కరుణ అంత్యక్రియలకు తొలగిన అడ్డంకి | Madras HC allows burial site for Karunanidhi at Marina beach | Sakshi
Sakshi News home page

కరుణ అంత్యక్రియలకు తొలగిన అడ్డంకి

Published Wed, Aug 8 2018 11:38 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి అంత్యక్రియలకు అడ్డంకులు తొలగిపోయాయి. చెన్నై మెరీనా బీచ్‌లో ఆయన ఖననానికి మద్రాస్‌ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మెరీనా-అన్నా స్క్వేర్‌ వద్దనే కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు మద్రాస్‌ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సాయంత్రం కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కోర్టు కేసులు, నిబంధనలు సాకుగా చూపి మెరీనా బీచ్‌లో స్థల కేటాయింపులకు ప్రభుత్వం నిరాకరించింది. దీనిపై డీఎంకే నేతలు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిపేలా అనుమతి ఇవ్వాలని కోరారు. మెరీనాలో కరుణానిధి అంత్యక్రియలకు స్థల కేటాయింపుపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement