Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Pulivendula Zptc Election: Botsa Satyanarayana Fires On Chandrababu1
వైఎస్‌ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముందీ?: బొత్స

సాక్షి, విశాఖపట్నం: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఎన్నిక జరిగిన 12వ తేదీ ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్‌ డే గా మిగిలిపోతుందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అక్కడ జరిగింది పోలింగ్ కాదు, రిగ్గింగ్ అన్నారు.ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించిన చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలిచిపోతాడని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంత అభద్రతాభావంతో ఉన్నాడని, అందుకే ఇలా దిగజారిపోతాడని అనుకోలేదని అన్నారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించేలా ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలకు అర్థాన్నే చంద్రబాబు మార్చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులతో ప్రభుత్వం కుమ్మక్కై దొంగ ఓట్లతో గెలిచింది. ఎందుకు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇంత అభద్రతతో వ్యవహరించింది.? మాది మంచి పాలన అని చెప్పుకునే ప్రభుత్వం ఎందుకు ప్రజాతీర్పును కోరకుండా, వ్యవస్థలను భ్రష్టు పట్టించి, అడ్డదోవలో గెలుపొందేందుకు తెగించింది..? ఎన్నికలు అంటేనే నిస్పక్షపాతంగా ఉండాలి. స్థానిక ఎంపీని పోలీసులు ఉదయం నుంచే అదుపులోకి తీసుకుని ఆంక్షలు విధించారు.కానీ కూటమి ప్రభుత్వంలోని మంత్రి, ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తమతో వందల కార్యక్తలను వెంట పెట్టుకుని సెగ్మెంట్‌లో తిరుగుతుంటే, వారికి పోలీసులు భద్రత కల్పించారు. ఓటు హక్కు కోసం పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన ఓటర్ల నుంచి స్లిప్‌లను లాక్కుని, పక్క నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. టీడీపీలో మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ వంటి పదవుల్లో ఉన్న నాయకులే దొంగ ఓటర్ల అవతారం ఎత్తితే, ఆ పక్కనే కలెక్టర్, డీఐజీ, డీఏస్పీ, సీఐ వంటి అధికారులు ఉండి వారితో ఓట్లు వేయించారు. పైగా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయంటూ వారే ప్రకటించుకుంటున్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి బ్లాక్‌డే. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదు. మంత్రి నారా లోకేష్ తన ఎక్స్‌ ఖాతాలో పెట్టిన ఫోటోలోనే దొంగ ఓటరు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. దీనినేమంటారు? కూటమి ప్రభుత్వానికి తమ పనితీరు మీదే నమ్మకం లేదు. తమ గెలుపు మీద అంతకంటే నమ్మకం లేదు. అందుకే దౌర్జన్యాన్ని, పోలీసులను నమ్ముకున్నారు. ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ఒక చిన్న మండల స్థాయి ఎన్నికలకు ఇంతగా దిగజారిపోవాలా? దీనివల్ల ప్రభుత్వంకు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? వ్యవస్థలనే నష్టపరిచేలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తీరు అత్యంత ప్రమాదకరం. ఈ పరిణామాలనే మాజీ సీఎం వైఎస్‌ జగన్ తీవ్రంగా ప్రశ్నించారు.ఇంత వయస్సు వచ్చిన సీఎం చంద్రబాబుకు బహుశా ఇవే చివరి ఎన్నికలు కూడా కావచ్చు, జనం మంచిగా చెప్పునే పనులు చేయాలే కానీ ఇలాంటి మచ్చ తెచ్చుకునేలా చేస్తారా అని ప్రశ్నిస్తే తెలుగుదేశం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైయస్ జగన్ గారు మాట్లాడిన దానిలో తప్పేముందీ? చంద్రబాబు చేసిన ఇటువంటి అప్రజాస్వామిక విధానాల వల్ల ఆయన చరిత్రలో మచ్చపడిన నేతగా నిలిచిపోతాడు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు కనీసం పోటీ చేసిన అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వరా? పక్క నియోజకవర్గంకు చెందిన టీడీపీ నాయకులను తీసుకువచ్చి, క్యూలైన్లలో నిలబెట్టి వారితో ఓట్లు వేయించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. వీరంతా దొంగ ఓటర్లు అని మేం చెబితే వారిపై చర్యలు ఏవీ? పులివెందుల్లో జరిగింది రిగ్గింగ్.డీఐజీ కోయ ప్రవీణ్ తీరు దారుణం:కోయ ప్రవీణ్ డీఐజీ స్థాయి అధికారిగా వ్యవహరించిన తీరు దారుణం. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ఒక అధికారి ఏకపక్షంగా వ్యవహరించే తీరు ఇదేనా? కడప పార్లమెంట్ సభ్యుడిని ఉదయం నుంచి నిర్భందంలోకి తీసుకుంటారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రిని మాత్రం పోలీస్ బందోబస్త్ మద్య సెగ్మెంట్‌లో విచ్చలవిడిగా తిరిగేందుకు అనుమతిస్తారు. ఇటువంటి వారి వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. సీఎం చంద్రబాబుకు ఇంత అభద్రతాభావం ఉందని అనుకోలేదు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందిస్తూ..పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడిన ఎంపీ రాహూల్ గాంధీ దేశంలో జరిగిన ఓట్ల అక్రమాలపై మాట్లాడారు. దీనిలో ఏపీలోనూ ఇదే తరహాలో అక్రమాలు జరిగాయి. దానిపై కూడా ఆయన ఎందుకు ప్రస్తావించలేదని వైయస్ జగన్ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనే దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏపీలో జరిగిన అక్రమాలపై మాట్లాడకపోవడం వెనుక ఉద్దేశాలను వైయస్ జగన్ ప్రశ్నించారు.

BRS Leader KTR Slams Congress Govrt Over State deflation2
‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇలా పతనం కావడం ఇదే తొలిసారి’

హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థ పాలనతోనే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ధ్వజమెత్తారు. వరుసగా నెలలు తెలంగాణ మైనస్‌ ద్రవ్యోల్పణమే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనం అయ్యిందనడానికి నిదర్శమన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు. వరుస రెండు నెలల పాటు తెలంగాణ మైనస్‌ ద్రవ్యోల్పణంలోకి వెళ్లిపోవడం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి అని మండిపడ్డారు. దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే కేటీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సర్కారు ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా అణచివేసిందని, అదే సమయంలో ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమైందన్నారు. ఒక శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థను అవగాహన లేని పాలనతో నాశనం చేయడం చూస్తే బాధగా ఉందన్నారు. ‍ప్రస్తుత కాంగ్రెస్‌ పాలన నిరాశజనకంగా కనిపిస్తోందన్నారు కేటీఆర్‌. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో పయనిస్తోందన్నారు.For the first time since its formation, Telangana has slipped into deflation for 2 straight months - June & JulyWhat’s worth highlighting is that Telangana is the ONLY state in India in this situationDeflation is not a sign of prosperity. It means people are limiting… pic.twitter.com/AAk5ZGCNTl— KTR (@KTRBRS) August 14, 2025

Dharmasthala Mass Burial Case Latest Update3
‘సిట్‌ నన్ను నమ్మడం లేదు’.. ధర్మస్థళ ఎపిసోడ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

బెంగళూరు: కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు ఊహించని మలుపు తిరిగింది. పారిశుధ్య కార్మికుడిగా (విజిల్‌బ్లోయర్) విధులు నిర్వహించే సమయంలో ధర్మస్థళలో వందలాది శవాలను తాను ఖననం చేశానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ‘భీమ’ (స్థానికులు పిలుస్తున్న పేరు) మీడియా ముందుకు వచ్చారు.ధర్మస్థళలో అవశేషాల కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు తనని నమ్మడం లేదని, నేను వారిని నమ్ముతున్నానని అన్నారు. అంతేకాదు తాను ఖననం చేసిన వారి అస్థిపంజరాలు తన కల్లోకి కూడా వచ్చేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థళ కేసు పురోగతిపై ఇండియా టుడే పారిశుధ్య కార్మికుడిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలను బహిర్ఘతం చేశారు.ధర్మస్థళలో 1995-2014 మధ్య కాలంలో నేను పారిశుధ్య కార్మికునిగా పని చేసే సమయంలో వందల మంది బాధితుల మృతదేహాల్ని ఖననం చేశాను. ఆ మృతదేహాలపై హింస,లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశా. మృతదేహాలను ఖననం చేయాలని ఆలయ ప్రతినిధులు మాకు ఆ పని పురమాయించారు. మృతదేహాల ఖననం విషయంలో ప్రభుత్వం,గ్రామ పంచాయతీ పెద్దలు ఎప్పుడూ మాకు చెప్పింది లేదు. ఎవరి మృతదేహాలను ఎక్కడ ఖననం చేయాలో.. ఎక్కడ దహనం చేయాలో మొత్తం ఆలయ అధికారులే ఆదేశించారు. అడవులు,నదీ తీరంలో ఖననాలుధర్మస్థళ దేవాలయం అధికారుల ఆదేశాలకు అనుగుణంగా మేం మృతదేహాలను ఖననం చేసే వాళ్లం.పూడ్చి పెట్టేవాళ్లం.ఈ పనిలో నాతో పాటు మరో ముగ్గురు పాల్గొన్నారు.మహిళల మృతదేహాలను స్మశాన వాటికల్లో కాకుండా అడవుల్లో,పాతబడిన రోడ్లు,నదీ సమీపంలో పాతిపెట్టేవాళ్ళం.మేము బాహుబలి కొండలపై ఒక మహిళను,నేత్రావతి స్నాన ఘాట్‌లో దాదాపు 70 మృతదేహాలను ఖననం చేశాం. నేను చెప్పిన స్పాట్‌ నెంబర్‌ 13లో సుమారు 70 నుండి 80 మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలను ఖననం చేసే సమయంలో స్థానికులు మమ్మల్ని చూసేవారు. కానీ వాళ్లెప్పుడూ జోక్యం చేసుకోలేదు.పై నుంచి ఆదేశాలు వచ్చేవి. మృతదేహాలను ఖననం చేసేవాళ్లం. అదే మా పని.ధర్మస్థల ఆలయం నుండి కిలోమీటర్‌ దూరంలో ఓ కొండపైన దిగంబర్ జైన విగ్రహం ఉంది. దానిని బాహుబలికొండ అని పిలుస్తారు. దిగంబర్‌ జైన్ విగ్రహం చేరుకోవాలంటే కింది నుంచి 300మెట్లు ఎక్కాల్సి ఉంది.100 మృతదేహాలలో 90 వారివేఖననం లేదంటే దహనం చేసిన మహిళలు,యువతులు,బాలికల మరణానికి కారణాలేంటనేది చెప్పలేదు. అయితే ఆ మృతదేహాలపై హింస, లైంగిక దాడికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. కొన్ని మృతదేహాలపై స్పష్టమైన గుర్తులు ఉన్నాయి. వారిపై దాడి జరిగినట్లు అనిపించింది. బాధితులపై లైంగిక దాడి జరిగిందా? లేదా? అన్నది వైద్యలు మాత్రమే గుర్తించగలరు. మృతదేహాల్లో పిల్లలు,వృద్ధుల ఎక్కువగా ఉన్నారు. మహిళలు ఎక్కువ మంది ఉండగా.. ఖననం చేసినట్లు పేర్కొన్న 100 మృతదేహాలలో 90 మంది వారే ఉండటం గమనార్హం.మారిన స్థలాలు..ఆధారాలు మాయం ధర్మస్థళ పరిసర ప్రాంతాల్లో నాడు ఖననం చేసిన ప్రాంతాల వరకు ఆచూకీ కనిపించడం లేదు. 1995-2014 మధ్య కాలంలో మృతదేహాలను ఖననం చేసే సమయంలో ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉండేవి. ఇప్పుడు ఎటుచూసినా చెట్లు మొలిచాయి. నిర్మాణాలు ఏర్పడ్డాయి.అయినప్పటికీ వాటిల్లో ఓ పాత రహదారి ఇప్పటికీ అలాగే సజీవంగా ఉంది. కాకపోతే ఆ ప్రాంతం అంతా అడవిలా మారింది. ఇప్పటికే నేను కొన్ని ప్రదేశాలు గుర్తించాను. జేసీబీ సాయంతో మరిన్ని మృతదేహాలను గుర్తిస్తానని మాజీ పారిశుధ్య కార్మికుడు చెబుతున్నాడు.మీరు వందల మందిని ఖననం చేశామని చెబుతున్నారు సరే.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ బృందం 13 ప్రదేశాల్లో పాక్షికంగా మృతదేహాల అవశేషాలను గుర్తించింది. వారిలో ఒక పురుషుడు మాత్రమేనని తెలుస్తోంది.మరి మిగిలిన మృతదేహాల మాటేమిటీ అని ప్రశ్నిస్తే.. బాధితుల్ని ఖననం చేసింది మేమే.. నేను నిజమే చెబుతున్నాను అని తనని తాను సమర్ధించుకున్నారు.‘నేను సిట్‌ను నమ్ముతాను..సిట్ నన్ను నమ్మదు’ఈ సందర్భంగా సిట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు దర్యాప్తు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పర్యవేక్షణలో కొనసాగుతోంది. వారిలో సిట్‌ బృందానికి ఐపీఎస్‌ డాక్టర్‌ ప్రణవ్‌ మొహంతి నేతృత్వం వహిస్తున్నారు. ఐపీఎస్ అధికారాలు అనుచేత్,జితేంద్ర కుమార్ దయామ, ఎస్పీ సైమన్, పుత్తూరు తహసీల్దారు స్టెల్లా వర్గీస్, బెళ్తంగడి తహసీల్దారు పృథ్వీ సానికంలు ఉన్నారు. వీరితో పాటు వైద్య పరీక్షల కోసం మంగళూరు కేఎంసీ వైద్యులు,అవశేషాల పరిశీలన కోసం ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఉన్నారు. ఇప్పుడు అదే సిట్‌ను మాజీ పారిశుధ్యకార్మికుడు సంచలన ఆరోపణలు చేశారు. సిట్‌ బృందాన్ని తాను నమ్ముతున్నట్లు.. వారి విధానంపై నిరాశను వ్యక్తం చేస్తూ.. నేను సిట్‌ను నమ్ముతాను. వాళ్లు నన్ను నమ్మట్లేదు. నాకు గుర్తున్నంత వరకు ఖననం చేసిన ప్రదేశాల్ని చూపించడానికి వచ్చాను. సంవత్సరాలు గడిచిన కారణంగా మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతుంది. గుర్తించేందుకు నావంతు కృషి చేస్తున్నాను. అవశేషాల గుర్తించాలంటే జేసీబీ పనితీరులో వేగం పుంజుకోవాలి. స్పాట్ 13తో సహా ఇంకా నాలుగు నుండి ఐదు ప్రదేశాలను గుర్తించాల్సి ఉంది. సిట్ బృందం నాతో పాటు పనిచేసిన వారిని కూడా గుర్తించాలి.వాళ్లొస్తే.. మృతదేహాల గుర్తింపు సులభం అవుతుంది. వేగం అవుతుందన్నారు. సౌజన్య హత్య కేసుసిట్‌ బృందం పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే 2012లో ధర్మస్థళ సమీప నిర్మానుష్య ప్రదేశంలో 17 ఏళ్ల సౌజన్య హత్య జరిగిన నాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నారు. సౌజన్య హత్యకు గురైన రాత్రి నాకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. నేను ఎక్కడ ఉన్నాననేది అవతల వ్యక్తి ఆరా తీశాడు. నేను సెలవు తీసుకుని ఊరికి వచ్చానని చెప్పడంతో ఫోన్‌లోని అవతలి వ్యక్తి నాపై గట్టిగా అరిచాడు. మరుసటి రోజు, హత్యకు గురైన అమ్మాయి మృతదేహాన్ని నేను చూశాను’అని విచారం వ్యక్తం చేశారు. అస్థి పంజరాలు కల్లోకి వచ్చేవి ఓసారి నా కుటుంబానికి చెందిన ఓ మైనర్‌ బాలికనుపై అధికారులు లైంగికంగా వేధించారు. దాంతో ధర్మస్థళ నుంచి 2014లో పారిపోయినట్లు పారిశుధ్య కార్మికుడు చెప్పాడు. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉండేది.కొన్నిసార్లు మృతదేహాల అస్థిపంజరాలు నాకు కల్లోకి వచ్చేవి.అందుకే బాధితులకు న్యాయం చేయాలని సంకల్పంతో ప్రాణాల్ని ఫణంగా పెట్టి ముందుకు వచ్చాను. నా ఉద్దేశ్యం ఆలయాన్ని కించపరచడం కాదు, మృతదేహాలను గుర్తించడం.. వాటికి అంతిమ సంస్కారాలు నిర్వహించడమేనని మరోసారి స్పష్టం చేసిన ఆయన .. తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. మృతదేహాల నుంచి ఆభరణాలను దొంగిలించడమే కాదు.. ఆలయాన్ని కించపరచడానికి ప్రయత్నం చేస్తున్నాంటూ తనపై వస్తున్న ఆరోపణల్ని పారిశుధ్య కార్మికుడు ఖండించారు. నేను దొంగతనం చేసి బతకాలనిపిస్తే.. ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని. ఆలయంలో ఎందుకు విధులు నిర్వహించేవాడిని అని అన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు విషయానికొస్తే.. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు 16 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపింది. వాటిలో 6,11స్పాట్‌లలో అస్థిపంజర అవశేషాలు లభ్యమయ్యాయి. 13వ స్పాట్‌లో అత్యధిక మృతదేహాలు ఉన్నాయని భీమ పేర్కొన్నారు. అక్కడ తవ్వకాలు సాంకేతిక కారణాలతో నిలిపివేశారు. ఇప్పటి వరకు భీమ 15 ప్రదేశాలను గుర్తించగా.. వాటిలో 8 నేత్రావతి నది ఒడ్డున, మిగిలినవి హైవే పక్కన ఉన్నాయి.

Trump Putin Alaska Talks: USA Sanctions Warn to India4
అదే జరిగితే భారత్‌కు మరిన్ని సుంకాలు తప్పవు: అమెరికా

భారత్‌ సుంకాలతో దాడి చేసిన అమెరికా.. భారత్‌కు మరో హెచ్చరిక జారీ చేసింది. భారత్‌పై మరిన్ని సుంకాలు లేదంటే ఆంక్షలు తప్పవని అంటోంది. ఉక్రెయిన్‌ శాంతి చర్చల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అలస్కాలో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చర్చల ఫలితాలను బట్టి ట్రంప్‌ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.రష్యాతో చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై ఇప్పటికే సుంకాలు విధించాం. ఒకవేళ.. ట్రంప్‌-పుతిన్‌ మధ్య చర్చలు గనుక విఫలమైతే భారత్‌పై మరిన్ని సుంకాలు, ఆంక్షలు తప్పవు. తుది నిర్ణయం చర్చల ఫలితాలను బట్టే ఉంటుంది అని ఆర్థిక కార్యదర్శి స్కాట్‌ బెస్సెంట్‌ బుధవారం బ్లూమరాంగ్‌టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్‌పై సెకండరీ టారిఫ్‌లు, లేదంటే పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది అని స్కాట్‌ స్పష్టం చేశారు.భారత్‌ తమ మిత్రదేశమంటూనే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించింది అమెరికా. అంతేకాదు.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు తమ వాణిజ్యం ద్వారా భారత్‌ పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్‌ ఆ టైంలో ఆరోపించారు. ఈ తరుణంలో.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు ఆపకపోవడంతో పెనాల్టీ కింద మరో 25 శాతం మోపారు. దీంతో భారత్‌పై అగ్రరాజ్యం టారిఫ్‌లు 50 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. భారమని తెలిసినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు కూడా. ట్రంప్‌ విధించిన దటి దఫా సుంకాలు ఇప్పటికే అమలు అవుతుండగా.. ఈ నెల 27 నుంచి రెండో దఫా ప్రకటించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య ఒప్పందాలపై వాషింగ్టన్‌లో వరుస చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు ట్రంప్‌ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. అదే సమయంలో.. భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండబోవని ప్రకటించారాయన. అయితే ఫాక్స్‌న్యూస్‌తో ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి స్కాట్‌ బెస్సెంట్‌ మాట్లాడారు. ఇరు దేశాల చర్చలు కొనసాగే అవకాశమూ ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25న అమెరికా నుంచి ప్రతినిధులు భారత్‌కు చేరుకుంటారని తెలిపారు. అయితే.. వ్యవసాయ, డెయిరీ మార్కెట్‌ను కాపాడుకునే ఉద్దేశంలో భారత్‌ ఉందని, ఇది చర్చలకు విఘాతంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.మూడున్నరేళ్ల యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలు ఉండబోతున్నాయని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధినేత కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది అలస్కా వేదికగా శుక్రవారం జరగబోయే చర్చలతోనే తేలిపోతుందని చెబుతున్నారాయన. అదే సమయంలో భూభాగాల మార్పిడితోనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఇరు దేశాలకు మరోసారి సూచించారు కూడా. అయితే ఈ ఆలోచనను ఉక్రెయిన్‌ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భూభాగాల విషయంలో రాజీ పడటం తమ రాజ్యాంగానికి విరుద్ధమని అంటోంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి యూరప్‌ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్‌ లేకుండా జరిగే చర్చలకు అర్థం ఉండదని, పుతిన్‌తో జరగబోయే ఒకే ఒక్క భేటీ రష్యా లక్ష్యాలకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వవచ్చని యూరప్‌ దేశాలు భావిస్తున్నాయి.

Prithvi Shaw to make Maharashtra debut in Buchi Babu Tournment5
కెప్టెన్‌గా రుతురాజ్‌పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మహారాష్ట్ర తరపున అరంగేట్రం చేసేందుకు టీమిండియా ఆట‌గాడు, ముంబై మాజీ ఓపెన‌ర్ పృథ్వీ షా సిద్దమవుతున్నాడు. బుచ్చి బాబు మల్టీ-డే టోర్నమెంట్ 2025 కోసం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.ఈ జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కింది. 25 ఏళ్ల పృథ్వీ షా ఇటీవలే ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో తెగదింపులు చేసుకుని మహారాష్ట్రకు తన మకాంను మార్చాడు. ఇక బుచ్చి బాబు టోర్నీ కోసం మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా అంకిత్ బావ్నేను సెల‌క్ట‌ర్లు నియ‌మించారు. మహారాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను కాద‌ని బావ్నేకు సెల‌క్ట‌ర్లు అవ‌కాశ‌మిచ్చారు. గ‌త రంజీ సీజ‌న్‌లో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ గైర్హ‌జ‌రీలో బావ్నేనే జ‌ట్టుకు నాయకత్వం వహించాడు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మహారాష్ట్ర తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్లలో రెండో ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అయితే సెల‌క్ట‌ర్లు గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయ‌క‌పోవ‌డం వెన‌క ఓ కార‌ణ‌ముంది. ఈ భార‌త ఓపెన‌ర్ 2025-26 దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టుకు సెల‌క్ట్ చేశారు. ఆగస్టు 28న దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుందున, బుచ్చిబాబు టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు రుతు అందుబాటులో ఉండ‌డు. అందుకే బావ్నే కెప్టెన్‌గా నియ‌మించారు.ఈ ఏడాది బుచ్చిబాబు టోర్నీ ఆగ‌స్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మ‌హారాష్ట్ర జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 18 నుండి 20 వరకు గురునానక్ కళాశాల మైదానంలో ఛత్తీస్‌గఢ్‌తో తలపడ‌నుంది.మహారాష్ట్ర జట్టుఅంకిత్ బావ్నే (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, సిద్ధేష్ వీర్, సచిన్ దాస్, అర్షిన్ కులకర్ణి, హర్షల్ కేట్, సిద్ధార్థ్ మ్హత్రే, సౌరభ్ నవాలే (వికెట్ కీప‌ర్‌), మందార్ భండారి, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ దాధే, ప్రదీప్ దద్దే, ప్రదీప్ దద్దే సోలంకి, రాజవర్ధన్ హంగర్గేకర్

Make Public 65 Lakh Names Top Court To Poll Body6
తొలగించిన 65 లక్షల ఓటర్ల జాబితాను బహిర్గతం చేయండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై మరోసారి సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ఏదైతే ఓటర్లను తొలగించామని చెప్పిందో.. ఆ 65లక్షలకు పైగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో వారిని ఎందుకు తొలగించారో పేర్కొంటూ వివరణతో కూడిన ఆ లిస్టును పబ్లిక్‌లోకి తీసుకురావాలని పేర్కొంది ధర్మాసనం. ఈ అంశానికి సంబంధించి గురువారం(ఆగస్టు 14వ తేదీ) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 22 లక్షల మందిని చనిపోయారన్న కారణంతో తొలగించడాన్ని సైతం​ ప్రశ్నించింది. బూత్‌ లెవెల్‌ స్థాయిలో దీనిని ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీసింది. పౌరుల హక్కు రాజకీయ పార్టీలపై ఆధారపడటం మాకు ఇష్టం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘భారత ఎన్నికల కమిషన్ వాదనలను మేము పూర్తిగా విన్నాం. విచారణ సమయంలో, ఈ క్రింది దశలను అంగీకరించారు. 2025 జాబితాలో పేర్లు కనిపించినప్పటికీ, తాజాగా జాబితాలో చేర్చబడని 65 లక్షల మంది ఓటర్ల జాబితాను జిల్లా స్థాయి వెబ్‌సైట్‌లలో ప్రదర్శించాలి’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.కాగా, బీహార్లో ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు ఈ జాబితా సవరణలోని లోపాలు ప్రతీ రోజూ బయటపెడుతూనే ఉన్నాయి. వీటిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయ.మరొకవైపు ఈసీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ, అనర్హులైన ఓటర్లను తొలగిస్తూ, ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరణ ఇస్తూ వస్తోంది.. అయితే ప్రతిపక్షాలు ఈ ఓటర్లు జాబితా సవరణ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇంతలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర, కర్నాటకలలో ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు బీహార్ లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపైనా పలు విమర్శలు గుప్పిస్తున్నారు.ఇదీ కూడా చదవండి'దేశ'మంత మందికి ఓటుండదా?

Anil Ambani Reliance Infra wins Rs 526 crore arbitration award against Aravali Power7
అనిల్‌ అంబానీకి భారీ విజయం

చాలా ఏళ్ల తర్వాత అనిల్‌ అంబానీకి భారీ విజయం దక్కింది. ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్‌ అవార్డ్‌ (మధ్యవర్తిత్వ పరిహారం) పొందినట్లు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ ఇన్‌ఫ్రా) తెలిపింది. 2018లో ఆరావళి పవర్ ఓ ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేయడంతో మధ్యవర్తిత్వం ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డు‘ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్ మెజారిటీ తీర్పుతో ఆ రద్దు చెల్లదని తేల్చి, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అనుకూలంగా రూ.526 కోట్లు పరిహార తీర్పును ప్రకటించింది’ ఆర్‌ ఇన్‌ఫ్రా తెలిపింది. ఈ అవార్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రోత్ క్యాపిటల్ కోసం వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఏమిటీ వివాదం?రిలయన్స్‌ ఇన్‌ఫ్రాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీసీపీఎల్) 2018లో రద్దు చేసుకుంది. అయితే ఇది అసంబద్ధమంటూ రిలయన్స్ ఇన్‌ఫ్రా మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆరావళి పవర్ రద్దు నోటీసు జారీ చేయడం, అదే సంవత్సరం మధ్యవర్తిత్వాన్ని కూడా కోరడంతో వివాదం ప్రారంభమైంది.ఆర్‌ఇన్‌ఫ్రా సంస్థపై గత ఏడాది డిసెంబర్‌లో పొందిన రూ .600 కోట్ల మధ్యవర్తిత్వ పరిహారాన్ని అమలు చేయాలని కోరుతూ ఆరావళి పవర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఆర్ఇన్‌ఫ్రా ప్రతిస్పందనను కోరింది.విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ రంగాల్లో నిమగ్నమైన ఆర్‌ఇన్‌ఫ్రా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌లో కీలక సంస్థగా ఉంది. ఆగస్టు 13 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,501 కోట్లుగా ఉంది.

IMD Big Flash Floods Alert To Andhra Districts Details8
ఏపీకి భారత వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక

విశాఖపట్నం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలం అవుతోంది. పలు జిల్లాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో గురువారం భారత వాతావరణశాఖ ఏపీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్‌ ఫ్లడ్‌) ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని తెలుస్తోంది.పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు కదిలే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణకేంద్రం అధికారి జగన్నాథ్‌ కుమార్ తెలిపారు.ఏపీ వ్యాప్తంగా గురువారం పలుజిల్లాలో భారీ వర్షాలు కొనసాగాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 22, ముమ్మిడివరంలో 18, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఏగురవేశారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.

cloud burst in jammu and kashmir9
కిష్ట్‌వార్‌లో క్లౌడ్ బరస్ట్‌.. 33 మంది మృతి.. 220మంది గల్లంతు

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో స్వల్ప వ్యవధిలో కిష్ట్‌వార్‌, పహల్గాంలో రెండో చోట్ల జరిగిన క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆకస్మికంగా ముంచెత్తిన వరదల కారణంగా గురువారం సాయంత్రం (ఐదుగంటల) సమయానికి 33 మంది మరణించారు. 220మంది గల్లంతయ్యారు. ఓవైపు క్లౌడ్‌ బరస్ట్‌ మరోవైపు కుండపోత వర్షంతో భారీ ఎత్తున ఆస్తినష్టం,ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.గురువారం మధ్యాహ్నం కిష్ట్‌వార్‌ జిల్లాలోని చషోటీ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. స్థానికులు ఏర్పాటు చేసుకున్న గుడారాలు ఎగిరిపోయాయి. కిష్ట్‌వార్‌లో క్లౌడ్‌ బరస్ట్‌ అయిన కాసేపటికే పహల్గాంలో క్లౌడ్‌ బరస్ట్‌ జరిగింది. పహల్గాంకు సమీపంలో మెరుపు వరదలు ముంచెత్తాయి. జల ప్రవాహం ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. కిష్ట్‌వార్‌లో మెరుపు వరదలతో 220మంది గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు.క్లౌడ్‌ బరస్ట్‌తో అప్రమత్తమైన రెస్క్యూబృందాలు వరదల్లో చిక్కుకున్న వందల మంది బాధితుల్ని రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాయి. చషోటీ ప్రాంతంలో ప్రతీ ఏడాది జూలై 25 నుండి సెప్టెంబర్ 5 వరకు మచైల్ మాతా యాత్ర (Machail Mata Yatra) ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఏడాది చండీ మాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా మచైల్‌ మాతా ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు, స్థానికుల మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.వరద సంభవించిన చషోటీ ప్రాంతం మచైల్ మాతా యాత్రకు ప్రారంభ ప్రాంతంతో పాటు కిష్ట్‌వార్‌లోని హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో వాహన సదుపాయం ఉన్న చివరి గ్రామం కూడా. దీంతో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా చషోటీ ప్రాంతంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోదీ విచారంజమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్‌వార్‌ క్లౌడ్‌ బరస్ట్‌పై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.వరదల కారణంగా గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన వారికి సాధ్యమైన ప్రతి సహాయం అందిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. My thoughts and prayers are with all those affected by the cloudburst and flooding in Kishtwar, Jammu and Kashmir. The situation is being monitored closely. Rescue and relief operations are underway. Every possible assistance will be provided to those in need.— Narendra Modi (@narendramodi) August 14, 2025ఇప్పటికే ముంచెత్తిన వరద నుంచి గ్రామస్తులతో పాటు భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కిష్ట్‌వార్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ పంకజ్‌ శర్మ తెలిపారు. వరదలపై జమ్మూకశ్మీర్‌ ఉదంపూర్‌ ఎంపీ, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ అప్రమత్తమయ్యారు. క్లౌడ్‌ బరస్ట్‌ జరిగిన ప్రాంతంలోని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సహాయకచర్యల్ని వేగవంతం చేయాలని అదేశాలు జారీ చేశారు. Massive cloudburst struck Chishoti area in the Jammu and Kashmir’s Kishtwar district, along the route to the Machail Matta Yatra.Casualties are feared, though further details and official confirmation are awaited. https://t.co/d5AQMPAbfU pic.twitter.com/xJgI5WrpwP— Rakesh Kumar (@RiCkY_847) August 14, 2025 సీఎం ఒమర్‌ అబ్దుల్లా విచారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కార్యాలయం జిల్లా యంత్రాంగంతో సంప్రదిస్తున్నట్లు, అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. కిష్ట్‌వార్‌లో జరిగిన విషాదంపై సీఎం ఒమర్‌ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాలు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పోలీసు,సైన్యం,రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ‘కిష్ట్‌వార్‌లో జరిగిన క్లౌడ్‌ బరస్ట్‌ బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలనేది నా ఆకాంక్ష. పౌరులు, పోలీసు,సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులు రక్షణ, సహాయ కార్యకలాపాలను బలోపేతం చేయాలని, బాధితులకు కావాల్సిన సహాయం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు.

War 2 Movie Review And Rating In Telugu10
‘వార్‌ 2 ’మూవీ రివ్యూ

టైటిల్‌ : వార్‌ 2నటీనటులు: హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులునిర్మాణ సంస్థ: యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌నిర్మాత : ఆదిత్యా చోప్రాదర్శకత్వం: అయాన్‌ ముఖర్జీసంగీతం: ప్రీతమ్‌(పాటలు), సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా(బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌)సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్విడుదల తేది: ఆగస్ట్‌ 14, 2025బాలీవుడ్‌ బడా నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నుంచి వచ్చిన తాజా స్పై యాక్షన్‌ ఫిలిం వార్‌ 2. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం కావడంతో టాలీవుడ్‌లో కూడా ఈ మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ అంచనాలను వార్‌ 2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.వార్ 2 కథేంటంటే..కలి.. ఓ అజ్ఞాత శక్తి. ఎవరికి కనిపించడు కానీ, ప్రపంచ దేశాలను వణికిస్తాడు. ఈసారి అతని చూపు భారత్‌పై పడుతుంది. భారత్‌ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు ‘ రా’ మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని పావుగా వాడతాడు. కలి టీమ్‌లో చేరాలంటే.. తన గాడ్‌ ఫాదర్‌ లాంటి వ్యక్తి, కల్నల్‌ సునీల్‌ లూథ్రా(అశుతోష్‌ రాణా)ని చంపాలని కబీర్‌కు టాస్క్‌ ఇస్తాడు. సునీల్ లూథ్రాని కబీర్‌ చంపేస్తాడు. దీతో ‘రా’ కబీర్‌ని వెంటాడుతుంది. అతడిని పట్టుకోవడానికి ‘రా’ చీఫ్‌ (అనిల్‌ కపూర్‌) ఓ స్పెషల్‌ టీమ్‌ని నియమిస్తాడు. కేంద్రమంత్రి విలాస్‌ రావు సారంగ్‌ సూచనతో స్పెషల్‌ టీమ్‌కి మేజర్‌ విక్రమ్‌ చలపతి(ఎన్టీఆర్‌)ని లీడర్‌గా నియమిస్తాడు. తన తండ్రి సునీల్‌ లూథ్రాని చంపిన కబీర్‌పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) కూడా విక్రమ్‌ టీమ్‌లో చేరుతుంది. విక్రమ్‌ టీమ్‌ కబీర్‌ని పట్టుకుందా? లేదా? అసలు కబీర్‌ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతని లక్ష్యం ఏంటి? విక్రమ్‌కి, కబీర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజ్ఞాతంలో ఉన్న కలి ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్పై యాక్షన్‌ థ్రిల్లర్ అనగానే క‌ళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్టులు లాంటివి గుర్తుకొస్తాయి. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకొనే థియేటర్స్‌కి వస్తాడు. వార్‌ 2లో ఆ రెండూ ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్‌ సీన్లు, ట్విస్టులు చూసి ఉండడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు ‘కొత్తగా ఏమీ లేదే’ అనిపిస్తుంది. కథ, కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. దర్శకుడు ట్విస్టులు అనుకొని రాసుకున్న సీన్లు కూడా ఈజీగా ఊహించొచ్చు. విజువల్స్‌ పరంగానూ సినిమా ఆకట్టుకునేలా లేదు. ఒకటి రెండు యాక్షన్‌ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్‌గానే ఉంటాయి. ఎమోషనల్‌ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకుంటాయి. ఓ భారీ యాక్షన్‌ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. కలి గ్యాంగ్‌.. హృతిక్‌కి ఒక టాస్క్‌ ఇవ్వడం.. అందులో భాగంగా కల్నల్‌ సునీల్‌ లూథ్రాని చంపేయడం.. అతన్ని పట్టుకునేందుకు ‘రా’ రంగంలోకి దిగడం అంతా రొటీన్‌గానే సాగుతుంది. ఇక మేజర్‌ విక్రమ్‌గా ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతంది. భారీ ఎలివేషన్‌తో ఎన్టీఆర్‌ ఎంట్రీ ఉంటుంది. కబీర్‌ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్‌ ఛేజింగ్‌ సీన్‌, మెట్రో ట్రైన్‌పై వచ్చే యాక్షన్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌కు ముందు విమానంపై వచ్చే యాక్షన్‌ సీన్‌ సినిమాకే హైలెట్‌. స్పై యాక్షన్‌ సినిమాలను చూసిన వారికి ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఈజీగా ఊహించొచ్చు. సెకండాఫ్‌ ప్రారంభంలో హృతిక్‌, ఎన్టీఆర్‌పై వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఆకట్టుకుంటుంది. కావ్య లూథ్రాకి అసలు నిజం తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. చివరిలో హృతిక్‌, ఎన్టీఆర్‌ మధ్య వచ్చే యాక్షన్‌ సీన్‌ అదిరిపోతుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌..ఇద్దరూ గొప్ప నటులే. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతారు. హృతిక్‌కు ఆల్రేడీ స్పై యాక్షన్‌ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్‌ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్‌ సీన్లు అదరగొట్టేశాడు. ఎన్టీఆర్‌కి ఇది తొలి స్పై యాక్షన్‌ మూవీ. మేజర్‌ విక్రమ్‌గా అద్భుతంగా నటించాడు. యాక్షన్‌, డ్యాన్స్‌ విషయంలో హృతిక్‌తో పోటీ పడి యాక్ట్‌ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకే భారీ ఎలివేషన్‌, ట్విస్టులు ఉంటాయి. దాదాపు 80 శాతం కథ ఎన్టీఆర్‌, హృతిక్‌ల చుట్టే తిరుగుతుంది. ఇక కల్నల్‌ సునీల్‌ లూథ్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కియరా అద్వానీ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రకి స్క్రీన్‌స్పేస్‌ చాలా తక్కువ అనే చెప్పాలి. హృతిక్‌తో వచ్చే యాక్షన్‌ సీన్‌లో కియారా అదరగొట్టేసింది. అనిల్‌ కపూర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ప్రీతమ్‌ పాటలు ఓకే. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్‌ సన్నివేశాలు ఒకటి, రెండు బాగున్నాయి. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement