అదృశ్యమైన మగ శిశువు ఆచూకీ లభ్యం | 6-day old infant stolen from Adilabad RIMS | Sakshi
Sakshi News home page

రిమ్స్‌లో అదృశ్యమైన మగ శిశువు ఆచూకీ లభ్యం

Published Tue, Jul 10 2018 9:39 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నవజాత శిశువు అపహరణ ఘటనను మరువకముందే ఆదిలాబాద్‌లోనే ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో మగశిశువు అపహరణకు గురయ్యాడు. శిశువు అదృశ్యమైన కొన్ని గంటల్లోనే ఈ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శిశువును అపహరించిన మహిళను ఇచ్చోడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు లేకపోవడంతోనే తాను శిశువును అపహరించానని నిందితురాలు పుష్పలత అంగీకరించారు. దీంతో మగశిశువును తిరిగి తల్లి మమత ఒడికి చేర్చారు. బిడ్డ కనిపించకపోవడంతో తల్లిడిల్లిపోయిన తల్లి మమత.. తిరిగి శిశువు ఒడికి చేరడంతో ఆనందం వ్యక్తం చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement