దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 22,444కు చేరింది. సెన్సెక్స్ 91 పాయింట్లు పుంజుకుని 73,916 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.20 శాతం నష్టంతో, నాస్‌డాక్ 0.11 లాభంతో ముగిశాయి.
దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన సమీక్ష (ఏప్రిల్ 3-5) నిర్ణయాలపైనా మదుపర్లు దృష్టి సారించొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ ప్రసంగ (ఏప్రిల్ 3) అంశాలూ గమనించాలి. నిఫ్టీ-50 తన జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 22,526.60ను పరీక్షించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. కార్పొరేట్ సంస్థల ఫలితాల సీజను ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండొచ్చని భావిస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment