ఒడిశాలో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే | PM Modi Conducts Aerial Survey of Areas Ravaged by Cyclone Fani in Odisha | Sakshi
Sakshi News home page

ఒడిశాలో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే

Published Mon, May 6 2019 11:48 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఫొని తుపాను విధ్వంసానికి విలవిలలాడిన ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఒడిశా చేరుకున్న ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేశారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, గవర్నర్‌ గణేషి లాల్‌, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా ఉన్నారు. అనంతరం ప్రధాని మోదీ భువనేశ్వర్‌లో ముఖ్యమంత్రితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఫొని తుపానుతో ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 33కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement