Judiciary advice
-
పీసీఐ అనుమతి లేకుండా కేసులొద్దు
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) లేదా ఇతర జ్యుడీషియరీ అథారిటీ అనుమతి లేకుండా జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తగదని, ఈ మేరకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ అడ్వొకేట్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంఘ విద్రోహ, జాతి వ్యతిరేక శక్తుల బండారం బయటపెడుతున్న న్యూస్ చానళ్లను కొందరు లక్ష్యంగా చేసుకుంటున్నారని, పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి, జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరిపై ఇలాగే కేసులు పెట్టారని గుర్తుచేశారు. జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే పీసీఐ అనుమతిని తప్పనిసరి చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ వెబ్సైట్ ఆవిష్కరణ
-
ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ వెబ్సైట్ ఆవిష్కరణ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. కమిటీ చైర్మన్ శివశంకరరావుతో కలిసి వెబ్సైట్, లోగోను సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చట్టం ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయముల (న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా పారదర్శకత), 2019 చట్టము 14.08.2019 నుండి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం వివిధ శాఖల్లో రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన పనుల వివరాలను ముందు న్యాయ పరిశీలనకు పంపుతారు. ఏ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ అయినా ముందుగా కమిషన్ ముందుకు వస్తుంది. ఆ తరువాత కమిషన్.. టెండర్ డాక్యుమెంట్‌ను పబ్లిక్ డొమైన్లో వారం రోజుల పాటు పెడతారు. ఆ టెండరుకు సంబంధించి ఎవరైనా సలహాలు సూచనలు చేయడానికి వీలుంటుంది. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాతే టెండర్లను ప్రభుత్వం ఆమోదించనుంది. వెబ్సైట్: judicialpreview.ap.gov.in కేబినెట్ సమావేశం.. ఈనెల 16న తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రిమండలి సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆధ్యక్షతను ఈ సమావేశం జరుగనుంది. -
‘నీట్’ ఆర్డినెన్స్‌పై న్యాయ సలహా కోరిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-నీట్) నుంచి రాష్ట్రాల బోర్డులకు ఏడాది పాటు మినహాయింపు కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ సలహా కోరారు. పలు రాష్ట్రాలు, విపక్షాల డిమాండ్ మేరకు నీట్ తప్పనిసరంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాక్షికంగా పక్కనబెడ్తూ, రాష్ట్రాల బోర్డులకు ఏడాది పాటు మినహాయింపునిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌ను శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్‌లోని పలు అంశాలపై రాష్ట్రపతి ప్రణబ్ శనివారం న్యాయ నిపుణుల నుంచి వివరణ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, ఇంత అత్యవసరంగా ఆర్డినెన్స్‌ను తీసుకురావాల్సిన అవసరమేంటని కూడా ప్రణబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.