దక్షిణ అగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి వాయగుండంగా రూపాంతరం దాల్చి వాయువేగంతో ఒడిశా తీరం వైపు దూసుకువచ్చిన ఫొని తుపాను శుక్రవారం ఉదయం పూరి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో పూరి తీర ప్రాంతంలో గంటల 180-200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పూరి తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది.