అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ చివరి రోజు హైడ్రామా నెలకొంది. ఉదయం నుంచే కోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన వాదనకు మద్దతుగా హిందూ మహాసభ న్యాయవాది న్యాయస్ధానంలో చూపించిన పుస్తకంపై వివాదం నెలకొంది. అయోధ్య రీవిజిటెడ్ పేరుతో మాజీ ఐపీఎస్ అధికారి కిశోర్ రాసిన పుస్తకాన్ని హిందూ మహాసభ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టు ముందుంచారు.