చేసింది!
పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. శుభవార్తలు వింటారు
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
మీ బండిపై చలాన్ ఉంది.. కట్టేయండి!
అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మియాపూర్: స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి మృతి
స్వామీ! మీరే కాపాడాలి.. ఎక్కడ మద్యం కేసులయినా మమ్మల్నే అందులోకి లాగుతున్నారు!
మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా
కాంగ్రెస్‌కు శశిథరూర్లాగా మనకూ ఈయన అలాగే ఉన్నాడనిపిస్తుంది సార్!
ODI WC 2011: యువీని సెలక్ట్ చేయడం అవసరమా?
గాజా నేలమట్టం
క్రికెట్ ప్లేయర్లు లంచ్ బ్రేక్‌లో ఏమి తింటారో తెలుసా?
పుష్ప 2 తొక్కిసలాట.. అల్లు అర్జున్ చేసిన తప్పు అదే!: విష్ణు
రాజమౌళి- మహేశ్ మూవీ.. ఊహించని విలన్!
‘నేను తగినవాడిని కాదనిపించింది’
నిద్రమాత్రలతో అతడికి ఏమీ కాలేదు
టార్గెట్ పెద్దిరెడ్డి.. నారావారి వికటాట్టహాసాలు
వెండితెర యాక్టర్.. వీగన్ అంబాసిడర్..
‘కుబేర’ పైరసీ చేసింది ఇలా..!
హమాస్ కమాండర్ హతం
వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..!
‘శశిథరూర్ మాతో లేరు.. మీటింగ్‌లకు పిలవం’
ప్రతి తప్పు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది: తమన్నా
ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు ముద్రగడ
రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
ఎలుక... ఎంత పని చేసింది!
పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. శుభవార్తలు వింటారు
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
మీ బండిపై చలాన్ ఉంది.. కట్టేయండి!
అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మియాపూర్: స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి మృతి
స్వామీ! మీరే కాపాడాలి.. ఎక్కడ మద్యం కేసులయినా మమ్మల్నే అందులోకి లాగుతున్నారు!
మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా
కాంగ్రెస్‌కు శశిథరూర్లాగా మనకూ ఈయన అలాగే ఉన్నాడనిపిస్తుంది సార్!
ODI WC 2011: యువీని సెలక్ట్ చేయడం అవసరమా?
గాజా నేలమట్టం
క్రికెట్ ప్లేయర్లు లంచ్ బ్రేక్‌లో ఏమి తింటారో తెలుసా?
పుష్ప 2 తొక్కిసలాట.. అల్లు అర్జున్ చేసిన తప్పు అదే!: విష్ణు
రాజమౌళి- మహేశ్ మూవీ.. ఊహించని విలన్!
సినిమా

బిగ్‌బాస్ సోనియా ప్రెగ్నెన్సీ రివీల్.. కమెడియన్‌తో సమంత
ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్‌బాస్ ఫేమ్ సోనియానదివే పాటని వెన్నెల కిశోర్‌తో రీల్ చేసిన సమంతబీచ్ వెకేషన్లో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్నడుము ఒంపుసొంపులు చూపించేస్తున్న ఇనయాపెర్ఫెక్ట్ షేప్ కనిపించేలా మౌనీ రాయ్ గ్లామర్పిల్లాడితో కనిమా రీల్ చేసిన రీతూ చౌదరిమత్తెక్కించేలా మారిపోయిన రుక్సార్ థిల్లాన్ View this post on Instagram A post shared by Yash Veeragoni (@yashveeragoni) View this post on Instagram A post shared by Rahul Ravindran (@rahulr_23) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

'భళ్లాలదేవ'గా నేనే చేయాలి.. కానీ అలా జరిగేసరికి: జయసుధ కొడుకు
గత దశాబ్దంలో తెలుగు సినిమా చాలా మారిపోయింది. 'బాహుబలి' సినిమా దెబ్బకు టాలీవుడ్.. ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే 'బాహుబలి' రిలీజై ఈ ఏడాదికి పదేళ్లయిన సందర్భంగా అక్టోబరులో రెండు పార్ట్స్ కలిసి ఒక్కటిగా రీ రిలీజ్ చేయబోతున్నారు. అందుకు తగ్గ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమాలోని భళ్లాలదేవ పాత్రని తానే చేయాల్సిందని, కొన్ని కారణాల వల్ల అది తప్పిపోయిందని సీనియర్ నటి జయసుధ కొడుకు చెబుతున్నాడు.ఇంతకీ ఏంటి విషయం?నటి జయసుధ కొడుకు పేరు నిహార్ కపూర్. హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. సహాయ నటుడిగానూ పలు చిత్రాల్లో కనిపించాడు. కాకపోతే గుర్తింపు రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. బాహుబలి మూవీలో అవకాశం మిస్ అయిన సంగతి చెప్పుకొచ్చాడు. అప్పుడు అసలేం జరిగిందో పూసగుచ్చినట్లు వెల్లడించాడు.(ఇదీ చదవండి: నిజజీవిత కథ.. 'గరివిడి లక్ష్మి' గ్లింప్స్ రిలీజ్)'భళ్లాలదేవుడి పాత్ర రానానే చేయాలి. కానీ ఆయన డేట్స్ సెట్ అవకపోవడంతో నన్ను అడిగారు. ఓకే చెప్పేశాను. నాలుగు వారాల ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆ పాత్రని రానా చేస్తానని మళ్లీ చెప్పడంతో నాకు కాలకేయ పాత్రని ఆఫర్ చేశారు. నేను ఆలోచనలో పడిపోయా. కాలకేయుడి పాత్రకు సంబంధించిన ఓ క్యారికేచర్ చూపించారు. పాత్ర ఇలా ఉంటుందని వివరించారు. ఎక్కువగా ప్రొస్థటిక్ మేకప్ వేశారు. ఇదే విషయాన్ని అమ్మకి చెబితే..'నీ మొదటి సినిమా ముఖం కూడా సరిగా కనిపించట్లేదు బాడీ కూడా కవర్ అయిపోతుంది. ప్రేక్షకులు గుర్తించరు' అని చెప్పారు''అమ్మ అలా చెప్పేసరికి 'బాహుబలి' టీమ్‌కి నో చెప్పేశాను. దీంతో ఆ పాత్రని ప్రభాకర్ చేశారు. క్యారికేచర్‌తో పోలిస్తే తెరపైకి వచ్చేసరికి పాత్ర లుక్ పూర్తిగా మారిపోయింది. అయితే ఆ రోల్ చేయనందుకు నేనేం బాధపడట్లేదు. మొదటినుంచి దర్శకుడు రాజమౌళి నాతో అన్ని విషయాలు మాట్లాడారు. ఆ తర్వాత సరదాగా షూటింగ్‌కి రమ్మంటే రెండు మూడుసార్లు వెళ్లాను' అని నిహార్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఏదైతేనేం నిహార్ మంచి ఛాన్స్ మిస్ అయ్యాడని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: Anushka Shetty: ఎక్కడికి వెళ్లినా ఆ దేవుడి విగ్రహం తనవెంటే!)

ఇండస్ట్రీలో మరో విషాదం.. స్టార్ డైరెక్టర్ ఇక లేరు
ఇండస్ట్రీలో మరో విషాదం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చంద్ర బరోట్(86) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయమై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. దర్శకుడికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.(ఇదీ చదవండి: యంగ్ హీరో నిఖిల్‌కి ఝలక్.. ట్వీట్ వైరల్)అమితాబ్ హీరోగా వచ్చిన 'డాన్' ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా తీసింది ఈయనే. అలా 'డాన్' దర్శకుడిగా చాలా ఫేమస్ అయిపోయారు. దీని తర్వాత ప్యార్ బరా దిల్, హాంకాంగ్ వాలీ స్క్రిప్ట్, నీల్ కో పకడ్నా తదితర చిత్రాల్ని తెరకెక్కించారు. కానీ, ఆయనకు అత్యంత గుర్తింపు తెచ్చింది మాత్రం డాన్. దర్శకత్వం వహించడానికి ముందు పురబ్ ఔర్ పచ్చిమ్, యాద్గార్, రోటీ కపడా ఔర్ మకాన్ తదితర మూవీస్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఈయన మృతి చెందడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: నిజజీవిత కథ.. 'గరివిడి లక్ష్మి' గ్లింప్స్ రిలీజ్)

రాముడిగా సూర్య, రావణుడిగా మోహన్‌బాబు, నేనేమో..: విష్ణు మంచు
మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie) అని అందరికీ తెలుసు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణంతో ఈ సినిమా తీశాడు. అందులో తనే కన్నప్ప పాత్రను పోషించాడు. మహాభారత్ సీరియల్ డైరెక్ట్ చేసిన ముకేశ్ కుమార్ ఈ చిత్రాన్ని అందంగా తెరకెక్కించాడు. జూన్ 27న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇటీవల రాష్ట్రపతి భవన్‌లోనూ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.2009లోనే..అయితే విష్ణు.. కన్నప్ప కంటే ముందు రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని ప్రయత్నించాడట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు మంచు మాట్లాడుతూ.. రావణుడి పుట్టుక నుంచి చావు వరకు ఏమేం జరిగిందనే కథంతా నా దగ్గరుంది. దీనిపై సినిమా తీయాలని నేను గతంలోనే అనుకున్నాను. ఈ ప్రాజెక్టులో సూర్య రాముడిగా నటిస్తే బాగుంటుందనుకున్నాను. ఇదే విషయం గురించి మాట్లాడేందుకు 2009లో సూర్యను కూడా సంప్రదించాను.హనుమంతుడిగా చేయాలనుకున్నా..రాఘవేంద్రరావును డైరెక్టర్‌గా అనుకున్నాను. అయితే రాఘవేంద్రరావుకు నేను హనుమంతుడి రోల్ చేయడం ఇష్టం లేదు. ఇంద్రజిత్తుడి పాత్ర చేస్తే బాగుంటుందన్నారు. రావణుడి పాత్ర మా నాన్న పోషించాల్సింది. స్క్రిప్టు.. డైలాగులు అన్నీ పూర్తయ్యాయి, కానీ బడ్జెట్ సమస్య వల్ల సినిమా పట్టాలెక్కలేదు. భవిష్యత్తులో రామాయణ మూవీ చేస్తానో, లేదో కూడా తెలీదు! సీతగా ఎవరంటే?ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం రాముడిగా మళ్లీ సూర్యనే ఎంపిక చేసుకుంటాను. సీతగా ఆలియాభట్‌ను సెలక్ట్ చేస్తాను. రావణుడిగా మా నాన్నను కాకుండా ఎవరినీ ఊహించుకోలేను. హనుమంతుడి పాత్ర నేనే చేస్తాను. ఇంద్రజిత్తుగా సూర్య సోదరుడు కార్తీ, లక్ష్మణుడిగా కళ్యాణ్ రామ్, జటాయువుగా సత్యరాజ్ చేస్తే బాగుంటుంది అని విష్ణు చెప్పుకొచ్చాడు.భారీ బడ్జెట్‌తో బాలీవుడ్లో రామాయణప్రస్తుతం బాలీవుడ్లో రామాయణ సినిమా తెరకెక్కుతోంది. నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. యష్ రావణుడిగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీంతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రామాయణ నిలిచింది. ఈ మూవీ మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు.చదవండి: నా జీవితానికి వెలుగు నీవే.. సితారకు మహేశ్ బర్త్‌డే విషెస్
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

‘యునైటెడ్ ఇన్ మాంచెస్టర్’
మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు ఒకవైపు నాలుగో టెస్టుకు సన్నద్ధమవుతూనే మరోవైపు విరామ సమయాన్ని సరదాగా గడుపుతోంది. తాజాగా విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ ‘మాంచెస్టర్ యునైటెడ్’ ప్రాక్టీస్ గ్రౌండ్‌ను టీమిండియా ఆటగాళ్లు సందర్శించారు. ఇరు జట్లకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న స్పోర్ట్స్‌వేర్ ‘అడిడాస్’ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. క్రికెట్, ఫుట్‌బాల్ టీమ్‌ల సభ్యులు పరస్పర గౌరవాన్ని ప్రదర్శిస్తూ జెర్సీలు మార్చుకున్నారు. భారత ఆటగాళ్లతో పాటు మాంచెస్టర్ ఆటగాళ్లంతా రెండు జట్లుగా విడిపోయి ముందుగా ఫుట్‌బాల్ ఆడారు. ఆపై మాంచెస్టర్ ప్లేయర్లు క్రికెట్లో తమ ఆసక్తి ప్రదర్శిస్తూ బ్యాటింగ్ చేశారు. స్టార్ డిఫెండర్ హ్యారీ మేగ్వైర్‌కు సిరాజ్ బౌలింగ్ చేయగా... ‘రెడ్ డెవిల్స్’ టీమ్ సభ్యులు డియాలో, మేసన్ మౌంట్ తదితరులతో ఫుట్‌బాల్ ఆడేందుకు పంత్, బుమ్రా ప్రత్యేక ఆసక్తి కనబర్చారు. మాంచెస్టర్ యునైటెడ్, పోర్చుగల్ జట్లకు కెపె్టన్ అయిన బ్రూనో ఫెర్నాండెజ్‌తో భారత కెపె్టన్ శుబ్‌మన్ గిల్ కబుర్లాడాడు. మరోవైపు భారత్, మాంచెస్టర్ యునైటెడ్ హెడ్ కోచ్‌లు గంభీర్, రూబెన్ అమోరిమ్ మధ్య కూడా సుదీర్ఘ సంభాషణ చోటు చేసుకుంది. శిక్షణ, నాయకత్వం, స్టార్ ఆటగాళ్లతో జట్లను నడిపించడంవంటి అంశాలపై చివర్లో ఇరు జట్ల కోచ్‌లు తమ అభిప్రాయాలు వెల్లడించడంతో కార్యక్రమం ముగిసింది. బుధవారం నుంచి ఓల్ట్ ట్రఫోర్డ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతుంది.

నితీశ్ రెడ్డి అవుట్!
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు భారత జట్టుకు గాయాల సమస్య ఎదురైంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి మోకాలి గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఆదివారం జిమ్‌లో ట్రైనింగ్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. పరీక్షల అనంతరం అతని గాయం తీవ్రత తెలిసింది. సిరీస్‌లో రెండో, మూడో టెస్టు ఆడిన నితీశ్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. లార్డ్స్ టెస్టులో 3 వికెట్లు తీయడంతో పాటు మొత్తం 43 పరుగులు చేశాడు. తొలి టెస్టులో శార్దుల్ ఠాకూర్ బరిలోకి దిగగా, అతని వైఫల్యంతో అదే తరహా ఆల్‌రౌండర్ అయిన నితీశ్‌కు అవకాశం దక్కింది. ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ ఇదే కూర్పుతో తుది జట్టును ఎంపిక చేస్తే మళ్లీ శార్దుల్ ఆడే అవకాశం ఉంది. మరోవైపు పేసర్లు ఆకాశ్‌దీప్, అర్ష్ దీప్ సింగ్ కూడా గాయాలతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఆకాశ్‌దీప్ తొడ కండరాల గాయంతో బాధపడుతుండగా, అర్ష్ దీప్ ఎడమ చేతికి గాయమైంది. రెండో టెస్టులో 10 వికెట్లతో భారత్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాశ్‌దీప్ లార్డ్స్ టెస్టులో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో లయను అందుకోలేక ఇబ్బంది పడిన అతను నాలుగో రోజు మధ్యాహ్నమే చికిత్స కోసం మైదానం వీడాడు. బెకెన్‌హామ్‌లో జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొన్నప్పుడు ఆకాశ్‌దీప్ అసలు బౌలింగ్‌కే దిగలేదు. మరోవైపు ఇంకా అరంగేట్రం చేయని అర్ష్ దీప్ సింగ్ నాలుగో టెస్టుకు దూరం కానున్నాడు. ఆకాశ్‌దీప్ ఆడకపోతే అతని స్థానంలో అర్ష్ దీప్ బరిలోకి దిగేవాడు. అయితే అతను కూడా అనూహ్యంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో బౌలింగ్ చేస్తున్న సమయంలో సాయి సుదర్శన్ కొట్టిన షాట్‌ను ఫాలో త్రూలో ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతికి గట్టి దెబ్బ తగిలింది. లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్ష్ దీప్ ఆపై చేతికి కట్టుతో వెనుదిరిగాడు. అతని చేతికి కుట్లు వేసినట్లు సమాచారం. ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు... ప్రధాన బౌలర్లు గాయాలబారిన పడటంతో ముందు జాగ్రత్తగా సెలక్టర్లు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అన్షుల్ కంబోజ్ను జట్టులోకి ఎంపిక చేశారు. ఈ సిరీస్‌కు ముందు అన్షుల్ భారత్ ‘ఎ’ జట్టు తరఫున రెండు అనధికారిక టెస్టులు ఆడాడు. నార్తాంప్టన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హరియాణాకు చెందిన అన్షుల్ 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 79 వికెట్లు తీసి 486 పరుగులు చేశాడు. గత రంజీ ట్రోఫీలో సీజన్లో కేరళతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్ పది వికెట్లు (10/49) పడగొట్టి సంచలనం సృష్టించిన అతను...రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు.

చరిత్ర సృష్టించేందుకు 25 పరుగుల దూరంలో శుబ్‌మన్ గిల్..
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు కోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోనే భారత జట్టు మాంచెస్టర్‌లో అడుగుపెట్టింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో టీమిండియా తీవ్రంగా శ్రమించనుంది. సిరీస్ సమమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్ గడ్డపై ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించేందుకు గిల్ సిద్దంగా ఉన్నాడు.ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం మహ్మద్ యూసుఫ్ పేరిట ఉంది. అతడు 2006 ఇంగ్లండ్ టూర్లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 90.14 సగటుతో 631 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 202గా ఉంటుంది.ఇప్పుడు మాంచెస్టర్‌లో శుబ్‌మన్ మరో 25 పరుగులు సాధిస్తే.. యూసుఫ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ప్రస్తుత సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి 101.16 సగటుతో 607 పరుగులు చేశాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన గిల్.. అనంతరం బర్మింగ్‌హామ్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా ద్విశతకంతో మెరిశాడు. అతడి అత్యధిక స్కోర్ 269గా ఉంది.ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్లుమహ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్) - 2006లో 4 మ్యాచ్‌ల్లో 631 పరుగులుశుభ్మన్ గిల్ (భారత్) - 2025లో 3 మ్యాచ్‌ల నుండి 607 పరుగులురాహుల్ ద్రవిడ్ (భారత్) - 2002లో 4 మ్యాచ్‌ల నుండి 602 పరుగులువిరాట్ కోహ్లీ (భారత్) - 2018లో 5 మ్యాచ్‌ల నుండి 593 పరుగులుసునీల్ గవాస్కర్ (భారత్) - 1979లో 4 మ్యాచ్‌ల నుండి 542 పరుగులుసలీమ్ మాలిక్ (పాకిస్తాన్) - 1992లో 5 మ్యాచ్‌ల నుండి 488 పరుగులుగిల్కు కఠిన పరీక్ష..కాగా మాంచెస్టర్ టెస్టు రూపంలో గిల్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ప్రస్తుతం భారత్ 1-2తో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో ఓడిన అనంతరం టీమిండియా రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత లార్డ్స్ టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది.దీంతో ఇప్పుడు నాలుగో టెస్టు భారత జట్టుకు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవకపోతే సిరీస్ కోల్పోనుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో గిల్ తన కెప్టెన్సీతో జట్టును ఎలా నడిపిస్తాడో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.చదవండి: #Karun Nair: అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై

నితీశ్‌ను పక్కన పెట్టండి.. ఇప్పటికైనా అతడిని ఆడించండి: హర్భజన్
భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి లార్డ్స్ టెస్టులో ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా కసితో ఉంది. ఈ కీలక మ్యాచ్ కోసం గిల్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మాంచెస్టర్ టెస్టు కోసం భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో చేయవలసిన మార్పులను మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ధానంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని భజ్జీ టీమ్ మెనెజ్‌మెంట్‌ను కోరాడు. ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు, రెండో టెస్టులో కుల్దీప్ ఆడుతాడని అంతా భావించారు. కానీ హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ గిల్.. వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.సుందర్ మెరుగైన ప్రదర్శన చేయడంతో మూడో టెస్టులో కూడా అతడిని కొనసాగించారు. ఇప్పుడు మాంచెస్టర్ వికెట్ కాస్త ఫ్లాట్ ఉండే అవకాశమున్నందన కుల్దీప్ను ఆడించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈజాబితాలో భజ్జీ కూడా చేరాడు. ఇప్పటికైనా అతడిని ఆడించండి.."బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని నేను సూచించాను. కానీ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ తర్వాత లార్డ్స్ టెస్టులోనైనా ఛాన్స్ ఇవ్వండి చెప్పాను. అప్పుడు కూడా అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు. మాంచెస్టర్ టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను కచ్చితంగా ఆడించాలి. ఎందుకంటే ఇంగ్లీష్ బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను ఆర్ధం చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. దూకుడుగా ఆడే ఇంగ్లండ్ బ్యాటర్లకు కుల్దీప్ను ఎటాక్ అంత సులువు కాదు. అతడికి బంతిని రెండు వైపులా టర్న్ చేసే సత్తా ఉంది. కుల్దీప్ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టే మిస్టరీ బౌలర్. టెస్టు క్రికెట్లో కొత్త బంతితో వికెట్ల పడగొట్టే బౌలర్ కాదు, పాత బంతితో కూడా అద్బుతాలు చేసే బౌలర్ జట్టుకు కావాలి. ఆ సత్తా కుల్దీప్ వద్ద ఉంది. కాబట్టి కుల్దీప్ కోసం భారత జట్టు మెనెజ్‌మెంట్ ఓ బ్యాటర్‌ను పక్కన పెట్టాల్సి వస్తోంది. నేను టీమ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఉంటే నేరుగా నితీశ్ స్ధానంలో కుల్దీప్ను జట్టులోకి తీసుకువస్తాను అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు.
బిజినెస్

తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన లాభాలు
ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 ఏప్రిల్–జూన్ కాలానికి రూ.4,116 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2024 ఇదే కాలానికి ఆర్జించిన రూ.3,679 కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. మొత్తం ఆదాయం రూ.30,874 కోట్ల నుంచి రూ.31,791 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.26,364 కోట్ల నుంచి అధికమై రూ.27,296 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.9,412 కోట్ల నుంచి రూ.9,113 కోట్లకు దిగివచ్చింది. నిర్వహణ లాభం 11% క్షీణించి రూ.7,785 కోట్ల నుంచి రూ.6,909 కోట్లకు తగ్గింది.స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) 4.54% నుంచి 3.52 శాతానికి, నికర ఎన్పీఏలు 0.90% నుంచి 0.62 శాతానికి తగ్గాయి. మొండి రుణాలకు ప్రొవిజన్ల కేటాయింపు రూ.1,651 కోట్ల నుంచి రూ.1,153 కోట్లకు తగ్గాయి. స్థూల అడ్వాన్సులు 6.83% పుంజుకొని 9,12,214 కోట్ల నుంచి రూ.9,74,489 కోట్లకు చేరుకున్నాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో(పీసీఆర్) 116 బేసిస్ పాయింట్లు పెరిగి 93.49 శాతం నుంచి 94.65 శాతానికి చేరింది. మొత్తం వ్యాపారం 5% వృద్ధి చెంది రూ.21,08,762 కోట్ల నుంచి రూ.22,14,422 కోట్లకు ఎగసింది.సెంట్రల్ బ్యాంక్ ఫలితాలు భేష్ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. ఆదా యం మెరుగవడం, మొండి రుణాలు (ఎన్పీఏలు) తగ్గడంతో ఏప్రిల్–జూన్‌లో రూ.1,169 కోట్ల నికర లాభా న్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2024– 25) ఇదే క్యూ1 నికర లాభం రూ.880 కోట్లతో పోలి స్తే ఇది 33% అధికం. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.9,500 కోట్ల నుంచి రూ.10,374 కోట్లకు ఎగసింది.బ్యాంకు వడ్డీ ఆదాయం రూ.8,335 కోట్ల నుంచి రూ.8,589 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 19% పెరిగి రూ.2,304 కోట్లకు చేరింది. ఆస్తుల నాణ్యత మెరుగవడంతో స్థూల మొండి బకాయిలు 4.54% నుంచి 3.13 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 0.73% నుంచి 0.49 శాతానికి తగ్గాయి. స్థూల అడ్వాన్సులు 9.97% పుంజుకొని 2,50,615 కోట్ల నుంచి రూ.2,75,595 కోట్లకు చేరుకున్నాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 96.17 % నుంచి 97.02 శాతం పెరిగింది. కనీస మూలధన నిష్పత్తి 15.6% నుంచి 17.6 శాతానికి మెరుగైంది. మొత్తం వ్యాపారం 11% వృద్ధి చెంది రూ.6,35,564 కోట్ల నుంచి రూ.7,04,485 కోట్లకు ఎగసింది.

48 గంటల్లో 2 లక్షలకుపైగా ఆర్డర్లు..
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన సెవెంత్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం భారత్‌లో లాంచ్ అయిన 48 గంటల్లోనే 2.1 లక్షల ప్రీ-ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. శాంసంగ్ ఏడో తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ స్మార్ట్ఫోన్లు జూలై 9న భారత్‌లో లాంచ్ అయ్యాయి.ఇంత భారీ సంఖ్యలో ప్రీ-ఆర్డర్లు రావడం "బ్రాండ్ ఏడవ తరం ఫోల్డబుల్ కోసం వినియోగదారుల్లో భారీ డిమాండ్, ఉత్సాహాన్ని" సూచిస్తున్నాయని శాంసంగ్ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ ఎస్ 25 సిరీస్ కోసం వచ్చిన ప్రీ-ఆర్డర్లకు ఇది దాదాపు సమానం అని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది.శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 25 లాంచ్ అయిన మూడు వారాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 4.3 లక్షల ప్రీ-ఆర్డర్లను అందుకుంది. మొదటి 48 గంటల్లో, ఎస్ 25, ఫోల్డ్ 7 / ఫ్లిప్ 7 కోసం ప్రీ-ఆర్డర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల ధర రూ.89,000 నుంచి రూ.2.11 లక్షల మధ్యలో ఉంది.గెలాక్సీ జెడ్ ఫోల్డ్7 ధర రూ.1.75 లక్షల నుంచి ప్రారంభమై రూ.2.11 లక్షల వరకు ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.22 లక్షల మధ్యలో ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ధర రూ.89,000 నుంచి రూ.95,999 వరకు ఉంది. భారత మార్కెట్లో శాంసంగ్ సూపర్ ప్రీమియం కేటగిరీలో అమెరికాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తో పోటీ పడుతోంది.ఐడీసీ ప్రకారం, భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో ముందంజలో ఉంది. ఇది 2025 తొలి త్రైమాసికంలో 19.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత శాంసంగ్ 16.4 శాతం ఎగుమతులతో రెండో స్థానంలో ఉంది.

అబ్బా.. ఇంటికి ఏముంది ఎలివేషన్!
గతంలో ఇల్లు అంటే నాలుగు గోడలుండే నిర్మాణం. కానీ, ఇప్పుడు ఇల్లంటే ఓ హోదా.. హుందా! ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు సొంతింటివాసులు. నిర్మాణ సంస్థలూ తక్కువేం కాదు.. సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో కనిపించే విభిన్న తరహా నిర్మాణాలను భాగ్యనగరంలో నిర్మించేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎలివేషన్స్ నుంచే సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టేస్తున్నారు. పడవ ఆకారంలో ఎలివేషన్, ఎలివేషన్‌లోనే వర్టికల్ గార్డెన్ ఏర్పాటు వంటివి ఈ జాబితాలోనివే మరి!! – సాక్షి, సిటీబ్యూరోపిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మాణాలుండాలి. మూస ధోరణిలో నిర్మించే ప్రాజెక్ట్‌లను ప్రజలు ఆదరించట్లేదు. విదేశీ తరహాలో నిర్మాణం.. అన్ని రకాల వసతులు.. అదీ అందుబాటు ధరల్లో ఉండే ప్రాజెక్టులు అంటే కస్టమర్లు జై కొడుతున్నారు. దీంతో విదేశాల్లో కనిపించే విభిన్న నిర్మాణాలు ఇప్పుడు భాగ్యనగరంలోనూ కనిపిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించడం కోసం విభిన్న ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో సంస్థల మధ్య పోటీ పెరిగి భాగ్యనగరం హంగులు అద్దుకుంటోంది.ఎలివేషన్లలో వర్టికల్ గార్డెన్..రిసార్ట్, విల్లాల్లో విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. అందుకే చుట్టూ పచ్చదనంతో ల్యాండ్ స్కేపింగ్ చేస్తారు. కానీ, అపార్ట్‌మెంట్స్‌లో.. అది కూడా స్థలాల లభ్యత తక్కువగా ఉండే మహానగరాల్లో కాసింత కష్టమే. దీనికి పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది నిలువైన ఉద్యానవనాలు(వర్టికల్ గార్డెన్స్).భవనాల ఎలివేషన్లలో నిలువుగా మొక్కలు పెంచడం వర్టికల్ గార్డెన్స్ ప్రత్యేకత. అయితే ఇవి ఎలివేషన్, బయటి గోడల మీదనే సాధ్యమవుతాయి. ఎండ పడని ప్రాంతంలో అంటే ఇంట్లో, హాల్లో, బెడ్ రూమ్‌లో వర్టికల్ గార్డెన్స్‌ను పెంచడం కుదరదు. ఇక్కడ పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు. సూర్యరశ్మి పడే ప్రాంతమైతే వర్టికల్ గార్డెన్స్‌లో కూరగాయలు, ఆకుకూరలు కూడా పెంచుకునే వీలు కూడా ఉంటుంది.ఖర్చు ఎక్కువే..సాధారణ భవనాలతో పోలిస్తే వరి్టకల్ గార్డెన్స్ భవనాల ధర చ.అ.కు రూ.100–200 అధికంగా ఖర్చవుతుంది. అయినా సరే బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారు. కస్టమర్లకు ఏదో నాలుగు గోడలుండే ఇంటిని అందించాలని కాకుండా వారి ఇంటిని అందంగా.. ఆరోగ్యకరంగా బృందావనంగా తీర్చిదిద్దుతున్నారు. వర్టికల్ గార్డెన్స్ భవనాలు పర్యావరణహితంగా ఉంటాయి. శబ్ధ, వాయు కాలుష్యం తక్కువగా ఉండటంతో పాటు ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. భవనం గోడలు, పిల్లర్లను ఆధారం చేసుకొని బయోలాజికల్ ఎరువులతో పెంచడం వల్ల భవనం చల్లగా ఉంటుంది.పిల్లలే లక్ష్యంగా..ఇంటి కొనుగోళ్లలో పిల్లల అభిరుచులకు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే పిల్లల అభిరుచులకు అనుగుణంగా విదేశీ ఆర్కిటెక్చర్లతో ప్రాజెక్ట్‌లను డిజైన్ చేయిస్తున్నారు బిల్డర్లు. ఇందుకోసం ప్రాజెక్ట్ ఎలివేషన్ దగ్గర నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విశాలమైన ఆట స్థలాలు, వినూత్నమైన ఎలివేషన్లతోనే పిల్లల్ని ఆకట్టుకుంటే.. ప్రాజెక్ట్‌లోనే పాఠశాలలు, ఆస్పత్రుల వంటి ఏర్పాటుతో తల్లిదండ్రులనూ కట్టిపడేస్తున్నారు.అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్‌కు తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.ప్రాజెక్ట్‌లో క్లబ్ హౌస్, స్విమ్మిగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలే కాకుండా ఇందులోనే పాఠశాల, ఆస్పత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని నిపుణులు అంటున్నారు. ప్రాజెక్ట్‌లో క్లబ్‌హౌజ్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి వసతులు కల్పించాలంటే కొంత స్థలాన్ని కేటాయిస్తారు. అలా కాకుండా ఎలివేషన్‌కు కేటాయించే స్థలంలో ఈ వసతులను కల్పిస్తే.. స్థలం వినియోగంతో పాటు ఫ్లాట్ల విస్తీర్ణమూ పెరుగుతుంది.

‘బేబీ గ్రోక్’ వస్తుంది.. పిల్లల కోసం ప్రత్యేక ఏఐ యాప్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏఐ పిల్లల కోసం ప్రత్యేక ఏఐ చాట్‌బాట్ యాప్‌ను తీసుకురానుంది. తమ గ్రోక్ చాట్‌బాట్‌కు కిడ్-ఫ్రెండ్లీ వెర్షన్‌ను రూపొందించే పనిలో ఉన్నట్లు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) పోస్ట్ చేశారు.'ఎక్స్ఏఐలో బేబీ గ్రోక్ అనే యాప్‌ను రూపొందించబోతున్నాం' అని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. పిల్లలకే ప్రత్యేకమైన కంటెంట్‌తో ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త వెర్షన్ యువ వినియోగదారుల కోసం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు, అయితే మరిన్ని వివరాలను ఇంకా ప్రకటించలేదు.మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ స్పామ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్‌ఫామ్‌పై కొత్త గ్రోక్ ప్రస్తావనలను తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు వైరల్ వీడియోలను జనరేట్ చేయడానికి, దాని సృజనాత్మక సాధనాలను మరింత విస్తరించడానికి వీలు కల్పించే ‘ఇమాజిన్’ అనే కొత్త సామర్థ్యాన్ని ‘గ్రోక్’కు జోడించే పనిలో ఉన్నట్లు కూడా మస్క్ ఇటీవల వెల్లడించారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. 44 శాతం మంది పిల్లలు జనరేటివ్ ఏఐని చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఇందులో తమ స్కూల్ వర్క్ లేదా హోమ్ వర్క్ చేయడానికే 54 శాతం వినియోగం ఉంటోంది.We’re going to make Baby Grok @xAI, an app dedicated to kid-friendly content— Elon Musk (@elonmusk) July 20, 2025
ఫ్యామిలీ

నీలిరంగులో కనిపించే పండ్లు, కూరగాయలు ఇవే..!
కొన్ని పండ్లు, కూరగాయలు సర్వసాధారణంగా ఒక నిర్దిష్టమైన రంగులో ఉంటాయి. అవి భిన్నమైన రంగులో కనిపిస్తే, అదొక విచిత్రంగా ఉంటుంది. అలవాటైన రంగుల్లో కాకుండా, నీలిరంగులో కనిపించే కొన్ని రకాల పండ్లు, కూరగాయల సంగతి తెలుసుకుందాం...టొమాటోలు పండిన తర్వాత ఎర్రని ఎరుపురంగులో ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అరుదుగా కొన్ని జాతుల టొమాటోలు ముదురు నీలి రంగులోను, ముదురు ఊదా రంగులోను ఉంటాయి. వీటిని ‘బ్లూ టొమాటో’ అని, ‘పర్పుల్ టొమాటో’ అని అంటారు. ఇవి ప్రకృతి సిద్ధంగా పండినవి కాదు. ఇంగ్లండ్‌లోని జాన్ ఇనెస్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు జన్యు మార్పిడి ద్వారా ఈ నీలి టొమాటో జాతులను సృష్టించారు. నేరేడు జాతికి చెందిన పండ్ల రంగుకు కారణమైన పిగ్మెంట్‌తో ముదురు నీలి, ముదురు ఊదా రంగులు వచ్చేలా టొమాటోలను రూపొందించారు. వీటిని ఇప్పుడు పలు యూరోపియన్ దేశాల్లో పండిస్తున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, ఈ జాతుల టొమాటో మొక్కలు చీడ పీడలను తట్టుకుని పుష్కలంగా దిగుబడిని ఇవ్వగలవని చెబుతున్నారు.బ్లూ క్యారట్స్మొక్కజొన్న దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా దొరుకుతుంది. సాధారణంగా మొక్కజొన్న గింజలు పసుపు రంగులో ఉంటాయి. అక్కడక్కడా లేత పసుపు, తెలుపు రంగు గింజలతో కూడా ఉంటాయి. అరుదుగా నీలి రంగు గింజలు ఉండే మొక్కజొన్నలు మెక్సికోలో పండుతాయి. మామూలు మొక్కజొన్న మాదిరిగానే నీలి మొక్కజొన్నను కూడా రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. సాధారణ మొక్కజొన్నల కంటే నీలి మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు.నీలి ముల్లంగిమన దేశంలో ఎక్కువగా ముల్లంగి తెలుపు రంగులోనే దొరుకుతుంది. కొన్ని దేశాల్లో ఎరుపు, పసుపు, గులాబి వంటి రంగుల్లో కూడా దొరుకుతుంది. అరుదుగా కొన్ని చోట్ల ముదురు నీలి, ముదురు ఊదా రంగుల్లో కూడా ముల్లంగి దొరుకుతుంది. నీలి, ఊదా రంగుల్లో ఉన్న ముల్లంగిని కోస్తే, లోపలి భాగంలో నీలి, ఊదా రంగులతో పాటు కొంత తెలుపుదనం కూడా ఉంటుంది. రుచికి ఈ రకం ముల్లంగి కొంచెం తీపిగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. వీటిని పచ్చిగా తినడంతో పాటు సలాడ్లు, ఇతర వంటకాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.చిలకడ దుంపలు సాధారణంగా కాస్త ఎరుపురంగు తొక్కతోను, లేత గోధుమ రంగు తొక్కతోను ఉంటాయి. తొక్క రంగు ఎలా ఉన్నా, లోపలి భాగం తెలుపుగా లేదా లేత నారింజరంగులోను ఉంటుంది. ముదురు రంగు తొక్క కలిగి, లోపలి భాగం కూడా ముదురు ఊదా రంగు లేదా ముదురు నీలి రంగులో ఉండే ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకాన్ని జపాన్‌లో పండిస్తారు. దీనిని ‘ఒకినావన్ స్వీట్ పొటాటో’ అంటారు. సాధారణ చిలకడ దుంపల కంటే ఈ ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకానికి చెందిన చిలకడ దుంపల్లో పోషకాలు మరింత అధికంగా ఉంటాయని చెబుతారు.నీలి అరటిపండ్లుఅరటిపండ్లు ఎక్కువగా పసుపురంగులో ఉంటాయి. కొన్ని ఆకుపచ్చగాను, అరుదుగా ఇంకొన్ని ఎరుపు రంగులోను ఉంటాయి. జావాలో మాత్రం ప్రపంచంలోనే అత్యంత అరుదైన నీలిరంగు అరటిపండ్లు పండుతాయి. దీనిని ‘బ్లూ జావా బనానా’ అని, ‘హవాయిన్ బనానా’ అని అంటారు. అరటిచెట్లు శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పెరగవు. అయితే, ఈ నీలి అరటిపండ్ల జాతికి చెందిన చెట్లు మాత్రం చల్లని వాతావరణాన్ని కూడా తట్టుకుని పెరగగలవు. దీని రుచి వెనీలా ఐస్‌క్రీమ్‌లా ఉంటుంది. అందువల్ల దీనిని ‘వెనీలా బనానా’ అని, ‘ఐస్‌క్రీమ్ బనానా’ అని కూడా అంటారు. ఇప్పుడు వీటిని యూరోపియన్ దేశాల్లో కూడా పండిస్తున్నారు.బ్లూ స్వీట్ పొటాటోచిలకడ దుంపలు సాధారణంగా కాస్త ఎరుపురంగు తొక్కతోను, లేత గోధుమ రంగు తొక్కతోను ఉంటాయి. తొక్క రంగు ఎలా ఉన్నా, లోపలి భాగం తెలుపుగా లేదా లేత నారింజరంగులోను ఉంటుంది. ముదురు రంగు తొక్క కలిగి, లోపలి భాగం కూడా ముదురు ఊదా రంగు లేదా ముదురు నీలి రంగులో ఉండే ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకాన్ని జపాన్‌లో పండిస్తారు. దీనిని ‘ఒకినావన్ స్వీట్ పొటాటో’ అంటారు. సాధారణ చిలకడ దుంపల కంటే ఈ ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకానికి చెందిన చిలకడ దుంపల్లో పోషకాలు మరింత అధికంగా ఉంటాయని చెబుతారు.బ్లూ పొటాటోబంగాళ దుంపలు పైకి గోధుమరంగులో ఉంటాయి. తొక్క తీశాక తెలుపురంగులో ఉంటాయి. అయితే, ముదురు నీలి రంగులోను, ముదురు ఊదా రంగులోను ఉండే బంగాళ దుంపలు కూడా ఉన్నాయి. తొక్క తీసి, తరిగిన తర్వాత కూడా ఈ దుంపలు ముదురు ఊదా లేదా నీలి రంగుల్లోనే ఉంటాయి. ‘అడిరోన్డాక్ బ్లూ’ జాతికి చెందిన బంగాళ దుంపలు ఈ ముదురు ఊదా లేదా నీలి రంగుల్లో ఉంటాయి. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీటి నుంచి మరిన్ని నీలిరంగు బంగాళ దుంపల జాతులను కూడా ఇటీవలి కాలంలో అభివృద్ధి చేశారు. (చదవండి: పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?)

పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?
నాకు ముప్పై ఐదు ఏళ్లు. మోకాలి నొప్పి చాలా ఎక్కువగా ఉంది. కొన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ వాడాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను. మునుపటి మందుల వలన ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఇప్పటికీ ఆ మందులు వాడొచ్చా?– అనిత, మెదక్.మీరు చెప్పిన మోకాలి నొప్పి సమస్య ఆస్టియో ఆర్థరైటిస్ కారణం కావచ్చు. ఇది జాయింట్ డీజెనరేషన్ లక్షణాలలో ఒకటి కావచ్చు. పెయిన్ కిల్లర్ మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కాని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో మాత్రం ఈ మందుల వాడకాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఐబుప్రొఫెన్ లాంటి మందులు తక్కువ కాలం ఉపశమనం ఇస్తాయి కాని, దీర్ఘకాలంగా వాడడం సురక్షితమేమీ కాదు. ముందుగా పూర్తి పరీక్షలు చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి. ఐబుప్రొఫెన్ వంటి మందులు ఎన్ ఎస్ఎఐడీ గ్రూపులోకి వస్తాయి. ఇవి నొప్పికి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. అయితే కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా వుంటాయి. మోకాలిలో నొప్పి లేదా గట్టిపడటం వంటి సందర్భాల్లో శరీరంలో ప్రోస్టాగ్లాండిన్లు అనే కెమికల్స్ విడుదల అవుతాయి. వీటిని తగ్గించడానికే ఈ మందులు పనిచేస్తాయి. ప్రెగ్నెన్సీలో వీటిని వాడితే పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్ని మందులు జీర్ణాశయంలో అల్సర్లు, శ్వాస సమస్యలు, బ్లడ్ క్లాట్లు వంటి ఇబ్బందులు కలిగించవచ్చు. హెర్బల్ మందులు కూడా డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో ఏ ఔషధాన్నైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే వాడాలి.నాకు యాభై ఐదు ఏళ్లు. ఇటీవల వజైనాలో పొడిగా ఉంటోంది. ఇరిటేషన్, ఇచింగ్, డిశ్చార్జ్ వస్తోంది. కొన్ని క్రీములు వాడాను. అయినా తగ్గడం లేదు. పరిష్కారం చెప్పండి.– సుజాత, రాజోలు.వజైనాలో పొడిబారడం అంటే ఎక్కువగా హార్మోనుల మార్పుల వలన వచ్చే సమస్య. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పచ్చటి డిశ్చార్జ్ వస్తే, అది ఇన్ఫెక్షన్ కావొచ్చు. పొడిగా మారడం, ఇచింగ్ అనేవి వజైనల్ వాల్స్, యూరినరీ ట్రాక్ట్ సున్నితంగా మారినప్పుడు జరుగుతుంది. ఆరోగ్యకరమైన వజైనల్ మ్యూకస్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. దీనివల్ల వజైనాలో తేమ తగ్గిపోతుంది. ఇక ఎక్కువ మంది బాధపడే ఇచింగ్ సమస్యకు కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు, వజైనల్ బ్యాక్టీరియా లోపం కూడా కారణం కావచ్చు. మెనోపాజ్ తర్వాత ఓవరీల నుంచి ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒత్తిడి వల్ల కూడా తేమ తగ్గే అవకాశం ఉంటుంది. వజైనల్ గ్లాండ్లు ఈస్ట్రోజ పై ఆధారపడి మ్యూకస్ తయారుచేస్తాయి. అవి తగ్గిపోతే పొడి సమస్య ఎక్కువవుతుంది. యాంటీఫంగల్ ఆయింట్మెంట్లు, పౌడర్లు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కానీ మళ్లీ మళ్లీ వస్తుంటుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఈస్ట్రోజన్ క్రీములు, వజైనల్ లూబ్రికెంట్లు, వజైనల్ ఈస్ట్రోజన్ టాబ్లెట్లు, కొన్ని ప్రత్యేకమైన మందులు డాక్టర్ సూచనతోనే వాడాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారు ఈ చికిత్సలు తీసుకోకూడదు. కనుక తప్పకుండా గైనకాలజిస్టును సంప్రదించి, వారి సూచనల మేరకు తగిన చికిత్స తీసుకోవాలి.(చదవండి: పెద్ద పిల్లల్లో చొల్లు చేటే..! సీరియస్‌గా తీసుకోవాల్సిందే..)

ధోతికట్టు..అదిరేట్టు..!
‘పంచె కట్టుటలోన ప్రపంచాన మొనగాడుకండువా లేనిదే గడపదాటని వాడుపంచ భక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడుసినారె.. రాసిన ఈ నాలుగు పంక్తుల్లో తెలుగువాడి పంచెకట్టు వైభవాన్ని చాటి చెప్పాయి.ధోతి ఒక అంచును పైనున్న లాల్చీ కుడి జేబులో పెట్టుకుని కనిపించిన నందమూరి తారకరామారావు తన తెలుగుదనపు ఠీవీని ప్రదర్శించారు. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం తనదైన శైలి పంచెకట్టుతో మూర్తీభవించిన తెలుగుదనానికి ప్రతిరూపంగా కనిపించేవారు. తెలుగు వారు ఠీవీగా చాటుకునే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సైతం విదేశీ పర్యటనలు మినహా ఎప్పుడూ పంచె కట్టును వీడింది లేదు’.ఈవెంట్లలోనే..నాటి తరం కట్టు బొట్టు ఇప్పడు ఫ్యాషన్ ట్రెండ్ అయింది. ప్రత్యేక సందర్భాల్లో నాటి చీరకట్టులో ప్రత్యేకత చాటుకుంటున్నారు. నాటి వస్త్రధారణ నేటి ఈవెంట్స్‌లో సరికొత్త సంప్రదాయ అలంకరణగా మారింది.– పడకంటి ఇందు,చామ కృష్ణవేణి, కరీంనగర్ ఎనభై ఏళ్లుగా..మా పుట్టిల్లు మర్తనపేట. అత్తగారి ఊరు ఇప్పలపెల్లి. పెళ్లయిన నాటి నుంచి ఇదే తరహా గోచీ చీరలే ధరిస్తున్న. 80 ఏళ్లు దాటుతున్నా మరో ఆలోచన లేదు. 18 మూరల చీరను కూడా సులువుగా కట్టుకుంటాం. కష్టం చేసుకుని బతికెటోళ్లకు ఇదే సౌకర్యం. – గొడుగు లచ్చవ్వ, ఇప్పలపల్లి సాగు పనులకు అనుకూలంనా చిన్నప్పటి నుంచి గోచీ గుడ్డ ధరించేది. కొంత పెద్దయ్యాక మొదలైన ధోతికట్టు ఇప్పటి వరకూ కొనసాగిస్తున్న. ధోతితో ఉండే సౌకర్యం మరే వస్త్రంతో ఉండదు. వ్యవసాయం చేసుకునే మాలాంటి కుటుంబాల్లో మగవాళ్లందరికీ ధోతికట్టే అలవాటైంది. సాగు పనులకు సౌకర్యంగా ఉండడం ధోతికట్టులో ఉన్నంతగా మరి దేనిలోనూ ఉండదు.సలేంద్రి దేవయ్య, పెద్దూరు అర్ధశతాబ్దకాలం క్రితం వరకు పురుషులు పంచెకట్టు, స్త్రీలు గోచి చీరలతో ఇబ్బడిముబ్బడిగా దర్శనమిచ్చేవారు. క్రమంగా ఈ వస్త్రధారణలో మార్పు ప్రవేశించింది. పల్లె సీమల్లో ఒక ఈడు దాటిన స్త్రీ, పురుషులు ఇంకా అక్కడక్కడా దర్శనమిస్తున్నా మెజార్టీ ప్రజల్లో ఈ అలవాటు దాదాపు కనుమరుగయ్యే దశ కనిపిస్తోంది. పంచెకట్టు ఒక తరం ఉనికిని, అస్తిత్వాన్ని, సాంస్కృతిక జీవన విధానాన్ని ప్రతిబింబించింది. ఆధ్యాత్మిక కార్యాలు, వివాహాది శుభకార్యాల సమయంలో వరుడితో పాటు అతని తండ్రి, కన్యాదానం చేసే వధువు తండ్రి సైతం పంచెకట్టుకే ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ పిల్లలకు ఐదారేళ్ల వయసొస్తే పంచెలు కట్టించే వేడుక నిర్వహించడం కూడా చూస్తున్నదే.పంచెకట్టు ప్రయోజనాలుశరీరానికి సహజమైన గాలి తగలడం పంచెకట్టుతో ఉన్న నిజమైన సౌకర్యం. ఏ తరహా శరీరానికైనా నప్పే పంచె వల్ల ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యం బాగుంటుందంటారు. పది మంది పిల్లల్ని కని పెంచిన పూర్వీకుల సంతతి కూడా ఇందుకు నిదర్శనంగా కనిపించడం విశేషం.ఇక స్త్రీల వేషధారణలో సైతం గోచీ పెట్టుకునే చీరలు ఈ తరానికి తెలియవంటే ఆశ్చర్యం లేదు. అమ్మమ్మ, నాన్నమ్మలంటేనే ఆ తరహా వేషధారణ గుర్తొచ్చేది. ఇప్పుడు మెల్లగా మొదలైన మార్పు అటు పంచెను ఇటు గోచీ చీరను తుడిచిపెట్టేసింది.సుమారు ఏడెనిమిది మీటర్లు లేదా 9 గజాలు లేదా 18 మూరల పొడవుండే ఈ చీరలు ధరించడం తెలుగునాట తరాలుగా కొనసాగింది. ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉన్న వారికి సాగుపనులకు అనుగుణంగా ఉండే అద్భుతమైన కట్టుబడి ఇది. గొల్ల కురుమలతో పాటు సాగు పనులు చేసే కాపు సామాజికవర్గాల్లో ఈ తరహా చీరకట్టు కనిపించేది. వాళ్ల ఆచారాల ఆధారంగా కొంగు కొందరు ఎడమ వైపు మరి కొందరు కుడివైపుకి ధరించేవారు.ఈ తరానికి తెలియని బొడ్లె సంచిగోచీ చీర ధరించే మహిళలు విధిగా ధరించే మరో వస్త్ర పరికరం బొడ్లె సంచి. ఈ తరానికి కనీసం చూసే భాగ్యం కూడా లేని అపురూపమైన నాటి మనీ పర్స్. వాలెట్‌గా పిల్చుకుంటున్న నేటి మనీ పర్స్‌లోని అరల కన్నా ఎక్కువగా ఉండే ఈ బొడ్లె సంచిలో ప్రయాణాలకు అవసరమైన చిల్లర నాణేలు, ఒకటో రెండో కరెన్సీ నోట్లకు భద్రమైన బ్యాగు. జాగ్రత్తగా దాచుకున్న డబ్బులున్న బొడ్లె సంచిని గోచీ చీరతో పాటు బొడ్లో దోపుకునే సంరక్షించుకునేవారు. ఇది కూడా లేని వాళ్లు కొంగు చివరన డబ్బులు మూటగా కట్టుకుని దాన్ని శరీరం చుట్టూ తిప్పి తిరిగి బొడ్లో దోపుకునే వారు.జీన్స్ ప్యాంటుల్లోకి వచ్చాక..స్త్రీ, పురుష వ్యత్యాసం లేకుండా ఇప్పుడు అందరూ కామన్‌గా ధరించేది జీన్స్ ప్యాంట్‌నే. యువతరానికి నచ్చినప్పటికీ దీంతో ఉండే అసౌకర్యం, అనారోగ్యం కూడా ఎక్కువే. జననేంద్రియాలను పట్టి ఉంచే లక్షణంతో ఉంటాయి కాబట్టి సహజమైన ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువ ఉష్ణానికి గురవుతుంటాయి. కాబట్టి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడానికి ఉన్న కారణాల్లో ఇదొకటిగా నిపుణులు చెప్తున్నారు. ఒకరిద్దరికి మాత్రమే పరిమితం అవుతున్న జంటలు కొన్నైతే, స్థిరపడ్డాకే సంతానం అనుకుంటూ 30 దాటినా పెళ్లిల్లు లేవు, 40 దాటినా సంతానం లేకుండా పోతున్నారు.అన్ని మారిపోతున్నాయిమన సంప్రదాయలు ఇప్పుడు కనిపించడం లేదు. అన్ని మారిపోతున్నాయి. మగ్గం బట్టలు పోయి మిల్లు బట్టలు వచ్చాయి. అప్పటి దోతి, పంచె కుట్టు, బనీయన్లు ఇప్పుడు కానరావడం లేదు. నేను మాత్రం మా తాత, నాయిన పద్ధతిలోనే నడుచుకుంటున్న.– కనుమల్ల రామస్వామి, నేత కార్మికుడు, వెదిర గోచీ పెట్టుకోవడమే అలవాటుచిన్నప్పుడు గౌను, లంగాజాకెట్ వేసుకునేదాన్ని. వయస్సు వచ్చాక లంగా, జాకెట్ ఓనీ, తర్వాత గోచిచీర కట్టుకుంటున్న. ఇప్పటి పిల్లలకు గోచిపెట్టుకోవడం నామోషీగా అనుకుంటారు. కానీ అదే మన పాతకాలం పద్ధతి. చీర కంటే గోచి చీర కట్టుకుంటే బాగుంటుంది.– కనకమ్మ, వ్యవసాయదారు, కరీంనగర్ నిండుగా ఉంటుందిపాత పద్ధతిలో ఆరుగజాల చీర కట్టుకుంటే నిండుగా ముతైదువ తనం ఉట్టిపడుతుంది. ఇప్పుడు ఎవరూ పాత పద్ధతులు పాటించడంలేదు. ఇంకా ముసలివాళ్లు మాత్రమే గోచిచీర కట్టుకుంటున్నారు. – ఓదెమ్మ, వ్యవసాయదారు,రైతుబజార్, కరీంనగర్ (చదవండి:

అందాల అనుపమా ఇష్టపడే ఫ్యాషన్ స్టైల్ వేరెలెవెల్..!
సింపుల్ స్టన్నింగ్ బ్యూటీకి నిర్వచనం, నటి అనుపమా పరమేశ్వరన్. ఆమె ధరించే ప్రతి ఔట్ఫిట్లోనూ ఒక ఫ్యాషన్ ఫ్లో ఉంటుంది. స్టయిలింగ్‌లో సౌకర్యం చూపిస్తూ మెరిసిపోవటమే ఆమె మ్యాజిక్! అందం అంటే ముఖం కాదు, మూడ్! హ్యాపీగా ఉంటే, ఎప్పుడూ అందంగానే కనిపిస్తాం. అందుకే, నా శరీరానికి నచ్చే, నప్పే దుస్తులనే ఎంచుకుంటాను. వన్ పీస్‌లు, కుర్తీ–జీన్స్ కాంబో, చిన్న స్లీవ్ల టాప్స్ నా ఫేవరెట్ ఔట్ఫిట్స్. చీరలు అంటే కూడా ఇష్టమే! వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్, హీట్ స్టయిలింగ్ తగ్గించడమే నా కేశ సౌందర్య రహస్యం అంటోంది అనుపమా పరమేశ్వరన్ . ఇక్క అనుపమా జ్యూలరీ బ్రాండ్: షాయా ఇయర్ రింగ్స్ ధర: రూ. 2,500, నెక్ పీస్ ధర: రూ. 7,800, డ్రెస్..రూ.98,800చెవితో మాట్లాడే చెయిన్!చెవికి పెట్టే ఈ చిన్న చెయిన్, మొత్తం మీ స్టయిల్‌నే చేంజ్ చేసేస్తుంది. ఒక్కసారి ఈ చెయిన్ చెవిలో కనిపిస్తే, ఆ తర్వాత అది చూసిన ప్రతి ఒక్కరి చెవిలోనూ అలాంటిదే దర్శనమిస్తుంది. అదే ఈ ‘చెయిన్డ్ ఇయర్ కఫ్’ మ్యాజిక్! పాత రోజుల్లో ఇది పంక్ స్టయిల్‌కి గుర్తుగా ఉండేది. కాని, ఇప్పుడు ఇది మోడ్రన్ ట్రెండ్ ఐకాన్. చెవిని నగల దుకాణంలా కాకుండా, మినిమలిస్టిక్‌గా చూపించాలంటే ఇదే బెస్ట్ చాయిస్. హెయిర్ స్టయిల్ విషయంలో హై పోనీ, స్లీక్ బ లేదా బ్రెయిడ్ బెస్ట్. ఎందుకంటే ఈ ఇయర్‌కఫ్ వేసుకున్నాక దాన్ని దాచడం, బ్యాడ్ టేస్ట్! చెవిని పూర్తిగా కనిపించేలా ఉంచాలి. వెస్ట్రన్ డ్రెస్సులు, ఫ్యూజన్ లెహంగాలు, కుర్తాలకు సూపర్ మ్యాచ్ అవుతుంది. చీరకైనా సరే, బ్లౌజ్ నెక్ డిజైన్లు ఆఫ్–షోల్డర్, స్వీట్హార్ట్, బోట్‌నెక్, సింగిల్ షోల్డర్ స్టయిల్స్‌తో ఉంటే గ్లామర్ డబుల్ అవుతుంది. ఫొటోషూట్స్, సంగీత్, కాక్టెయిల్ పార్టీలు, బ్రాంచ్ డేట్స్‌కు బెస్ట్. ఒక్కసారి ఈ చెయిన్డ్ ఇయర్‌కఫ్ వేసుకుంటే, అదే మీ ఫ్యాషన్ స్టేట్మెంట్ అవుతుంది!.(చదవండి: పార్లమెంటు క్యాంటీన్లో సరికొత్త హెల్త్ మెనూ! లిస్టు చూసేయండి!)
ఫొటోలు
అంతర్జాతీయం

అమెరికాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. డెల్టా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 767 ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో బోయింగ్ విమానం ఎడమ ఇంజిన్ నుండి మంటలు రావడం కనిపిస్తోంది. అట్లాంటాకు వెళ్లాల్సిన ఈ డెల్టా ఎయిర్ లైన్స్ విమానం లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.❗️Boeing 787 Makes Emergency Landing in LA 🇺🇸 - Engine ON FIRE 🔥Video claims to show a Delta Airlines flight bound for Atlanta on Friday making an emergency landing at LAX. The engine reportedly caught fire shortly after take-off.📹 @LAFlightsLIVE https://t.co/t1HBVLDi0P pic.twitter.com/vYNgkpZJcq— RT_India (@RT_India_news) July 19, 2025శుక్రవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్ మంటల్లో చిక్కుకున్నట్లు గుర్తించడంతో.. అట్లాంటాకు వెళ్లాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ విమాన్నాన్ని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఎల్ఏఎక్స్)కి తిరిగి మళ్లించి, అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విమాన ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, అగ్నిమాపక సిబ్బంది రన్‌వేపై మంటలను చల్లార్చడంతో ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. ఏవియేషన్ A2Z నివేదిక ప్రకారం ఈ విమానం విమానాశ్రయం నుండి బయలుదేరిన వెంటనే ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. విమాన సిబ్బంది అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి మళ్లించేలా మార్గనిర్దేశం చేసింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ విమానం దాదాపు 25 సంవత్సరాల క్రితం నాటిది.డెల్టా ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం ఈ ఏడాది ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏప్రిల్‌లో ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా విమానం మంటల్లో చిక్కుకుంది. అట్లాంటాకు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సహాయకులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

ఐఎస్ఎస్ వైపూ ట్రాఫిక్ బిజీ!
వాషింగ్టన్: తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం కోసం వరసబెట్టి భక్తులు క్యూ లైన్లలో నిల్చున్నట్లు ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి సైతం వ్యోమ నౌకలు ఒకరకంగా క్యూ కట్టాయి. కొద్ది వారాల వ్యవధిలో సరకు రవాణా స్పేస్‌క్రాఫ్ట్ లేదా వ్యోమగాములను తీసుకొచ్చే వ్యోమనౌకలు ఒకదాని వెంట మరోటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ ఐఎస్ఎస్ మార్గాన్ని బిజీగా మార్చేశాయి. నాసా, రోస్కాస్మోస్, స్పేస్ ఎక్స్ సంస్థల వ్యోమనౌకలు తమ వంతు కోసం వేచిచూస్తున్నాయి. బోయింగ్ వారి ప్రతిష్టాత్మక స్టార్‌లైనర్ వ్యోమనౌక మరో ఏడాదిదాకా ఐఎస్ఎస్కు పయనమయ్యే అవకాశం దక్కదని తాజా షెడ్యూల్‌ను బట్టి తెలుస్తోంది. చరిత్రలో ఎన్నడూలేనంతగా ఐఎస్ఎస్కు స్పేస్‌క్రాఫ్ట్‌ల రాకపోకలు ఇటీవ లకాలంలో ఎక్కువయ్యాయి. గత రెండు మూడు వారాలపాటు యాగ్జియం–4 మిషన్ వారి డ్రాగన్ ‘గ్రేస్’ క్యాప్సూల్ ఐఎస్ఎస్ ‘ఔట్‌పోస్ట్’ వద్ద ‘పార్కింగ్’లో ఉండిపోయింది. ఇటీవలే అది భారత వ్యోమగామి శుభాంశు శుక్లాసహా నలుగురు వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. దీంతో క్రూ–11 మిషన్ ప్రయోనికి రంగం సిద్ధమైంది. ఇదిగాక ఇప్పటికే ఐఎస్ఎస్ వద్ద రష్యా అంతరిక్ష సంస్థ పంపిన ప్రోగ్రెస్–92 కార్గోషిప్ అక్కడ తిష్టవేసింది. దీంతోపాటు మరోమూడు వ్యోమనౌకలు ఐఎస్ఎస్ వద్దే ఉన్నాయి. స్పేస్ఎక్స్ డ్రాగన్, సోయూజ్ ఎంఎస్–27, ప్రోగ్రెస్ రీ–సప్లై నౌకలు అక్కడ ఉన్నాయి. చాలా రోజులుగా ఐఎస్ఎస్లో విధుల్లో ఉండి అలసిపోయిన వ్యోమగా ములను భూమి మీదకు తీసుకొచ్చేందుకు, అక్కడ నిండుకున్న సరుకులను భూమి నుంచి మోసుకొచ్చేందుకు తరచూ ఇలా వ్యోమనౌకలు ఐఎస్ఎస్కు వస్తూనే ఉన్నాయి. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ల ట్రాఫిక్ ఈ ఏడాది చివరిదాకా కొనసాగనుంది. డిసెంబర్‌లోపు మరో ఆరు వ్యోమనౌకలు అక్కడికి చేరుకోనున్నాయి. కొత్త వ్యోమగాములను మోసుకెళ్లడం, సరకుల తరలింపు, ఆధునిక శాస్త్రసాంకేతికత సంబంధ ఉపకరణాలను మోసుకుంటూ ఇవి అటూఇటూ తిరగనున్నాయి. అత్యంత బరువైన ప్రయోగ పేలోడ్లను తరలించనున్నాయి. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన 2000 సంవత్సరం నుంచి చూస్తే ఐఎస్ఎస్కు ఇంతటి భారీ ఎత్తున వ్యోమగాములు, సరకులు, ప్రయోగ పరికరాల రాకపోకలు పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. అమెరికా నాసా, రష్యా వారి రోస్కాస్మోస్, ఎలాన్‌మస్క్ స్పేస్ఎక్స్, స్టార్‌లైనర్ ఇలా అన్ని సంస్థల స్పేస్‌క్రాఫ్ట్‌లు అంతరిక్షయానాన్ని బిజీగా మార్చాయి.క్యూ వరస నుంచి తప్పుకున్న స్టార్లైనర్భారతీయ మూలాలున్న మహిళా అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్సహా బుచ్ విల్మోర్ను బోయింగ్ వారి స్టార్‌లైనర్ వ్యోమనౌక 2024 జూన్‌లో ఐఎస్ఎస్కు పంపించింది. అయితే తిరుగుప్రయాణంలో అది మొరాయించడంతో వ్యోమగాములు లేకుండానే పలుసార్లు వాయిదాల తర్వాత ఒంటరిగా భూమికి తిరిగొచ్చింది. దీంతో 2025లో స్టార్‌లైనర్ మరోసారి ఐఎస్ఎస్కు వెళ్లలేదు. ఇలా స్పేస్‌షిప్‌ల ట్రాఫిక్ నుంచి ఇది తప్పుకుంది. న్యూ మెక్సికోలోని నాసా వారి వైట్శాండ్స్ పరీక్షకేంద్రంలో ఈ స్టార్‌లైనర్ వ్యోమనౌకకు సమగ్రస్థాయిలో పరీక్షలు జరుపుతున్నారు. 2026లో జరపబోయే ఐఎస్ఎస్ ప్రయాణానికి సురక్షితమేనా కాదా అనేది నిర్ధారించుకునేందుకు కీలక సమీక్షా పరీక్షలు జరుపుతున్నారు. నెలల తరబడి నిరీక్షణ తర్వాత సునీతా విలియమ్స్ చివరకు క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వ్యోమనౌకలో తిరుగుపయనమైన విషయం విదితమే. అంతర్జాతీయ అంతరిక్ష సందర్శకుల తాకిడి ఎక్కువైతే ఐఎస్ఎస్ మార్గం మరింత బిజీగా మారనుంది.

థాయ్‌లాండ్‌లో మాయలేడి
బ్యాంకాక్: అందం ఎరవేసి బౌద్ధ గురువులు, సన్యాసులను ఉచ్చులోకి లాగి, రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన మాయలేడి వ్యవహారం థాయ్‌లాండ్‌లో సంచలనం సృష్టిస్తోంది. గత నెలలో బ్యాంకాక్‌లోని బౌద్ధ ఆలయం నుంచి ఫ్రా థెప్ అనే సీనియర్ గురువు అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. అతడి అదృశ్యం వెనుక ‘మిస్ గోల్ఫ్’ అనే మహిళ ప్రమేయం ఉన్నట్లు వెల్లడయ్యింది. ఆమె ఇంట్లో సోదాలు చేయగా, 80 వేలకుపైగా సెక్స్ ఫొటోలు, వీడియోలు ఉన్న ఫోన్లు లభించాయి. ఆమె అసలు పేరు విలావన్ ఎమ్సావత్ అని గుర్తించారు. వయసు 30 ఏళ్లు. బౌద్ధ సన్యాసులకు వలవేసి, ఏకాంతంగా ఉన్నప్పుడు వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడం, వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసి, భారీగా డబ్బులు వసూలు చేయడం ఆమె దినచర్య అని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, మనీ లాండరింగ్ కేసులో ఎమ్సావత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చాలామంది బౌద్ధ గురువులు, సన్యాసులు ఆమె వలలో చిక్కినట్లు గుర్తించారు. గత మూడేళ్లలో వారి నుంచి 385 బాత్స్ (రూ.102 కోట్లు) వసూలు చేసింది. అదృశ్యమైన ఫ్రా థెప్ ఆచూకీ ఇంకా లభించలేదు. అతడితో ఎమ్సావత్‌కు 2024 మే నెలలో సంబంధం ఏర్పడింది. అతడితో తాను బిడ్డను కన్నట్లు చెబుతోంది. బిడ్డ సంరక్షణ కోసం ఫ్రా థెప్ నుంచి తనకు రూ.1.90 కోట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తోంది. ఎమ్సావత్ బౌద్ధ సన్యాసుల నుంచి డబ్బులతోపాటు ఖరీదైన వస్తువులు, వాహనాలు కూడా స్వీకరించింది. అయితే, ఆ సొమ్మును ఆన్లైన్ జాదంలో పెట్టింది. బౌద్ధ ఆలయాలకు భక్తుల నుంచి విరాళంగా వచ్చిన డబ్బును సన్యాపులు ఈ మాయలేడికి ధారపోసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. భగవంతుడి సన్నిధిలో ఉంటూ ఆదర్శవంతమైన జీవితం గడపాల్సిన బౌద్ధ సన్యాసులు శారీరక సుఖాల కోసం ఆరాటపడడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Yoweri Museveni: 40 ఏళ్లుగా నాటౌట్!
వయసు 80 ఏళ్లు. అందులో దేశాధ్యక్షునిగానే ఏకంగా 40 ఏళ్లు! ఇదీ, ఉగాండా ప్రెసిడెంట్ యోవేరి ముసేవేని ట్రాక్ రికార్డు! అయినా తనివి తీరలేదేమో, ఈ వయసులో కూడా మళ్లీ అధ్యక్ష బరిలో దిగుతున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి అని పాలక నేషనల్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ (ఎన్ఆర్ఎం) పార్టీ ప్రకటించింది. అందుకు ముసేవేని అంగీకరించారు కూడా. ఎన్ఆర్ఎం గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన 40 ఏళ్ల రికార్డను మరింత మెరుగు పరుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జనవరిలో ఎన్నికలు ఉగాండాలో 2026 జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పాప్ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాబీ వైన్ వాటిలో ముసేవేని ప్రధాన ప్రత్యర్థిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. విపక్ష నేషనల్ యూనిటీ పార్టీ తనను నామినేట్ చేస్తే ముసేవేనిపై తలపడేందుకు సిద్ధమని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ‘‘దేశంలో అణచివేత పెరుగుతోంది. విపక్షాల్లో కొనసాగడమే దుర్భరంగా మారింది. విపక్ష నేతలపై నేరుగా ఉగ్రవాది ముద్ర వేస్తున్నారు’’ అన్నారాయన. వైన్ 2021 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బరిలో దిగినా ముసేవేని చేతిలో ఓటమి చవిచూశారు. మరో ప్రముఖ ప్రతిపక్షం ఫోరం ఫర్ డెమొక్రటిక్ చేంజ్ (ఎఫ్డీసీ) నేత కిజ్జా బెసిగ్యే దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ సైనికాధికారి అయిన ఆయన గత నవంబర్ నుంచి నిర్బంధంలో ఉన్నారు. పశుల కాపర్ల కుటుంబం యోవేరి ముసేవేని 1944లో ఉగాండాలోని ఎంబారా జిల్లాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పశువుల కాపర్లు, పెంపకదారు లు. ఆయన మిషనరీ పాఠశాలల్లో చదివారు. టాంజానియాలోని దారెస్సలాం విశ్వవిద్యాలయంలో చదువుతుండగా ఆఫ్రికన్ విముక్తి ఉద్యమాలతో అనుబంధం ఏర్పడింది. వామపక్ష విద్యార్థి సంఘానికి చైర్మన్ అయ్యారు. నేషనల్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ (ఎన్ఆర్ఎం) ఆధ్వర్యంలోని సాయుధ దళమైన నేషనల్ రెసిస్టెన్స్ ఆర్మీకి నేతృత్వం వహించారు. 1980ల్లో నాటి అధ్యక్షుడు ఒబోటే పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశారు. 1986లో తిరుగుబాటు నాయకుడిగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయన పదవిలో కొనసాగడానికి వీలుగా రాజ్యాంగాన్ని రెండుసార్లు సవరించి మరీ వయో,, పదవీకాల పరిమితులను తొలగించారు! ఆ తర్వాత 2001, 2006, 2011, 2016 ఎన్నికల్లో ముసేవేని వరుస విజయాలు సాధించారు. 2017లో మరోసారి రాజ్యాంగ సవరణ చేసి అధ్యక్ష అభ్యర్థుల వయో వయో పరిమితిని పూర్తిగా ఎత్తేశారు. తద్వారా 2021లో తిరిగి ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఉగాండాను ముసేవేని ప్రగతి పథంలోకి నడిపించారు. రాజకీయ స్థిరత్వం అందించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చారు. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. పత్రికా స్వేచ్ఛకు మద్దతిచ్చారు. ఇదంతా నాణేనికి ఒకవైపే ముసేవేనిపై తీవ్ర అవినీతి మచ్చలున్నాయి. దాంతో కొన్నేళ్లుగా ఆయన ఆదరణ, ప్రాబల్యం తగ్గుతూ వస్తున్నాయి. విపక్ష నేతలను వేధించడం, నిర్బంధించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉత్తర ఉగాండాను దశాబ్దాలుగా భయభ్రాంతులను చేస్తున్న లార్డ్స్ రెసిస్టెన్స్ ఆర్మీ (ఎల్ఆర్ఏ)ని కట్టడి చేయడంలో విఫలమయ్యారని ముసేవేని ఆరోపణలు ఎదుర్కొన్నారు. సోమాలి యాలో ఆఫ్రికన్ యూనియన్ దళానికి సైనిక సాయం చేసి ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే 2013లో దక్షిణ సూడాన్ చెలరేగిన అంతర్యుద్ధంలో ప్రభుత్వానికి మద్దతిచి్చవిమర్శలపాలయ్యరు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

ఆపరేషన్ సింధూర్ ‘లిటిల్ హీరో’కు సన్మానం
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్‌కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్‌తో భారత్ ఆర్మీ తన సత్తాచాటింది. పాక్‌లోకి దూసుకుపోయి మరీ ఉగ్రస్థావరాలను, పలు పాక్ ఎయిర్ బేస్‌లపై దాడులు చేసింది. ఇందులో మన ఆర్మీ పాత్రను ఎంత కొనియాడినా తక్కువే. అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికతో పాక్‌కు దడపుట్టించింది. ఆ దెబ్బతో పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావడంతో దానికి భారత్‌కు అంగీకరించింది.ఇదిలా ఉంచితే, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కు సాయం చేసిన ఒక 10 ఏళ్ల లిటిల్ హీరో కూడా ఉన్నాడు. అదేంటి 10 ఏళ్ల పిల్లాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారా?, పాక్ ఆర్మీతో యుద్ధం చేస్తున్న సమయంలో భారత్ సైనికులకు భోజనాలు అందించి తన పాత్రను నిలబెట్టుకున్నాడు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పంజాబ్ గ్రామంలో భారత సైనికులు యుద్ధం చేస్తున్న సమయంలో వారికి ఆ ‘బుడ్డోడు’ భోజనాలు తదితర ఆహార పదార్థాలను సప్లై చేశాడు. దాంతో ఆ లిటిల్ హీరోను సత్కరించింది ఆర్మీ. పంజాబ్‌లోని తారా వాలి గ్రామంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆ చిన్నోడు ధైర్యాన్ని ఇండియన్ ఆర్మీ కీర్తించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్ గ్రామంలో తుపాకీతో పోరాడుతున్న సైనికులకు మధ్య మధ్యలో భోజనం సరఫరా చేసిన పదేళ్ల బాలుడు ష్వాన్ కథను వెస్ట్రన్ కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ పంచుకున్నారు.Indian Army decides to sponsor all educational needs of the Youngest Warrior of '#OperationSindoor' from Punjab, Master Shvan Singh.This 10-years old from Ferozepur kept on providing essential eatables, day and night, to the army men deployed in his fields in the border… pic.twitter.com/8xv7kozth4— All India Radio News (@airnewsalerts) July 20, 2025ఆ బాలుడి ధైర్యానికి మెచ్చిన ఇండియన్ ఆర్మీ.. ఆ పిల్లాడు చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చింది. ష్వాన్ యొక్క కథ దేశంలో ఉన్నవారికి ఆదర్శం కావాలని ఆర్మీ స్పష్టం చేసింది. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని మామ్‌డోట్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన 10 ఏళ్ల ష్వాన్... అతను కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరాలని కోరుకుంటున్నాడు.‘ నేను పెద్దయ్యాక 'ఫౌజీ' కావాలనుకుంటున్నాను. దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను’ అని గతంలోనే చెప్పుకొచ్చాడు.

జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపునకు ముహూర్తం ఖరారు?
సాక్షి,న్యూఢిల్లీ: కాలిన నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు పదవి నుంచి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైంది.రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందే జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసన ద్వారా తొలగించే ప్రక్రియపై 100 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు పెట్టినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించారు.ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. విచారణకు సుప్రీంఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జస్టిస్ వర్మపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీతో విచారణ చేపట్టింది. ఈ విచారణలో కాలిన నోట్ల కట్టలు జస్టిస్ యశ్వంత్ వర్మవేనన్న సాక్షులు,ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అభిశంసన చర్యలువీటిని పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ సైతం జస్టిస్ వర్మను అభిశంసన ద్వారా తొలగించాలని సిఫారసు చేసింది. త్రిసభ్య కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టిన జస్టిస్‌వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయ స్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాలు చేశారు.త్రిసభ్య కమిటీ రిపోర్టుపై సవాలునోట్ల కట్టల వ్యవహారంలో తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు.ఏకమైన అధికార,ప్రతి పక్షాలు తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతోనే నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగవిరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికపై తాను అధికారికంగా స్పందించకముందే దాన్ని మీడియాకు లీక్ చేశానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ మండిపడ్డారు. అందుకే ఈ నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయినప్పటికీ జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అధికార,ప్రతి పక్షాలు ఏకమయ్యాయి. అభిశంసన తీర్మానం ద్వారాభారత రాజ్యాంగం ప్రకారం.. అవినీతి ఆరోపణల ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించవచ్చు.అటువంటి ఘటనల్లో అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు లేదంటే లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ఆమోదిస్తారు. ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి సభలోని మూడింట రెండు వంతుల ఎంపీల మద్దతు అవసరం.మంత్రి కిరణ్ రిజిజు ఏమన్నారంటే?ఇప్పుడు ఇదే పద్దతిలో జస్టిస్ వర్మ తొలగింపునకు అధికార,ప్రతిపక్ష లోక్ సభ,రాజ్య సభ సభ్యులు సంతకాలు పెట్టారు. న్యాయవ్యవస్థలో అవినీతి అనేది చాలా సున్నితమైన విషయం. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. వర్షాకాల సమావేశంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నాం’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామంఈ అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం విభేదిస్తుంటాయి. కానీ న్యాయవ్యవస్థలో అవినీతి వంటి సున్నితమైన అంశంపై పార్టీలకు అతీతంగా స్పందించడం, ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలుస్తూ.. 100 మంది ఎంపీలు అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయడం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా 35 మంది కాంగ్రెస్ ఎంపీలు సైతం సంతాలు చేసినట్లు సమాచారం.

‘ఆ టైమ్‌లో కిటికీలు తెరిచే ఉంచొచ్చు’.. విమాన ప్రయాణికులకు డీజీసీఏ వరం
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు ఆహ్లాదం కలిగించే వార్త ఇది. ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో కిటికీలో నుంచి బయటకు చూడాలనే ప్రయాణికుల ఆశ నెరవేరనున్నది. భారత వైమానిక దళంలోని జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్‌లలో (జేయూఏఎస్))విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కిటికీ షేడ్స్‌ను మూసివేసి ఉంచాలనే నిబంధనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ఉపసంహరించుకుంది. అయితే, విమానాశ్రయాలలో గ్రౌండ్ లేదా ఏరియల్ ఫోటోగ్రఫీపై నిషేధం కొనసాగుతుంది.పలు భద్రతా కారణాల దృష్ట్యా గతంలో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కిటికీ షేడ్స్‌ను కిందికి ఉంచాలంటూ డీజీసీఏ అన్ని వాణిజ్య, చార్టర్, ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్లకు సూచించింది. ఈ సూచన ముఖ్యంగా ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఎయిర్‌బేస్‌లను ఉద్దేశించి చేశారు. ఇప్పుడు ఈ నియమాన్ని సడలించారు. అయితే ఫోటోలు, వీడియోలు తీయడంపై గల నిషేధం భద్రతా కారణాల దృష్ట్యా అలాగే కొనసాగనుంది. ప్రయాణికులు తమ ప్రయాణంలో ఫోటోలు లేదా వీడియోలు తీయకూడదని డీజీసీఏ కోరింది.భారత వైమానిక దళం సూచనల ప్రకారం, భద్రత దృష్ట్యా ఫోటోగ్రఫీపై నిషేధం చాలా ముఖ్యమైనదని డీజీసీఏ స్పష్టం చేసింది. టేకాఫ్, ల్యాండింగ్ లేదా విమానం రన్‌వేపై ఉన్నప్పుడు ప్రయాణికులను ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి అనుమతించరు. ఈ నియమం ముఖ్యంగా జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్‌లు అని పిలిచే ఐఏఎఫ్ ఎయిర్‌బేస్‌లకు వర్తిస్తుంది. పౌర, సైనిక విమాన కార్యకలాపాలు ఈ విమానాశ్రయాలలో కొనసాగుతాయి. పఠాన్‌కోట్, శ్రీనగర్, ఆగ్రా, బరేలీ, గ్వాలియర్ తదితర ఎయిర్‌బేస్‌లలో ఫోటోగ్రఫీపై నిషేధం వర్తిస్తుంది.

Gujarat: కుటుంబాన్ని బలిగొన్న రూ. ఐదువేల ఈఎంఐ?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. శనివారం (జూలై 19) రాత్రి బాగోద్ర గ్రామంలో ఒకే కుటుంబానికి ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న వీరు విషం తాగారనే అనుమానాలున్నాయి. మృతుల్లో భర్త, భార్య వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు.కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను విపుల్ కాంజి వాఘేలా (34), అతని భార్య సోనాల్ (26), వారి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవానిగా పోలీసులు గుర్తించారు. వీరి కుటుంబం మొదట గుజరాత్‌లోని ధోల్కాలో ఉండేది. విపుల్ వాఘేలా ఆటో రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే, బాగోద్ర పోలీసులు, 108 అంబులెన్స్ బృందం, అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక ఒత్తిడి కారణంగానే కాంజి వాఘేలా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.విపుల్ బావమరిది ఈ ఘటన గురించి మాట్లాడుతూ విపుల్ రుణం తీసుకుని ఆటోరిక్షాను కొనుగోలు చేశాడని, ప్రతీనెలా రూ. ఐదువేల ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతున్నాడని తెలిపారు. ఆ భారమే అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పి ఉండవచ్చని అన్నారు. కాగా ఈ ఐదు మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం బాగోద్ర కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు విపుల్ బంధువులను, పొరుగవారిని, పరిచయస్తులను విచారిస్తున్నారు.
ఎన్ఆర్ఐ

లండన్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం రోజున బండి సంజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని లండన్ ఇల్ఫార్డ్‌లోని బీజేపీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్, స్వీట్లు, పంపిణి మొక్కలు నాటడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టారు.బీజేపీ లండన్ అధ్వర్యంలో ఇల్ఫార్డ్ లోని బండి సంజయ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాటిపల్లి సచిందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో దిగ్విజయనేత అని కొనియాడారు. కార్పొరేటర్ నుండి ఎంపీ, కేంద్రమంత్రి స్థాయికి బండి సంజయ్ ఎదిగిన తీరు కార్యకర్తలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమన్నారు. సరస్వతీ శిశు మందిరం లో విద్యనభ్యసించిన బండి సంజయ్ కుమార్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు.ఆర్ఎస్ఎస్లో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే బండి సంజయ్ పని చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో, బిజెపి కరీంనగర్ పట్టణ ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షులుగా, జిల్లా , రాష్ట్ర కార్యవర్గాల్లో వివిధ హోదాల్లో బిజెపిలో ఆయన బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జిగా ను ఆయన పని చేశారని, ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రలోనూ బండి సంజయ్ కుమార్ భాగం పంచుకున్నారని , 35 రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. 1994 _ 2003 మధ్యకాలంలో బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పని చేశారన్నారు.2005లో కరీంనగర్ 48వ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా బండి సంజయ్ విజయం సాధించారని, వరుసగా మూడుసార్లు ఆయన కార్పొరేటర్ గా గెలుపొందారన్నారు.2019 లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన సారాధ్యంలో బిజెపి రాష్ట్రంలో పుంజుకుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రతో బీజేపీ గ్రామ గ్రామానికి చేరిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ, అధికార పార్టీపై తీవ్రస్థాయిలో బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారని తెలిపారు.బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికలు చరిత్ర సృష్టించాయన్నారు. బండి సంజయ్ దిశా నిర్దేశంలో రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ పెరిగిందన్నారు. అనంతరం బండి సంజయ్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు. కరీంనగర్ చరిత్రలోనే భారీ మెజారిటీతో రెండోసారి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యునిగా గెలుపొంది, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర బిజెపి కీలక నేతల్లో బండి సంజయ్ ఒకరని చెప్పారు.ప్రధానంగా కరీంనగర్ పార్లమెంటు సర్వతో ముఖాభివృద్ధి కోసం బండి సంజయ్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రెండు టర్ములలో పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటి తో గెలుపొంది రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా పనిచేసి కేంద్రమంత్రి గా కొనసాగుతూ స్థానికంగా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు ఈ కార్యక్రమం లోఓవర్సీస్ బీజేపీ నాయకులు వాస భరత్, బండ సంతోష్, కోమటిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి, జయంత్, సంజయ్, బద్దం చిన్న రెడ్డి, సురేష్, చార్లెస్, జేమ్స్, ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు.

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్ వజ్ర రియల్‌ఎస్టేట్‌కు అభినందనలు తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ట్రంప్‌కు మరో షాక్.. రాజీనామా యోచనలో కాష్ పటేల్!
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినోఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్‌బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్‌ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. పామ్ బాండీ‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్‌బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్‌బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎఫ్‌బీఐకి, డీవోజే(డిపార్ట్మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్‌బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్‌బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్‌బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్‌హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.కశ్యప్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్‌కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్‌తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.

యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్‌లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్‌ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్‌పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్‌కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!
క్రైమ్

చిట్టి మనసు.. తల్లడిల్లి..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గురుకుల విద్యా సంస్థలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడటం తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. గతేడాది ఏకంగా 48 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కేవలం నెలన్నర వ్యవధిలోనే దాదాపు 10 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు కేజీబీవీ విద్యార్థులుండగా..ఒక వారం వ్యవధిలోనే నలుగురు మరణించడం చర్చనీయాంశమవుతోంది. ఒంటరితనం..ఒత్తిడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకుల సొసైటీలతో పాటు విద్యాశాఖ పరిధిలోని జనరల్ గురుకుల సొసైటీ పరిధిలో 1,038 గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 4.5 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇవిగాకుండా విద్యాశాఖ పరిధిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ 600 వరకు ఉన్నాయి. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థులకు వసతితో కూడిన ఉచిత బోధన ఉంటుంది. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లల్ని వీటిల్లో చేరుస్తుంటారు. అయితే..ఇంటిపై బెంగ, హాస్టళ్లలో ఒంటరితనం, చదువు నేపథ్యంలో మానసిక ఒత్తిడికి లోనై కొందరు ప్రాణాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుండగా..మరికొన్ని చోట్ల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది వేధింపులు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు విద్యార్థుల ఆత్మహత్యలు నివారించే దిశగా సరైన చర్యలు చేపట్టడం లేదని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన ఘటనలకు సంబంధించి ప్రభుత్వం ఏకంగా 20 మంది ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయడం గమనార్హం. బలహీన మనస్తత్వం..కౌన్సెలింగ్ అంతంత మాత్రం! విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ.. ఎక్కువ మంది బలహీనమైన మనస్తత్వం (వీక్ మైండెడ్) కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబానికి దూరంగా ఉంటున్నామనే ఆలోచనలు, ఇతర విద్యార్థులతో పోటీ పడి చదవగలమా అనే ఆత్మన్యూనత భావం... బోధన, అభ్యసన కార్యక్రమాల ఒత్తిడి వారిని ప్రతికూల ఆలోచనలకు ప్రేరేపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవసరమైన కౌన్సెలింగ్ సరిగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ.. బీసీ గురుకుల సొసైటీలో జిల్లా కేంద్రంగా వీక్ మైండెడ్ విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయి. పాఠశాల, కళాశాలలో వీక్ మైండ్ ఉన్న విద్యార్థులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ విద్యార్థులను జిల్లా కేంద్రానికి పంపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఎస్సీ గురుకుల సొసైటీలో ‘ప్రాజెక్టు మిత్ర’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు మరింత ముమ్మరంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. వారంలోనే నలుగురు..! ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 10 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా, సుమారు వారం వ్యవధిలోనే నలుగురు మరణించారు. » ఈ నెల 13వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలంలోని ఉలిగేపల్లి గ్రామానికి చెందిన కురువ క్రిష్టన్న, సవారమ్మ దంపతుల కుమారుడైన హరికృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. » 14న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల వసతి గృహంలో ఊరబాయి సంధ్య (11) అనే విద్యార్థిని హాస్టల్ భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. » ఈ నెల 15న సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూష మహాలక్ష్మి తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. » ఈ నెల 19వ తేదీ ఉదయం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న సంతోష్ (17) ఆత్మహత్య చేసుకున్నాడు. » జూన్ నెలాఖరులో రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. » ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. » ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన మూడు నెలల్లో ఆరుగురు ఆత్మహత్య చేసుకోగా వీరిలో ముగ్గురు గత నెలలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూషా మహాలక్ష్మి ఈ నెల 15న తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. చదువుల్లో టాపర్. 9వ తరగతిలో తానే టాపర్. 10వ తరగతిలో కూడా టాపర్‌గా నిలుస్తానని మాకు చెప్పింది. ఆమె ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి..’ అని తనూష తల్లిదండ్రులు వెంకన్న, వసుంధర డిమాండ్ చేశారు.పరిస్థితిని చక్కదిద్దుతున్నాం.. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత బాధాకరం. గురుకులాల వరకు పరిశీలిస్తే.. దీర్ఘకాల వేసవి సెలవుల తర్వాత తిరిగి రావడం.. రెండునెలల పాటు తమకు ఇష్టం వచ్చినట్లుగా కాలం గడిపి..ఒక్కసారిగా ఆ వాతావరణానికి దూరం కావడం విద్యార్థులకు కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. ఈ పరిస్థితిని సరిదిద్దే విధంగా గురుకులాల్లో చర్యలు తీసుకుంటున్నాం. తల్లిదండ్రులు, తోబుట్టువులతో మాట్లాడేందుకు వీలుగా ‘ఫోన్మిత్ర’ అందుబాటులోకి తెచ్చాం. అన్ని సొసైటీల్లో ఇలా ఫోన్లను ఏర్పాటు చేశాం. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. మరోవైపు విద్యార్థులను చైతన్యపరిచేలా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. –అలగు వర్షిణి, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శిటీచర్లు, సిబ్బందిని ఎడ్యుకేట్ చేయాలి... గురుకుల విద్యా సంస్థల్లో చదివే పిల్లల వయసు 18 ఏళ్లలోపే ఉంటుంది. ఎదిగీ ఎదగని వయసు కాబట్టి పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని..వారితో సందర్భోచితంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, గురుకుల సిబ్బందిపై ఉంది. ముఖ్యంగా విద్యార్థుల్లో అభద్రతా భావాన్ని తొలగించి, మానసికంగా బలపరిచే బాధ్యత ఉపాధ్యాయులు, సిబ్బంది తీసుకోవాలి. పిల్లలు అన్యమనస్కంగా ఉంటున్నట్లు, చురుగ్గా లేనట్టు గమనిస్తే..వెంటనే సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ఆత్మహత్యలు నివారించవచ్చు. – విశేష్, సైకాలజిస్ట్

నెల్లూరులో కుబేర సినిమా తరహా స్కామ్
ధనుష్ నటించిన తెలుగు సినిమా ‘కుబేర’.. థియేటర్ నుంచి ఇప్పడు ఓటీటీకి వచ్చి అలరిస్తోంది. అమాయకులను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ తరహా మోసాలకు కూడా పాల్పడతారని చూపించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే ఈ సినిమా కథాంశం తరహాలోనే నెల్లూరులో ఓ భారీ కుంభకోణం ఇప్పుడు బయటపడింది.సాక్షి, నెల్లూరు: కుబేర సినిమా తరహాలో జిల్లా కేంద్రంలో బయటపడిన ఓ భారీ స్కామ్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా రూ.10 కోట్ల 60 లక్షల మేర సొమ్మును కేటుగాళ్లు మాయ చేశారు. ఇందుకోసం అమాయక గిరిజనుల ఐడెంటిటీని వాడుకున్నారు.ఓ ఫేక్ కంపెనీని ఏర్పాటు చేసి.. అందులో కొందరు గిరిజనులను ఉద్యోగులుగా చూపించారు. వాళ్లకు ఆరు నెలలపాటు జీతాలు ఇచ్చినట్లు స్టేట్మెంట్లు క్రియేట్ చేశారు. అలా మొత్తం 56 మంది పేరిట నెల్లూరు యాక్సిస్ బ్రాంచ్‌లో లోన్లకు అప్లై చేసి డబ్బు చేజిక్కించుకున్నారు. అయితే.. సకాలంలో రుణం చెల్లించకపోవడంతో గిరిజనులకు నోటీసులు వెళ్లాయి. దీంతో వాళ్లు లబోదిబోమన్నారు. 2022 నుంచి సుమారు రెండేళ్లపాటు ఈ భారీ స్కామ్ జరిగినట్లు తేలింది. కిందటి ఏడాది సదరు బ్రాంచ్ మేనేజర్ ముగ్గురు వ్యక్తుల మీద ముత్తుకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ భారీ స్కాంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

భార్యకు అదే పిచ్చి... భర్త ఏం చేసాడంటే!
కడప జిల్లా : ప్రవర్తన బాగా లేకపోవడంతో పద్ధతి మార్చుకోవాలని రెండేళ్లుగా భర్త చెబుతూ వస్తున్నాడు .. భార్య వివాహేతర సంబంధంపై పలుమార్లు పోలీసు స్టేషన్లో పంచాయితీలు జరిగాయి. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో భార్యను హతమార్చి శవాన్ని గోనె సంచిలో తీసుకెళ్లి మైదుకూరు – పోరుమామిళ్ల మధ్య గల ఎద్దడుగు కనుమలో పడేసిన ఘటన శనివారం మండలంలోని చియ్యపాడులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చాపాడు మండలం చియ్యపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల సుజాత(40)ను ఆమె భర్త నల్లబోతుల గోపాల్ ఈ నెల 17న గొంతు నులిమి హత్య చేశాడు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా ఉంటున్న గోపాల్ తన అక్క పార్వతమ్మ కూతురు అయిన సుజాతను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత రెండేళ్ల క్రితం నుంచి తన ఇంటి నిర్మాణం చేస్తున్న చియ్యపాడు దళితవాడకు చెందిన బేల్దారి బాబుతో సుజాతకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భర్త గోపాల్ పలు సార్లు భార్య సునీతను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ పంచాయితీ పలు సార్లు చాపాడు పోలీసు స్టేషన్‌కు సైతం వచ్చింది. ఇదే విషయంలో బాబుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. అయినప్పటికీ సుజాత, బాబు వివాహేతర సంబంధం కొనసాగుతుండడంతో ఈ నెల 17న రాత్రి గోపాల్, సుజాత గొడవ పడ్డారు. తన మాట వినలేదనే కారణంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్ తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా సుజాత శవాన్ని గోపాల్ గోనే సంచిలో కట్టుకుని తన బైక్‌లో మైదుకూరు – పోరుమామిళ్ల రహదారి మధ్యలో గల ఎద్దడుగు కనుమలోని ఓ ముళ్లపొద గుంతలో పడేశాడు.గ్రామంలోనే ఉన్న సుజాత తల్లి పార్వతమ్మ తన కూతురు కని్పంచలేదని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రూరల్ సీఐ శివశంకర్, ఎస్ఐ చిన్న పెద్దయ్య ఈ ఘటనపై గోపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా స్వయంగా తానే సుజాతను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎద్దడుగు కనుమలో పడేసిన శవం వద్దకెళ్లి డీఎస్పీ రాజేంద్రప్రసాద్, రూరల్ సీఐ, ఎస్ఐ పరిశీలించారు. సుజాత మృతదేహం కుళ్లిపోవడంతో బయటికి తీసేందుకు వీలు కాక అక్కడే పంచానామా నిర్వహించారు. పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ తెలిపారు.

ఎలుక... ఎంత పని చేసింది!
అది 2018 ఫిబ్రవరి ఒకటో తేదీ. హైదరాబాద్‌లోని ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతం... తెల్లవారుతూనే క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటి పైన మూడు నెలల చిన్నారి తల ఉందనే వార్త దావానలంలా వ్యాపించింది. ఆ ఇంటి ఎదురుగా నివసించే ఒక మెకానిక్ ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసుల విచారణ ఎదుర్కొన్నాడు. అసలు నిందితులు చిక్కే వరకు నానా ఇబ్బందులు పడ్డాడు. దీనికంతటికీ కారణం ఒక ఎలుక! చిలుకానగర్ మైసమ్మ దేవాలయం సమీపంలో నివసించే రాజశేఖర్ వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్. ఎప్పటిలాగే 2018 ఫిబ్రవరి ఒకటో తేదీన తన క్యాబ్ తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. అతడి అత్త బాలలక్ష్మి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉతికిన దుస్తులను ఆరేసేందుకు డాబాపైకి వెళ్లింది. అక్కడ ఒక చిన్నారి తల కనిపించడంతో హడలిపోయి, కేకలు వేస్తూ కిందికి పరిగెత్తుకు వచ్చింది. పక్కింట్లో ఉండే నరహరికి ఈ కేకలు వినిపించాయి. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆమె వద్దకు వచ్చాడు. బాలలక్ష్మి విషయం చెప్పడంతో పైకి వెళ్లి తలను చూసి, దగ్గర వరకు వెళ్లి పరిశీలించి వచ్చాడు. ఆపై విషయాన్ని ఫోన్ ద్వారా రాజశేఖర్‌కు తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అంతకు ముందురోజు అమావాస్య కావడంతో ఇది నరబలిగా అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈలోపు అక్కడకు చేరుకున్న రాజశేఖర్, అతడి భార్య శ్రీలత సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ ఇంటి చుట్టుపక్కల వాళ్లే ఎవరో నరబలి ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి క్లూస్టీమ్స్తో పాటు డాగ్ స్క్వాడ్‌ను కూడా పోలీసులు రప్పించారు. పోలీసు జాగిలాలు రాజశేఖర్ డాబా పైనుంచి కిందికి వచ్చి ఎదురుగా ఉన్న నరహరి ఇంటి వద్దకు చేరాయి. అక్కడ నుంచి సమీపంలోని రోడ్డు మీదకు వచ్చి ఆగాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రాజశేఖర్, శ్రీలతలతో పాటు నరహరిని, మరికొందరినీ పోలీసులు ప్రశ్నించారు. ఒక్కో రోజు గడిచే కొద్దీ పోలీసులపై ఒత్తిడి పెరుగుతూ పోయింది. ఒక పక్క నిందితుల కోసం, మరోపక్క మొండెం కోసం గాలించడం మొదలెట్టారు. పోలీసులు అదే ఏడాది ఫిబ్రవరి 9న నరహరి ఇంట్లో గాలిస్తుండగా దుర్వానస వస్తున్నట్లు గమనించారు. నరబలి కోసం పూజలు చేసి, అక్కడే చిన్నారిని చంపి ఉండవచ్చని అనుమానించారు. మొండేన్ని కూడా అక్కడే దాచి ఉండటంతో కుళ్లి దుర్వాసన వస్తోందని భావించారు. అతడే ప్రధాన అనుమానితుడిగా మారడంతో మరోసారి వివిధ కోణాల్లో లోతుగా విచారించారు. ఇలా రెండు రోజులు గడిచాక ముందు మొండేన్ని లేదా కొన్ని ఆధారాలను వెలికి తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ పని చేస్తే కేసు కొలిక్కి వచ్చినట్లే అనే భావనతో క్లూస్‌టీమ్‌తో కలిసి ఆ గదిలో అణువణువూ తనిఖీ చేశారు. చివరకు గదిలో సామాను కింద చనిపోయిన ఎలుక దొరకడంతో అదే దుర్వాసనకు కారణమని తేల్చారు. ఘటనాస్థలికి వచ్చిన జాగిలాలు అతడి ఇంట్లోకి ఎందుకు వెళ్లాయనేది ఆరా తీశారు. ఇంటి పైన ఉన్న చిన్నారి తలను చూసిన బాలలక్ష్మి అరుస్తూ కిందికి పరిగెత్తుకు వచ్చింది. అప్పటికే రాజశేఖర్ తన క్యాబ్ తీసుకుని వెళ్లిపోయాడు. అరుపులు విన్న ఎదురింట్లో ఉండే నరహరి డాబా పైకి వచ్చాడు. అక్కడున్న తలను చూసి, దగ్గర నుంచి పరిశీలించాడు. ఆపై అతడే ఫోన్ ద్వారా విషయాన్ని రాజశేఖర్‌కు సమాచారం ఇచ్చి తన ఇంటికి వెళ్లిపోయాడు. అలా అక్కడ అతడి వాసన ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసు జాగిలాలు వాసన చూస్తూ నరహరి ఇంట్లోకే వెళ్ళాయి. ఈ పూర్వాపరాలను మరోసారి సరిచూసుకున్న అధికారులు అతడికి క్లీన్ చిట్ ఇచ్చి వదిలిపెట్టారు. ఆధారాల కోసం పోలీసులు మరోసారి ఘటనాస్థలికి పరిశీలించారు. రాజశేఖర్ ఇంటి లోపలి భాగాన్ని ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి తనిఖీ చేసిన పోలీసులు కొన్ని రక్తపు మరకలు కనుగొన్నారు. తల భాగం దొరికిన డాబా పైన కూడా తనిఖీలు చేస్తున్నప్పుడు పోలీసుల దృష్టి ఓ చీపురుపై పడింది. ఇంటిలోకి ఎండ, వర్షం నీరు పడకుండా సన్‌షేడ్ మాదిరిగా ఏర్పాటు చేసిన రేకులపై అది కనిపించింది. దాన్ని తీసిన పోలీసులు వెదురు ఆకులతో చేసిందిగా గుర్తించారు. దగ్గరగా పరిశీలించగా ఆకుల మధ్య కుంకుమ కనిపించడంతో పూజలు చేసిన ఆనవాళ్లుగా భావించారు. వీటన్నింటినీ మించి ఆ చీపురును ఓ దారంతో పాటు ఎండు గరికతో కలిపి కట్టడంతో అనుమానం బలపడింది. నమూనాలనూ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి క్షుద్రపూజల విషయం నిర్థారించుకున్నారు. రాజశేఖర్, శ్రీలతల పాత్ర రూఢి కావడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తే, తన భార్య ఆరోగ్యం కోసం నరబలి ఇచ్చినట్లు అంగీకరించాడు.ఈ హత్య వెలుగులోకి వచ్చిన రోజే పోలీసు జాగిలాలు డాబా పైనుంచి వాసన చూసుకుంటూ నేరుగా రాజశేఖర్ ఇంట్లోకే వెళ్లాల్సి ఉంది. అయితే, 2018 జనవరి 31న చిన్నారిని కిడ్నాప్ చేసిన రాజశేఖర్ నేరుగా ప్రతాపసింగారం వెళ్లి అక్కడే చిన్నారిని హత్య చేసి మొండాన్ని మూసీలో పడేశాడు. అక్కడ నుంచి తలను ఇంటికి తీసుకువచ్చి నట్టింట్లో పెట్టి తన భార్య శ్రీలతతో కలిసి పూజలు చేశాడు. ఆపై తలను ఇంటి పైన పెట్టి, భార్యతో కలిసి ఇల్లంతా కడిగేశాడు. వాసనను బట్టి ముందుకు వెళ్లే పోలీసు జాగిలాలు నీళ్లతో కడిగిన ప్రాంతంలో వాసన గుర్తించలేవు. రాజశేఖర్ తన ఇంటిని ఫ్లోర్ క్లీనర్లతో పూర్తిగా కడిగేసిన కారణంగానే జాగిలాలు అతడి ఇంటి లోపలకు వెళ్లకుండా సమీపంలో తిరిగాయి. 2018 ఫిబ్రవరి 15న రాజశేఖర్, శ్రీలతల్ని పోలీసులు అరెస్టు చేశారు. ∙