Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Hyderabad Metro Train Timings Extended From April 1st1
హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మెట్రో ప్రయాణికులకు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. మెట్రో సమయం పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉన్న మెట్రో సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇకపై ఏప్రిల్‌ 1 నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ మారిన వేళలు అమల్లో ఉంటాయని తెలిపారు.కాగా, ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న ఆఫర్ మరో ఏడాది పొడిగించారు. విద్యార్థుల 20 ట్రిప్పుల డబ్బులతో 30 ట్రిప్పులు వెళ్లే ఆఫర్ పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. సూపర్ సేవర్ హాలిడే ఆఫర్, ఆఫ్-పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31తో ముగియనుంది. తాజాగా ఈ ఆఫర్‌ను మరో ఏడాది పొడిగిస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని మెట్రో ఎండీ పేర్కొన్నారు.

Ex High Court Judge Acquitted In Chandigarh 20082
16 ఏళ్ల నిరీక్షణ.. నిర్దోషిగా హైకోర్టు మాజీ జడ్జి

చంఢీగడ్: అదొక పదహారేళ్ల క్రితం కేసు.. అందులోనూ హైప్రొహైల్ కేసు. ఒక జస్టిస్‌ తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి సుదీర్ఘకాలం వేచి చూసిన కేసు. హర్యానా జడ్జిగా పని చేసిన జస్టిస్ నిర్మలా యాదవ్.. భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే కేసు. అయితే ఆ కేసు సుదీర్ఘంగా విచారణ చేసింది సీబీఐ. చివరకు ఆ కేసులో నిర్మలా యాదవ్ ఎటువంటి తప్పుచేయలేదని తేలడంతో ఆమెకు బిగ్ రీలీఫ్ లభించింది. తాజాగా సీబీఐ కోర్టు.. ఆమెను నిర్దోషిగా తేల్చి తీర్పును వెలువరించింది. 2008 జరిగిన ఈ కేసులో తీర్పు తనకు అనుకూలంగా రావడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా ఈరోజు(శనివారం) సీబీఐ కోర్టుకు హాజరైన ఆమె.. తీర్పు తర్వాత మాట్లాడారు. తనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని, అందుకే ఇంతకాలం ఓపిక పట్టిన దానికి ప్రతిఫలం లభించిందన్నారు. ఒక జడ్జికి ఇవ్వబోయి.. మరొక జడ్జికి క్యాష్ డెలివరీఆ ఇదర్దు జడ్జి పేర్లు ఇంచుమించు ఒకే మాదిరి ఉంటాయి. ఒకరు నిర్మలా యాదవ్ అయితే మరొకకే నిర్మలాజిత్ కౌర్. అయితే హర్యానా మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సంజీవ్ బన్సాల్ క్లర్క్.. ఓ రూ. 15 లక్షల నగదును ప్యాక్ చేసుకుని నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు విచారణలో తేలింది. తాను ఇవ్వాల్సింది జస్టిస్ నిర్మలాజిత్ కౌర్ కని కాకపోతే పొరపాటున జస్టిస్ నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు ఆ ప్యాక్ తీసుకెళ్లిన అప్పటి క్లర్క్. రోజుల వ్యవధిలో ఆమెపై రెండు ఎఫ్ఐఆర్‌లుఈ కేసుకు సంబంధించి 2008, ఆగస్టు 16వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఆ తర్వాత మళ్లీ ఓ కీలక మలుపు తీసుకుంది. అప్పటి యూనియన్ టెర్రిటరీ జనరల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్ ఆదేశాలతో ఆ కేసును సీబీఐకి బదిలీ చేశారు. దాంతో 12 రోజుల వ్యవధిలో సీబీఐ మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.2009 జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభంజస్టిస్ నిర్మలా యాదవ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల్లో దర్యాప్తు చేపట్టేందుకు తమకు అనుమతి కావాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టుకు విజ‍్క్షప్తి చేసింది సీబీఐ. దీనికి అనుమతి లభించడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ పై విచారణ చేపట్టింది సీబీఐ. 2011లో ఆమెపై చార్జిషీట్ నమోదు చేసింది సీబీఐ.దీనిలో భాగంగా మొత్తం 84 మంది సాక్షులను పేర్లను నమోదు చేసింది. ఇందులో 69 మందిని విచారించిన సీబీఐ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 10 మంది సాక్షులను తిరిగి విచారించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే 10 మంది కీలక సాక్షులను మళ్లీ విచారించారు. చివరకు ఆ రూ. 15 లక్షల కేసులో జస్టిల్ నిర్మలా యాదవ్ పాత్ర ఏమీ లేదని తేలడంతో ఆమె నిర్దోషిగా నిరూపితమయ్యారు.

YS Jagan Ugadi Wishes To All Telugu People3
తెలుగువారికి వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు

తాడేపల్లి: రేపు తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ తన సందేశంలో ఆకాంక్షించారు.

IPL 2025: Gujarat titans vs Mumbai indians live updates and highlights4
గుజ‌రాత్ రెండో వికెట్ డౌన్‌.. జోస్‌ బట్ల‌ర్‌ ఔట్‌

IPL 2025 MI vs GT live updates and highlights: ఐపీఎల్‌-2025లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.గుజ‌రాత్ రెండో వికెట్ డౌన్‌..జోస్ బ‌ట్ల‌ర్ రూపంలో గుజ‌రాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 39 ప‌రుగులు చేసిన బట్ల‌ర్.. ముజీబ్ ఉర్ రెహ్మ‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ రెండు వికెట్ల న‌ష్టానికి 134 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయిసుద‌ర్శ‌న్‌(49), షారూఖ్ ఖాన్‌(0) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న జోస్‌ బట్ల‌ర్‌..12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయి సుద‌ర్శ‌న్‌(42), బ‌ట్ల‌ర్‌(26) ఉన్నారు.తొలి వికెట్ డౌన్‌.. శుబ్‌మ‌న్ గిల్ ఔట్‌శుబ్‌మ‌న్ గిల్ రూపంలో గుజ‌రాత్ తొలి వికెట్ కోల్పోయింది. 38 ప‌రుగులు చేసిన గిల్‌.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి జోస్ బ‌ట్ల‌ర్ వ‌చ్చాడు. 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 79 ప‌రుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న గిల్‌, సుద‌ర్శ‌న్‌గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్లు సాయిసుద‌ర్శ‌న్‌(32), శుబ్‌మ‌న్ గిల్‌(32) దూకుడుగా ఆడుతున్నారు. 6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 66 ప‌రుగులు చేసింది.నిల‌క‌డ‌గా ఆడుతున్న గుజ‌రాత్ ఓపెన‌ర్లుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 26 ప‌రుగులు చేసింది. క్రీజులో ఓపెన‌ర్లు శుబ్‌మ‌న్ గిల్‌(13), సాయిసుద‌ర్శ‌న్‌(13) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. గుజ‌రాత్ మాత్రం త‌మ జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు.తుది జ‌ట్లుముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్‌), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీప‌ర్‌), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ

Sneha, Prasanna gets Trolled for Wearing Footwear in Tiruvannamalai Arunachalesvara Temple5
'స్నేహ.. కొంచెమైనా బుద్ధుందా? చెప్పులేసుకుని గిరిప్రదక్షిణా?'

అరుణాచల శివుడిని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందంటారు. అరుణాచలం దర్శనానికి ముందు, దర్శనం తర్వాత.. అన్నంతగా జీవితం మారిపోతుందంటారు. విక్టరీ వెంకటేశ్‌, కిరణ్‌ అబ్బవరం.. ఇలా ఎందరో సెలబ్రిటీలు ఆ ప్రదేశాన్ని ఎంతగానో ఆరాధిస్తారు. తాజాగా హీరోయిన్‌ స్నేహ (Actress Sneha) కూడా అరుణాచలం వెళ్లింది. భర్త ప్రసన్నకుమార్‌తో కలిసి గిరిప్రదక్షిణ చేసింది. గిరి ప్రదక్షిణసూర్యుడు ఉదయించడానికి ముందే ముఖానికి మాస్కులు ధరించి భార్యాభర్తలిద్దరూ కాలినడకన గిరి ప్రదక్షిణ చేశారు. దారిలో ఎదురయ్యే ఆలయాల దగ్గర ఆగి కొబ్బరికాయలు కొడుతూ తర్వాత నడక సాగించారు. ఈ క్రమంలో తమకు ఎదురైన హిజ్రాలతో నవ్వుతూ ఫోటోలు కూడా దిగారు. అంతా బాగుంది కానీ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు వీళ్లిద్దరూ చెప్పులు, శాండిల్స్‌ ధరించారు. కాస్తయినా బుద్ధి లేదా?అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన భక్తులు, అభిమానులు స్నేహ దంపతులపై మండిపడుతున్నారు. కాళ్లకు చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడమేంటి? కొంచెమైనా బుద్ధి లేదా? ఇది మహాపాపం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు మాత్రం.. వారు తెలియక చేసుంటారని వెనకేసుకొస్తున్నారు.సినిమా- పర్సనల్‌ లైఫ్‌స్నేహ తెలుగు, తమిళంలో టాప్‌ హీరోయిన్‌గా రాణించింది. ప్రియమైన నీకు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హనుమాన్‌ జంక్షన్‌, వెంకీ, శ్రీరామదాసు, రాధాగోపాలం, పాండురంగడు, అమరావతి, రాజన్న, సన్నాఫ్‌ సత్యమూర్తి, వినయ విధేయ రామ.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. ఇటీవల వచ్చిన డ్రాగన్‌ మూవీలో డాక్టర్‌గా అతిథి పాత్రలో కనిపించింది. ఇకపోతే స్నేహ కథానాయికగా సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ లీడ్‌ చేస్తున్న సమయంలోనే నటుడు ప్రసన్నకుమార్‌తో ప్రేమలో పడింది. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒక కుమారుడు, కూతురు జన్మించారు. AK Fan Boy Prasanna Sir and Sneha Mam went to Girivilam.Prasanna sir will be eyeing for huge success for his character in GBU.#Ajith#AjithKumar#GoodBadUgly#Prasanna#SnehaPrasanna pic.twitter.com/fxQWoQvNzS— Deepak Kaliamurthy (@Dheeptweet) March 28, 2025 చదవండి: బాలీవుడ్‌లో అంతా గొర్రెలే.. సౌత్‌ను చూసి నేర్చుకోండి: నటుడు

Hyderabad realty down Housing sales plummet by 49pc6
హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్‌‌ పతనం

రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ ప్రతికూల విధానాలు, ఆకాశాన్నంటిన ప్రాపర్టీ ధరలు.. కారణాలేవైనా.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం పల్టీలు కొడుతూ పతనమైపోతోంది. రెండేళ్ల క్రితం ఎన్నికలతో మొదలైన స్థిరాస్తి రంగం మందగమనం.. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో గ్రేటర్‌లో గృహ విక్రయాలు, లాంచింగ్స్‌ భారీగా తగ్గాయి. దేశంలోనే ఇళ్ల అమ్మకాలు, లాంచింగ్స్‌లో అత్యధిక క్షీణత మన నగరంలోనే ఉండటం గమనార్హం. - సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో (క్యూ1) 10,100 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2024 క్యూ1లో 19,660 సేల్‌ అయ్యాయి. ఏడాది కాలంలో విక్రయాలలో 49 శాతం తగ్గుదల నమోదయిందని అనరాక్‌ గ్రూప్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. అలాగే నగరంలో 2025 క్యూ1లో కొత్తగా 10,275 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. అదే 2024 క్యూ1లో 22,960 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో లాంచింగ్స్‌ 55 శాతం తగ్గాయని పేర్కొంది. అయితే ఆశ్చర్యకరంగా నగరంలో కొత్తగా ప్రారంభమైన ఇళ్లలో లగ్జరీ గృహాలదే ఆధిపత్యం. గ్రేటర్‌లో కొత్త ఇళ్ల నిర్మాణాలలో రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ ఇళ్ల వాటా 70 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇన్వెంటరీ 5 లక్షలపైనే.. ఏడు నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) కాస్త తగ్గాయి. 2024 క్యూ1లో 5,80,890 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. 2025 క్యూ1 నాటికి 5,59,810కు క్షీణించాయి. అంటే ఏడాది కాలంతో పోలిస్తే ఇన్వెంటరీ 4 శాతం తగ్గింది. స్థిరమైన ఆర్థిక పరిస్థితి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణ కారణంగా దేశంలో గృహాల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. ఏడాది కాలంలో ప్రాపర్టీ ధరలు మాత్రం 17 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా ఎన్‌సీఆర్‌లో 34 శాతం, బెంగళూరులో 20 శాతం వృద్ధి చెందాయి.దేశంలోనూ సేమ్‌.. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ స్థిరాస్తి రంగం తిరోగమనంలోనే ఉంది. ఈ ఏడాది క్యూ1లో ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 28 శాతం, లాంచింగ్స్‌ 10 శాతం క్షీణించాయి. 2025 క్యూ1లో 93,280 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే గతేడాది క్యూ1లో 1,30,170 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇదే సమయంలో 7 నగరాల్లో 2025 క్యూ1లో 1,00,020 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. 2024లో 1,10,865 గృహాలు ప్రారంభమయ్యాయి. అంటే ఏడాదిలో 10 శాతం లాంచింగ్స్‌ క్షీణించాయి.లగ్జరీదే హవా.. లాంచింగ్స్‌లో లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాలే అత్యధికం. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ తరహా ఇళ్ల వాటా 42 శాతం ఉన్నాయి. ఆ తర్వాత రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉండే ప్రీమియం యూనిట్ల వాటా 27 శాతం, రూ.40–80 లక్షల ధర ఉండే అఫర్డబుల్‌ హౌసింగ్స్‌ వాటా 12 శాతంగా ఉన్నాయి.

US revoked Hundreds of international students Visas in Overnight Details7
విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

వాషింగ్టన్‌: అమెరికాలో విదేశీ విద్యార్థులపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో బాంబు వేసింది. వందల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ రాత్రికి రాత్రే వీసా రద్దు మెయిల్స్‌​ పంపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీసాలు రద్దయిన విద్యార్థులు తక్షణమే దేశాన్ని వీడాలని లేదంటే బలవంతంగా తరలిస్తామని ఆ మెయిల్స్‌లో హెచ్చరించింది. వీసాలు రద్దైన వాళ్లలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం. యూనివర్సిటీలలో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ మెయిల్స్‌ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ‘బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ వీసా’ నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్‌ పంపింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన విద్యార్థులకు.. ఆఖరికి ఆ పోస్టులకు లైకులు కొట్టినవాళ్లకు కూడా ఈ హెచ్చరికలు పంపించింది.‘‘యునైటెడ్ స్టేట్స్‌ ఇమిగ్రేషన్, అమెరికా జాతీయచట్టంలోని సెక్షన్‌ 221(జీ) ప్రకారం.. మీ వీసా రద్దయింది. ఈ మేరకు స్టూడెంట్‌ ఎక్చ్సేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌కు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్లింది. మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చు’’హెచ్చరిక సందేశాలు వచ్చినవారు.. తమ స్వదేశాలకు వెళ్లేందుకు సీబీపీ హోమ్‌ యాప్‌ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ చర్యతో.. ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండటం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది.

AP CM Chandrababu Again U Turn Comments On Super Six Promises8
ఆరోజు అన్నీ హామీలు అమలు చేయగలుగుతాం అనిపించింది

ఎన్టీఆర్‌ జిల్లా, సాక్షి: ఎన్నికల హామీల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్లేటు ఫిరాయించారు. సూపర్‌ సిక్స్‌ను ఎగ్గొట్టేందుకు ఈసారి కొత్త రాగం అందుకున్నారు. ఇందుకు మంగళగిరి ఇవాళ జరిగిన టీడీపీ ఆవిర్భావ సమావేశాలు వేదిక అయ్యింది. ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ హామీలిచ్చాం. ఆరోజు బయట నుండి చూస్తే అన్నీ చేయగలుగుతాం అనిపించింది. నేను అనేకసార్లు చెప్పా. అభివృద్ధి జరగాలి.. సంపద సృష్టించాలి. ఆదాయం పెంచి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అప్పులు చేసి సంక్షేమపథకాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయాం అంటూ వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో అప్పులపైనా మళ్లీ పచ్చి అబద్ధాలు చెప్పారాయన. రాష్ట్రానికి రూ. 9.75 లక్షల కోట్లు అప్పుందంటూ వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు యూటర్న్‌ వ్యాఖ్యలు ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఇలాగే మాట్లాడారాయన. ఇప్పుడు టీడీపీ సభలోనూ అమలు చేయలేకపోతున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.

Woman Gives Birth On Bangkok Street Amid Earthquake Tremors9
ఆస్పత్రిలో ప్రసవ వేదనతో ఉండగా భూకంపం.. పాపం ఆ మహిళ..!

సరిగ్గా ప్రకృతి విపత్తుల నడుమే అనుకోని విత్కర పరిస్థితులు వస్తుంటాయి. ఓ పక్కా భూప్ప్రకంపనాలతో వణికిపోతున్న తరుణంలో.. ఓ నిండు చూలాలు నొప్పులు పడుతుంటే..దేవుడా..! ఏంటిదీ అనిపిస్తుంది. అక్కడ ప్రాణం పోసే వైద్యులు తమ ప్రాణాలు రక్షించుకోలేని స్థితిలో ఉండగా..మరోవైపు పేషెంట్‌ ప్రసవ వేదనతో అల్లాడుతుంటే..ఏం చేయాలో తోచని స్థితి అది. మనిషి మరచిపోతున్న మానవత్వపు విలువను గుర్తుచేసేందుకు దేవుడి పెట్టిన విపత్కర పరీక్ష ఏమో అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ మానవత్వమే గెలిచింది. థాయ్‌లాండ్‌, మయన్మార్‌లని శుక్రవారం రెండు భారీ భూకంపాలు ఘోరంగా అతలాకుతులం చేసిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో ఇప్పటిదాకి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అయితే దారుణ భూవిలయంల నడుమ జరిగిన ఓ అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. సరిగ్గా థాయ్‌లాండ్‌లో భూకంపం సంభవిస్తున్న తరుణంలో.. బ్యాంకాక్‌లోని ఓ ఆస్పత్రిని ఖాళీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విపత్కర సమయంలో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను కూడా స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు. అక్కడ సమీపంలోని పార్క్‌లోనే ఆస్పత్రి సిబ్బంది చుట్టుముట్టి మరీ డెలివరీ చేశారు. ఓ పక్క భూవిలయం మరోవైపు శిశు జననం చోటు చేసుకున్న అరుదైన ఘటన ఇది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. భూకంపం సమయంలో ఓ శిశువు ఊపిరిపోసుకుందంటూ ఓ వీడియోని షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల​ ప్రకారం.. భూప్రకంపన నేపథ్యంలో మయ కింగ్ చులాలాంగ్‌కార్న్ మెమోరియల్ హాస్పిటల్ రోగులను చర్‌లు, వీల్‌చైర్‌లతో దగ్గరలోని పార్కుకి తరలించారు. ఆ సమయంలోనే ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చి పార్క్‌లోనే డెలివిరీ చేశారు. ఆ పార్కులోనే మిగతా రోగులకు కూడా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా, మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 694 మంది మరణించగా, వెయ్యిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పైగా ఇంకా 68 మంది ఆచూకి కానరాలేదని సమాచారం. ఏదీఏమైనా ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. విపత్తుల సమయంలోనే మనలోని మంచి మనిషి బయటకు వస్తాడేమో అంతా ఒక్కటే అనే భావనతో మెలుగుతాం కాబోలు. Footage during the earthquake in #Bangkok a baby was born in the park 😭 Waht a story to tell ‘’ I was born during the earthquake ‘’ #แผ่นดินไหว #earthquake #myanmarearthquake #bangkokearthquake #ตึกถล่ม pic.twitter.com/7E0FdzfPEf— Miia 🩵 (@i30199) March 28, 2025 (చదవండి: వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆది వరాహస్వామి ఆలయం..)

KSR Comment On AP Political Bhakts Silence10
అయినను రాజకీయ భక్తులు నోరు విప్పరేం?

మనం ఎవరైనా.. ఏదో సందర్భవశాత్తు.. తప్పనిసరైతేనే అబద్దాలు చెబితే చెప్పవచ్చు. కానీ దైవసన్నిధికి వెళ్లినప్పుడు మాత్రం అలా అసత్యాలు చెప్పడానికి వెనుకాడతాం. రాజకీయ నేతలకు ఈ విషయంలో కూడా మినహాయింపే ఉన్నట్లు ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు.. అంతా పవిత్రంగా భావించే తిరుమలను సైతం తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో విపక్షంలో ఉన్నప్పుడు కాని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాని ఆరితేరినట్లు కనబడుతోంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు పురస్కరించుకుని తిరుమలకు వెళ్లినప్పుడు ఆయన చెప్పిన విషయాలలో అబద్దాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు, ఆ తర్వాత భూమన వాదన విన్న తర్వాత తిరుమల యాత్ర సందర్భంగా కూడా అబద్దాలు చెబుతున్నారన్న విమర్శలకు సీఎం ఎందుకు ఆస్కారం ఇస్తున్నారనే భావన కలుగుతోంది. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని, దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే నీచత్వం చంద్రబాబు, పవన్‌లదని భూమన అన్నప్పుడు దానిని ఖండించవలసిన టీడీపీకాని, ప్రభుత్వంలోని వారు కాని అసలు పట్టించుకోలేదంటే దానిపై వివరణ ఇచ్చే పరిస్థితి లేదనే అర్ధం అవుతుంది కదా!. 👉వైఎస్‌ జగన్(YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశాన్ని.. అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా గోరంతలు కొండంతలు చేసి తిరుమల అపవిత్రం అయిపోతోందంటూ చంద్రబాబు, పవన్, లోకేష్ ఆరోపణలు గుప్పించేవారు. వాటిలో అత్యధికం అసత్యాలే అనే సంగతి అప్పట్లోనే రుజువు అయ్యింది కూడా. కానీ జగన్ ప్రభుత్వానికి జరగవలసిన డామేజీ అప్పటికే జరిగిపోయింది. ఉదాహరణకు తిరుమలకు వెళ్లే బస్‌ల టిక్కెట్లపై అన్యమత ప్రచారం ఉందని, కొండపై శిలువ రూపంలో లైట్లు ఉన్నాయని.. ఇలా ఒకటేమిటి దారుణమైన అబద్దాలు ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా పోటీపడి ఈ అసత్యాలను జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేసేవి. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయిన ఈ పద్దతి మానుకున్నారా? అంటే లేదు. అదే ధోరణి అనుసరిస్తున్నారు. 👉చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు అత్యంత ఘోరమైన అపచారం.. తిరుమల లడ్డూ విషయంలో చేశారు. కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ బాధ్యతారాహిత్యంగా చంద్రబాబు ఆరోపణ చేశారు. దానికి అదనంగా అయోధ్యకు పంపిన లడ్డూలలో కల్తీలడ్డూలు వెళ్లాయని దారుణమైన అబద్దాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. తీరా చూస్తే ఇవేవి నిజం కాదని వెల్లడైంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి సరఫరా అయితే దానిని టీటీడీ అధికారులు వెనక్కి పంపినట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాంటప్పుడు జంతు కొవ్వు కలిసిన నెయ్యి లడ్డూలో ఎలా వాడతారన్నదానికి ఇంతవరకు సమాధానం లేదు. అలాగే అయోధ్యకు లడ్డూలను తయారు చేయించి పంపించింది ప్రస్తుతం టిటిడి సభ్యుడిగా ఉన్న సౌరబ్ బోరా అని తేలింది. ఆయన స్వచ్చమైన ఆవు నేయితో తయారు చేసిన లడ్డూలను పంపితే.. పవన్ కళ్యాణ్ మాత్రం తప్పుడు ఆరోపణ చేశారు. పోనీ ఆయన తన అభిప్రాయానికి కట్టుబడి బోరా పై ఏమైనా చర్య తీసుకోవాలని కోరారా? అంటే అదీ లేదు. ఇవన్నీ తిరుమలేషుని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం కాదా? అన్న ప్రశ్న వస్తే సమాధానం ఉండదు. చంద్రబాబు తాజా తిరుమల టూర్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చూద్దాం. ఏడుకొండలను ఆనుకుని ఉన్న ప్రాంతం స్వామివారి సొంతం అని, అక్కడ ఓబెరాయ్ హోటల్‌కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి అభివృద్ది సంస్థ ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని మాత్రం కప్పిపెట్టారు. పైగా ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వగానే ఎల్లో మీడియా రాయలసీమలోనే మొదటి సెవెన్ స్టార్ హోటల్ అంటూ ఊదరగొట్టింది. మొత్తానికి.. సాధువుల నిరసనలతో ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దేవలోక్ ప్రాజెక్టు కు కేటాంచిన భూ అనుమతిని కూడారద్దు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టుకు 2016లో అప్పటి టిడిపి ప్రభుత్వమే విల్లాలు,గదుల నిర్మాణం నిమిత్తం అనుమతి ఇచ్చింది. గతంలో అసెంబ్లీలో.. ఏడు కొండలు లేవు.. రెండు కొండలే ఉన్నాయని కొందరన్నారని మరో అసత్య వచనం చెప్పారు. దానిపై అప్పట్లో పోరాడనని చంద్రబాబు అంటున్నారు. అప్పుడు కూడా చంద్రబాబు అబద్దమాడినట్ట్లు ఒకటికి పదిసార్లు రుజువు అయినా అదే అసత్యం చెబుతూ ఉంటారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడు కొండలను దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో జి,ఓ.746 ఇచ్చారని ప్రస్తుత ఈఓ శ్యామలరావు హైకోర్టులో వేసిన ఒక అఫిడవిట్‌లో తెలిపారు. 👉ఒక వదంతిని సృష్టించడం, దానిని నిజమని ప్రచారం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన గురించి తెలిసినవారు వ్యాఖ్యానిస్తుంటారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తామని ఒకసారి , దానిని కొనసాగిస్తామని మరోసారి చెబుతున్నారు. ఇది కాకుండా కొత్తగా ఆలయాల నిర్మాణం కోసం ఇంకో ట్రస్టు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. నిజానికి శ్రీవాణి ట్రస్టు ను ఏర్పాటు చేసింది టీడీపీ హయాంలోనే అట. దానిని వైఎస్సార్‌సీపీ హయాంలో సమర్ధంగా నిర్వహించి విదేశాలలో, దేశ వ్యాప్తంగా 3600 దేవాలయాలను నిర్మించిందని భూమన చెప్పారు. అనేక చోట్ల కళ్యాణోత్సవాలను కూడా జరిపించారు. ఇది వాస్తవమా?కాదా?.. ఇప్పుడేదో కొత్తగా దేశంలో టీటీడీ(TTD) తరపున ఆలయాలు నిర్మించబోతున్నట్లు బిల్డప్ ఇవ్వడం అవసరమా?. నిజంగానే శ్రీవాణి ట్రస్టు ను రద్దు చేసి ఆ నిధులను టీటీడీ సాధారణ నిధులలోకి తీసుకువస్తే రూ. 600 కోట్ల జీఎస్టీని చెల్లించవలసి వస్తుందని భూమన చెప్పారు. ఏ ఉద్దేశంతో చంద్రబాబు ఈ ట్రస్టును రద్దు చేసి మరో కొత్త ట్రస్టు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారో తెలియదు. గతంలో శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు ఆరోపించేవారు. అది నిజం కాదని పరోక్షంగా ఆయన అంగీకరిస్తున్నారనుకోవాలి. ఇక.. తిరుమలకు నీటి కొరత రాబోతోందని, ఆలయం మూసివేయాలని ఒక అధికారి తనతో చెప్పారంటూ చంద్రబాబు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ అధికారి పేరు ఎందుకు చెప్పలేదు. నిజంగానే నీటి సమస్య వస్తే భక్తులను కొండపైకి రాకుండా ఆపుతారేమో కాని, స్వామివారి నిత్య కైంకర్యాలను ఆపి ,ఆలయాన్ని మూసివేయడం ఎక్కడైనా జరుగుతుందా? అనేదానికి జవాబు దొరకదు. ఆఖరికి సెంటిమెంట్ విషయాలలో కూడా చంద్రబాబు ఇలా మాట్లాడడమేమిటో అర్ధం కాదు. గతంలో అప్పటి ఈఓ ధర్మారెడ్డి తనయుడు ఆకస్మికంగా చనిపోతే.. కర్మకాండ ముగిసిన తర్వాత ఆయన ఆలయానికి వస్తే దానిని తప్పుపడుతూ ఆలయాన్ని అపవిత్రం చేస్తారా? అని చంద్రబాబు, పవన్‌లు అన్నారన్న సంగతిని భూమన ప్రస్తావించారు. మరి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించి నెలలు తిరగకముందే.. చంద్రబాబు కుటుంబం తిరుమలకు ఎలా వస్తారని, ఇది అపవిత్రం కాదా? అని భూమన ప్రశ్నించారు.దీనికి చంద్రబాబు లేదంటే ఆయన తరపున టీటీడీ వాళ్లైనా జవాబు ఇవ్వాలి కదా!. కిక్కురుమన్నట్లు లేదు. అంతేకాదు.సోషల్ మీడియాలో ఒక ఫొటోతో కూడా వ్యాఖ్య ఒకటి కనిపించింది. జగన్ ముఖ్యమంత్రి హోదాలో తిరుమల వెళ్లినప్పుడు స్పూన్ తో ప్రసాదం స్వీకరించడాన్ని కూడా ఆక్షేపించి తమ రాజకీయ అవసరాలకోసం చంద్రబాబు వాడుకున్నారట. మరి అదే చంద్రబాబు తన మనుమడితో పాటు స్పూన్ తోనే ప్రసాదం తీసుకుంటున్న ఫోటో కనిపించింది. నిజానికి ఇది పెద్ద అంశం కాదు. కాని చంద్రబాబు దేనినైనా రాజకీయం చేయగలరని.. తనవరకు వస్తే మాత్రం ఏమి జరగనట్లే ఉంటారని చెప్పడానికే ఇలాంటి నిదర్శనాలు అవుతాయి. పాపనాశనం రిజర్వాయిర్‌లో బోటింగ్ పెట్టారట. అదే జగన్ టైంలో పెట్టి ఉంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు ఎంత గగ్గోలు పెట్టేవో?. ఇప్పుడేమో వివాదం అయ్యేసరికి అధికారులు ఏవో సాకులు చెబుతున్నారు. తిరుమల అదనపు ఈవో అచ్చంగా రాజకీయవేత్త మాదిరి.. స్థానికంగా వైఎస్సార్‌సీపీ అభిమానులన్న అనుమానంతో చిరువ్యాపారులను బెదిరిస్తున్నారట. సామాన్యులకే స్వామివారి దర్శనంలో ప్రాధాన్యత అని చంద్రబాబు,పవన్ కళ్యాణ్, బీఆర్ నాయుడు ఊదరగొడుతుంటారు. కాని ఆచరణలో మాత్రంఅందుకు భిన్నంగా ప్రస్తుతం రోజుకు ఎనిమిదివేల మందికి వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారట. వీటిలో అత్యధికం ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందట. దాంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండవలసి వస్తోందని సామాన్యులు వాపోతున్నారు. ఇక ఆలయాల కూల్చివేతలు, మఠాల భవనాల ధ్వంసం చేయడం వంటివి జరుగుతున్నా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు నోరు విప్పి మాట్లాడం లేదు. హిందూ మత ఉద్దారకులమని ప్రచారం చేసుకునే బీజేపీ సైతం వీటిని చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. మతాన్ని,దైవక్షేత్రాలను రాజకీయాలకు వాడుకుంటున్న వీరికి నిజంగా భక్తి ఉందా? అనే సందేహం ఎవరికైనా రావచ్చు. వీరు అపర భక్తులా? లేక రాజకీయ భక్తులా అంటే ఏమి చెబుతాం?.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement