బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కులో అరుదైన జంతువులు అటు సందర్శకులు.. ఇటు వాకర్లకు కనువిందు చేస్తున్నాయి. కొన్ని జంతువులు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంటాయనడం అతిశయోక్తికాదు. ఆ కోవలోకే వస్తుంది అలుగు. చూస్తూనే చిన్న డైనోసార్ గుర్తుకొచ్చేలా ఉన్న తొండజాతికి చెందిన జంతువు అలుగు. దీని ముక్కు సూటిగా పొడవుగా ఉండి చీడ పురుగులు, చీమలను మాత్రమే తింటుంది. పొలుసుల్లా.. రాయిని పోలినట్లు మందంగా దీని చర్మం ఉంటుంది. ఈ జంతువు ఎవరికీ హాని తలపెట్టదని.. చాలా అరుదుగా కనిపిస్తుంటుందని పార్కు వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా వాక్ వేలో మెల్లగా వెళ్తున్న ఈ జంతువును వాకర్లు తమ కెమెరాల్లో బంధించారు.
కేబీఆర్ పార్కులో ‘అలుగు’
Published Sun, Jan 5 2020 2:19 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
Advertisement