కరోనాను జయించిన పోలీసులపై పూలవర్షం | Guntur Police Officers Discharged From Hospital Who Tested Covid-19 Positive | Sakshi
Sakshi News home page

కరోనాను జయించిన పోలీసులపై పూలవర్షం

Published Sat, Jul 18 2020 5:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

సాక్షి, గుంటూరు: ఇటీవల కరోనా బారిన పడిన పోలీసులు మహమ్మారిని జయించారు. చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీతో పాటు అర్భన్‌ పరిధిలోని 36 మంది పోలీసులు డిశ్చార్జ్‌ అయ్యారు. మరికొందరూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం తిరిగి విధుల్లో చేరిన ఆరుగురు  కరోనా వీరులకు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ... సిబ్బందిలో మనోధైర్యం కల్పిస్తున్నామని, మరింత ఉత్సహంతో వారు పని చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

దిశా స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్‌, డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ దంపతులు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో శుక్రవారం తిరిగి విధుల్లో చేరిన ఐపీఎస్‌ దంపతులకు డీజీపీ గౌతం సవాంగ్‌ ఘనస్వాగతం పలికారు. కోవిడ్‌ను జయించిన పోలీసు అధికారులు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని డీజీపీ పిలుపునిచ్చారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement