గత పది రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెర వెనుక నుంచి నడుపుతున్న రాజకీయ క్రీడ ఆదివారం కూడా కొనసాగింది. ఆయన తాజాగా టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యా రు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చించారు. బీజేపీపై విరుచుకుపడా లని ఆదేశించారు. దాంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు తదితరులు బీజేపీపై విమర్శల దండకం అందుకున్నారు. రాష్ట్రానికి చాలా ఇచ్చామంటూ ఆ పార్టీ విడుదల చేసిన లెక్కల్లో నిజం లేదని అన్నారు.