కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి బాబు అంతిమయాత్ర రణరంగంగా మారింది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బాబు అంతిమ యాత్రలో పాల్గొనేందుకు రాష్ట్ర వేలాది కార్మికులు కరీంనగర్ రూరల్ మండలం ఆరెపల్లి గ్రామానికి తరలివచ్చారు. ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు అంత్యక్రియలు చేసేది లేదని బాబు కుటుంబ సభ్యులతో సహా జేఏసీ నేతలు, విపక్షాల నేతలు ప్రతినబూనారు. మృతదేహాన్ని భద్రపరిచిన ఫ్రీజర్ చెడిపోవడాన్ని గమనించకపోవడంతో 3 రోజుల కిందట మృతి చెంది న బాబు మృతదేహం డీకంపోజింగ్ అవుతుందని గమనించిన నేతలు దహన సంస్కారాలు నిర్వ íహించేందుకు కుటుంబ సభ్యులను ఒప్పించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు మృతదేహాన్ని ఆయన పనిచేస్తున్న కరీంనగర్ –2 డిపో కు తరలించి, తిరిగి శ్మశానవాటికకు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టిన అంతిమ యాత్రను పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సూచనల మేరకు పోలీసులు బాబు మృతదేహాన్ని శ్మశానవాటికకు మళ్లించి, నాయకులను మరోవైపు పంపించారు.