తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దొమ్మేటి వెంకటేశ్వర్లు గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో దొమ్మేటితో పాటు ఆయన అనుచరులు ఇవాళ ఉదయం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలిశారు. వైఎస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.