ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. కమిటీ చైర్మన్ శివశంకరరావుతో కలిసి వెబ్‌సైట్, లోగోను సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చట్టం ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయముల (న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా పారదర్శకత), 2019 చట్టము 14.08.2019 నుండి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.